నీరాకతో.....

నీవు వస్తున్నావని చిరుగాలి కబురు తెచ్చింది
అది విన్న నా మనసు నాట్యమాడింది
ఇప్పుడే నా చుట్టూ వెన్నెల విరబూసింది
నీవు లేక నా కంటి కాటుక కరిగింది
ప్రతిరోజు నా కన్నీరే నాకు తోడైంది
నేను వద్దన్నా నా మనసు నీ వెంటవచ్చింది
ఇంతవరకు పెదవులపై చిరునవ్వు కరువైంది
నీవు వచ్చాకే నాకు తెలిసి వచ్చింది
వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది
నీ అండతో నా మనసు నామాట వినను అంటుంది
ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది
ఇది చూసిన నా హృదయం కొంగుచాటున దాగింది
నీలా నేను దాగలేనంటూ నా ముఖం విప్పారింది
నీవే నా ఆనందాన్ని తిరిగి తీసుకుని వచ్చింది....

14 comments:

 1. Its touching one.....

  ReplyDelete
 2. నిన్నటి నా వేదన :(

  "ఈ నిశ్శబ్దం నను నలిబిలిచేస్తుంది, ఈ ఎడబాటు నను శిధిలజీవిని కమ్మంటుంది
  నీవు లేని వనాన నేనిక విహారం చేయను, ఈ విలాపాల విరహగీతమాలపిస్తాను
  నివురువోలె నింగికెగయనా, వానవోలె నేలకు జారనా, ఏవిధముగ నిను చేరను?
  ఏ దిక్కున నిను వెదకను, వేగిరపడి ఏ మలుపున నిను కలవను?"

  నేడు మీ కవితతో ఉపశమనం. :)

  ReplyDelete
 3. మీ నిరీక్షణలో ప్రేమ దాగివుంది....

  ReplyDelete
 4. పెదవులపై చిరునవ్వుల కరువు నిండువెన్నెల అలకను
  హృదయము దాచే గిలిగింతలు ముఖం దాచలేదంటూ

  మనసును కవితా ఊయలలో ఓలలాడించారు.

  ReplyDelete
 5. యోహంత్, రాఘవ, సృజన గార్లకి ధన్యవాదాలు.
  ఉషగారూ...మీ మరువపు చల్లదనంలో ఈ ఉపశమనం ఎంత చెప్పండి!!!
  భాస్కర్ గారూ.... మీ అభిమానానికి కృతజ్ఞతలు

  ReplyDelete
 6. ప్రియుని రాకతో తిరిగి వచ్చిన ఆనందం---చక్కని భావం. చల్లని గీతం.

  ReplyDelete
 7. మీ అభినందనలకు నమస్సులు
  సాహితీ సహృదయానికి వందనాలు
  విరియాలి సదా ఈ స్నేహసుమాలు
  - మన్నవ
  మీ బ్లాగు చూసి నేను మరింత ఒదిగి ఉండాలని నాకు నేనే చెప్పుకున్నాను.
  సో.. సోదరీ మీ కళాహృదయానికి మరో సారి వందనం
  ...మన్నవ65

  ReplyDelete
 8. nice blog... maintaining.. ...keep it up.....

  ReplyDelete
 9. చాలా బాగుంది మీ కవిత. అలిసిన మనసుకి ఉపశమనం.

  http://priyamainamaatalu.blogspot.com/2009/05/blog-post.html

  చూసి మీ అభిప్రాయం చెప్పండి.

  ReplyDelete
 10. "ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
  ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది"-- awesome!!!

  ReplyDelete
 11. "ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
  ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది"-- awesome!!!

  ReplyDelete
 12. "ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
  ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది"-- awesome!!!

  ReplyDelete
 13. "వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది" అద్భుతమైన భావం !

  ReplyDelete