ప్రేమ పయనం...
ఒక ద్వీపంలో ప్రేమ, సంతోషం, విషాదం, ఐశ్వర్యం, జ్ఞానం,అందం, సమయం, మిగిలిన వాటితో కలసి జీవిస్తుండేవి. ఓ రోజు ఆ ద్వీపం మునిగి పోబోతుందని తెలిసి అన్నీ ఎవరి దారిన అవి వేరొక చోటికి పయనమైనాయి.
ప్రేమ తనకి ఎవరైనా సహాయము చెస్తారేమో అని ఆశగా కనబడిన వారిని అడుగుతూ, ఆ దారిన ఎంతో హంగు ఆర్భాటాలతో వెళుతున్న ఐశ్వర్యాన్ని అర్ధించింది. ఐశ్వర్యం ఎంతో దర్పంతో నా నావంతా బంగారం, ధనంతో నిండి వుంది నీకు చోటు లేదని చెప్పి వెళ్ళిపోయింది.
అటువైపుగా అందం వేరొక నావలో వెళుతూ నీవు నా పడవలో ఎక్కి ,దాన్ని తడిపేసి అంతా పాడుచేస్తావు అని ప్రేమ అడిగినదానికి ఒయ్యారాలు పోతూ సమాధానం చెప్పి చల్లగా జారుకుంది.
ప్రేమ విషాదాన్ని నీతోపాటు నన్ను తీసుకుని వెళ్ళవా అని అడిగితే..."ఓ ప్రేమా నేనే బాధలో వున్నాను నిన్ను ఏమి భరించను, నన్ను ఒంటరిగా వదిలివేయవా" అని చెప్పి వేడుకుంది.
సంతోషం ఆనందంగా కేరింతలు కొడుతూ, ప్రేమ తనని పిలిస్తున్న విషయాన్ని కూడా వినిపించుకోలేదు.
ప్రేమ నిరాశతో ఏమి చేయాలో తోచక ఆలోచిస్తుంటే , ఒక గంభీరమైన గొంతు వినిపించింది.."ప్రేమా నాతో రా, నిన్ను నేను తీసుకుని వెళతాను....." అన్న మాటలకి ప్రేమ ఆనందం తో ఆ పెద్దరికాన్ని పేరు కూడా అడగకుండా వెళ్ళి నావలో కూర్చుండిపోయింది. ప్రేమని సురక్షిత ప్రాంతానికి చేర్చి ఆ పెద్దరికం తన దారిన తను వెళ్ళిపోయింది.
ప్రేమ తనకి సహాయపడింది ఎవరని జ్ఞానాన్ని అడిగితే...."నిన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకుని వచ్చి చేర్చింది సమయం" అన్న సమాధానాన్ని విని, సమయమా నాకు ఎందుకు సహాయపడింది!!! అని ఆశ్చర్యపోయింది ప్రేమ. జ్ఞానం నవ్వి " పిచ్చిదానా ఎందుకంటే సమయం మాత్రమే ప్రేమ ఎంత అవసరమో అర్థం చేసుకుంటుంది కనుక" అని చెప్పింది.
మెచ్చిన జంట...
తనువుకి ప్రాణం
మనిషికి జ్ఞానం
జగతికి మనం
వైద్యుడికి నరం
ఆశకి అంతం
పువ్వుకి పరిమళం
నాట్యానికి అభినయం
సంగీతానికి స్వరం
కవికి కలం
కవిత్వానికి భావం
బ్లాగ్ కి నా కవిత్వం
దానికి మీ వ్యాఖ్యానం
అదే నాకెంతో ప్రియం
మరింకెందుకండి ఆలస్యం?
మనిషికి జ్ఞానం
జగతికి మనం
వైద్యుడికి నరం
ఆశకి అంతం
పువ్వుకి పరిమళం
నాట్యానికి అభినయం
సంగీతానికి స్వరం
కవికి కలం
కవిత్వానికి భావం
బ్లాగ్ కి నా కవిత్వం
దానికి మీ వ్యాఖ్యానం
అదే నాకెంతో ప్రియం
మరింకెందుకండి ఆలస్యం?
నీలో నేను!!!
నీ ఒడిలో నన్ను సేద తీరని...
నీ తలపులలో
నా కలతలన్ని కరగిపోని...
నీ ఆనందానికి నేను అడ్డుకానని...
నీ కష్టసుఖాలు
నా అనుకుని పాలుపంచుకోని...
నీ ప్రేమలో నన్ను మైమరచిపోని...
నీ ప్రతి అణువులో
నా రూపం మిగిలిపోని...
నీ మాటైనా పాటైనా నాదవని...
నీ ప్రతి క్షణం
నా కోసమే అనుకోని...
నీ శ్వాసలో నన్ను కలవని...
నీ చివరి ఊపిరి వరకు
నా ప్రాణముండిపోని...
నీ తలపులలో
నా కలతలన్ని కరగిపోని...
నీ ఆనందానికి నేను అడ్డుకానని...
నీ కష్టసుఖాలు
నా అనుకుని పాలుపంచుకోని...
నీ ప్రేమలో నన్ను మైమరచిపోని...
నీ ప్రతి అణువులో
నా రూపం మిగిలిపోని...
నీ మాటైనా పాటైనా నాదవని...
నీ ప్రతి క్షణం
నా కోసమే అనుకోని...
నీ శ్వాసలో నన్ను కలవని...
నీ చివరి ఊపిరి వరకు
నా ప్రాణముండిపోని...
ఎలా మరిచేది ప్రియతమా!
నిన్ను మరచిపోవాలంటే,
నేను నేనుగా మిగలాలంటే
తెల్లవారితే నీ తలపులు రావనుకుంటే,
నీ తలపులే తట్టి నాకు తెల్లవారింది.
అద్దంలో నా ప్రతిబింబాన్ని చూద్దామంటే,
అది కూడా నీ బింబాన్నే చూపెడుతుంది.
నా నీడైనా నాతోడుందంటే,
నీ నీడే నన్ను వెంటాడుతుంది.
నీవు చేసిన గాయం మానుతుందనుకుంటే,
మనసు మౌనంగా రోధిస్తూనేవుంది.
నిన్ను నేను ఎలా మరిచేది ప్రియతమా!!!!
నీవైనా తెలుపుమా!!!!!!
శిల్పి చెక్కిన సూక్తి....
క్రిందటి ఏడాది తాతగారు ఊళ్ళో గుడి కట్టిస్తున్నారంటే చూద్దామని వెళ్ళాను. గుడిలో ఒక శిల్పి దేవుడి విగ్రహాన్ని శ్రద్దగా చెక్కుతున్నాడు. అతను చెక్కుతున్న విగ్రహం లాంటిదే మరో విగ్రహం అతనికి కొద్ది దూరంలోనే నాకు కనిపించింది. ఆ విగ్రహాన్ని చూసి శిల్పిని అడిగాను "ఒకే రకమైన రెండు విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారా?"అని.
నా ప్రశ్నకి అతను "లేదమ్మ ఆ విగ్రహం విరిగింది" అని సమాధానమిచ్చి తన పనిలో నిమగ్నమై పోయాడు.
ఆ విగ్రహాన్ని ఎంతసేపు పరీక్షించినా నాకు ఎక్కడా విరిగిన జాడలే కనిపించలేదు, ముఖంపైన చెంప వద్ద చిన్ని బీట తప్ప....
ఆశ్చర్యంతో ఆగలేక శిల్పిని అడిగాను "ఎంతో పరీక్షగా గమనిస్తే, లేకపోతే మీరు చెప్పే వరకు కూడా ఆ బీటనేది ఎవరికీతెలియదు కదా!! ఎవరు చూస్తారని మీరు దాని కోసం ఇంత శ్రమపడి ఇంకొకటి చెక్కుతున్నారు?"అని.
నా ప్రశ్నకి శిల్పి చిరునవ్వు నవ్వి "ఎవరు చూసినా చూడక పోయినా నాకు తెలుసు కదమ్మా.. విగ్రహం బీట బారిందని, అలాగే ఆ దేవుడికి కూడా తెలుసు" అని సమాధానమిచ్చి తన పనిలో నిమగ్నమైపోయాడు.
అప్పుడు ఆ శిల్పిని చూస్తే అనిపించింది...."మనస్సాక్షిని మించిన సాక్షం లేదని, అతను చెక్కుతున్నది విగ్రహాన్నే అయినా దానితో పాటు నా మనోపలకం పై గొప్ప సూక్తిని కూడా చెక్కాడని"....
నా ప్రశ్నకి అతను "లేదమ్మ ఆ విగ్రహం విరిగింది" అని సమాధానమిచ్చి తన పనిలో నిమగ్నమై పోయాడు.
ఆ విగ్రహాన్ని ఎంతసేపు పరీక్షించినా నాకు ఎక్కడా విరిగిన జాడలే కనిపించలేదు, ముఖంపైన చెంప వద్ద చిన్ని బీట తప్ప....
ఆశ్చర్యంతో ఆగలేక శిల్పిని అడిగాను "ఎంతో పరీక్షగా గమనిస్తే, లేకపోతే మీరు చెప్పే వరకు కూడా ఆ బీటనేది ఎవరికీతెలియదు కదా!! ఎవరు చూస్తారని మీరు దాని కోసం ఇంత శ్రమపడి ఇంకొకటి చెక్కుతున్నారు?"అని.
నా ప్రశ్నకి శిల్పి చిరునవ్వు నవ్వి "ఎవరు చూసినా చూడక పోయినా నాకు తెలుసు కదమ్మా.. విగ్రహం బీట బారిందని, అలాగే ఆ దేవుడికి కూడా తెలుసు" అని సమాధానమిచ్చి తన పనిలో నిమగ్నమైపోయాడు.
అప్పుడు ఆ శిల్పిని చూస్తే అనిపించింది...."మనస్సాక్షిని మించిన సాక్షం లేదని, అతను చెక్కుతున్నది విగ్రహాన్నే అయినా దానితో పాటు నా మనోపలకం పై గొప్ప సూక్తిని కూడా చెక్కాడని"....
నాలో నీవు!!!
నీవు నా జీవితం కాకపోయినా
నా జీవితంలో భాగమైపో...
నీవు నా నవ్వుల హరివిల్లు కాకపోయినా
నా పెదవులపై చిరునవ్వైపో...
నీవు నా కంటికెదురుగా లేకపోయినా
నా కంటిపాపవైపో...
నీవు నాకు మనస్సుని ఇవ్వలేకపోయినా
నా గుండెల సవ్వడివైపో...
నీవు నాప్రేమ గీతం కాకపోయినా
నా ప్రతి కవితలో ఇమిడిపో...
నీవు నాకు సంతోషాన్ని ఇవ్వకపోయినా
నా భాధవై నాలో ఉండిపో...
నీవు నా చెంత లేకపోయినా
నా ఊహల సౌధనివైపో...
నీవు నిన్నలలో లేకపోయినా
నా నేడై వుండిపో...
నీవు నాదీపం కాకపోయినా
నా ధూపమై కరిగిపో......
నా జీవితంలో భాగమైపో...
నీవు నా నవ్వుల హరివిల్లు కాకపోయినా
నా పెదవులపై చిరునవ్వైపో...
నీవు నా కంటికెదురుగా లేకపోయినా
నా కంటిపాపవైపో...
నీవు నాకు మనస్సుని ఇవ్వలేకపోయినా
నా గుండెల సవ్వడివైపో...
నీవు నాప్రేమ గీతం కాకపోయినా
నా ప్రతి కవితలో ఇమిడిపో...
నీవు నాకు సంతోషాన్ని ఇవ్వకపోయినా
నా భాధవై నాలో ఉండిపో...
నీవు నా చెంత లేకపోయినా
నా ఊహల సౌధనివైపో...
నీవు నిన్నలలో లేకపోయినా
నా నేడై వుండిపో...
నీవు నాదీపం కాకపోయినా
నా ధూపమై కరిగిపో......
ఎలా తెలిపేది???
మనస్సులు కలిసాయి
మాటలు కరువైనాయి
పెదవులు విచ్చుకున్నాయి
పదాలు బయటకు రాకున్నాయి
నా మౌనం నీతో ఊస్సులాడుకున్నాయి
నేను ఏమీ చెప్పలేదని నీవు నాతో లడాయి
క్షమించు ప్రియతమా!!! నా మనోభావాలకి భాష కరువైనది....
బహుశా దానికి వ్యక్త పరచడం ఎలాగో తెలియకున్నది.....
మాటలు కరువైనాయి
పెదవులు విచ్చుకున్నాయి
పదాలు బయటకు రాకున్నాయి
నా మౌనం నీతో ఊస్సులాడుకున్నాయి
నేను ఏమీ చెప్పలేదని నీవు నాతో లడాయి
క్షమించు ప్రియతమా!!! నా మనోభావాలకి భాష కరువైనది....
బహుశా దానికి వ్యక్త పరచడం ఎలాగో తెలియకున్నది.....
Subscribe to:
Posts (Atom)