వ్యక్తీకరణం

తడవకోమారు తలపుకురాకు..
పొలమారితే పులకరింతనుకోకు!

చిరుగాలివై చిలిపిగా గిల్లమాకు..
మెలికలు తిరిగితే గిలిగింతనుకోకు!

గడియకోసారి గుండెను గుచ్చకు..
తనువు తిమ్మిరెక్కితే తిక్కనుకోకు!

తుంటరి తుమ్మెదవై జడిపించమాకు..
తృళ్ళిపడి తుమ్మితే శకునమనుకోకు!

కంటికెదురుగ కనపడక కలలోకిరాకు..
కస్సుబుస్సులాడితే కలవరింతనుకోకు!

వేళకానివేళ వెనకమాటుగా హత్తుకోకు..
వెక్కిళ్ళు ఎందుకంటూ వెక్కిరించమాకు!

మనసుదోచి ముగిసెనని సంబరపడిపోకు..
మరుపన్నది మనిషికి వరమని మరువకు!

66 comments:

  1. థ్యాంక్యూ పద్మార్పితగారు..ఈ ఆదివారం ఆటవిడుపు కవిత చెప్పి అలరించారు.
    కవిత చిన్ని పదాలతో హాయిగా సాగింది, మిమ్మల్ని మరీ విసిగిస్తున్నాను కదా!
    చిత్రంలోని అమ్మాయి మన కోవకి చెందిందే అనడంలో సందేహం లేదు.. ఏమంటారు :-)

    ReplyDelete
    Replies
    1. Aakanksha gaaru Mana Kova Annaaru Paalakovaanaa..?? :-) Urike Saradaaki Antunnaa kaani.. ! Emanukomaakandi.

      Delete
    2. ఆమెలో దాగింది నీవేగా :-)

      Delete
    3. పాలకోవా జిలేబీ అంటూ ఎప్పుడూ తిండి ధ్యాసేనా చెప్పండి మనిసన్నాక కాస్త కలా పోషన ఉండాలి...అందుకే నాకోవలో ఆ బొమ్మ అన్నమాట :-) Sridhar Bukya Smile Please :-)

      Delete
    4. ఆకాంక్ష గారు, నాకు మమకారం తెలుసు ప్రతీ"కారం" తెలీదు
      మాటలోని తీయదనమే తెలుసు మాటను "తీయ"డం తెలీదు
      పిలిస్తే పలికే పిలుపులు తెలుసు చింత చివురు "పులుపు" తెలీదు
      కాకరకాయ చేదు తెలుసు మనషుల మధ్య "చెడు" చేయటం తెలీదు

      "లడ్డూ" అంటే మహా ప్రీతి "జిలేబి" "పాలకోవ"లంటే ఎక్కువ ఇష్టంలేదు
      "జీడి పప్పు పాయసం" "చక్కరపొంగలి" "బొబ్బట్లు" "పోలిపుర్ణం బూరెలు" "చంద్రకళ" చాల ఇష్టం.
      తీపి కంటే బంధాలలో తీయదనం స్నేహంలో మాధుర్యం భలే ఇష్టం.
      "తినగా తినగా వేముగూడ తీయగానుండు" "మేలైన బంధము కంటే ఇంకేది సాటిరాదు"


      P.S.: బంధాల గురించి చిట్టి కవిత మీ వ్యాఖ్య వల్ల వచ్చినందుకు మీకు కృతఙ్ఞతలు అభిలాషిణి ఆకాంక్ష గారు. నాకు తిండి ధ్యాస ఎక్కువ ఉండదండి. ఆకలైతే తప్ప.

      Delete
    5. పాలకోవా అని పలకరిస్తేనే పసందైన నోరూరించే ఇన్ని మిఠాయిలు పంచారా కవితలో :-) నేను మాత్రం పిచ్చ తిండిపోతుని :-)

      Delete
    6. ఏదైతేనేం లెండి ఆకాంక్ష గారు. ఆరోగ్యంగా ఉంటె అదే పదివేలు లేకపోతె ఇన్ని స్వీట్స్ ఉన్నా తినబుద్దెయదు :-) థ్యాంక్ యు.

      Delete
  2. తుంటరి తుమ్మెదవై జడిపించమాకు..
    తృళ్ళిపడి తుమ్మితే శకునమనుకోకు!
    ఎంతో బాగుంది పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. మీ చిలకల జంటకి సొంతం ఈ పలుకులు.

      Delete
  3. హమ్మయ్య !
    మా ఎదురుచూపులకు ఫలితం దక్కింది.
    హావభావాల్లో దాగిన ఆంతర్యాన్ని ఇలా వ్యక్తీకరించడం మీకే సాధ్యం.
    సింపుల్ అండ్ వండ్రఫుల్ పోయెం విత్ బ్యూటిఫుల్ పైంటింగ్ మేడం.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానమేగా రాయిస్తుంది నాతో

      Delete
  4. హావభావిష్కరణ బాగుంది పద్మార్పితగారు. చిత్రంలో సుందరి బాగుంది

    ReplyDelete
    Replies
    1. పచ్చరంగు బొమ్మ మీకే.:-)

      Delete
  5. చేయకు అని పైకి అన్నా లోలోపల చేస్తే బాగుంటుంది అనే భావం మీ కవితలో

    ReplyDelete
    Replies
    1. మీ ఫీల్ ఇది కదా యోహంత్ :-)

      Delete
  6. మరిచి పోవడం సాధ్యమా? మరిచి పోయామనుకోవడం భ్రమే.. కాదంటారా?

    ReplyDelete
    Replies
    1. అనుకుంటే సాధించలేనిది ఉందా :-)

      Delete
  7. బాగుంది పద్మా...దురద, గోకుడు, తుమ్మడం, చీదడం మరిచిపోయావేం :-)

    ReplyDelete
    Replies
    1. వాటి గురించి రాస్తే రోగాలు అంటారేమో అని :-)

      Delete
  8. photos mast hai. kaha se paatheho

    ReplyDelete
    Replies
    1. payal mai hoon...dhoom machaavo :-)

      Delete
    2. నయని మాటే నాదీను.:-)

      Delete
  9. ఈ పాయల్ గారు ఏమిటండీ, తన వ్యాఖ్యలు హిందీ లో వ్రాస్తారు, తనకి ఈ తెలుగు కవితలు అర్ధమవుతున్నాయనుకుందామా? అర్ధమయితే మరి వ్యాఖ్యలు కూడా తెలుగులోనే వ్రాయచ్చుగా? అప్పుడప్పుడంటే సరే అనుకోవచ్చు గాని ప్రతిసారీ హిందీలోనే వ్రాస్తే ఎలాగా అదీ తెలుగు బ్లాగులో?

    ReplyDelete
    Replies
    1. She is North Indian. పాయల్ హిందీలో మంచి కవయిత్రి. తనకి తాను తెలుగు పై ఇష్టంతో కావాలని పద్మార్పితగారి కవితలు అడిగి తెలుసుకుని చదివిచున్నారు. నేను మొదట్లో పద్మగారి తెలుగు SMS 2008 చదివి చాలా నచ్చి ఆవిడకి మెయిల్ చేస్తే మాకోసం ఇంగ్లీష్ లో రాసి పంపేవారు తెలుగు చిన్ని చిన్ని కవితల్ని. మొదట్లో ఆమెకి నేను హిందీలోనే మెసేజ్ చెసె వాడిని. క్రమముగ తెలుగు అలవాటైంది. ఆమె అప్పుడు ప్రోత్సాహం నేను ఇప్పుడు తెలుగులో కవితలు రచించడానికి. ఎప్పుడు ఏం అడిగినా ఓపిగ్గా చెప్పి సరిచెయిస్తారు. పాయల్ కూడా అలా నేర్చుకోవాలని అంటే మేమె చెప్పాము ఇలా మెల్లిగా రాయడం వస్తుంది చదివి అర్థం చెసుకోమని.even my telugu is also not that much correct.

      Delete
    2. proceed payal & yohath we all are with to encourage and to enjoy your telugu writings

      Delete
    3. Anon...i think you got it.
      Yohanth...Don't be emotional.
      నాలో నేను....thanks for supporting.
      Payal...We all are with you.

      Delete
  10. sorry Anonji....i can read and understand telugu but i can't write . within short period i will. until then you bear my hindi.

    ReplyDelete
    Replies
    1. Then, kindly place your comments in English. That would be better.

      Delete
    2. Payal within short period you will. I think you gone through with my mail.Don't feel for anything. Your are a very good poetess and I am one of your fan. Keep on writing.

      Delete
    3. పాయల్ గారూ,

      ఈ బ్లాగ్ ఓనర్ చేసిన "Anon....... I think you got it." అనే కామెంటుకి నేను స్పందించదలుచుకోలేదు.

      కాని ఒక సంగతి చెప్పదలుచుకున్నాను. (మీరు తెలుగు చదవగలుగుతున్నారు గాబట్టి వ్రాయగలరు కూడా అనుకుని) మీ హిందీ వ్యాఖ్యల గురించి నేను వ్రాసిన వ్యాఖ్యకి మీరు ఇచ్చిన జవాబు ఎంతో ఒద్దికగాను, చాలా సంస్కారవంతంగానూ ఉంది. తెలుగు వ్రాయటం కూడా నేర్చుకోవాలనే మీ పట్టుదల, శ్రమ తప్పక ఫలితాన్నిస్తాయి.

      Delete
    4. నమస్తె...దన్యవాదము Anon...this is my first word i started to type in telugu

      Delete
    5. బాగుంది పాయల్ గారూ, శుభారంభం.
      మీరు వ్రాసిన రెండు పదాల్లో చిన్న తప్పులున్నాయి, సరిజేసుకోవాలి.
      మీ ప్రయత్నానికి నా అభినందనలు.

      Delete
  11. పోలమారితే జ్ఞాపకాల దొంతరల మాటున నీ నవ్వులు
    చెదిరిపోని చిరునవ్వు వసివాడని పువ్వులు
    వింత ఏమిటంటే వెన్నెల రాగం లో చంద్రుడు

    కన్నాయి తో రెద మ కేలుజేనజ్ కు లక్నాకేచికో పద్మ గారు
    వ్యక్తి కారణాలు వ్యక్తీకరించే రణగొణ ధ్వనులు
    కీచు మని వినిపించే సవ్వడి తట్టిలేపే చిరు వేకువలో

    ReplyDelete
    Replies
    1. పైన వ్రాసిన మూడు లైన్స్ అర్థమయ్యాయి....మరి క్రింది మూడు లైన్స్ మర్మమేమి మహానుభావా :-)

      Delete
  12. మీరు వ్యక్తీకరించారా మమ్మల్ని వ్యక్తపరచమన్నారా

    ReplyDelete
    Replies
    1. మీ భావాలని మీరు వ్యక్తీకరించమనే :-)

      Delete
  13. your expressions are like----shooted with loaded gun.

    ReplyDelete
    Replies
    1. మీ తుపాకీ భాష బాగుంది :-)

      Delete
  14. తరచి చూస్తే లోతట్టు భావం సూటిగా చెప్పకపోయినా ఘాటుగా నాటుకున్నట్లు చెప్పారు. బహుబాగు

    ReplyDelete
    Replies
    1. నాటుకున్నట్లేకదా :-)

      Delete
  15. పిక్స్ తో పిచ్చెక్కిస్తారు
    కవితలతో కిక్ ఎక్కిస్తారు
    కమెంట్ రిప్లైస్ తో కుమ్ముతారు
    కాంగా ఉందామంటే ఉండనివ్వరు

    ReplyDelete
    Replies
    1. వామ్మో వ్యాఖ్యలతో అదరగొట్టేస్తున్నారు :-)

      Delete
  16. అది చేయొద్దు ఇది చేయొద్దు అంటే చేయడానికి ఇంకేం మిగులుతాయని :-)

    ReplyDelete
    Replies
    1. మీకంటూ కొన్ని మిగిలి ఉంటాయిగా మహీ :-)

      Delete
  17. మరుపన్నది మనిషికి వరమని మరువకు!
    ప్రేమించిన వ్యక్తిని మరువడం సాధ్యం అంటారా?

    ReplyDelete
    Replies
    1. సాధ్యం కానిదంటూ లేదు.

      Delete
  18. తడవకోమారు తలపుకు వస్తున్నప్పుడు
    గడియకోసారి గుండెను గుచ్చుతున్నప్పుడు
    వేళ కాని వేళ వెనుకమాటుగా హత్తుకుంటున్నప్పుడు...
    ఇంకా ఏం తక్కువైందని మర్చిపోతారు? అసలెందుకు మరచిపోవాలి?

    మగువలతో ఇదో తంటా.
    వలచి చెప్పేటందుకు సిగ్గు. సిగ్గు విడచి చెప్పేటందుకు అహం. అలాగని వదిలేస్తే బాధపడుతూ ఆ బాధకు కారణం నువ్వేనంటూ నిష్టూరం.

    అయినా చిత్రంలోని ఆ ఫోజు చూశాక ఎవడన్నా మరచిపోయేదాకా తెచ్చుకుంటాడా?

    ReplyDelete
    Replies
    1. ఈ మాత్రం సెల్ఫ్ అనలైజ్ అవసరమే...ఇంతకీ ఎంతమంది మగువల మనసు చదివారో :-) చిత్రాల సీన్ చూసే మతిచెడితే ఎలా చెప్పండి :-)

      Delete
  19. ilaa evaroo raayaleru maapadma tappa.
    naakaite assalu saadyam kaadu

    ReplyDelete
    Replies
    1. Meeru Raase Kavitalu Samaajika Spruha to Samakaaleena Vishayaala gurichi Raastaaru Meeraajammi.. Atuvanti Sahetuka kavitalu spoorthini reketistaayi kaadantaaraa.. :) Mee Baatalone Andarunu.. Sadaa mee Aasissulu korukuntu..

      Delete
    2. మీరాజ్ గారు అభిమానంతో అలా అంటారే కానీ మీలా నేను రాయలేనుగా.
      శ్రీధర్ గారు మీతో నేను ఏకీభవిస్తున్నాను.

      Delete
  20. Replies
    1. కొట్టినట్లు ఖండించకండి :-)

      Delete
  21. బాగుంది...మరిపించి మురిపించడంతోనే అయిపోదు. ఆ ప్రేమని నిలబెట్టుకోవాలని నీదైన రీతిలో చెప్పావు-హరినాధ్

    ReplyDelete
  22. ఇలా చేయకు అలా చేయకు అని ఆర్డలేంటండి ? తప్పు కదూ.... :-))

    ReplyDelete
    Replies
    1. ఆర్డర్ వేసినంతనే ఆగిపోయేవారు లేరని ఇలా అక్షరాలతో ఆర్డరింగ్ అంతే :-)

      Delete
  23. నాకు ప్రేమ కవితలకి సామెతలు తట్టక తచ్చాడుతున్నా....ఎవరైనా షాయపడగలరు.:-) లేనిచో ఈ కవితకి నో కమెంట్స్ :-)

    ReplyDelete
    Replies
    1. సొంత సామెతలు పుట్టించండి నయనిగారు....కాదనేవారు ఎవరు చెప్పండి :-)

      Delete
  24. Nidra raaka talagadatho kusti padutunte ..
    Mee kavitalu vennela palakarinchayi..
    epudu padukundam ante vennela digade..
    udayaminaa ushaakiranalu ..ee padma pawanaalanu maripistayemo chudali.:)

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog. bahushaa udayapu suryakiranalu padma pawanaalani maripinchayanukuntanu. :-) thanks for viewing my blog.

      Delete
  25. తడవతడవకూ పులకరింత నీ తలపనుకోకు అంటూనే
    చిరుగాలి చిలిపి గిలిగింత లా .... ఒక చక్కని కవిత
    అభినందనలు పద్మప్రీయా జీ! శుభసాయంత్రం!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి మీ స్పందనలకు.

      Delete
  26. మనసుదోచిన కవితాలహరి.

    ReplyDelete
    Replies
    1. ధన్యురాలను రాధగారు

      Delete