చిత్రిస్తున్నా!!!


ఛీ! కొడుతూనే చిత్రంగా నీ చిత్రాన్నే గీస్తున్నా

వద్దని వారిస్తూనే నా వేళ్ళకి
త్తాసునిస్తున్నా

పిచ్చిగీతలలికేస్తూ నీ రూపానికి జీవంపోస్తున్నా

జ్ఞాపకాల మైమరపులో కలలకి రంగులద్దుతున్నా

తిడుతూ పోట్లాడే ప్రయత్నంలో నిన్ను ప్రేమిస్తున్నా

ముఖకవళికలని చిత్రించకనే ఆశగా ఎదురుచూస్తున్నా

దంఢించాలని నిన్ను నే బంధించి కౌగిలినే కోరుతున్నా...

ఈ సృష్టి చిత్రించిన చిత్రంలో నా ఉనికి ఇసుక రేణువైనా

నీ హృదయాన్ని విశ్వమంతగావేసి నన్ను నింపేస్తున్నా!!

40 comments:

  1. వండర్ఫుల్ కవితా బొమ్మా రెండూనూ!

    ReplyDelete
    Replies
    1. నచ్చి మెచ్చిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  2. Nice picture and I loved last two lines padma gaaru.

    ReplyDelete
  3. ఈ సృష్టి చిత్రించిన చిత్రంలో నా ఉనికి ఇసుక
    రేణువైనా
    నీ హృదయాన్ని విశ్వమంతగావేసి
    నన్ను నింపేస్తున్నా!!!
    superb.. prema hrudayaanni
    aavishkarinchaaru Padmarpitagaaru..

    ReplyDelete
    Replies
    1. ప్రేమతత్వాన్ని ఆస్వాధించే మీ హృదయానికి వందనం వర్మగారు.

      Delete
  4. beautiful...last 2 lines adaragottaru padma garu!

    ReplyDelete
  5. this is one of your master piece mam.

    ReplyDelete
    Replies
    1. Thanks for you affectionate comment Yohanth

      Delete
  6. ముఖకవళికలని చిత్రించకనే ఆశగా ఎదురుచూస్తున్నా
    -- స్వచ్చమైన ఆశ కి మంచి తార్కాణం...
    ఈ సృష్టి చిత్రించిన చిత్రంలో నా ఉనికి ఇసుక రేణువైనా
    -- అచ్చమైన ఆలోచన కి మచ్చుతునక ...
    నీ హృదయాన్ని విశ్వమంతగావేసి నన్ను నింపేస్తున్నా!!
    -- నిఖ్కచ్చితమైన ఆవాహన కి దర్పణం ....

    మొత్తంగా అన్ని కలిపి కవిత లో చదివితే పైన చెప్పిన మూడు వాక్యాల విలువ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది ...
    కాకపోతే విడి విడిగా చదివితే మటుకు...

    ఇంక మాటలు చాలవు ....ఏమి చెప్పాలో తోచదు .....
    సింపుల్ గా చెప్పాలంటే
    భావాల్ని క్రోడీకరించి
    పదాలని సమీకరించి
    పొదుపుగా పొందికగా మీరు అమర్చే విధానం... hats-off అండి.
    coaching center ఎమన్నా ప్లాన్ చేస్తే నేనే మీ మొదటి విద్యార్ధిని ....హ హ ... ;-)

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానాప్యాయత స్పందనకు ధన్యవాదాలండి.
      coaching center పెట్టాలంటే నేను ముందు పట్టభద్రురాలిని కావాలికదండి. :-)

      Delete

  7. ఛీ ,
    వద్దు,
    పిచ్చి,
    ఙ్నాపకాలు,
    తిట్లు,
    ముఖ కవళికలు ,
    దండించటం,
    సృష్టి,
    నీ కాదు మీ హృదయాన్ని
    తెలియచేస్తున్నాయి .

    ఈ పై మాటలన్నింటితో చక్కగా ఆడుకున్నారు ,
    ఈ పై మాటలన్నింటినీ చక్కగా వాడుకున్నారు .

    చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. మీ పరిశీలనాత్మక స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  8. chaalaa chakkani kavita ni chitrikarinchaaru abhinandanalu

    ReplyDelete
  9. Naku kuda last two lines chala nachindi Padmarpitha...Kavitha chitram rendu adurs!! :)

    ReplyDelete
    Replies
    1. ala...aa 2 lines ae nachchaayante migataa lines feel autayemo Sri Valli...:-)
      Just kidding.....Thank you.

      Delete
  10. CHALA BAGUNDI.. IMG SUPER..

    ReplyDelete
  11. నీ హృదయాన్ని విశ్వమంతగావేసి
    నన్ను నింపేస్తున్నా!!! చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. చూసారా సృజనగారూ....మీకు ఆ లైన్స్ నచ్చాయి, అందరికీ ప్రేమే కావాలన్నమాట :-)

      Delete
  12. చాలా చిత్రంగా చిత్రించారండి .... చివరి రెండు వాక్యాలు... ఆహా అదుర్స్....

    ReplyDelete
    Replies
    1. ఏం చిత్రించినా సృష్టించినా అంతా ప్రేమమయం :-) ధన్యవాధాలండి.

      Delete
  13. ఈ సృష్టి చిత్రించిన చిత్రంలో మీ ఉనికి ఇసుకరేణువే కావొచ్చు. మీరు చిత్రించిన, పేర్చిన ఈ కవితో... ఈ సాహిత్య సృష్టిలో
    జాబిలి నుంచి ఊడిపడ్డ వెన్నెల రేణువయ్యారు. ఏం చెప్పాలి. చాలా కష్టం ఇలా రాయడం. నిజాయతీగా చెప్తున్నా
    చివరికొచ్చేసరికి... కవితానందం కలిగింది ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి. తడి ఆరిపోతే అభినందనల భావ వ్యక్తీకరణలోనూ
    తేడా వస్తుందని గబాగబా రాసేశాను. చాలా బాగుంది. అంతకు ముందే మీకు చెప్పాని అక్షరాలను, అనుభవాలను ప్రేమించి.. వాటిని అక్షరాల్లో బంధిస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ కవితాస్వాధగుణానికి, స్పందించే హృదయానికి నమోఃవందనం.

      Delete
  14. జ్ఞాపకాల మైమరపులో కలలకి రంగులద్దుతున్నా!!!ఆహా ;)

    ReplyDelete
    Replies
    1. చాన్నాళ్ళకివిచ్చేసి ఇలా ఆహ;) అన్నందుకు ధన్యవాదాలండి చాతకం గారు.

      Delete
  15. చిత్రాన్ని ఎంత చంచల మనసుతో చిత్రించినా, చివరికి మీ ధృధసంకల్పాన్ని తెలపడం ప్రసంశనీయం.

    ReplyDelete
    Replies
    1. మనసులోని మర్మాన్ని తెలుసుకున్న మీకు అభివందనం.

      Delete
  16. నీ హృదయాన్ని విశ్వమంతగావేసి నన్ను నింపేస్తున్నా!!! చాలా బాగుంది.ఇలాగే మీ అందమైన కవితల చిత్రాలను అందించాలని నా మనవి!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాధాలండి.

      Delete
  17. beatiful heart feelings you painted with emotions in this kavita.

    ReplyDelete
  18. చాలా బాగుందండీ :)

    ReplyDelete
  19. ధన్యవాధాలండి.

    ReplyDelete
  20. అందమైన అక్షరమాలలు
    అంతకంటె అందమైన చిత్రరేఖలు
    ఆస్వాదించిన చాలు
    అమందానందమవును హృదయాలు
    అందుకే అందిస్తున్నా అబినందనలు....

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి సుస్వాగతం శైలజగారు.
      అందంగా
      అభినందనలు తెలిపిన మీ
      ఆత్మీయ స్పందనకు
      అభివందనములు!

      Delete