ప్రయత్నం...

కెరటాలకి భయపడి నౌక తీరం చేరుకోదు
ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీలేదు...
క్రిందపడి లేచి పరుగిడే ప్రయత్నం నీవు చేయి
కష్టానికి తగ్గ ఫలితం తప్పక ఉంటుందోయి...
చీమ ఆహారాన్ని చేరవేస్తూ పడిలేస్తూ ఉంటుంది
మనలో నమ్మకం ఉంటే విజయం తప్పక వరిస్తుంది...
ఓటమిని అనుకోకు ముళ్ళబాటగా
ధైర్యంతో దాన్ని మలచుకో పూలబాటగా...
ఏదీ సాధించలేనివారిని ఎవరూ గుర్తించరు
మనలోని మంచితనాన్ని ఎవరూ తుదముట్టించలేరు...
అనుకున్నది సాధించే వరకు నిదురపోకు
సంఘర్షణ అనే మైదానం నుండి పారిపోకు...
సముద్రగర్భం నుండి ముత్యాన్ని సాధించడం బహుకష్టం
అలాగని నీవు వెనుతిరిగి రాకు రిక్తహస్తం......


2 comments:

  1. ఈ సారి కవితా రీతిని,గతిని మార్చి కవితలల్లుతున్నారనిపిస్తుంది. బాగుంది ఈ శైలి.

    ReplyDelete
  2. naku dhyarannichindi mee kavita.'
    munduku nannu nadipinchatanki dhyarannichindi.
    Thanks

    ReplyDelete