సృష్టికార్యం

గుండెల్లో నక్షత్ర కూటమే మువ్వలతో మ్రోగె
నువ్వు మనసుపెట్టి ముచ్చటగా మాట్లాడితే

కనుల ఎదుట కల్పవృక్షమే గజ్జె కట్టి నర్తించె
నువ్వు నిండుపున్నమిలా నాకెదురై నవ్వితే

చంద్రుడిలోని తెలుపే మెరిసి తెల్లబోయి చూసె
నీ స్వఛ్ఛమైన మనసు నాకే ఇచ్చావని చెబితే

నరాలన్నీ వీణాతంత్రులై కళ్యాణి రాగమే పాడె
నీ ఉఛ్వాస నిఛ్వాసలకి నా పైట రెపరెపలాడితే

గోధూళి సైతం పరిమళాలని రాయబారం పంపె
నువ్వు నా కంటిపై ముంగురులే తొలగించబోతే

తనువుల ఘర్షణలో మన్మధుడు మధనం చేసె
నువ్వూ నేనొకటై సృష్టికార్యానికి శ్రీకారం చుడితే

72 comments:

  1. అత్యధ్భుత శృంగార కావ్యం. కుడోస్ టు యు

    ReplyDelete
    Replies
    1. మెచ్చిన మీకు వందనములు

      Delete
    2. చాలా బాగుంది మేడం

      Delete
  2. గిట్లా రొమాంటిచ్ చిత్రం పెడితే బూతులు రాసినారు అంటారని భయతో చాలామంది రాయనీకి భయపడుతురు. పద్మకు గసోంటి భయాలు ఏం లేవని మరొకపారి రుజువు చేసినవు. నమస్తే తల్లో నీకు.
    ఏముచ్చట ఎట్లున్నా కవిత మస్తుగుంది. ఇక చిత్రం మంచిగ మాచింగ్ :)

    ReplyDelete
    Replies
    1. బూతులు రాస్తే బుగుల్ కానీ భావం రాయనీకెందుకు :-)

      Delete
  3. మాడం మీకు మీరే...అమ్మో ఎంత ధైర్యం కావాలో శృంగార రసాన్ని అందులోను స్త్రీ నిర్భయంగా ఈ భావాలని వ్యక్తపరచాలంటే. అందుకే మీరు మా అభిమాన కవయిత్రి.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ... ఇక్కడ నేను రాసింది అసభ్యకరమైన శృగారం ఏమీ కాదనే ధైర్యంతోనే రాసానండి.

      Delete
    2. అసభయ మనడమే అసభ్యం.

      Delete
    3. అసభ్యయ మనడమే అసభ్యం.
      (సవరణ)

      Delete
  4. మీకు సరస్వతీదేవి కటాక్షంతో పాటు కాళిదాసు మీపై పూనకం వచ్చి వ్రాయించినట్లున్నారు. రసరమ్యకవిత

    ReplyDelete
    Replies
    1. కటాక్షం వరకూ ఓకే మరీ పూనకం అంటేనే :-)

      Delete
  5. కవితలో భావం బాగుంది, చిత్రమే కొంచెం ఇబ్బందికరంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. పోస్ట్ కి ఆప్ట్ గా ఇండాలని ఎంచుకున్నదండి.

      Delete
    2. ఇబ్బందేమీ లేదు.

      Delete
  6. మధురభావాల కుసుమాలు మనసులో పూస్తున్నాయి మీ కవిత చదివి చిత్రం చూస్తుంటే.

    ReplyDelete
    Replies
    1. ఆస్వాధించండి

      Delete
  7. మేము ఎప్పుడైనా భావాలని రాద్దాం అంటే కనీసం అక్షరాలు కూడా సహకరించవు అదేం విచిత్రమో మీలో భావాలకి అక్షరాలేకాదు అందరితోపాటు సూర్యచంద్రులు, గోధూళి అబ్బో ఇంకా ఇలా ఎన్నెన్నో సహకరిస్తాయి పద్మగారు. అందుకే మీరు వ్రాయకలుగుతున్నారు మేము వ్రాయలేక పోతున్నాము. :)

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్ష నిజం చెప్పండి మీఎఉ రాయ తలపెట్టాలే కానీ అబ్బో అందరూ మీకు తోడు :-)

      Delete
    2. వ్రాయాలని తలపెట్టి పెట్టి తల బ్రద్దలైపోతుంటేను. ఏం వ్రాస్తాము చెప్పండి.

      Delete
  8. నక్షత్ర మువ్వలు మ్రోగడం
    కల్పవృక్షం నర్తించడం
    చంద్రుడు తెల్లబోవడం
    తంత్రులు రాగాలు పాడడం
    ధూళి రాయబారం పంపడం
    ఈ ఫాటసీలన్నీ మీ పోయంస్లోనే కనబడతాయండి. అబ్బురం

    ReplyDelete
    Replies
    1. నిజ జీవితంలో జరగని వాటిని ఫాంటసీగా చూడ్డంలో తప్పులేదండి.

      Delete
    2. అక్షర సత్యం.

      Delete
  9. మరికాస్త అలోచించి ఉంటే ఇంతకన్నా అమోఘంగా భావాన్ని మరింత రసాత్మకంగా చెప్పేదానివి అర్పితా. ఈ కవితలో ఏదో కొరవడింది అనిపిస్తుంది. నీ పాత కవితల్లో మంచి రసరమ్య భావాలని చదివిన వ్యక్తిగా ఈ విషయాన్ని చెప్పడానికి సంకోచమే అయినా తప్పడంలేదు. ఆశిస్సులతో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. అవునేమో. కానీ నిజానికి ఆలోచించే రాసాను. చిత్రం పెట్టే విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగి ఉండవచ్చును. ఇక పై శ్రద్ధ తీసుకుంటానండి.

      Delete
  10. మీరు ఏ టాపిక్ అయినా ఫీలుండేలా రాస్తారు.
    Madam you have lot of guts. Iam fond of your attitude.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ. Nothing like that Sindhoo :-)

      Delete
  11. చాలా రసోత్తర ప్రణయకావ్యం పద్మగారు. బాగుంది

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  12. చాలా బాగుంది. చిత్రం చాలా అధ్భుతం.

    ReplyDelete
    Replies
    1. విశ్వేస్వరరావుగారు అభివందనములు.

      Delete
  13. నరాలన్నీ వీణాతంత్రులై కళ్యాణి రాగమే పాడె
    నీ ఉఛ్వాస నిఛ్వాసలకి నా పైట రెపరెపలాడితే
    sooooooooooo beautiful feel.

    ReplyDelete
  14. శృంగారానికి శ్రీకారం చుట్టి ఆత్యంతము అలరించిన కవిత. పద్మార్పిరగారి పదాలతో పాటుగా చిత్రం కూడా శృంగారానికి న్యాయం చేకూర్చింది. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీకు నా అభివందనములు.

      Delete
  15. బహుముఖ ప్రాజ్ఞాత్వం మీ కవితల్లో గోచరిస్తాయి... ఈ కవితలో ప్రేమతత్వాన్ని ఒక ఉచ్ఛస్తాయికి తీసుకెళ్ళి శృంగార భావాలతో ముగింపు పలికారు... చాలా అరుదుగా ఇటువంటి కవితలు పుడతాయి... మీ కవిత్వం లో రమ్యత్వానికి ఇదొక మచ్చుతునక.... మీ కవితల్లో కొద్దిగా విభిన్నత్వాన్ని పునికిపుచ్చుకున్న ఈ కవిత భావకుడికి.... ఒక కాల్పనిక లోకంలో ఒక అధ్బుతాన్ని ఆవిష్కరించబోయే ముందు అలుముకొన్న నిశ్శబ్దంలా .... విచ్చుకోబోయే ముందు మేఘంలా మారి పుప్పొడిని వర్షించే ఆకాశంలా... అలరింతలకు గురిచేస్తోంది మేడం... సూపర్.... చక్కటి భావచిత్రం మీ అభిరుచికి పరాకాష్ట....

    ReplyDelete
    Replies
    1. చిత్రం చూసి ఇది ఒక శృంగార కవిత అని చాలా మంది నిర్ణయానికి వచ్చేస్తే ఎలా ? ఇదో అందమైన ప్రేమ కవిత .కొంతమేర పద్మారిత అభిమానులు సరిగ్గా విశ్లేషించారు . మిగిలినవారు మరొక్కమారు కవితను చదివి చూడండి . ప్రతి అక్షరంలోనూ ఎంత ప్రేమ దాగి ఉందో తెలుస్తుంది . ఆ నాయిక ఎంత గాడంగా అతడిని వలచిందో కనిపిస్తుంది . ముమ్మాటికీ ఇది అత్యన్నత మయిన ప్రేమ భావన , అత్యంత అనురాగంతో చేసుకునే ఆత్మ నివేదన , సర్వస్య సమర్పణ . ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ తప్ప మరోటి లేదు ఇందులో . సృష్టి కార్యం అన్న టైటిల్ , సన్నిహితంగా ఉన్న జంటను చూసి కవిత చదివితే ... అరె , శృంగారోద్దీపన మొహమ్మీద చెళ్ళున కెరటంలా కొట్టలేదు సరి కదా.... లలిత మనోజ్ఞమైన ప్రణయ భావనలు బొగడ పూల పరిమళంలా నాసికా పుటాలకి సోకుతాయి . అందుకేనేమో , కొందరికి ఇందులో ఏదో లోపం ఉన్నట్టు అనిపించి ఉండవచ్చు . నిజానికి ఏకాంతంలో ఇవే మాటలు అందరూ వారి వారి మనోహరులకు చెప్పినవే కదా ! అవే కొంచెం కవితా ధోరణిలో ఇక్కడ చూస్తున్నాము .

      Delete
    2. మీరు చూసిన దృష్టితో చూస్తే అంతా ప్రేమ మయం, కానీ అందరికళ్ళు చూపు ఒకే మాదిరి లేదు గాడేపల్లిగారు. ఎవరు ఏ విధంగా ఊహించుకుంటే వారికి ఆ విధంగా అనిపించడం పద్మార్పిత స్పెషాలిటీ ఇది నిజం :-) హా హా

      Delete
    3. @ Padmarpita Fans మీ వ్యాఖ్యలకు నా దగ్గర జవాబు లేదు. రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్ప _/\_

      Delete
    4. మీ సునిశిత పరిశీలనకి నాభావాలని ఆస్వాధించడంతో పాటుగా లోతట్టు భావాన్ని వెలికితీసి నన్ను సమర్ధిస్తూ స్పూర్తినిచ్చే మీ వాఖ్యలకు నమోఃవందనాలు గాడేపల్లి వెంకట్ గారు._/\_

      Delete
    5. నయనిగారు...ఈ కమెంట్ లో ఏమీ ట్విస్ట్ లేదు కదా :-)

      Delete
    6. చిత్రం చూసి ఇది ఒక శృంగార కవిత అని చాలా మంది నిర్ణయానికి వచ్చేస్తే ఎలా ?వెంకట్ గారు...పద్మార్పితగారి చిత్రాలే కాదు మాటలు అంతకన్నా రెచ్చ గొడుతుంటాయి. మరి వీక్ మైండ్ వాళ్ళు అలాగే అనుకుంటారు. మీరు తప్పు పడితే ఎలా :-)

      Delete
    7. ఆకాంక్షా...మరీ ఇంతటి అభియోగమా అందునా అమాయకురాలి పై :-)

      Delete
  16. శృంగార రసాన్ని రమ్యమైన రీతిలో పండించారు. ప్రణయానికి ప్రతిసృష్టిలా ఉంది చిత్రం.

    ReplyDelete
  17. వలపు శృంగారాన్ని అందంగా సింగారించారు. చిత్రం ఎంపికలో మీకు ధీటైన వారు లేరు. నేను ఈ మధ్య ప్రయత్నిస్తున్నను. కొంచెం లుక్కండి పద్మగారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు.
      మీరు పోస్ట్ చేసే ఆర్ట్ పిక్స్ చాలా బాగుంటాయి.

      Delete
  18. పద్మగారు నాకు ప్రశ్నలు అడగడమే తెలుసు అన్నింటిలో నెగెటీవ్ చూడ్డం అలవాటైనా మీరు వ్రాసే కవితల్లో పాజిటివ్ మాత్రమే కనిపిస్తుంది అందుకేనేమో మీ ఈ సృష్టికార్యంలో అడగడానికి సందేహించడానికి ఏంలేదు.
    నో డౌట్ ఇది మీ కలం నుండి జాలువారిన మరో అద్భుత ప్రణయకావ్యం.

    ReplyDelete
    Replies
    1. ప్రశ్నలకి కొదవ ఎక్కడిది నందినీ....మనం వేసిన ప్రశ్నలకి జవాబులు ఇవ్వక తప్పించుకునే నేర్పరి పద్మార్పిత.

      Delete
    2. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్లు అడుగుతూ ఉండండి తెలిసీ తెలియని జవాబులు ఇచ్చేస్తానుగా ;-)

      Delete
    3. నయనీ నేర్పరి అంటూ మరో నిందనా నా పై. :-)

      Delete
  19. నవ్విపోతారు కవితలో శృంగారం, చిత్రంలో నగ్నత్వం ఉందని ఎవరైనా అంటే. అయినా ఎవరి అలోచనా ధోరణి వారిది మనం కాదంటే మాత్రం వారి బుధ్ధి మారేనా. మీరు అనుకున్నది, నచ్చింది రాయండి పద్మగారు.
    కవితలోని భావం దానికి అనుగుణంగా చిత్రం చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. బాగాచెప్పారు. ఎవరికి తోచింది వారు ఊహించుకుంటారు అని వదిలేయలేం కదా. థ్యాంక్యూ.

      Delete
  20. గోధూళి పరిమళాలని రాయబారం పంపడం చాలా బాగుంది పద్మా.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ సంధ్యగారు..

      Delete
  21. మధుర రసభరితం ఈ కవిత పద్మగారు

    ReplyDelete
  22. అబ్బా..గన్ షాట్ కవిత
    గుండె జివ్వుమంది. పిక్ కిరాకు పుట్టించింది :)

    ReplyDelete
    Replies
    1. మరో తుపాకీ గుండులాంటి కమెంట్ :-)

      Delete
  23. romantic rythm of love.

    ReplyDelete
  24. ఏమని పొగిడేది మా పద్మమ్మను
    రోజుకో కవిత రాసి మురిపిస్తుంటే...
    విరహం ప్రేమ వైరాగ్యం వేదాంతం
    అన్నీ సమపాళలో కురిపిస్తుంటే...
    ఏమని పొగిడేది మా అర్పితమ్మను

    ReplyDelete
    Replies
    1. నయనిగారూ...రాసేయండి మీలో మరో కవయిత్రి దాగిందండోయ్

      Delete
  25. awesome poetry and picture.

    ReplyDelete
  26. బాగుంది మీ ప్రేమాలాపన

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి స్వాగతం శాంతకుమారీగారు

      Delete
  27. రతీదేవినీ.మించిన ప్రచోధిని లా ఉన్నావ్ ..మీ కవిత సూపర్

    ReplyDelete
  28. చాలా చక్కని కవిత.. తగిన చిత్రం కూడా.. అభినందనలు మేడం������

    ReplyDelete
  29. సృష్టికార్యమైనా శృంగారక్రీడైనా..కామసూత్రకారుడు జన్మించిన భూమి లో ఖజూరాహో శిల్పాల సాక్షిగా ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పడం అవసరం.లౌకిక జీవనంలో అది ఒక ఆనందయోగం.అద్భుతమైన ఔషధం.అనవసరమైన వ్యామోహాలతో,ఇతర వ్యాపకాలతో ఈ ఆనందానికి దూరం కాకుండా దంపతులు దీర్ఘకాలం జీవించాలి. మీకు హృదయ పూర్వక అభినందనలు..

    ReplyDelete
  30. మీ పద ప్రయోగం అద్భుతం. చాలాబాగుంది. ఎంతో అందముగా గౌరభావంకలిగేటట్టు గా ఉండి.

    ReplyDelete
  31. This comment has been removed by the author.

    ReplyDelete
  32. నరాలన్నీ వీణాతంత్రులై కళ్యాణి రాగమే పాడె
    నీ ఉఛ్వాస నిఛ్వాసలకి నా పైట రెపరెపలాడితే

    తనువుల ఘర్షణలో మన్మధుడు మధనం చేసె
    నువ్వూ నేనొకటై సృష్టికార్యానికి శ్రీకారం చుడితే

    entha chakkani vivarana .prathi okka dhampathula enno theepi gnapakaalu entha baaga vivarinchaaru .srungaaram venuka dhagi vunna pavithratha ee kaalam vaallaki telidhu.

    ReplyDelete