"మొండిమనసు"


ఉషోదయకిరణాల చురకల్ని
నీ వాడితలపులుగా తలచి
అకారణంగా తడిపేసిన వానని
నీ కొంటె అల్లరిగా సరిపుచ్చి
మధ్యాహ్నం చెమట ఉక్కపోతని
నీ విరహ తాపంగా నెంచి
సంధ్యవేళ చిరుగాలి తెమ్మెరల్ని
నీ కరస్పర్శానుభూతిగా మెచ్చి
మాపటేల మబ్బుల్లోదాగిన జాబిలిని
నీవాడు దాగుడుమూతలుగా మార్చి
తారలన్ని మెరుస్తూ ముసిగా నవ్వ
నీవు నాకై దాచిన మల్లెలనిపించి
నడిరేయిలో కీచురాళ్ళ సవ్వడిని
నీ ఊసుల భాషగా ముచ్చటించి
కనుమూయ కలలో మాయమౌతావని
కనులు తెరచి నిదురలో నిను జపించి
ఒక రోజంతటిని ఒక యుగముగా గడప
తెలవారగనే మనసు మరల ప్రశ్నించె...
నువ్వే కావాలంటూ మనసు మారాం చేసె
నీవొక కరిగిన కలవని సర్దిచెప్ప బోతే...
విన్నట్టేవిని మాటవినకుందె "మొండిమనసు"

20 comments:

  1. mondimanasuku johaarlu..
    chaalaa hrudyamaina prema kaavyam Padmagaru.. abhinandanalato..

    ReplyDelete
  2. మాపటేల మబ్బుల్లోదాగిన జాబిలిని
    నీవాడు దాగుడుమూతలుగా మార్చి
    తారలన్ని మెరుస్తూ ముసిగా నవ్వ
    నీవు నాకై దాచిన మల్లెలనిపించి
    నడిరేయిలో కీచురాళ్ళ సవ్వడిని
    నీ ఊసుల భాషగా ముచ్చటించి
    కనుమూయ కలలో మాయమౌతావని
    కనులు తెరచి నిదురలో నిను జపించి..>ఏన్నో జన్మలగా ఎదురు చూస్తున్న నా ఈ విరహ వేదనతో తపిస్తున్నా పరితపిస్తున్న మనస్సు ...మధిభాష్యింగా నీముందుంచినా ఇంకా ఆలోచిస్తున్నావెందుకో..వేయియుగాలైనా ...తడికన్నులతో నిన్నిలా ఆరాదిస్తూనే ఉంటా... Chala chala super andi Ela chappalo ardam avvvadamleedu

    ReplyDelete
  3. mee mondimanassu... chaalaa baavundi... meeru ilaage raastu kavithala samrajyamloo maharanigaa avvandi..-:)

    ReplyDelete

  4. విన్నట్టేవిని మాటవినకుందే "మొండిమనసు" .
    నిజానికి మనసు లక్షణమే అదే కదా!.
    పసితనపు పోకడలని అంటిపెట్టుకొంటూ ,
    పేద్ద పేద్ద పనులు చే(యి)స్తుంటుంది .

    అందుకే ఆ " మొండి మనసు " ని ఎవరూ వదిలిపెట్టలేరు ,
    ఈ కవిత లాగా .


    ReplyDelete
  5. mind blowing art with heart touching words.

    ReplyDelete
  6. "మాట వినని ఈ మనసునేం చేయను" అని నేనొక కవిత వ్రాసాను.అలాగే ప్రేమ లో పడ్డప్పుడు మొండి మనసు మాట వినదు మరి.కొత్తగా వ్రాసారు.

    ReplyDelete
  7. నీ భావాలకి తగ్గ కవిత & చిత్రం.

    ReplyDelete
  8. మొండిమనసును గుండె దిటవు చేసుకుని
    మండే హృదయానికి లేపనం పూసుకుని
    భాద్యతల భంధాల్ని గుర్తు చేసుకుని
    బట్టి విక్రమార్కుడిలా నీ జ్ఞాపకాల్నిభుజాన వేసుకుని
    నీ అందాల ఖజానా మూసేసుకుని
    నన్ను ఎప్పటికి నీ జీవితం లోంచి వెళ్ళి పోనీ .

    ReplyDelete
  9. తెలుగులో ఇంకా కవితలు రాసేవారున్నారని బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకే తెలిసింది. అంటే ఇంత "అద్భుతం" గా రాసేవారని. I felt the FEEL:) continue ur style.

    ReplyDelete
  10. Pic Pichi ye-kistundi Padma Garu ;)

    ReplyDelete
  11. స్వప్నాల జడివానలో తడిపేశారు. ప్రేమించే క్షణాలను మళ్లీమళ్లీ గుర్తుచేసి.. హృదయాన్ని రమింపచేశారు.
    అక్షరమక్షరం ప్రేమించుకుని... విరహావేశ బిగికౌలిలో పదాలుగా రమించి... శృంగార నైషధాన్ని రంగరించి..
    మనసు పలికే మౌనరాగాన్ని... స్వప్న వీచికను ప్రణయ నిరీక్షణగా మార్చేసిన మీ ఊహావిన్యాసానికి.... నమస్కారం.

    ReplyDelete
  12. పెయింటింగ్ పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి. కవితకూడా

    ReplyDelete
    Replies
    1. ఆ కవిత పైంటింగ్ కే అందాన్నిచ్చింది తెలుగమ్మాయి

      Delete
  13. మీదైన శైలిలో ప్రేమను పండించారు...చిత్రంలో కూడా గుప్పించారు :-)

    ReplyDelete
  14. chala bagundandi kavita as well as picture..

    ReplyDelete
  15. వ్యాఖ్యలిడి నా భావాలకి విలువనిచ్చి ప్రేరేపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభివందనాలు.

    ReplyDelete
  16. Anonymous08 May, 2013

    ఒక కవి వేదన తన కవిత చదివిన వారికి కూడా కలిగితే, ఆ కవి విజయం సంపూర్ణం. మీరు ఆ సంపూర్ణ విజయం పొందారు దీనితో.

    ReplyDelete