జై భారత్ మాత!

దివిని భువికి బహుమతిగా ఇద్దాం
తారా చంద్రులతో అలంకరించుదాం....
ఇంటింటా విద్యాజ్యోతుల్ని వెలిగిద్దాం
దేశపురోగాభివృద్దికి పాటుపడదాం....
విధ్రోహశక్తుల వెన్ను విరిచేద్దాం
మన శక్తిసామర్ధ్యాలని నిరూపించుకుందాం....
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదిరిద్దాం
మనకి మనమేసాటి అని తెలియ చెబుదాం....
చెడుకి బానిసలం కామని ప్రమాణం చేద్దాం
దేశమాతకి ముద్దుబిడ్డలమని చాటిచెబుదాం....
భరతమాత ఒడిని సుఖఃసంతోషాలతో నింపేద్దాం
బాట కఠినమైనా, గమ్యాన్ని మనం చేరుకుందాం....
పైన వ్రాసిన వ్రాతల్ని చేతల్లో చేసి చూపిద్దాం
బ్రహ్మాండమైన సంబరాలు మరింకెన్నో జరుపుకుందాం....

6 comments:

 1. ఇంతకు మించిన సంబరం ఏమైనా వుందా మనమంతా ఐకమత్యంగా జరుపుకోను. మీవి నావి కలలు కల్లలు కావని ఆశిద్దాం, పద్మార్పిత.

  ReplyDelete
 2. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

  ReplyDelete
 3. మీ కలలు కల్లలు కాకూడదని ఆశిస్తూ..

  ReplyDelete
 4. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..పద్మా

  ReplyDelete
 5. స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు.

  ReplyDelete
 6. మీ కలలు నిజమవ్వాలని కోరుకుంటూ
  స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete