నాడు... నేడు...

చదువుని నిర్లక్ష్యం చేసిన నాడు! ఇంగితం లేదు, వివేకం లేదు.
గాలివాటుకి గమ్యం లేకుండా తిరిగిన నాడు! అడ్డులేదు, అదుపు లేదు.
లక్ష్యం లేని జీవితాన్ని గడిపిననాడు! భయమూ లేదు, ఆశయమూ లేదు.
ప్రేమతో దరిచేరిన ఆ నాడు! నీపై ఆకర్షణయే తప్ప నిజమైన ప్రేమ లేదు.

జీవితంపై స్పష్టత వచ్చిన నేడు! జీవిద్దామంటే ఆరోగ్యం, ఆయుషు లేదు.
ఆస్తులు, అంతస్తులు ఉన్న నేడు! నాకంటూ ఎవరూ తోడు లేరు.
పలకరించ వచ్చిన నాకు, నేడు! మౌనం తప్ప మాటలే రావడం లేదు.
చెప్పలేని భావాలెన్నోఉన్నా, వ్యక్తపరిచే సమయమిది కాదు, లేదు.....

ప్రేమ ఎవరికైనా ప్రియమేనంట!!!

చూసారా!!!
1. తన జంటపక్షిని గాయపరచి వెళ్ళిన వాహనాన్ని ఎలాచూస్తుందో....

2.ఆహారాన్ని తెచ్చి ప్రేమతో తినిపించి లా ఓదారుస్తుందో......

3.ఇంతలోనే నన్ను వదలి ఎలా వెళ్ళిపోయావు అని రోధిస్తుందో....

4..నీవెంట నన్ను కూడా తీసుకుని పోరాదా!! అని అడుగుతుందో...

5.నీవు లేకుండా నేనెలా జీవించను అని లా ఆక్రోషిస్తుందో....

6.దీని మరణానికి కారణమైన వారిని ఏమీ చేయలేక మౌనంగావుందో????

ఇది నిజమో కాదో నాకు తెలియదంటా!!!!
కాని, ఆమూగజీవులకే కనుక మాటలువస్తే
నాకన్నా బాగ చెప్పి వుండేవి అనుకుంటా!!!!

ఏది ఏమైనా ప్రేమనేది ఎవరికైనా ప్రియమేనంటా!!!!
అది వ్యక్తపరచడంలోనే వివిధ రూపాలుంటాయనుకుంటా!!!!
మీరు ఏమంటారోనని ఎదురు చూస్తుంటా!!!



ప్రయత్నం...

కెరటాలకి భయపడి నౌక తీరం చేరుకోదు
ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీలేదు...
క్రిందపడి లేచి పరుగిడే ప్రయత్నం నీవు చేయి
కష్టానికి తగ్గ ఫలితం తప్పక ఉంటుందోయి...
చీమ ఆహారాన్ని చేరవేస్తూ పడిలేస్తూ ఉంటుంది
మనలో నమ్మకం ఉంటే విజయం తప్పక వరిస్తుంది...
ఓటమిని అనుకోకు ముళ్ళబాటగా
ధైర్యంతో దాన్ని మలచుకో పూలబాటగా...
ఏదీ సాధించలేనివారిని ఎవరూ గుర్తించరు
మనలోని మంచితనాన్ని ఎవరూ తుదముట్టించలేరు...
అనుకున్నది సాధించే వరకు నిదురపోకు
సంఘర్షణ అనే మైదానం నుండి పారిపోకు...
సముద్రగర్భం నుండి ముత్యాన్ని సాధించడం బహుకష్టం
అలాగని నీవు వెనుతిరిగి రాకు రిక్తహస్తం......


రంగుల జీవితం!

అందమైన జీవితాన్ని ఏయే రంగుతో అద్దమంటావని నన్నడిగితే!!
మనసుని స్వఛ్ఛంగా వుంచే తెలుపుకే మొదటి స్థానమంటాను.
ఎరుపు క్రోధానికే కాదు ప్రేమకి కుడా చిహ్నమేనంటాను.
నీలంలోని నిర్మలత్వాన్ని సొంతం చేయమంటాను.
పచ్చని పైరు గాలిలా జీవితం సాగిపోవాలనుకుంటాను.
పసుపు పవిత్రతతో పాటు శుభాలను ఒసగుతుందనుకుంటాను.
నలుపు రంగా నేను నిన్నెలా మరచి పోతాను!!
ఇన్ని రంగులను చూపిన కనుగుడ్డే నీవంటాను.
అందరి జీవితాలు రంగులమయం కావాలని నే కోరుకుంటాను.!!!

మనమెవరు????


నా స్నేహితురాలు అమెరికా నుండి నిన్న హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు అమెరికన్స్ కూడా ఇండియా చూస్తాను అంటే తనతోపాటు తీసుకుని మొత్తం భారతదేశం అంతా చూసి చివరికి నిన్న మా ఇంటికి వచ్చారు. మా కబుర్లు అయిపోయి భోజనం చేసిన తరువాత అమెరికన్స్ తో ఎలావుంది ఇండియా మరియు ఇండియన్స్ అని అడిగితే వారు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని భారతదేశానికేం ఎంతో అద్భుతమైన దేశం కానీ మాకు ఇక్కడ ఇండియన్స్ ఎవరూ కనిపించలేదు మీరు ఎవరిగురించి అడుగుతున్నారు అంటూ ........
కాశ్మీర్ లో మాకు కాశ్మీరి వాళ్ళు, పంజాబ్ లో మాకు పంజాబీస్, మరాటీస్, మార్వాడీస్, తమిలియన్స్, మళయాలీస్ ని ఆఖరికి ముస్లింస్ , క్రిస్టియన్స్, బుద్దిస్ట్, హింధూస్, జైన్స్ ఇలా రకరకాల వాళ్ళని చూసామే కానీ మాకు ఎక్కడా ఇండియన్స్ కనపడలేదు అన్నారు. వాళ్ళు అన్నది ఏ ఉద్దేశంతోనైన నాకుమాత్రం వాళ్ళన్నమాటలే ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. మీతో చెప్పుకుంటే కనీసం కొంత మనశ్సాంతిస్తుందేమో అని నా ఈ చిన్ని ప్రయత్నం.

ఎలా చేరుకోను?

తొలిపొద్దు నిను తాకే వేళ చిరు వెలుగు నేనవనా
మండుటెండలో చల్లని నీడనై నీ వెంట నేరానా
సంధ్య వేళ నిను తాకి వెళ్ళే చిరుగాలి నేనవనా
నీతో కలసి జీవించే నీతోడునీడనై నేనుండిపోనా!

పలుకై నా గొంతు నుండి రావా
కవితై కలం నుండి జాలువారవా
నా గుండెలో దీపమై నీవుండిపోవా
ప్రేమకి ప్రతిరూపమై నిలచి పోవా!

శ్వాస తీసుకున్న ప్రతీసారి గుర్తొస్తావెందుకు
శ్వాసలేకుండా జీవించలేనని తెలుసుకదా నీకు
శ్వాస కూడా నీ తలపు తరువాతే వస్తుందెందుకు
శ్వాసకి కూడా నాపై ఇంత అలుకెందుకు!

నీవు అలసిన వేళ నీకు అమ్మఒడిని నేనౌతా
విసిగివేసారిన వేళ విశ్రాంతి నేనౌతా
నీవు నిదురపోయే వేళ జోలపాట నేనౌతా
నీ నిదురలో నేనొక కమ్మని కలనౌతా!!!

ఏడు వింతలు!!!

భారతీయులు అందరూ కలసి మనదేశంలోని ఏడు వింత కట్టడాలుగా ఎంపిక చేసినవి.....
(As per NDTV Chanel survey)


ఎర్రకోట...
డిల్లీలో
మనందరికి సుపరిచితమైనది.






సూర్యదేవుని మందిరము...
ఒరిస్సాలో
కలదు.





నలంద విశ్వవిద్యాలయము.....
బీహార్







జసల్మీర్ కొట.....
రాజస్తాన్
లోని కట్టడము.




కజూరాహో మందిరము...
మధ్యప్రదేశ్
నందు కలదు.






ధోలావీర కట్టడాలు......
గుజరాత్






మీనాక్షీదేవి
మందిరము....
తమిళనాడు.





వీటిలో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఏదీ ఎంపిక కాకపోవడం కాస్త భాధగా అనిపించిన......
మనమందరం భారతీయులం కదండీ!!!!
Proud to be an INDIAN....

అతడు/ఆమె....

అతడు.......
అతని బాహుబలాన్ని చూడకు...
ఆమె ప్రేమని పొందాలన్న అతని ఆరాటాన్ని చూడు.

అతని మాటల్లో కరకుతనాన్ని చూడకు...

ఆమెపై అతడికున్న మమకారాన్ని చూడు.

అతని సిరిసంపదలని చూడకు...

ఆమె స్థానం అతని హృదయంలో చూడు.

అతని చేష్టలు నొప్పిస్తాయని చూడకు...
ఆమెని అతని లాలనతో ఎలా మైమరపిస్తాడో చూడు.

అతని ప్రేమ ఆమెకే సొంతం కావాలని చూడకు...

ఆమె ప్రేమలో అతడు చివరివరకు కట్టుబడిన తీరుని చూడు.
అతని శక్తిసామర్ధ్యాలని అంచనావేసి చూడకు...

ఆమెకి అతడు తోడునీడగా నిలచే మంచి మనిషి అని చూడు.


ఆమె......

ఆమె అందాన్ని తను ధరించిన వస్త్రధారణలో చూడకు...

అతనిపై ఆమెకున్న భావాలని మనోనేత్రాలలో చూడు.
ఆమె మేనిఛాయలోని మెరుపులను చూడకు...

అతనిపై ప్రేమను ఆమె కనురెప్పల మాటున దాచింది చూడు.

ఆమె బుగ్గల గులాబిరంగుని చూసి మోహించకు...

అతనితో ఆమె చేదోడు వాదోడుగా వుండేలా చూడు.

ఆమె అందాన్ని వేరొకరితో పోల్చి చూడకు...
అతనిపై ఆమెకున్న ఆరాధనతో కూడిన అనురాగాన్ని చూడు.

ఆమె రాగాలాపన చేయగలదా అని చూడకు...

అతనికి ఆమె అవసరమైనప్పుడు సపర్యలు చేయగలదా అని చూడు.

ఆమె ఇచ్చే క్షణాల సుఖాన్ని ఆశించకు...
అతనితో జీవితాంతం కలసి జీవించేలా చూడు.