వైకల్య వ్యధ

భరించలేనంటూనే వ్యధని భరిస్తూ
చేసినబాసల బాటలో ముళ్ళేరుతూ
మూసిఉన్న మదితలుపులు బాదేస్తూ
తెరుచుకోవని తెలిసినా విరగ్గొడుతున్నా!

చీకటి జీవితంలో చమురులేని దీపంతో
ప్రజోజ్వల వెలుగు ఇస్తుందన్న భ్రాంతిలో
మిణుగురులతో చెలిమి అంటుకట్టి ఆశతో
చిగురించబోయే బంధానికి పందిరి అల్లేస్తున్నా!

సంప్రదింపు చర్చల్లో కుంటిదైన సంబంధమేదో
నడవలేదని తెలిసి రేసుగుర్రమల్లే పరిగెత్తాలని
మత్తుమమతల చర్నకోల్ ఝళిపి చేసిమాయేదో
రోజూ రేయింబగలు పలకలేనని నామంజపిస్తున్నా!

అలసటతో విరిగిన అంచనాలకు ఆసరా అతుకేసి
సహనమంటూ ఆగలేక కన్నీటితో కొలనంతా నింపి
ఉప్పనీరు దాహం తీర్చదని తనకన్నీళ్ళు తానేతాగేసి
సమాలోచలతో కోల్పోయిన నాలో నన్నే వెతుకుతున్నా!

48 comments:

  1. వైకల్యభరితమైన వ్యధని సైతం అధికమించే శక్తి ఆ చిరునవ్వుకే ఉందండి.:-)

    ReplyDelete
    Replies
    1. అందుకే కదా నవ్వేస్తుంటాను వేదనలోను వేడుకలోను :-)

      Delete
  2. అమ్మో ఇంతటి వ్యధ భరించడం నావల్ల కాదు మీ కవితానాయకిని మీ అడుగుజాడల్లో నడిచి నవ్వుతూ సాగిపొమ్మనండి:-)

    ReplyDelete
    Replies
    1. వ్యధని భరించడం ఎంధుకు విడాకులిస్తే పోలా.... నా కవితానాయకి నాలాగే :-)

      Delete
  3. మళ్లీ మీ నుంచి చాలా మంచి కవితను చాన్నాళ్ల తర్వాత చూశాను. రియల్లీ... విరిగిన మనసు ముక్కలను
    ఒక చోట పేర్చి... ఏర్చి కూర్చినట్టుంది మీ పదబంధం. గట్టు తెగిన ప్రవాహంలో కన్నీటిని ఉబికితే... ఆ ప్రవాహంలో తేలుతున్న అక్షరాలన్నీ తీరాన్ని చెల్లాచెదురుగా చేరితే... వాటిని ఓ చోట చేర్చినట్టుంది... ఈ వేదనా వ్యధ.

    ReplyDelete
    Replies
    1. సతీష్ కొత్తూరిగారి.....ప్రశంసా వ్యాఖ్యలు చెప్పారంటే అమ్మో....:-) నాకు నేనే భుజాలు చరచుకుంటున్నా :-) థ్యాంక్యూ

      Delete
  4. మొదటి మరియు చివరి స్టాన్జాల మధ్య చిక్కుకొని బయటికి రాలేని పరిస్తితి. ఇలా వేదనలోను కట్టిపడేయడం మీకే సాధ్యం మేడం.... చాన్నాళ్ళకి మీ దర్శనభాగ్యం. Hope every thing is going well. Keep Rocking :-)

    ReplyDelete
    Replies
    1. మీరు ఇలా మొదటి చివరి స్టాంజాల నడుమ చిక్కుకుని బయటకి రాలేకపోతే భయపడకండి......మై హూ నా :-) thanks a lot

      Delete
  5. వైకల్యం అంటే అక్షరాలకో భావాలకో అనుకున్నా, ఇక్కడ మైండ్ బ్లాక్ అయి వైకల్యం నాకు సంతరించి చదివిందే చదువుతున్నా :-)

    ReplyDelete
    Replies
    1. అక్షరాలకి వైకల్యం వస్తే సరిచేసినట్లే మీ మైండ్ బ్లాక్ అయిపోతే నవ్వించి బైపాస్ చేస్తాను డోట్ వర్రీ మై ఫ్రెంఢ్

      Delete
  6. మనసులో మెదిలే భావాలు నీ జ్ఞాపకాలతో వ్యాకులం చెందినా
    నవ్వులు రువ్వే పెదవులే కోపతాపానికి వేడెక్కి కమిలిపోయినా
    చేయూతనిచ్చే చేతులే మోడువారి కదలకుండ మారం చేసినా
    వెన్నంటి ఉండి నడిపించే స్నేహం ముందర అన్ని చిన్న బోవా ?

    పరిణితి చెందిన కావ్యం మీ కలం నుండి జాలువారింది, చాలా చక్కగా అభివర్ణించారు, మనోవైకల్యం మనకు మన వాళ్ళ దూరం వలనే కలుగుతుంది అనే భావాన్ని మీ కవితలో తెలియపరిచారు. చాలా విషాదం నిండినట్టుగా కానవస్తుంది ఆ చిత్రం.

    ReplyDelete
    Replies
    1. స్నేహ హస్తం చేయూత ముందు ఏ ఒడిదుడుకులైనా బలాదూర్ అని చక్కగా చెప్పి ఆత్మస్థైర్యాన్ని నింపారు. మీ అభిమాన ప్రశంసా వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

      Delete
  7. పద్మార్పిత గారూ !
    రచనా వ్యాసంగంలో మీ పరిణతిని రోజు రోజుకు ఎంతగా పెంచుకుంటున్నారో మీ ఈ కవిత చెప్పకనే .. చెబుతుంది. కవిత కు కవితకు మధ్య ఏదో నూతనత్వం . ఎన్నెన్నో మలుపులు.. మెరుపులు .

    "చీకటి జీవితంలో చమురులేని దీపంతో
    ప్రజోజ్వల వెలుగు ఇస్తుందన్న భ్రాంతిలో
    మిణుగురులతో చెలిమి అంటుకట్టి ఆశతో
    చిగురించబోయే బంధానికి పందిరి అల్లేస్తున్నా!"

    ఆలోచనలను రేకిత్తించే పై మాటలు ఎంత పరిపూర్ణ మైనవో ... భావోద్రేకాలకు గురిచేస్తూనే భావ గర్భిత మైన మంచి కవితనందించిన మీకు నా అభినందనలు . మీ ఈ కవిత ఓ 'ఆణి ముత్యమే'.

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాదగారు.....ముందస్తుగా మీ సునిశిత పరిశీలనా స్ఫూర్తి వ్యాఖ్యలకు నెనర్లు. ఏదో రాసింది అని ఒకసారి చదివీ చదవనట్లు చదివి వ్యాఖ్యలు అందించే ఈ రోజుల్లో అసాంతం చదివి ఆస్వాధించి ఓపిగ్గా వ్యాఖ్యలు రాసే మీ అభిమానం ముందు ఒకోసారి నా పదాలు చిన్నబోతాయి. అందుకే రిప్లై ఇవ్వాలంటే ఎంతో ఆలోచించవలసి వస్తుంది. ఎప్పుడైనా అక్షరాల్లో తప్పులు దొర్లితే మన్నించేద్దురూ :-)

      Delete
  8. marvellous poetry from padmarpita's powerful pen. kudoos my friend

    ReplyDelete
  9. చాలా బాగా చెప్పారు .. అంతులేని వ్యథ ని గుండెల్లో దాచి ఆశా రాగాలను మీటుతూ మనసు మూలల్లో పెల్లుబుకుతున్న ఉప్పని ఉప్పెన ని కప్పెడుతూ ... మీరన్నట్టు చమురు లేని దీపం .. సంతోషం లేని మనసు లోతుల్నించి రాని చిరునవ్వు ని పెదవులపై ఆశ్రయమిస్తూన్న .. వేదనా భరిత జీవితాన్ని కళ్ళ ముందు నిలిపి మిమ్మల్ని శహభాష్ అనేలా చేసారు పద్మర్పితగారు

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు రాధికగారు. వ్యధని ఎంత కప్పెట్టుకుందాం అనుకున్నా ఒకోసారి ఉప్పెనై ఎగసిపడుతుంది....అలా బయటపడిన తరువాత ప్రశాంతంగా ఉంటుందనుకుంటాను. వేదన అయినా ఆనందం అయినా ఎదుటివారితో పంచుకోవడమే మంచిదేమో.

      Delete
  10. నడవలేని గుర్రాన్ని పరిగెత్తించాలనే ప్రయత్నానికి మమతల మత్తుని జోడించి చర్నకోల్ అనే పదాన్ని చాన్నాళ్ళకి వినేలా చేసిన మీ భావప్రకటనలు పదప్రయోగాలు అమోఘం.

    ReplyDelete
    Replies
    1. అసలే కుంటిగుర్రం దానికి మత్తులాంటి మమతను జోడించి పరిగెత్తమని కొడితే ఏం పరిగెడుతుంది అక్కడే కూలబడిపోతుంది, వృధాప్రయాస కదండి! మీకు నా భావలు నచ్చినందుకు అభివందనాలు.

      Delete
  11. వ్యధాభరితమైన కవితకు బాగుందని స్పందనరాయలేక, కొత్త పదాలు ఏం రాయాలో తెలియక తికమక పడుతుంటే మీ వైకల్య వ్యధలోని పదాలు మీ మునివేళ్ళపై నర్తించి తరించి ఉంటాయనిపిస్తుంది మీ కవితచదివాక.

    ReplyDelete
    Replies
    1. స్పందనకై వ్యధ చెందక....నా మునివేళ్ళ నర్తనను చూసి నవ్వేయండి...:-)

      Delete
  12. వేడనను హృదయాంతరంగంనుంచి అక్షరీకరించడంలో మీ కలానికి సాటి లేదు పద్మార్పిత గారు. చిత్రం కూడా అద్భుతంగా కుదిరింది. మీ కలానికి కుంచెకు అభినందనలు..

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనమాలా పుష్పాల సేకరణకై అక్షరనిధి అన్వేషణతో ఎప్పుడూ తాపత్రయ పడుతుంటాను. ధన్యవాదాలండి.

      Delete
  13. నీ మేధస్సుకి వైరాగ్యం రంగరిస్తే పలికిన పలకులు.

    ReplyDelete
    Replies
    1. సృజనగారు మరీ మేధస్సు అని మలై రుద్దేస్తున్నారు. :-)

      Delete
  14. ఇంత గంభీరమైన పదజాలం కేవలం పద్మార్పిత కవితామాలలోనే చూడగలం అని మరోమారు ధృవీకరించావు. శభాష్ డియర్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు గంభీరపదాలేనా....మరి అప్పుడెప్పుడో అల్లరిపిల్లని చిలిపిదాన్ని అన్నారుగా :-)

      Delete
  15. వేదనంతా వడపోసి కూర్చిన కవితామాల బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete

  16. எத்தனை வண்ணங்கள் எத்தனை எண்ணங்கள் .... பாடலும் படமும் மிக மிக அருமை

    ReplyDelete
    Replies
    1. Padmanabhan Said: "Ettaṉai vaṇṇaṅkaḷ ettaṉai eṇṇaṅkaḷ.... Pāṭalum paṭamum mika mika arumai"
      means:
      "The picture is also very good .... so many thoughts of many colors"

      Delete
    2. padmanabhan....please translate this :-) I couldn't understand this script.

      Delete
    3. బుక్యా శ్రీధర్ గారు బ్రతికించారు....మీరు అనువదించి ఉండకపోతే నన్నేదో తిట్టేసారేమో అనుకునేదాన్ని. మొత్తానికి పొగిడారన్నది తెలిపిన మీకు, మెచ్చుకున్న పద్మనాభన్ గారికి ధన్యవాదాలు.

      Delete
  17. వేదనాభరితమైనా చదివినదే పదే పదే చదివేలా రాస్తూ ప్రశంసలు పొందేయడంలో పండిపోయారు.

    ReplyDelete
    Replies
    1. అనికేత్....మరీ పండిపోయానని చెప్పి పాతవాళ్ళంతా పత్తా లేకుండా పోతే ఎలా :-)

      Delete
  18. ఇన్నాళ్లు అవకాశం లభ్యం కాలేదు సావకాశంగా ఉండటానికి . తీరా లభ్యమయ్యేసరికి ఊహించని సంఘటనలో నా ఎడమకాలు హేర్ లైన్ ఫ్రాక్చరుకి గురి అయింది . శింపుల్ గా ఆరే ఆరు వారాలు బెడ్ రెస్ట్ తిచ్ ఈ హౌస అరెస్ట్ చేశారు . ఇక నీ కమియ విషయానికొస్తే భావ చిత్రీకరణ చాలా చక్కగా ఉన్నవిగబ్లె . ఓకదానికి ఒకటి పోటీ పడ్తున్నట్లుగా ఉన్నది .

    ReplyDelete
    Replies
    1. అయ్యో.....ప్రస్తుతం అన్నీ సర్దుకుని ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ ప్రేరణాత్మక స్పందనకు నెనర్లు. Take care and have a energetic blissful life.

      Delete
  19. Very beautiful padma garu:-) pic super:-)

    ReplyDelete
    Replies
    1. Thank you Priya ji....after a long time. How are you?

      Delete
  20. వైకల్యం నడుముకు వచ్చిందనుకుంటాను. మడత సరిగ్గా లేదు.. ఇలాంటి ఏడుపుగొట్టు కవితలు ఎవరు రాయమన్నారు మీకు?? రాసి మీ వ్యధను మాకు వదిలేడ్డామనా?? (జస్ట్ kidding అండి.) ఎలా సాసేస్తారో ఇలా మీరు...

    ReplyDelete
    Replies
    1. ముఖంపై ముడతల్నిబట్టి మనిషి జ్ఞానాన్ని
      నడుము మడతల్ని చూసి మనోవేదన్ని....
      కనుక్కొనే పరికరాలు ఇంకా రాలేదు వినోద్ గారు. ఎప్పుడూ ఒకేరకమైనవి రాస్తే ఎలా నవరసాలూ పండించే ప్రయత్నమేదో నన్ను కూడా చేయనివ్వండి :-) ఇంక నవ్వడం ఏడవడం మీ మైండ్ సెటప్ పైన ఆధారపడి ఉంటుంది కదా :-) (Just kidding ) ఏదో మీ అందరి ప్రోత్సాహంతో ఇలా రాస్తున్నాను...

      Delete
  21. వేదన కూడా వన్నెలు అద్దుకుని సేదతీరింది మీ కవితాక్షరాల్లో.

    ReplyDelete
    Replies
    1. అమ్మో....."వన్నెలు అద్దుకున్న వేదన" భలేగుంది, ఒక పోస్ట్ రాస్తాను మీ ప్రేరణతో లిపి. థ్యాంక్యూ

      Delete
  22. మాడమ్ కాస్త ఈ వ్యథ నుండి మమ్మల్ని బయటకు తెప్పంచే మార్గం ఆలోచించి ఒక రసవత్తమైన కవిత రాస్తారా :-)

    ReplyDelete
    Replies
    1. రసవత్తంగా ఏం రాయను చెప్పండి......ఎండలు మండిపోతుంటే :-)

      Delete