నా వయసెంత?!

నా వయసు ఎంతంటే ఏంచెప్పను?!.:-)
కన్నవారి లాలింపులో నేను పసిపిల్లని
జ్ఞానసముపార్జనలో నేను 5దేళ్ళపాపని
అల్లరి ఆటల్లో నేను 10దేళ్ళ అమ్మాయిని!!

నా వయసు ఎంతంటే ఏంచెప్పను?!.:-)
పరువాల ఉరవడితో పొంగే 16రేళ్ళ పడుచుని
అందంలో 21 ఏళ్ళ వయసొచ్చిన యువతిని
పరిణయానికి పరిణితి చెందిన 25దేళ్ళ పడతిని!!

నా వయసు ఎంతంటే ఏంచెప్పను?!.:-)

మాతృత్వానికి మచ్చరానీయని 30ఏళ్ళ మహిళని
క్రమశిక్షణతో పెంచి పెద్దచేసేవేళ 35దేళ్ళ ముదితని
నలుగురితో ముచ్చటించ్చేప్పుడు నేను 40ఏళ్ళ ప్రౌఢని!!

నా వయసు ఎంతంటే ఏంచెప్పను?!.:-)

ఆత్మవిశ్వాసంతో 50ఏళ్ళు అధికమించిన సబలని
బరువు-బాధ్యతలను మోయడంలో 55దేళ్ళ నారిని
జీవితపదవీవిరమణ హక్కుకై వేచియున్న 60ఏళ్ళ స్త్రీని!!

62 comments:

  1. ఇన్ని మలుపులలోను స్త్రీ ఔన్నత్యాన్ని చక్కగా వివరించారు పద్మ గారూ..
    ఇంతకీ మీ వయసెంతో చెప్పలేదుః-)

    ReplyDelete
    Replies
    1. వర్మగారు....స్త్రీ మలుపుల్లోని ఔన్నత్యాన్ని గుర్తించినా మీకు నెనర్లండి!
      చెప్పకూడదనుకున్నాను....తప్పడంలేదు:-)
      ఇప్పటికింకా నా వయసు నిండాపదహారే (ఎవరికీ చెప్పకండేం):-)

      Delete
  2. ఆ చిత్రం చూస్తూనే వుండి పోయా...Pleasant looks...

    ReplyDelete
    Replies
    1. ఆ చిత్రకారుని (మోహన్ గారు) ప్రతిభా కౌసల్యమండది జోహార్లు ఆయనకు!!!! thank you.

      Delete
  3. అన్ని వేళల తన పాత్ర సమర్థవంతంగా
    పోషించిన...పోషిస్తున్న...పోషించబోయే
    పడతి..పద్మార్పిత...:-)
    వయసెంత? అంటే.....
    (5+10+16+21+25+30+35+40+50+55+60 /11..=...:-))...)
    బాగుంది మీ భావార్పితం.
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఓహో! భూత, భవిష్యత్, వర్తమానకాలాల పద్మార్పిత గురించి భలే చెప్పారే....
      పోషించగలనన్న నమ్మకాన్ని వమ్ముచేయనులెండి:-)
      (5+10+16+21+25+30+35+40+50+55+60 /11..=...:-))...)
      మీ లెక్కన ఇంకా సగం కూడా పూర్తికాలేదన్నమాట...ఇంకెన్నేళ్ళో??? :-)
      భావార్పితం బాగుందన్న మీకు ధన్యవాదములు.

      Delete
  4. Hello Padmarpita garu, i was wondering if we i can buy this painting.
    very very Beautiful.

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog. Thanks for your compliment.
      Aruna garu contact the great artist Sri.Mohan garu to buy this:-)

      Delete
  5. ee painting ni 'http://www.tineye.com/' to search chesanu, ekkada dorakaledu..inta andamgaa painting vesarante .. simply superb..maaku ammagaligite .. memu adrushtavantulam. frame lo pettukune alochana undi.

    ReplyDelete
    Replies
    1. This is the painting of Sri.Mohan who is an amazingly talented artist, works for Malayala Manorama. I don’t know about him more than this, but he is a very great artist. I salute to him.
      Thanks for visiting my blog.

      Delete
    2. Mohan gaarini pattukunnanandi.

      http://www.kalakeralam.com/artistd/mohan.htm

      Delete
    3. Thank you Madhu Mohan garu for the address.

      Delete
    4. You welcome, Aruna garu.

      Delete
  6. పసిడి ప్రాయమ్మున పాపాయి వయసులో
    అమ్మ-నాన్నల కనుల కమృత సిరులు
    కౌమారమున ఙ్ఞాన కమలాల కొలనులో
    గురువుల శిక్షల విరియు విరులు
    యౌవనమ్మున ప్రేమ భావనోద్యానాన
    జీవన సౌభాగ్య శ్రీల కళలు
    ప్రౌఢ ప్రాయమ్మున పరిణతి చెందిన
    పౌర జీవనయాన పాంథ చరులు

    నడి వయస్సున సంసార నావ లాగి
    తుదకు ‘ మలిసంధ్య’ బ్రతుకులో దుర్బలులగు
    మనుజులకు తమ ‘ వయసు’ లో మార్పు దప్ప
    ఆడ-మగ యన్న తేడాలె అసలు లేవు .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు మనఃపూర్వక వందనములు.

      Delete
  7. chaal bagundi andi, picturekuda

    ReplyDelete
  8. పద్మ గారూ, కవిత బాగుంది.
    అన్నివేళలా సమర్దవంతంగా పోషించే మీ పాత్ర ఇంకా బాగుంటుంది.(ఉద్యోగం, గృహిణి , చిత్రకారిణి.)
    మొత్తం మీద అందరికీ ఏదో ఒక పజిల్ పెట్టి ఆలోచించేలా చేస్తారు కదా, చిత్రం బాగుంది....మెరాజ్

    ReplyDelete
    Replies
    1. మీ మెచ్చుకోళ్ళతో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను మెరాజ్ జీ.:-) మీ స్పందనకు ధన్యవాదములు.

      Delete
  9. ఒక అద్భుతమైన painting అందించారు.ఇక పోతే మహిళ పాత్రను చక్కగా వర్ణించారు.కానీ నా వయసెంత అనే title ఎందుకు పెట్టారో మరి.

    ReplyDelete
    Replies
    1. అది నిజంగా అంత అధ్భుతమైన పెయింటింగ్ కాబట్టే అలా అందరిని ఆకట్టుకుంటుందండి! థ్యాంక్యూ......
      అన్ని పాత్రలు సవ్యంగా పోషించాలంటే ఎంతవయసైతే ఆ స్త్రీకి కరెక్టో అని అలా:-)

      Delete
  10. Replies
    1. ok.....means still you are thinking and calculating my friend:-)

      Delete
  11. Replies
    1. thanks for visiting my blog and for comment too:-)

      Delete
  12. నాది కూడా వర్మ గారి కామెంటేనండీ..వర్మ గారూ ఏమనుకోకండీ మీ కామెంటును వాడుకుంటున్ననందుకు :)

    ReplyDelete
    Replies
    1. సుభగారు వందనములు, వర్మగారి జవాబే మీకు ఇవ్వమంటారా:-)

      Delete
  13. Wow marvelous pic, you are great in selecting pics & concept padmarpita.

    ReplyDelete
  14. పద్మార్పితగారు మీరు ఏలైన్లో దాగున్నారో కాస్త వివరించండి ప్లీజ్:)
    పెయింటింగ్ అదిరిందండి...మీరు ఏది రాసినా గీసినా ఇంతేనేమో:)

    ReplyDelete
    Replies
    1. కళ్ళతో కాకుండా మనసుతో చూస్తే ప్రతిలైన్లో కనిపిస్తానేమో!!!:-) థ్యాంక్యూ!

      Delete
  15. నేనెంతో అభిమానించే పైంటర్స్ లో మోహన్ గారు ఒకరు. అటువంటి ఆయన పైంటింగ్ అందరూ అభిమానించే మీ కవితకు పెట్టడం నిజంగా నయనానందకరం.
    ఆడవారి వయసు చెప్పకూడదు అంటారు కనుక మీ వయసెంతో నాకు తెలిసిపోయినా నేను చెప్పట్లేదు ;)

    ReplyDelete
    Replies
    1. మీది కూడా కళాత్మక హృదయం అని తెలిసి మహానందమాయె! ధన్యవాదములు.
      మీ వయసే నాదీనూ......ఎవరికీ చెప్పరని తెలుసులెండి:-) మంచోరుకదా!

      Delete
  16. పద్మార్పితా... ఈసారి మీ కవిత చిత్రం ముందు చిన్నబోయినట్లుందండి:)
    అయినా మీ చిలిపి ప్రశ్నలతో చిత్తు చేస్తూనే ఉంటారుగా. Keep it up!

    ReplyDelete
    Replies
    1. ఆ చిత్రంలోని అందం ముందు అలా చిన్నబోవడం ఆనందమేనండి:-) థ్యాంక్యూ!

      Delete
  17. Pic chala bagundi andi padma garu.. Naa chinna nati memories gurtuki vachayi :)

    ReplyDelete
    Replies
    1. thankQ.....memories ni njoy chey ramya:-)

      Delete
  18. ఏం చెప్పను? కవితనే పదే పదే చదవనా లేక చిత్రాన్నే చూసి మురవనా అన్నట్లుందండి.

    ReplyDelete
    Replies
    1. ఏంచెప్పక పోయినా మీ మోములో మెరుపు నేను చూసానులెండి:-) నెనర్లు!

      Delete
  19. Replies
    1. 45 దేళ్ళకి =?????( బ్లాగ్ లో పోస్ట్ లు రాసుకుంటూ మనసువిప్పి మాట్లాడుకుంటానని) అదేంటండీ చాతకం గారు.....ఇది అడగాల్సిన విషయమా! అర్థం చేసుకోవాలి కానీ:-):-)
      (అమ్మో! ఇక నుండి ఏదీ మరచిపోకుండా గుర్తుంచుకుని రాయాలికామోసు:-)

      Delete
  20. ఫోటో చాలా చాలా నచ్చిందండీ..

    ReplyDelete
    Replies
    1. ఫోటో నచ్చినందుకు నెనర్లండి!

      Delete
  21. స్త్రీమూర్తి బహుమూర్త్వత్వాన్ని సహజ సుందర సరళ శైలిలో సత్యనిష్టతో చెప్పిన గొప్ప కవితగా నేను భావిస్తున్నను మ్యాడం! అందమైన మీలొని బ్లాగ్ సృష్టి కర్త అభిరుచికీ అభినందనలు

    ReplyDelete
  22. నా బ్లాగ్ కి స్వాగతం. మీ అభిమాన స్పందనకు నెనర్లండి!

    ReplyDelete
  23. మా రాకాసిని ఎలా పొగడాలో తెలియటం లేదు నాకు మొదటి సారి ఫీల్ అవుతున్నాను నేను, నాకు కవిత్వం వ్రాయటం రాలెదు అని, వచ్చి ఉంటె ఎన్నెన్నో వర్ణంచేవాడిని నేను.

    ReplyDelete
    Replies
    1. తిట్టుకోలేదు అంటే పొగిడినట్లే కదా నేస్తం:-)

      Delete
  24. పద్మర్పిత గారు, ఫోటొ చాలా బావుంది. ఒక కాపీ ఇవ్వగలరా ప్లీజ్..మీ కవిత,ఫోటొ రెండూ ఒకదానితొ ఒకటి పొటీ పడుతున్నట్టు వున్నాయి

    ReplyDelete
  25. ఫోటో నచ్చినందుకు సంతోషమండి....కాపీ ఇచ్చే కఫీరైట్స్ నాకులేవండి. అది వేరొకరి కళాఖండం.

    ReplyDelete
  26. ఆమె... ఈ సృష్టిలోని అందాన్నంతా తనలో నింపుకొన్న స్త్రీమూర్తి...
    ఎన్నో జన్మలకు సరిపడా ప్రేమను అందించు మాతృమూర్తి...
    బంధాలన్నిటిని నిలబెట్టే ఓపిక దాచుకొన్న మైత్రి...
    ఇలా ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోయే ఓ అపూర్వ భావన..

    పద్మార్పిత గారు... మీ కవితా సామర్థ్యానికి జేజేలు...
    ఎంతలా అంటే... చదువుతూ ఉంటే పోగొట్టుకున్నదేదో దక్కినపుడు కలిగే ఆనందమంత!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానపు స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  27. పద్మర్పిత గారు ఈ సృష్టిలోని అందాన్నంతా మీలొ నింపుకొన్న స్త్రీమూర్తి...
    ఎన్నో జన్మలకు సరిపడా ప్రేమను అందించు మాతృమూర్తి...
    బంధాలన్నిటిని నిలబెట్టే ఓపిక దాచుకొన్న మైత్రి...
    ఇలా ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోయే ఓ అపూర్వ భావన..స్త్రీమూర్తి బహుమూర్త్వత్వాన్ని సహజ సుందర సరళ శైలిలో సత్యనిష్టతో చెప్పిన గొప్ప కవితగా నేను భావిస్తున్నను మ్యాడం! అందమైన మీలొని బ్లాగ్ సృష్టి కర్త అభిరుచికీ అభినందనలు మీ కవితా సామర్థ్యానికి జేజేలు.పద్మర్పిత గారు ధన్యవాదాలండి.

    ReplyDelete
  28. జీవనయాత్రకు సూత్రధారి పాత్రధారి నారీశిరోమణియే అమ్మకడుపులో పిండంగా మొదలై అమ్మై అమ్మమ్మై బామ్మై
    మూర్తీభవించిన ధర్మమ్మై మానవత్వాన్ని గెలిపిస్తుంది.
    చక్కని కవిత ..శతాబ్దాలుయుగాలు గడచినా మారనిధర్మదీక్ష

    ReplyDelete