సాహసమేల!


చలిగాలికి నిను తాకాలన్న తపనేల!
వలపువిరహ సెగనై నే నిను తాకగా

నీరెండ లేతకిరణాల వెచ్చదనం నీకేల!
నా మునివేళ్ళు నీ నుదుట నర్తించగా

వానజల్లు నిన్ను తడిపి మురియనేల!
సుగంధ పరిమళ స్వేదమై నే తడపగా

చిగురాశలకు నిన్ను చుట్టేసే తాహతేల!
చక్కదనాల చుక్కను నీ చెంతనుండగా

సప్తస్వరాలు కనుసైగతో నిను పిలవనేల!
సరిగమ శృంగారనాదస్వరమే నే ఊదగా

చీకటిరేయి నిను బంధించి భయపెట్టనేల!
నాకురుల వింజామరలు లాలిలా జోకొట్టగా

పూలకి మత్తుజల్లి మాయచేసే మర్మమేల!
ప్రేమమత్తుకి కొత్తదనాన్ని నేను పేనానుగా

ప్రకృతికి మన ప్రణయమంటే పరిహాసమేల!
జగతికే ఈర్హ్య పుట్టేలా నే ప్రేమను పంచానుగా 

                            *******
                      
                                                                                                        

53 comments:

  1. Beautiful feel.....showering all da love ....

    ReplyDelete
  2. ప్రేమలో పూర్తిగా తడిసి ముద్దైపోయాను :-) సర్వం పద్మార్పితం

    ReplyDelete
    Replies
    1. మరీ అంతలా తడవకండి జలుబుచేస్తుంది...అంతా తుమ్ములమయం :-)

      Delete
  3. కవిత చాలా బాగుంది
    ayurbless team
    http://ayurbless.blogspot.in

    ReplyDelete
  4. ఎంతబాగా ప్రేమను పండించగలరో అంతకు రెట్టింపు మదిని పిండేయగలరు. నవరసాల్లో మెప్పించగల ప్రతిభ మీలో మెండుగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవదాలు యోహంత్...ప్రేమకు ఆ శక్తి ఉంది

      Delete
  5. ఎంత బాగా రాసారండీ. సూపర్.....

    ReplyDelete
    Replies
    1. బాలగారు...వెల్ కం టు మై బ్లాగ్....థ్యాంక్యూ

      Delete
  6. పాత ఒరవడితో మళ్ళీ మాముందుకొచ్చారు... కంగ్రాట్స్!!

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడూ కొత్తగా అనుకుని పాతదే ఫాలో అయిపోతుంటాను ఏంటో :-) thank you

      Delete
  7. మీరుండగా అవంతటి సాహసం చేయలేవుగా.

    ReplyDelete
    Replies
    1. నాతో పాటు మీరంతా ఉన్నారన్న ధైర్యం నాకు భయం వాటికిలెండి :-)

      Delete
  8. kuch khas nahin...jaisa ke ap hamesha likhti ho ye waisa nahin

    ReplyDelete
    Replies
    1. har ek baar khas kaise keha sakti hoon :-)

      Delete
  9. ఆదివారం, చలికాలం అందమైన అమ్మాయి బొమ్మతో గిలిగింతలు పెడితే ఎలా అర్పితా....మరీ అల్లరి ఎక్కువైపోతుంది- బాగుంది ఇలా కూడా

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు మీరే ఇలా అంటే...ఇంక మిగిలినవాళ్ళంతా నన్ను అల్లరిపిల్ల అంటారుకదండి :-)

      Delete
  10. Padmarpita madam gariki

    Namaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi. Mee blogu choosi aanandamu vesindi.

    Padmarpita madam garu meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.

    Padmarpita madam garu idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.

    http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

    Padmarpita madam garu meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.

    Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.

    Padmarpita madam garu meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.

    Padmarpita madam garu meenunchi naa Lamps of India message ki oka manchi sandesamu englishlo vasthumdani alaage meeru naa blogulo membergaa join avutharu ani aasisthunnanu.

    ReplyDelete
  11. వానజల్లు నిన్ను తడిపి మురియనేల!
    సుగంధ పరిమళ స్వేదమై నే తడపగా
    చిగురాశలకు నిన్ను చుట్టేసే తాహతేల!
    చక్కదనాల చుక్కను నీ చెంతనుండగా
    సప్తస్వరాలు కనుసైగతో నిను పిలవనేల!
    సరిగమ శృంగారనాదస్వరమే నే ఊదగా xtraordinay.. mesmerizing feel..Love this..<3

    ReplyDelete
    Replies
    1. thanks a lot for your encouraging comments

      Delete
  12. వాటి సాహసమేమో కానీ మీరు మాత్రం గట్స్ ఉన్న లేడీ అని మరోమారు నిరూపించారు.

    ReplyDelete
    Replies
    1. అంటే పిరికిదాన్ననా తెలుగమ్మాయిగోరు అర్థం :-)

      Delete
  13. చిలిపి ప్రశ్నలతో బాగుంది పద్మర్పిత.

    ReplyDelete
    Replies
    1. థ్యాంకులూ థ్యాంకులు ;-)

      Delete
  14. మనిషిలోని ప్రతి స్పందన ప్రతి ప్రతిస్పందన ప్రకృతి తో ముడిపడి ఉందన్న సత్యాన్ని ఇందులో గ్రహించవచ్చు. ప్రకృతిలో ఋతువుల మాదిరిగా మనలోని భావాలు కొంగోత్తగా పల్లవిస్తాయనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాక్షాత్తు ప్రకృతే మనిషిలో ఇనుమడింపజేసినట్టు బహుచక్కని కావ్యమిది సరియైన చిత్రం అది పద్మార్పిత కారు. ది బెస్ట్ అనిపించారు కదా ...

    ReplyDelete
    Replies
    1. కారు అని పడింది దానిని గారు గ చదువుకోగలరని మనవి

      Delete
    2. మీ అభిమానాత్మక ప్రేరణా స్పందనకు ప్రణామం_/\_

      Delete
  15. కవిత చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog..థ్యాంక్యూ

      Delete
  16. ప్రపంచాన్ని శాసించేదే ప్రేమ. ప్రేమ లేని చోట మనిషే లేడు. స్త్రీ తన ప్రేమను మనస్పూర్తిగా
    పంచాలీ అనుకుంటే.. ప్రకృతైనా తలవంచక తప్పదుగా. దాసోహం కానిదేది.

    ReplyDelete
    Replies
    1. వాహ్ వాహ్.....ఏంచెప్పారండి. అంతేకదా...that is the power

      Delete
  17. సూపర్ పద్మ గారు, చాలా చాలా బాగుందండి. పిక్ సూపర్:-)) పధాల అల్లిక ఇంద్రజాలంలా ఉందండి:-))

    ReplyDelete
  18. awesome pic with fabulous words and lovely feel.. padma you are always rocking.

    ReplyDelete
  19. అమ్మో ఎన్నేసి మాటలంటున్నావు చేయవలసినవన్నీ చేసి కొంగున ముడివేసుకుని :-)

    ReplyDelete
    Replies
    1. నేనా....కొంగున ముడివేసుకున్నానా....ఎప్పుడు :-)

      Delete
  20. సప్తస్వరాలు కనుసైగతో నిను పిలవనేల!
    సరిగమ శృంగారనాదస్వరమే నే ఊదగా
    చీకటిరేయి నిను బంధించి భయపెట్టనేల!
    నాకురుల వింజామరలు లాలిలా జోకొట్టగా
    ఇంతలా ప్రతి అణువునూ ప్రేమతో పూరిస్తే ఇంక వేరేవి జొరబడ్డానికి ఆస్కారమేముంది ఆ ధైర్యం తాహతు ఎవరికి ఉంటాయి చెప్పండి

    ReplyDelete
    Replies
    1. మహీ.....మరీ ఇంతలా అనాలా చెప్పు :-)

      Delete
  21. Mi bhavalu super andi....Padma garu meeku fans page vunda!!....Ayyooo nenu inni rojulu miss ayyanee....

    -Roopa

    ReplyDelete
    Replies
    1. thank you Roopa.....appudu miss aithenem ippudu follow avvandi

      Delete
  22. కవిత చాల బాగుంది
    ..పెయింటింగ్ అంతకన్నా బాగుంది

    ReplyDelete
  23. Nice...really beautiful..:-):-)

    ReplyDelete
  24. చాలా బాగుంది పద్మార్పిత

    ReplyDelete