ఎందుకని!


ప్రియా! తారలను కన్నీటితో చూస్తే మెరుస్తాయి ఎందుకని!
విరహములో వర్షించే ఆశువులకి రంగులేలా? అందుకని...

నీవు లేకపోతే మేఘాలు వర్షించవు ఎందుకని!
నాలోనే థూఃఖాన్ని దిగమింగుకున్నాను అందుకని...

పలుకని పెదవులు పరిభాషలాడుతున్నాయి ఎందుకని!
మనస్సులోని భావాలకి ఏ భాష అడ్డుగోడలు కావు అందుకని...

చలికాలంలో వడగాల్పులే వీచవు ఎందుకని!
ప్రేమలో అనుమానాలకి తావేలేదు అందుకని!

వెతుకుతున్నా వియోగాన్ని మించిన భారమేదైనా ఉందేమోనని!
మౌనంగా ఉన్నా దీనికి నాదగ్గర సమాధనం లేదు అందుకని....

20 comments:

  1. హెచ్ ఎం ఎం ఎం ....ఎందుకో చెప్పేసారు
    బాగా బ్లాగారు..అభినందనలు

    ReplyDelete
  2. హడావిడిగా పోస్ట్ చేసినట్టున్నారు.. ఒక్కసారి మళ్ళీ చదవండి.. బాగుంది కవిత....

    ReplyDelete
  3. " చలి కాలం లొ వదగాల్పులె వీచవు ఎందుకని?"
    ఇక్కడ మీ కవితా పుస్పాల పరిమళం ..సోకలేదు
    మన్నించాలి ...మీ కవితల అభిమానిని ..

    ReplyDelete
  4. పద్మార్పిత గారూ, ఎక్కడో మీ భావాలు ఈ కవితలో సరిగ్గా ప్రతిఫలించ లేదేమో అన్పిస్తోంది. వీలయితే తిరగరాసే ప్రయత్నం చేయండి.

    ReplyDelete
  5. @ హరేకృష్ణ గారు ఎందుకు అని చెప్పిన వివరణ నిజంగానే మిమ్మల్ని సంతృప్తి పరచినట్లైతే ఓ.కే...లేకపోతే I will try my level best....

    @ మురళీగారు హడావిడిగా పోస్ట్ చేయలేదు కానీ ఏదో మిస్సైన ఫీలింగ్...
    బాగుంది కవిత అనే కన్నా, సరిచేసి ఉంటే సంతసించేదాన్ని...మన్నించాలి నా విన్నపాన్ని...

    @రిషి గారి అభిమానానికి కృతజ్ఞతలు....చలికాలంలో వడగాల్పులకు తావులేనట్లే, ప్రేమలో అనుమానాలకి చోటు ఉండకూడదని నా భావన (భావ ప్రకటనలో లోపానికి చింతిస్తున్నాను)

    ReplyDelete
  6. @ సిరాకిపుత్ర గారు లోపమెక్కడుందో అనే ఈ వేట...
    సరిచేయడానికే చేస్తున్నాను వెతుకులాట...
    ఎవరైనా సహాయపడకపోతారని నా ఉబలాట...
    ప్రాసకై పడుతున్నాను ప్రాకులాట...
    ఇలా జరగకుండా ప్రయత్నిస్తానని ఇస్తున్నాను మాట...

    ReplyDelete
  7. కవయిత్రి ..భావాలు బాగా reflect అయ్యాయి.. అభిమానులు, స్నేహితులు.. మునుపటి కవితల తో పోల్చినట్టున్నారు అంతే..

    నాకైతే నచ్చింది..చక్కగా..కాక పోతే చదవటానికి కొంచెం టైం తీసుకున్నాన్ను..(late గా) అంతే.. :)

    పద్మార్పిత గారు... నేను ఇదే మొదటి సారి మీ బ్లాగ్ కి రావడం... నేను చదివిన మీ అన్ని కవితల్లో .. లేక చూసిన paintings లో ఎదురు చూపు కనిపించిది..

    All the best !

    ReplyDelete
  8. విరహాలు ఎదురుచూపుల నుండి ఇలా వియోగం వైపు చూపు సారించారేం?

    ReplyDelete
  9. శివగారు....ధన్యవాదాలు!!
    ఉషగారు.... విరహము కూడా సుఖమే కదా అని
    వియోగ వేళలో విరిసే ప్రేమను కనలేరాండి!!

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. మదిలోని విరహం
    కనులలో నీరై కురవంగ
    మెరిసే తారకలన్నీమసకబారుతూ కనిపింపంగా
    వేసవిలో వీచే వడగాడ్పులైనా
    శరదృతువులో వణికించే చలిగాడ్పులైనా
    నా ఈ విరహాన్ని మరువనివ్వలేదు ఓ క్షణమైనా
    చెదిరి పోలేదు నా ప్రేమ ఇసుమంతైనా.
    ప్రేమైనా విరహమైనా
    నాణానికి రెండు వైపులు,
    పగలు రాత్రుల ప్రతిబింబాలు కాబోలు!
    ఏది ఏమైనా ప్రేమామృతాల
    విరహాగ్నుల కలబోతే గదా ఈ మనస్సు.

    ReplyDelete
  12. పద్మార్పితగారు....మనసుని పిండేస్తున్నారండి మీ కవితలతో....

    ReplyDelete
  13. బ్లాగు లోకం లోకి ప్రవేసించగానే 'పద్మార్పిత 'కెళ్తాను ఎందుకని?
    అందరినీ తనవైపు లాగే అయస్కాంతమది అందుకని!

    ReplyDelete
  14. వియోగం కూడా ఎంత బాగుందో మీ కవితల్లో,
    మీ బ్లాగ్ చూడనిదే నిద్ర పట్టదండి....

    ReplyDelete
  15. యోహంత్ గారి, జయచంద్రగారి, సృజనగారి అభిమానానికి కృతజ్ఞతలు....

    ReplyDelete
  16. కదిలే కలము తరగదెందుకని?
    అది పద్మార్పిత కలము అందుకని.

    మదిలే భావాలు భాష్పమవదెందుకని?
    అవి పద్మార్పిత విరహ గీతాలు అందుకని.

    ReplyDelete
  17. చాలా బాగా రాసారు :)

    ReplyDelete
  18. @ భాస్కర రామిరెడ్డి గారు....మీరన్నది
    విజయపు మెట్టా!
    లేక మునగ చెట్టా!
    ఏదైన బాగుంది.....థ్యాంక్స్!!

    @ నేస్తమా ధన్యవాదాలు...
    చాలా రోజులైంది బ్లాగ్ ని దర్శించి...

    ReplyDelete
  19. padma garu mi kavithalu chala bagunai nenu mi fan aipoyanandi naku oka manchi love msg cheyandi

    ReplyDelete