అమావాస్యనాడు చందమామ లేకపోతేనేమిలే మావా..
నా ఎద సవ్వడులు నిన్ను ఆడ నిలువ నీయవు కదా
సందెమబ్బు పైటతీసి వేడి పక్కేసి పిలిస్తే నీవాగుతావా!?
వానజల్లు కురియ మల్లెలు లేవని మురిపాలు ఆగేనా..
నా కౌగిట కర్పూరమై కరిగేది నీవని నాకు తెలుసు కదా
మఖ్మల్ పరుపు లేకున్న నులకమంచమైతే వద్దంటావా!?
మంచిగంధ పరిమళం లేకపోతేనేమి నీలో కోర్కెలు రేగవా..
నా బిగుపట్లు తెలిసిన నీవాటి గుట్టు రట్టు చేయవు కదా
సిగన మందారాన్ని చూసి శిరసు తొడపై పెట్టక మానేవా!?
ఇద్దరి రాసకేళి రసపట్లు చూసి వాత్సాయనుడు ఆగునా..
నా రమ్మన్న నిర్లజ్జ పిలుపు నిన్ను రెచ్చగొట్టకాగదు కదా
ఇదే అదునుగా వసంత వెన్నెల కెంపుల్లో నీవు రెచ్చిపోవా!?
రసరమ్య దృశ్యకావం లిఖించారు.
ReplyDeleteSuper picture
ReplyDeleteరమ్మన్న నిర్లజ్జ పిలుపు
ReplyDeleteనూతన వాక్యం బాగుంది
అమావాస్య నాడు చంద్రుడిని చూపించారు చిత్రంలో అక్షరాల్లోనూ.
ReplyDeletekavita chadivi
ReplyDeletebhevoshshhhhhhhh
lovely ga undi
ReplyDeleteరాసికరాగార్పితా.. అధరహో.... ఇట్లు కసికసికాక్సేన :)
ReplyDeleteచందమామ లేడని మల్లెపూలు తీసుకుని రాలేదని అలిగి వెళ్ళిపోయే ఆడవాళ్ళకు. సరసం ఎరుగక ఎప్పుడూ సంపాదన యావలో కొట్టుకుని జీవితాన్ని అనుభవించని మగవారికి కనువిప్పు కలిగించే కవిత.
ReplyDeleteవానజల్లు కురియ మల్లెలు లేవని మురిపాలు ఆగేనా..
ReplyDeleteరస హృదయం జిల్లుమంది.
ReplyDeleteహ హ హ హ ఆ ఆ :) :)
Chala rojula tarvata Padmarpita ni gurtu chesaru.
ReplyDeleteరెచ్చిపోయారు వాక్యాలు అదుర్స్
ReplyDeleteస్త్రీ ప్రేమకు ప్రతిరూపం
ReplyDeleteమీ కవితల్లో అది చుసాం
so beautiful.
ReplyDeleteనిన్ను రమ్మన్న నిర్లజ్జ పిలుపు...కెవ్వమనిపించే😊
ReplyDeleteరసపట్లు తెలిసినవారు ఎవరు>?
ReplyDeleteha ha :) ha ha :)
Bagundandi :)
ReplyDeleteవలపు ఉన్నచోట చెమటవాసనైనా పరిమళమే అంటారా పద్మార్పితగారూ...
ReplyDeleteరసిక రాగాలు ఎన్ని ఆలాపించినా అంతం లేదు
ReplyDeleteబొమ్మ అదిరింది..చాలు చాలు
ReplyDeleteపైట తీసి పరుపు వార్చినీ పొంగుకు
మావ వేగు చుంటి మంచి మగడ
రార దరిని రమ్మ రాసకేళి రసమ
యంపు వేళ పద్మ యామిలముగ!
రామ రామ :)
జిలేబి
నా రమ్మన్న నిర్లజ్జ పిలుపు నిన్ను రెచ్చగొట్టకాగదు కదా
ReplyDeleteBeautiful combination of words.
ReplyDeleteతోటలో పూలెన్ని పూసినా పూజకు చేరేవి కొన్ని మాత్రమే
వలచిన వారు ఎందరు ఉన్నా కొందరు మాత్రమే మదికి చేరుతారు
తోటలో పూలెన్ని పూసినా పూజకు చేరేవి కొన్నే
ReplyDeleteవలచిన వారు ఎందరు ఉన్నా మదికి చేరేది కొందరే
లక్ష్మి గారూ --- భావం బాగుంది.
మంచిగంధ పరిమళం లేకపోతేనేమి
ReplyDeleteరమ్మన్న నిర్లజ్జ పిలుపు నిన్ను రెచ్చగొట్టక మానదు
wow lovely
ReplyDeleteమొత్తం ఏకరువు పెట్టారా?
ReplyDeleteఇంకా ఏమైన కోర్కెలు
మిగిలి ఉన్నాయి అంటారా?
ఏమోలే బ్యాలెన్స్ తరువాత
రసికరాగ ఆలాపన బాగుంది
ఎప్పటికప్పుడు అందరికీ విడివిడిగా రిప్లైయ్ ఇవ్వాలి అనుకుంటూనే ఇవ్వలేకపోతున్నాను. మీరు అందరూ ఎంతో పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశతో... అందరికీ పేరు పేరునా అభివందనములు తెలుపుకుంటున్నాను-మీ పద్మార్పిత
ReplyDeleteనిర్లజ్జ పిలుపు...కొత్త పదం
ReplyDeleteVery interesting.
ReplyDeleteరసిక రాగాలాపన వినే వారిని బట్టి కవితలు చదివి ఆస్వాధించే వారిని బట్టి ఉంటాయి.
ReplyDeleteఅద్భుత రాగం.
ReplyDeleteఏవి లేకపోయినా అన్నీ ఉన్నట్లు అనుకోమంటారు...
ReplyDelete