"అలోచనలతో బుర్రలో తిరుగుతున్నాయి సుడులుఏమి వండి వడ్డించాలని గుండె నిండా గుబులుఅంతగా వంటరాని నాపై నాకే చెప్పలేని దిగులుఎన్నో రుచులవంటలకై జిహ్వ ఎదురుచూపులువనభోజనాల నాడు మెప్పుకై చేయాలి జిమిక్కులులేకపోతే తప్పవు పాకప్రావీణ్యులతో మొట్టికాయలు" ఏంటి పద్మా! నీకు చెప్పిందేమిటి నువ్వు చేస్తుందేమిటి? వంటావార్పుతో వనభోజనాలకి రమ్మంటే పదాలకూర్పుతో తవికలల్లి దిగులని గుబులని నేర్పుగా తప్పించుకోకు అంటారని నాకు తెలుసు అందుకే.......తెల్లవారుజామునే అయిదు గంటలకే తలంటుకుని చెంగావిరంగుపై ఎరుపు, ఆకుపచ్చ రంగంచున్న చీరకట్టి ( ఎందుకు డ్రెస్స్ కోడ్? అని అడక్కండి మీకే తెలుస్తుంది మున్ముందు ).......
భగవంతునికి దీపం, ధూపం వందనమాచరించి....అవిఘ్నమస్తు! అందరి మెప్పులు ప్రాప్తిరస్తు! అని నాకు నేనే ఆశీర్వదించుకుని వంటగదిలో వంద ప్రదక్షణాలు చేసినా ఒక్కవంటైనా నన్ను కనికరిస్తే కదా వండి వడ్డించడానికి......
ఏదో నాలుగు ప్రాస పదాలతో కవిత వ్రాసుకోక జ్యోతిగారి బ్లాగ్ లోకి వెళ్ళి మరీ ఈసారి చేసేస్తా పెట్టేస్తానని ప్రగల్భాల వ్యాఖ్యలు పెట్టనేల అని నన్ను నేను పరిపరి విధముల తిట్టుకొనుచుండగా......
పూర్వము నా బ్లాగ్ లో ఒకానొక పోస్ట్
"కాయగూరలతో కబుర్లు!!!" చెప్పితినని అవి నన్ను కనికరించి "కూరగాయోపదేశము" చేసి నా చేతికి కత్తిరించమని కత్తినిచ్చినవి.....
ఉపదేశమెట్టిదనగా.....
పిచ్చి పద్దూ.... "ఈ యాంత్రిక జీవనశైలిలో వంటావార్పెందులకు? కడుపుమంటా, షుగర్, బీపీలను పెంచేందులకు!
అంటూ మంతెన సత్యనారాయణగారి లాంటి నలుగురి ప్రముఖుల పేర్లను రెఫరెన్స్ గా చెబుతూ....
పద్దు! నీవు వంట జోలికి వెళ్ళవద్దు....
పచ్చి కూరగాయలతో నీవు చేసేయి "వెజిటెబుల్ సలాడ్"
అది అతిగా భుజించకుండా ఏర్పరుస్తుంది ఒక సరిహద్దు....
ఆ హద్దుతో ఆఖరున భుక్తాయసమంటూ ఎవరూ బాధపడరు....
అదే మనందరికీ ఎంతో ముద్దు"
అని అంటూ....
నీ హస్త కళానైపుణ్యముతో నన్ను అందంగా మలచు అంటే నన్ను అంటూ కారెట్, కీరదోసకాయ, బీట్ రూట్, కాప్సికం, ఉల్లిపొరక, టమాటాలు నేనంటే నేనంటూ నా ముందుకు నర్తించాయి....
పరువుని కాపాడిన కూరగాయలపై ప్రేమతో అలా ఆ చీర మాచింగ్ అన్నమాట...:)మరింక ఆలస్యమెందుకు?
ఆరగించండి అందరూ.....
నేనందిస్తున్న
"వెజిటేబుల్ సలాడ్"ఏదో ఒట్టి చేతులతో కాకుండా నేను సైతం ఒక వంట(అమ్మో!వంట అంటే తంతారేమో!!:) తెచ్చాను అనుకుని
మీరంతా
"సలాడ్స్" ని ఆరగిస్తే......
ఉపదేశించినందుకు కూరగాయలు,
మీ అందరితో వనభోజనం చేసినందుకు నేను ఎంతో ఆనందిస్తానండి!
(Serving With Love)
ఇట్లు,ప్రేమతో పద్మార్పిత!!!