సొగసు చూడతరమా!

నా గుండెలయలో నీ జాడ తెలుసుకోనా
మనసు చూపిన దారిలో నీదరికి చేరనా

నా కనుల నీడలో నీ రూపు చూసుకోనా
కలలు కనే కాలాన్ని కాసేపు ఆగమననా

నా అధరాలతో నీ నామమంత్రం జపించనా
తలపులతో నీ తనువునంతా తడిమేయనా

నా కర్ణాల కలువరేకులనే విప్పార్చి విననా
ప్రియతమా అన్న పిలుపుతో పరవశించనా

నా నాసిక పీల్చే శ్వాసలో నిను బంధించనా
ప్రేమ పరిమళ పుప్పొడితో నే అభిషేకించనా

నా మెడ వంపులో నీ మోమునే దాచుకోనా
అనురాగ అత్తర్లతో అనువణువు ఆక్రమించనా

నా కురుల వింజామరతో వీచి అలసట తీర్చనా
సేదతీరువేళ ప్రేమ ఊసులే చెప్పి గారాలుబోనా

నా మునివేళ్ళతో నీ ఎదపై నా చిత్రాన్ని గీయనా
సరససరాగాలెన్నో నీలో సుకుమారంగా మీటనా

63 comments:

  1. అబ్బా!! మీ ప్రియుడికెంత బద్ధకం. అన్నీ మీరే చేయాలా ఇలా??!!

    ReplyDelete
    Replies
    1. వినోద్ గారు.....గుండె, కనులు, అధరాలు, కర్ణాలు, నాసిక, మెడ, కురులు, మునివేళ్ళు నావైనప్పుడు ప్రియుడితో పనిచేయించడం భావ్యమా చెప్పండి :-)

      Delete
  2. ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకుని మరీ వాలడూ.......తన ఎదపై మునివేళ్ళతో చిత్రాన్ని గీయించుకొవడానికి....పద్మార్పితగారు చిత్రం , కవిత రమ్యంగా ఉన్నాయి ,

    ReplyDelete
    Replies
    1. శ్రీదేవిగారు....వచ్చివాలి చిత్రం గీయించుకుని చక్కగా చెక్కేస్తాడేమో :-)

      Delete
  3. సొగసు చూడతరమా!!!!! కెవ్వు మనిపించారు పద్మగారు

    ReplyDelete
    Replies
    1. యోహంత్ జీ.....అరిచింది మీరేనా!!! :-)

      Delete
  4. Simply Superb With Fantastic Painting. Claps Claps Claps

    ReplyDelete
  5. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది ...చెలీ ఇదేం అల్లరి :-)

    ReplyDelete
    Replies
    1. అదేంటండీ.....అందంగా ఇవ్వన్నీ చేయనా అంటే అల్లరి అంటారు :-)

      Delete
  6. ఏమని చెప్పనూ !
    ఎలా చెప్పనూ !!

    "సొగసు చూడతరమా!"
    మనసుకి గుచ్చుకునేలా రాశావ్

    "నా కురుల వింజామరతో వీచి అలసట తీర్చనా
    సేదతీరువేళ ప్రేమ ఊసులే చెప్పి గారాలుబోనా"
    - ఎంత ఆప్యాయత ఈ మాటల్లో - ఇంతకంటే కోరుకునేదేముంది

    "నా మునివేళ్ళతో నీ ఎదపై నా చిత్రాన్ని గీయనా
    సరస సరాగాలెన్నో నీలో సుకుమారంగా మీటనా"
    -పులకరింతలతో పాటు కాస్తా గిలిగింతలు కుడా పెట్టాయి
    పై వాక్యాలు. సరళమైన భాషతో భావాల్ని ఇట్టే ముడేసారు పద్మార్పితా...... చాలా బావుంది .
    -శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాదగారు......చిత్రాన్ని గీసే ప్రయత్నంలో మునివేళ్ళు మనసుకి గుచ్చుకున్నాయేమో :-)

      Delete
  7. నీ గుండెలయలో వెతికితే జాడ కనిపించలేదెందుకో
    మనసు చూపిన దారిలో అంతా వెతుకుతూనే ఉన్నా ఇప్పటికే

    గుండెలయలో మది అందియల శబ్దాలు
    నన్ను కాసేపుకూడా నిలువనీయడం లేదు

    నా కనుల నీడలో నీ రూపు చూసుకోనా
    కలలు కనే కాలాన్ని కాసేపు ఆగమననా

    కనుల అంచున జారిన నా కన్నీటి
    బొట్టూలో దాగిన ఆ నిజాన్ని అడుగు

    నీ అధరాలతో జపించే నామమంత్రం
    నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది
    నన్ను నీ తలపులతో తనువునంతా తడిమేపేస్తుంది

    నా నాసిక పీల్చే శ్వాసలో బందీఅయిన బావాలన్నీ
    చిక్కులు చిక్కులుగా నన్నేంటో చిద్రం చేస్తున్నాయి
    అనురాగ అత్తర్లతో మనసంతా అల్లుకపోయిన పరిమళాల సాక్షిగా


    Note :-మీ కవితను ఆశ్వాదించి ఆహ్లాదంలో మునిగి .. మీ ప్రతి పదంలోఉన్న భావాన్ని చింద్రంచేశానేమో అనిపించింది .. తప్పైతే క్షమించగలరు పద్మాగారు

    ReplyDelete
    Replies
    1. క్షమార్పణలు గిమార్పణలు జాంతా నహీ.....మీ మనసు మీ ఇష్టం :-)

      Delete

  8. సొగసు చూడాల్సిందే తరించి పోవలసినదే !!

    నూతన వత్సర సొగసుల తో

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీగారికి తీపిరుచుల(సొగసు) సంగతులు నేనేం చెప్పగలను...:-)

      Delete
  9. నా గుండెలయలో నీ జాడ తెలుసుకోనా .... కలలు కనే కాలాన్ని కాసేపు ఆగమననా .... ప్రియతమా అన్న పిలుపుతో పరవశించనా
    రాధా మాదవీయం లా ఎంతో చక్కగా చిక్కగా చాలా బాగుంది "సొగసు చూడతరమా" లో .... సొగసైన పదజాలం!

    ReplyDelete
    Replies
    1. చంద్ర వేములగారి సొగసైన కమెంట్ కడు కమ్మనైనది...._/\_

      Delete
  10. అంతా ప్రేమార్పితమయం.. ప్రతి పదం ప్రేమమయం..
    చిత్రం అమోఘం..ః-) అభినందనలు పద్మార్పిత గారు..

    ReplyDelete
    Replies
    1. వర్మగారూ.....ప్రేమించే మనసున్న మీలాంటివారికి అంతా ప్రేమమయంగానే తోస్తుందేమో :-)

      Delete
  11. వండర్ ఫుల్.....
    మీదైన స్టైల్ లో పేష్ కర్తీ హూ :-)
    అర్పితా ఒక విన్నపం వెల్లడించనా
    మనసులోని భావాన్ని ఇలా తెలుపనా
    అందంగా వలపందించిన చేతిని ముద్దాడనా

    ReplyDelete
    Replies
    1. అభిలాషిణి.....చిన్నికవితలో ముద్దుగా ముద్దాడనా అంటే కాదంటానా :-)

      Delete
  12. సరళమైన పదాలతో సరసమైన కవితనందించారు. మీ కవితా ప్రవాహానికి నా ప్రణామం పద్మార్పిత గారు.

    ReplyDelete
    Replies
    1. అభిమాన సమూహానికి ప్రతివందనం._/\_

      Delete
  13. Superrrrrrrrrrrrr ......
    .....


    ReplyDelete
  14. Its soooooooo romantic with beautiful pic

    ReplyDelete
  15. అపూర్వమైన ప్రేమకావ్యం నీ భావసముదాయం అమోఘం....అమ్మో ఏంటో కవితలొచ్చేస్తున్నాయి పద్మార్పిత బ్లాగ్ చూడగానే :-)

    ReplyDelete
    Replies
    1. అయితే త్వరలో సృజనగారి కవితలు చదివేయబోతున్నాం :-)

      Delete
  16. Manchi feel tho alaa alaa sagipoyindi..
    nijamgaa sarileru meekevvarooo..
    pic superb:-):-)

    ReplyDelete
    Replies
    1. సరిలేరంటూ ఆకాశానికి ఎత్తేయఖండి....ఇలలోనే ఉండనీయండి...ఇంకా మీ అందరికీ నా పాండిత్యం చూపాలికండి :-)

      Delete
  17. ఊపిరి ఆడటం లేదు... పద్మగారు. చిలిపితనం, అల్లరితనం, వలపుతనం, శృంగారనైషధం... ఎన్ని చెప్పినా... చెప్పాలనిపుస్తూనే ఉంది. ఆడపిల్లల మనసు ఇలా తెలిస్తే ఆగతరమా. రామచంద్రా. మొత్తం వర్ణనలో నాకు నచ్చిన లైను... నా మెడ వంపులో నీ మోమునే దాచుకోనా... అసలైన ప్రేమకు సిసలైన చిరునామా అది.. అని నా భావన. చాలా బాగుంది. ఈ స్థాయిలో ప్రేమ గుమ్మరించి ఊపిరి సలపనివ్వకుండా చేశారు కదండి... తస్సదియ్య.

    ReplyDelete
    Replies
    1. వాయమ్మో!!!!!....ఊపిరి సలపనియ్యలేదంటూ పోలీసు కేసు పెట్టకండి :-)

      Delete
  18. ఓయ్ సూపర్:-) అయ్యబాబోయ్ ఎంత అందంగా రాసారో:-) మహాద్బుతంగా ఉంది కవిత, పిక్:-) అసలు ప్రేమను ఎంత అందంగా, చిలిపిగా, పండించారో. అబ్బా చూస్తూనే ఉండిపోయా:-) నీకు నీ కవితలకు కోటి కోటి ప్రణామాలు -^- ఒక్క% అయినా నీలా రాయాలని దీవించు మాడం:-)

    ReplyDelete
    Replies
    1. శృతి.....అహా...ఓహో...అనేసి అందలం ఎక్కిస్తావే కానీ నిజానికి నువ్వుకూడా అదరగొట్టేస్తావుగా కవితలు ;-)

      Delete
  19. ఎడారిలో వాన పడితే మరుభూమి సొగసు చూడతరమే
    హిమాలయాల మాటున చలువ చందురుని సొగసు చూడతరమే
    కంటిపాపలో నిదురించే కల కళ్ళకెదురుగా కనులకు ఇంపుగా ఉంటె సొగసు చూడతరమే
    కాని కులుకులు మెలికలు అల్లిన చెలి మోము సొగసు చూడతరమా ?
    చాలా చక్కని భావపదజాలం పద్మగారు. చిత్రం కావ్యం సొగసు చూడ తరమా అని అడగాలనుంది. మిన్నంటిన మనసు భావం ఇదే కామోసు!!

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారు....సొగసు చూడతరమే అని చెప్పేసి...అడగనా అంటారేల :-)

      Delete
  20. పరిపూర్ణమైన ఆడతనానికి అద్దం పట్టింది ఈ కవిత, చిలిపితనం కలబోసి అనురాగం అందించావు ఈ కవిత ద్వారా పద్మార్పిత. అభినందనలు-హరినాథ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు.....మీరు నన్ను చిలిపి అల్లరిపిల్లగానే అభిమానించండి అదే బాగుంది. :-) ఇలా పరిపూర్ణత్వం అంటే పొగరొచ్చేసి ఇంకేం రాయలేనేమో!

      Delete
  21. ఒక్క కవితలో భావాలనికి పుట్టించడాని పిచ్చప్రయాస పడుతుంటే మీరేంటో ప్రతిరోజు పంచభక్షాలాంటి పసందైన కవితలతోపాటు కనులకింపైన ఫోటోలు కూడా పెట్టేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. తెలుగమ్మాయిగోరు.....ఇలా ప్రయాస అనే పదం లిపిగా మీకు నప్పలేదండోయ్....పంచభక్షాలు భక్షించి మిమ్మల్ని మీరు తలుచుకోండి....ఇంక కవితలే కవితలు ;-)

      Delete
  22. dhoo macha rahi ho padmaji, yah kavita se pata chala hi aap bahut natkat ho :-) pic tho la jawab hi

    ReplyDelete
    Replies
    1. dhoom kyaa machaavu...sirf kavitha mein hee likhi hoon tho aap ne natkat keh rahe ho :-)

      Delete
  23. తలచి తరచి చూస్తే మాత్రం తర్కానికి అందని భావం.

    ReplyDelete
    Replies
    1. సొగసులో కూడా తర్కం ఏం తరచి చూస్తారు చెప్పండి

      Delete
  24. ఇంత సుతారంగా ఎదనుతాకే భావాలు మీకే సొంతం. చిత్రం కనులకు ఇంపుగా ఉందండి

    ReplyDelete
    Replies
    1. మనసంతా నాపై అభిమానం ఉందిగా అందుకే అలా అనిపిస్తుంది కదా :-)

      Delete
  25. మీ భావహొయలే బ్రహ్మాండం....సొగసు చూడతరమా?? :-)

    ReplyDelete
    Replies
    1. భావహొయలు ఆస్వాధించడంలో అలసత్వం ఒద్దు అనికేత్ :-)

      Delete
  26. తలపులతో నీ తనువునంతా తడిమేయనా...
    అనురాగ అత్తర్లతో అనువణువు ఆక్రమించనా...

    ఒక తపించే మది దర్పణం...
    చూసాక తప్పుతుందా మది అర్పణం...

    స్నేహపూర్వక శుభాభినందనలు...

    ReplyDelete
    Replies
    1. Nmrao Bandigaru..... మరీ తప్పదని మది అర్పణమా :-) స్నేహపూర్వక అభినందనలు అందించారుగా...అయితే ఓ.కే

      Delete
  27. ఈసారి జ్ఞానేంద్రియాలన్నింటితో ప్రేమతత్వం భోధించారన్నమాట...బాగుంది

    ReplyDelete
    Replies
    1. ప్రేరణగారు.....పసిగట్టేసారు. టూ ఇంటలిజెంట్ మీరు

      Delete
  28. సొగసు చూడతరమా....అదో అలౌక్యానుభూతి ;-) రసరమ్యం మీ కవితా దృశ్యకావ్యం

    ReplyDelete
    Replies
    1. మహీ......అలౌకికానుభూతిలో మునిగి ఆలస్యంగా ఇచ్చారా కమెంట్ :-)

      Delete
  29. అలసిపోయే మనశ్శరీరానికి సేద తీర్చగలిగే ఏదో శక్తి మీ కవితల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో ...

    ReplyDelete
    Replies
    1. Mehdi Aligaru.... నిజంగా అలాంటి సేదతీర్చే శక్తిని ఉంటే దాన్ని ఎప్పుడూ అంధించమని వేడుకుంటాను.

      Delete
  30. కమెంట్స్ కి కాస్త చిలిపిగా జవాబులివ్వాలనే ప్రయాసలో ఎవరినైనా నొప్పిస్తే పద్మార్పిత మీలో ఒకరని అనుకుని మన్నించేయండి. మనసుకి తీసుకోరన్న కొండంత ఆశతో ధైర్యంగా రాసేస్తున్నా ఇలా..._/\_ _/\_ _/\_

    ReplyDelete
  31. యద పై కాదు కాదు నా హృదయం లో మీ చిత్రం ముద్రితమై గిలిగింతలు పెడుతుంది

    ReplyDelete
  32. aap ko meri pranam padmarpitaji, aap ke bhaavanawon ki gulam hogayi maine

    ReplyDelete
  33. Me kavithalu super andi na fb lo vesukovcha

    ReplyDelete