ప్రేమ పోరాటం...

ప్రేమని పొందాలని నా మనసు చేస్తుంది పోరాటం
నీ హృదయంలో స్థానానికై పడుతుందది ఆరాటం

కనులు గాయ పరుస్తున్నాయి కంటిచూపునే
పలు ప్రశ్నలతో నామనసు వేధిస్తోంది నన్నే

కనులు చీకట్లో కారుస్తున్నాయి కన్నీరు

వాటికి ఇంకా అలవాటు కాలేదు వెలుతురు

ఎంతో మంది మేధావులకే దక్కలేదు ప్రేమనేది

ప్రేమించి శిక్షను అనుభవిస్తుంది నా మనసనేది

ఒకరోజు నీవు పంపిస్తావు నీ ప్రేమ పుష్పాలని
చూస్తావప్పుడు నా హృదయానికైన గాయాలని

కన్నీళ్ళు కూడా నీ మనసుకి అమ్ముడు పోతాయి

మౌనంగానే మన హృదయాలు రెండూ రోధిస్తాయి


నిన్ను నేను తప్పక గెలుస్తాను వేచియుండు

నీ నుండే నిన్ను లాక్కుని పోతాను చూస్తుండు!

14 comments:

 1. అంతిమ పోరాటం ఇదే కావాలని ఆకాక్షిస్తూ, తుది గెలుపూ ప్రేమదేనని ధీమానిస్తూ..

  నావే మునుపటి కవితల్లోని పలుకులు....

  1
  మరెపుడు, అసలు జీవితమే ఇంకా త్వరగా కరిగిపోతుందనీ,
  రాదు జారిపోతున్న ఏ అవకాశం తిరిగి నీ చేతికనీ,
  కాలాన్ని క్షణక్షణంగా ముక్కచేస్తే చివరకు మిగిలేదేదీలేదనీన్నీ తెలుసుకుంటావ్?
  2
  ఎవ్వరికీ తెలియకుండా పోతుంటాను ఎవరూయెరుగని నా వూహాతీరాలకి,
  నీకూ తెలియని నిన్నూ తీసుకుపోతుంటాను నా వెంట తప్పనిసరిగా.
  3
  నేనొక వూపిరి తీసి, అది నీ గుండెలోనింపుతాను.
  నిన్నీ లోకబధాలనుండి దూరంగా నా ప్రేమతీరాల్లో చేర్చి,
  సేద తీరుస్తాను, నీ ఎదపైనే నేనూ అలసట తీర్చుకుంటాను.

  ReplyDelete
 2. ఎందుకో విషయంలో ఏకత్వమే తప్ప కవితలో అది లోపించిందనిపించింది. ర్యాండం థాట్స్ ఆన్ లవ్ లాగా ఉంది.

  ReplyDelete
 3. పద్మార్పితగారు...క్షమించాలి కవిత ఏదో మూస పోసినట్లుంది.

  ReplyDelete
 4. "కన్నీళ్ళు కూడా నీ మనసుకి అమ్ముడు పోతాయి"
  "నీ నుండే నిన్ను లాక్కుని పోతాను చూస్తుండు!"
  Beautiful!

  ReplyDelete
 5. బావుంది మీ టపా

  ReplyDelete
 6. నీ నుండే నిన్ను లాక్కుని పోతాను చూస్తుండు
  బావుంది :)

  ReplyDelete
 7. మంచి ప్రయత్నం...

  ReplyDelete
 8. Love without courage is not ever successful. You have it. Good luck.

  ReplyDelete
 9. మీలో ఆ పట్టుదల ఉంది, తప్పక విజయం మీదే....

  ReplyDelete
 10. Padma Garu nee nunde ninnulakkupothanu chustundu annare adi chala bagundi.
  Good meru ellappudu ilane rastu undandi.
  Best of luck Mirchy Harish Varma

  ReplyDelete
 11. పద్మా! ఎంటి నగురించి ఇలా వ్రాసేశారు. హమ్మా!
  నిజం నాకు కోపం వచ్చినప్పుడంతా ఇలాగే అంటాను "చూడు ఎదో ఒక రోజు నిన్ను గెలిచి, నన్ను గెలిపించుకుంటాను. ఆరోజు నాలో నువ్వుంటావు కాని, నువ్వు నువ్వుగా కాదు అని"
  నిజంగా చాలా బావుంది.

  ReplyDelete
 12. నిన్ను నేను తప్పక గెలుస్తాను వేచియుండు
  నీ నుండే నిన్ను లాక్కుని పోతాను చూస్తుండు!

  నిస్వార్దమైన ప్రేమ లో గెలుపోటములు వుండవని నా అభిప్రాయం..

  మంచి టపా..
  టీనేజ్ కవిత లా వుంది.

  ReplyDelete
 13. స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి....

  ReplyDelete