కూనీరాగం
తీస్తూ కల్లబొల్లి కబుర్లు ఎన్నో చెప్పబోతివి
తడి తనువు చూసి తబ్బిబై తలకోన జలపాతమని
మాడిపోయిన
మోముని మంచుశిఖరంతో పోల్చితివి
నడిరేతిరి
నడుముచూసి నయాగరా జలపాతమని
మనసు
చూడకనే మహాలోతైన సముద్రం అంటివి
కారుచీకటిలో
కురులు చూసి కుంట్ల జలపాతమని
కళ్ళకాటుకని
మనసుకి పూసి మాయచేసి పోతివి
ఏవంకనో
ఎక్కడెక్కడో చూసి ఎత్తిపోతల జలపాతమని
ఎదను
దోచకనే ఏదో కావాలంటూ ఇంకేదో అడగబోతివి
జారినపైట
చూసి జోరుగా ఈలవేసి జోగ్ జలపాతమని
తాళి
కట్టినాకనే సరసమంటే జామురేతిరి జారుకుంటివి