రసిక రాగం..

మావాస్యనాడు చందమామ లేకపోతేనేమిలే మావా.. నా ఎద సవ్వడులు నిన్ను ఆడ నిలువ నీయవు కదా సందెమబ్బు పైటతీసి వేడి పక్కేసి పిలిస్తే నీవాగుతావా!? వానజల్లు కురియ మల్లెలు లేవని మురిపాలు ఆగేనా.. నా కౌగిట కర్పూరమై కరిగేది నీవని నాకు తెలుసు కదా మఖ్మల్ పరుపు లేకున్న నులకమంచమైతే వద్దంటావా!? మంచిగంధ పరిమళం లేకపోతేనేమి నీలో కోర్కెలు రేగవా.. నా బిగుపట్లు తెలిసిన నీవాటి గుట్టు రట్టు చేయవు కదా సిగన మందారాన్ని చూసి శిరసు తొడపై పెట్టక మానేవా!? ఇద్దరి రాసకేళి రసపట్లు చూసి వాత్సాయనుడు ఆగునా.. నా రమ్మన్న నిర్లజ్జ పిలుపు నిన్ను రెచ్చగొట్టకాగదు కదా ఇదే అదునుగా వసంత వెన్నెల కెంపుల్లో నీవు రెచ్చిపోవా!?

మేడిపండు




అందం చూడవయా ఆనందించి పోవయా అంటే..
చప్పున లగెత్తుకొచ్చి పుటుక్కున వాటేసుకుంటారే
అదే ఆలోచించవయా ఆదుకుని పోవయా అంటే..
ఎలా తప్పించుకోవాలని ఆలోచించకనే ఆగిపోతారే!

ఇదో వింత లోకంలో అందరం మృగాలమే అంటే..
కానే కాదని కత్తుల్లేకుండాను కలంతో పోట్లాడతారే
అదే మనలోని మృగాన్ని మనమే చంపేద్దామంటే..
చూసినా కూడా చూడనట్లు చల్లగా జారుకుంటారే!

ఆదర్శవాది మీరని బిరుదులిచ్చి సత్కరిస్తాం అంటే..
చంకలెగరేసుకొచ్చి చచ్చుపుచ్చు సలహాలు ఇస్తారే
చెప్పేమాటలు ఆచరణలో చూపించరు ఎందుకు అంటే..
అన్నవన్నీ ఆచరించి చూపితే అడుక్కు తినాలంటారే!   

ఈ లోకంలో నగ్నత్వానికి నిర్వచనం ఏమిటి అంటే..
సంస్కారం సంకనాకిందని పళ్ళికిళించి చెప్పుకుంటారే
సంఘాన్ని ఉద్దరించే సంస్కర్తలై ఎందుకిలా అంటే.. 
ఆడది విప్పి చూపిస్తే పైకి అవ్వాని లోన లొట్టలేస్తారే!