మేడిపండు




అందం చూడవయా ఆనందించి పోవయా అంటే..
చప్పున లగెత్తుకొచ్చి పుటుక్కున వాటేసుకుంటారే
అదే ఆలోచించవయా ఆదుకుని పోవయా అంటే..
ఎలా తప్పించుకోవాలని ఆలోచించకనే ఆగిపోతారే!

ఇదో వింత లోకంలో అందరం మృగాలమే అంటే..
కానే కాదని కత్తుల్లేకుండాను కలంతో పోట్లాడతారే
అదే మనలోని మృగాన్ని మనమే చంపేద్దామంటే..
చూసినా కూడా చూడనట్లు చల్లగా జారుకుంటారే!

ఆదర్శవాది మీరని బిరుదులిచ్చి సత్కరిస్తాం అంటే..
చంకలెగరేసుకొచ్చి చచ్చుపుచ్చు సలహాలు ఇస్తారే
చెప్పేమాటలు ఆచరణలో చూపించరు ఎందుకు అంటే..
అన్నవన్నీ ఆచరించి చూపితే అడుక్కు తినాలంటారే!   

ఈ లోకంలో నగ్నత్వానికి నిర్వచనం ఏమిటి అంటే..
సంస్కారం సంకనాకిందని పళ్ళికిళించి చెప్పుకుంటారే
సంఘాన్ని ఉద్దరించే సంస్కర్తలై ఎందుకిలా అంటే.. 
ఆడది విప్పి చూపిస్తే పైకి అవ్వాని లోన లొట్టలేస్తారే! 

28 comments:

  1. చెప్పేమాటలు ఆచరణలో చూపించరు ఎందుకు అంటే..
    అన్నవన్నీ ఆచరించి చూపితే అడుక్కు తినాలంటారే!.
    Idhi 100 ki 100% correct.

    ReplyDelete
  2. సమాజంలో మనుషుల మనస్తత్వాలు కాచి వడబోసినట్లున్నారు...

    ReplyDelete
  3. కరెక్ట్ రాసినారు.

    ReplyDelete
  4. జీవన వాస్తవికత దర్పణం.

    ReplyDelete
  5. అన్ని మేడిపండ్లు ఒకేరకం
    చూడ చూడ రుచుల జాడవేరు

    ReplyDelete
  6. లోకనగ్నత్వం

    ReplyDelete
  7. మగవాళ్ళే ధోషులు అంటారు ఎప్పుడు.:(

    ReplyDelete
  8. so beautiful pic and true words.

    ReplyDelete
  9. అందరూ మేడిపండులా ఉంటారు ఆడా మగా అయినా విప్పిచూస్తేనే పురుగులు.

    ReplyDelete
  10. మరో నిష్టూరబాణం వదిలినట్లుంది.

    ReplyDelete
  11. యురేకా తకమిక

    ReplyDelete
  12. memu andaroo anthe ante opukomu

    ReplyDelete
  13. లోకంలో నగ్నత్వానికి నిర్వచనం

    ReplyDelete
  14. అందరూ ఎగరేసుకుంటూ రారు
    మనసుపడితే వచ్చి చెడిపోతారు

    ReplyDelete
  15. నిర్వచనం ఏమిటి?

    ReplyDelete
  16. అన్నీ మేడిపండ్లు అంతేనా...కాదు కాదు

    ReplyDelete
  17. కేవలం మగవారే కాదు
    ఆడవాళ్ళు అంతకు మించిన మేడిపండ్లు

    ReplyDelete
  18. మీరు ఎంత స్త్రీ పక్షపాతి అయితే మాత్రం అందరినీ ఇలా ఒకే టాడుకి కట్టేయడం బాగోలేదు.

    ReplyDelete

  19. పై పై మెరుగులు
    నీటిలో నురుగులు
    పనికిరాని మాటలు
    వ్యర్థమైన పనులు
    చేసినా చెయ్యకున్నా
    లాభమేమి ఈశ్వరా..

    ReplyDelete
  20. manastawam baga chadivaru manishidi.

    ReplyDelete
  21. శతకోటి వందనములు.

    ReplyDelete
  22. లోకంలో నగ్నత్వానికి నిర్వచనం ఏమిటి?

    ReplyDelete
  23. ఇదో వింత లోకమని మీరే అన్నరు కదా..చాలా ఆలోచనాత్మకంగా వ్రాసారు.

    ReplyDelete