ఇద్దరం కలసి జీవించన్నప్పుడు.......
నాపై శ్రధ్ధ చూపకు నేను దానికి అలవాటు పడిపోతాను.
నా నుండి ఏమీ ఆశించకు నేను వాటిని నెరవేర్చలేను.
నాపై నమ్మకాన్నుంచకు నేను దాన్ని నిలబెట్టుకోలేను.
నా హృదయాన్ని హత్తుకొనేలా ప్రవర్తించకు నీ నుండి విడలేకపోతాను.
నాలో ఆరాధనా భావాన్ని కలిగించకు దాన్నుండి బయటపడలేను.
నా జీవితంలో భాగమైపోకు నీవు లేకుండా నేను జీవించలేను.

16 comments:

  1. ఇంత మంచి కవితలు రాయకండి. అభిమానులయిపోతాము. :-)

    మీ కవితలన్నీ ఇప్పుడే చదివాను. చాలా బాగున్నాయి. అభినందనలు.

    ReplyDelete
  2. సరే అయితే అలాగే కానీ నే వేరే అమ్మాయిని చూసు కుంటాను. అనుకుంటూ వెళ్లి పోతాడేమో మీ ప్రియుడు పద్మార్పిత గారు?

    ReplyDelete
  3. బ్యూటిఫుల్

    ReplyDelete
  4. సాప్ట్ వేర్ కదా సాప్ట్ గా చెప్పారు...
    మీ అభిమానంతో నేను అంచెలంచెలుగా ఎదగాలని ఏదో ఆశండి...

    ReplyDelete
  5. రవిగారూ... తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎన్నాళ్ళని పట్టుకుని వేళాడుతాం చెప్పండి?

    ReplyDelete
  6. బాబాగారికి,సుజనగారికి ధన్యవాదాలు....

    ReplyDelete
  7. పైన కనబడుతున్న బొమ్మ మీరు గీసారాండీ? ఒక్క మాటలో చెప్పాలంటే అధ్బుతంగా ఉందీ.

    అసలా బొమ్మను చూట్టం కోసమైనా మీ బ్లాగుకు మళ్ళీ మళ్ళీ రావలనిపించేలా..

    ReplyDelete
  8. పద్మగారు,
    అభిమానాలు ఆనందంగా పెంచుకోవడం తరువాత విడిపోవాల్సి వచ్చినపుదు బాధపడడం, పున్నమిరోజున సముద్ర కెరటాల్లా ఆకాశానికెగరటం మరుక్షణంలో పాతాళానికి పదిపోవటం ఇదేగా జీవితం...

    ReplyDelete
  9. Thank you very much.....
    కుమార్ గారు బొమ్మలోని గీతలతోపాటు బ్లాగ్ లోని నా పిచ్చి రాతలు కూడా చూడండి......

    ReplyDelete
  10. శర్మగారూ..... పది పదాలలో పదిల పరచి పంచారు జీవితాన్ని, చాలా బాగుందండి.

    ReplyDelete
  11. మనసులోని భావం ఒక్కోసారి చదివిన, చూసిన దానితో అన్వయించుకున్నట్లే, నిన్న ఈ కవిత చదవగానే కొంచం వులికిపడ్డాను, నాలోకి తొంగిచూసారా ఎమిటో అని. లిప్తపాటులో సర్దుకొని మీ వ్రాతలన్నీ ఒకటి కాదు, రెండు కాదు పదే పదే చదివాను, వద్దన్నా వచ్చిన నిద్రని దూరం తరిమి మరీ చదివి తరించాను, ఒదిగి మరీ పులకరించిపోయాను.

    ReplyDelete
  12. ఉషగారు ధన్యవాధాలు.....
    మీ ఉలికిపాటుతో మేల్కొని మీ బ్లాగ్ లోకి తొంగిచూసాను....
    ఈ బ్లాగ్ ప్రపంచంలోకి వేస్తున్నవి తప్పటడుగులే అయినా జాగ్రత్తగా వేయాలని తెలుసుకున్నాను...
    ఎక్కడైనా పడిపోతే మీరంతా ఉన్నరన్న ధీమాతో ఉన్నాను...

    ReplyDelete
  13. చాలా బావుందండి

    ReplyDelete
  14. chala bavundi.. na manasulo ni bavalaku akshara roopam ichhinattundi

    ReplyDelete