ఈ పిలుపులెందుకు?

మదిలో లేని తలపును, పెదవులతో పలుకనేల?
రంగుటద్దాలలో చూస్తూ వావివరుసలు అననేల?
చుట్టరికాలంటూ మనచుట్టూ మనం గిరిగీసుకున్నా
అంతర్మధన సంఘర్షణలకి అవి అడ్డుగోడలు అగునా?

మూడు ముళ్ళతో బంధించి భార్యభర్తల బంధమన్నా
ప్రేమకరువైతే అది పాశమై ఊపిరాడనీయక అపునా
భాధ్యతలు ఎరిగినవాడు బంధంలేని బావే అయినా
కామాంధుడై కోరిక తీర్చమని అడుగడు తెలుసునా!

అక్కా అన్న అతిచనువు ఆమె అందాలను వెతకినా
అన్నా అని పిలచినంత అతనిలో కోరిక అణగారేనా
వదినా అన్నవాడు ప్రేమవచనాలు వల్లించకుండునా
బాబాయ్ అని అంటే ఆమెలో రగిలిన సెగ చల్లారునా?

వావివరుసలని మనిషి ఈ పిలుపులను నిర్ధేశించినా
పుర్రెలో పుట్టిన బుధ్ధుల్ని పిలుపులు మార్చేయునా
మనసు మలినమై పిలిచే పిలుపులో పవిత్రత ఏల?
మనం పవిత్రంగా ఉంటే ఏమని పిలచినా తప్పేల!!?

63 comments:

  1. పద్మార్పిత గారు, మీరు మొత్తానికి ఓ సాహసం చేసారన్నమాట...

    ReplyDelete
    Replies
    1. సాహసం కాదేమోనండి.....సందేహనివృత్తికై చెప్పిన సత్యాలనుకుంటాను:-)

      Delete
    2. వినోద్ గారు....మీతో ఏకీభవిస్తూ......I am taking my words return.
      సందేహం లేదు సత్తుబండాలేదు:-)

      Delete
  2. మనిషి అంతర్ముఖం గురించి చాలా చక్కగా వివరించారు.

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్యా! అర్థం చేసుకున్నారు కదా...తిట్టలేదు అంతే చాలండి:-)

      Delete
    2. భలేవారే, ఉన్నది చెప్పారు. ఎందుకు తిడతాం అండి :)

      Delete
  3. nice but
    lady lo ilanti bavalu vundava..?

    ReplyDelete
    Replies
    1. andentandi!!!feelings ki ladies gents ane bedhamledu...paina iddaru unnaaru. bhaavamlonu bommalonu chudandi.

      Delete
  4. మనసు మలినమై పిలిచే పిలుపులో పవిత్రత ఏల?
    మనం పవిత్రంగా ఉంటే ఏమని పిలచినా తప్పేల!!?
    పద్మార్పిత గారు బాగుంది మీ కవిత....

    ReplyDelete
    Replies
    1. నా భావం నచ్చినందుకు నెనర్లండి!

      Delete
  5. అసలే మనిషి అంతరాత్మ సంఘర్షణలో ఉంటే, మీరిలా సూటిగా కవితాబాణాలు ఎక్కుపెట్టనేల?
    మీ కవిత బాణంలా వాడిగా ఉంది. బొమ్మ బాగుంది.

    ReplyDelete
  6. అంతరాత్మ సంఘర్షణలో పనిలోపనిగా దీనిగురించి కూడా కూసింత ఆలోచిద్దురూ.....బాణం వాడిదైనా హాని చేయదులెండి:-)

    ReplyDelete
  7. చాలా చక్కగా చెప్పారు పద్మార్పిత గారు...

    ReplyDelete
  8. పద్మార్పితగారు......యు ఆర్ యూనిక్!
    మీ ప్రతికవితా ఆలోచించాల్సిన ఒక అమరభాంఢం,(is this word is correct mam?:)

    ReplyDelete
  9. ఇంతలా ఆలోచించేవారు చాలా అరుదేమో అని నా అభిప్రాయమండి.
    ఏదో ఒకటి పిలచి పబ్బం గడుపుకుందాం అనుకునేవారే చాలా వరకు.

    ReplyDelete
    Replies
    1. నిజమే అలా అంటే మనం ఒప్పుకునేవారెందరో మరి:-)

      Delete
  10. అంతరంగంలోని భావాన్ని బలవంతంగా అణచిపెట్టుకొని కనురెప్పలకింద క్రీనీడలా దాచుకొని బతికే మనసులోని సంఘర్షణలకు ఓ జవాబుగా మీ కవిత బాగా ప్రశ్నించింది పద్మార్పిత గారు.. అందుకే బ్లాగ్ లోకంలో మీరో Trendsetter అన్నది..

    ReplyDelete
    Replies
    1. నా భావాల ప్రశ్నల్లోని మర్మాన్ని గ్రహించి విశధీకరించిన వర్మగారూ thank Q!.....ఏంటో కొత్తట్రెండ్ అని కొట్టరు కదా:-)

      Delete
  11. అమ్మోలమ్మో మా బాగా సెప్పినవ్..
    ఇలగిలాగ మనసుల్ని కడిగి పారేసే గొప్ప మనిసి వుంటే సాలదా...
    గుండెల్లో సూడగానే గుబులు పుట్టించే మనిసిని అక్కో అన్నో పిలుపుతో కట్టి పడేత్తే ఆ మనసు పడే వేదన తెలీని లోకం ఏదైనా జరిగిపోతే పీక్కు తింటాది ఆ మనసుని...
    ఎంతైనా నీది దొడ్డ మనసు...
    అభినందనలు పద్దక్కో...

    ReplyDelete
    Replies
    1. మాటలేవో బాగా సెప్పినానని.....గుండె గుబులు పుట్టించే మనిసి అగుపడితే అక్కో అన్నో అనకపోయినా పర్లేదు....అదేదో అనేయబాకే:-) అందరూ కలిసి పీక్కు తింటారే సెల్లి:-)Thank you.

      Delete
    2. వారి వారి .. మీ అక్కా చెళ్ళెండ్ర వాద ప్రతివాదనలు భలే గమ్మత్తుగా వుండాయే..రేపటి చీకటిని చీల్చడానికి మీరిలగిలగే ఎదగండి మిత్రులారా...

      Delete
    3. మీకు నచ్చిందన్నమాట:-)

      Delete
  12. బాగుంది పద్మర్పిత గారు. పిలుపుల వల్లనైనా తలపులను అదుపులో ఉంచగలరనే ప్రయత్నమేమో!!! ఈ పిలుపులనేవి లేక పోతే కుటుంబం బతకదనేమో!!!! సంఘమే మాయమౌతుందనో!!!!!

    ReplyDelete
    Replies
    1. నిజమే...మీరన్నట్లు ఇలాంటి నియమాలతో అయినా కాస్త మనిషిగా నిలబడతామేమో!

      Delete
  13. nijaanni mee laagaa nirbhayamga cheppe varu chala arudu andi.. manasu chadivinatlu chala chakkaga chepparu..

    ReplyDelete
    Replies
    1. nijam maatelaagunna..... ee prasna maatram nannu chaalaa rojulnundi veadhistundandi, andukea evareamanukunnaa adigeayaalanipinchindi. hammayyaa adigesanu:-)

      Delete
    2. ప్రసూనగారు.....మీరు చెప్పింది నిజమండి, ఇలాంటి టాపిక్స్ గురించి చర్చించడానికి కూడా ఇష్టపడనివారు ఎందరో ఉన్నారు.

      Delete
  14. Correct andi, nijaalni nirbhayanga chepparu, bagundandi:))

    ReplyDelete
    Replies
    1. nijaalea cheppaanantara nirbhayamgaa:-)???

      Delete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. పైకి అక్కా, అన్నా అనిపిలుస్తూ......మనసులోను, మైండ్ లోను మరో విధంగా అనుకోకపోవడమే నేను ఇక్కడ అనుకుంటున్న పవిత్రతండి. మీకు తెలిసిన నిర్వచనం మీరు చెప్పండి!

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. thanooj mee prasnalu chustunte Arpil Ist vidudalalo Rajendra Prasad gurtukostunnaadu..

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. thanooj.....నాకొచ్చే సందేహాలతో నేను వేసే చెత్త ప్రశ్నలకే విసిగి ఉన్న మన బ్లాగ్ మిత్రుల్ని ఇలా మీరు కూడా విసిగించడం భావ్యమా మిత్రమా:-)

      Delete
    6. Sorry to interrupt in this....I think if we starts discussion on sin it creates a WAR which is a big SIN:-) in our healthy bloggers friendship, shall we end this here please.
      Have a smile dear:-)THANK YOU

      Delete
    7. Wah kya baat hai Madam....creating it and suppressing it in smooth way:)hahaaaaaaaaaaaaaa

      Delete
    8. No Aniketh its not suppressing the topic. Just i dont want to hurt anyone. Thank Q:-)

      Delete
    9. This comment has been removed by the author.

      Delete
    10. hoooooooooo....njoy friend:-)

      Delete
  16. చాలామంది అంతర్లీనంగా అనుకునేది ఇదేనండి పద్మార్పితగారు...మీరు ఇలా అడగబట్టి కొందరైనా కొంచెంసేపు ఆలోచిస్తారు అనుకుంటున్నాను. నాకు తెలిసి చాలా మంది వారి మనసులోని భావానికి ముసుగేసుకుని పక్కింటాయన్ని అన్నయ్యగారు అని పిలవకపోతే వాళ్ళావిడేమనుకుంటుందో అని, అక్కా అనకపో వీళ్ళాయన అనుమానిస్తాడేమో అని పిలుస్తారే తప్ప ఆవరుసల విలువ తెలిసికాదనుకుంటానండి. మంచి టాపిక్ తో ముందుకొచ్చారు:-) కుడోస్!

    ReplyDelete
    Replies
    1. ఆలోచిస్తారనే అనుకుంటున్నానండి నేనుకూడా....చూద్దాం ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో!

      Delete
  17. అందుకే నేమో ! అక్కా , అన్నా అనడం మానేసి చాలా కాలమైంది . ఇప్పుడంతా ఆంటీ , అంకుల్ .

    ReplyDelete
    Replies
    1. అంకుల్, ఆంటీ అంటూ అందాలు వెతుకుతూ వెంటపడేవారు లేరంటారా?

      Delete
  18. ఏదైనా వరసతో పిలిస్తే ఆ బంధానికి
    జీవితాంతం కట్టుబడి ఉండాలి...
    ఆలోచనలు మారి వరసలు మారకూడదు...
    చాలా బాగుంది...పద్మ గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. నిజంగా అలా కట్టుబడితే...
      నేను ఈ పోస్ట్ రాసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్నికానేమో:-)

      Delete
  19. కొంత మంది ---- లను దృష్టిలో పెట్టుకోని, నిజమైన బంధాలను ఇబ్బంది పెట్టే కవిత అవసరమంటారా,.
    పవిత్రంగా వుంచడానికి సహకరించేవాటిని దెబ్బకొట్టడం బావ్యమా...అంత పవిత్రంగా వుండగలిగితే బట్టలు మాత్రం ఎందుకు చెప్పండి, ఎమనుకోకండి, ప్రతిచోట ఈ ఉపదేశాలు చేయలేను కాని ఒక మిత్రుడిలా ఫీలై ఇలా....పై బొమ్మలాగే కవితా వాక్యాలూ నచ్చలేదు నాకు..

    ReplyDelete
    Replies
    1. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్యూ.....నాకు వచ్చే డౌట్స్ & నేను రాసేవి అందరికీ నచ్చాలని కాదుకదా భాస్కర్ గారు.
      అవసరమా అనుకుంటే అసలు ఏదీ అవసరంలేదనుకుంటా:-)
      మీరు నచ్చలేదు అని చేసిన కామెంట్ నాకు నచ్చిందండి!

      Delete
    2. I vote for Mr.Bhaskar. It is better not raise such unwanted discussions.

      Delete
    3. I will take care of it. thanks for you comment sarmaji.

      Delete
  20. చిన్నా.. నాదీ అదే ఆలోచన.. కానీ నాకైతే అలా అక్షరాలలో బందించడం మాత్రం చేతకాదు..భలే వ్రాసారు సుమీ.

    ReplyDelete
    Replies
    1. ఓ!....నాలా ఆలోచించే వాళ్ళుకూడా ఉన్నారోచ్:-)

      Delete
  21. నాకు మాత్రం నిలబెట్టుకోలేని ఆ వరుసలెందుకు, హాయిగా పేర్లతో పిలుచుకుంటే సరి అనిపిస్తుంది:-) ఐడియా మరీ అంత చెత్తగా లేదనుకుంటాను?

    ReplyDelete
    Replies
    1. అవును ఇదేదో బాగానే ఉందండి:-)

      Delete
  22. బాగా రాసారు పద్మగారు... ఎవరిని నమ్మలేని ఈ రోజుల్లో....మనుషుల మనస్తత్వానికి apt అయ్యే పోస్ట్

    ReplyDelete
    Replies
    1. నిజాలని అంగీకరించాలంటే ధైర్యం కావాలేమో అనిపించి ఈ పోస్ట్ రాసాక:-)
      ధన్యవాదాలు మీకు నచ్చినందుకు.

      Delete
  23. మీ బ్లాగులో నన్ను మొట్ట మొదట ఆకర్షించినది మీ అధ్బుతమైన చిత్రాలు. కానీ తర్వాతెందుకో ఈ కవిత నాకు బాగా నచ్చింది.
    మీ భావ వ్యక్తీకరణ అమోఘం పద్మ గారు.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి విచ్చేసిన మీకు స్వాగతం.
      నా భావాలని మెచ్చి అభినందించిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  24. Thopu .... Chalam style lo undhi

    ReplyDelete