మనసా మాయమైపోదాం రా!

చెప్పడానికి ఏముంది వినేవారుంటే ఎన్నో చెబుతారు
పనికిరాని మాటలకి విలువలేదు కదాని వాగేస్తారు..   
విని వదిలివేయక పట్టించుకుంటే బ్రతుకలేవే మనసా!

ప్రతి ఉషోదయానికీ రేయితో సంబంధం అంటగడతారు
నువ్వెంత నీ ప్రాతివత్యమెంతని రోబోతో రంకుగడతారు  
మనుషులున్న లోకంతీరే ఇదని తెలుసుకోవే మనసా! 

మనల్ని మనమాడిపోసుకుంటే అవునని ఆసరా ఇస్తారు
కాదని వాదించి గెలవాలి అనుకోకు తప్పులెంచుతారు..
వీధి కుక్కలు మొరుగుతుంటాయి గుబులేలనే మనసా! 

నీతులు చెప్పే ప్రబుద్ధులెందరో గోతులు తవ్వుతుంటారు
అవసరానికి అందితే చేతులు లేదా కాళ్ళు పట్టుకుంటారు   
పరులు అనేమాటలకి నీకళ్ళు తడుపుకునేడవకే మనసా!

ఎంతటి మహానీయులైనా అందరినీ ఆనందింపజేయలేరు
ఎవరికి ఎవరూ చివరికి ఎవరూ నీవారు కారు, రారు..    
మనకు సంతోషాన్ని ఇచ్చేది ఒక్కటైనా చెయ్యవే మనసా!

23 comments:

  1. మీ మనసుతో మీరే ముచ్చటించి మాయమయిపోతాను అంటే ఎలాగండి. చిత్రంలో చిన్నది బాగుంది.

    ReplyDelete
  2. Very smoothening and inspiring words madam

    ReplyDelete
  3. ఓల్ని గింతగనం తిట్టినావ్ తల్లో..జత మనసు పదిలం

    ReplyDelete
  4. ఎవరూ ఎవరికి ఏమీ కారని ఎంతో బాగావ్రాసారు.

    ReplyDelete
  5. కళ్లు మూసుకొని
    మనసు ద్వారాలు తెరిస్తే
    అక్కడ అంతా ప్రశాంతతేగా
    నిదురపోతే కలల్లో వెలిగిపోతూ
    హాయిగా కళ్ళు మూసుకుంటే
    అక్కడ మన హృదయం
    మనతోనే ఉంటుంది

    ReplyDelete
  6. మీకు నమస్సులు

    ReplyDelete
  7. మనం చెప్పిన మాట వింటే అది మన మనసు ఎలా అవుతుందండి.పోనీ మనసు చెప్పినట్లయినా మనం విందామంటే లోకం ఒప్పుకుంటుందా చెప్పండీ..

    ReplyDelete
  8. ఏం చెప్పినావ్
    దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్

    ReplyDelete
  9. మీరు యమ ఘాటుగా చెప్పారు, ఎవరికి డోస్ ఇచ్చారు?

    ReplyDelete
  10. పంపుతున్నది ఆహ్వానం మనసా
    మనసా సమాయాల మాయ చూడు
    కనులే తెరచి కాల మార్పు చూడు
    దారులెన్నో ముందరున్నా తీరికలేదు
    చేరుకోవాలన్న తీరం చెంతకు రాదు
    గాలి ఎన్ని దిశలు మార్చి పయనించినా
    పీల్చే ఊపిరి ఎప్పటికి మారునా
    ఏమిటో మన్సా ఏల ఈ మాయ

    ReplyDelete
  11. మనసా తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు ...కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే లేనిది కోరేవు యున్నది వదిలేవు.

    ReplyDelete
  12. మనసుతో పరాచకాలు వద్దు
    అది మన మాట వినదని చెప్పారు.

    ReplyDelete
  13. నువ్వెంత నీ ప్రాతివత్యమెంతని???
    రోబోతో రంకుగడతారు..
    కొత్త పదాలు దొర్లుతున్నాయి

    ReplyDelete
  14. ఊసులాడే మనసా ఊయలూగే వయసా నీకుగాని తెలుసా కొంటె ప్రేమ వరసా?
    గుండెలోన ఆశలన్నీ చెప్పుకుంటే తప్పుకాదే చెప్పనంటే ఊరుకోదే చెప్పకుండా చేరుకోదే
    ఏఎ మాట చెప్పవే ఎలాగోలా..

    ReplyDelete
  15. ఎంతటివారైనా అందరినీ సంతృప్తిపరచలేరని చాలా చక్కగా వివరించారు మనిషి నైజాన్ని. వినేవారు ఉంటే చెప్పేవారు అందరూ.

    ReplyDelete
  16. ఎవరూ నీవారు కారు ఎవరూ నీతోడు రారు

    ReplyDelete
  17. నువ్వు ప్రేమించిన వారెవరూ నీవారు కారు. నీ స్నేహితులు నీకు నిజమైన స్నేహితులు కారు. నీ బంధువులు కూడా అంతే. అందరూ అవకాశవాదులే.అందరూ స్వార్ధపరులే. ఏ అవసరం లేకుండా నిన్ను ఎవరూ ప్రేమించరు. నిజంగా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నిన్ను నీవు ప్రేమించుకో అది కనీసం నీవు బ్రతకడానికి బలాన్ని ఇస్తుంది.

    ReplyDelete
  18. మనసా మనసా ఓ మనసా!

    ReplyDelete
  19. ఎంతటి మహానీయులైనా అందరినీ ఆనందింపజేయలేరు-correct 100%

    ReplyDelete
  20. ప్రతి ఉషోదయానికీ రేయితో సంబంధం అంటగడతారు.

    ReplyDelete
  21. స్పందనలు అందించిన అందరికీ వందనాలు...ఇంతకన్నా ఏముంది చెప్పడానికి

    ReplyDelete
  22. Avasaram teerae varakoo andaroo aathma bandhuvu le..

    ReplyDelete