బాగుంటుంది!

పుస్తకంలోని పుటలన్నీ వెనక్కి తిప్పినట్లు జీవితాన్ని తిప్పితే ఎంత బాగుంటుంది!
నిదురలోని ఊహా పుష్పాలు నిజ జీవితంలో విరబూస్తే విడ్డూరమౌతుంది!
హృదయాలు రెండుండీ, ఒకటి విరిగినా మరొకటి మనదైతే మరింత బాగుంటుంది!

మనసుకి ముసుగు వేయక మమతలని పంచే తోడుంటే ఎంత బాగుంటుంది!
ఆలోచనలని ఆచరణలో పెడితే చేరవలసిన గమ్యం చేరువౌతుంది!
మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటే మరింత బాగుంటుంది!

ఆశించి ఆదరించక, అభిమానంతో ఎవరైనా అక్కున చేర్చుకుంటే ఎంత బాగుంటుంది!
మంచితనాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తే మక్కువౌతుంది!
జీవించినప్పుడే కాదు నిర్జీవివై నలుగురి మనసులో జీవిస్తే మరింత బాగుంటుంది!

19 comments:

  1. బాగుందండి.

    ReplyDelete
  2. పద్మార్పిత గారు, హృదయాలు రెండుండీ, ఒకటి విరిగినా మరొకటి మనదైతే మరింత బాగుంటుంది! అద్భుతమైన ఊహ.

    ReplyDelete
  3. >>హృదయాలు రెండుండీ, ఒకటి విరిగినా మరొకటి మనదైతే మరింత బాగుంటుంది!

    బాగుందండీ...

    ReplyDelete
  4. జీవించినప్పుడే కాదు నిర్జీవివై నలుగురి మనసులో జీవిస్తే మరింత బాగుంటుంది!

    baagundandi...

    ReplyDelete
  5. "పుస్తకంలోని పుటలన్నీ వెనక్కి తిప్పినట్లు జీవితాన్ని తిప్పితే ఎంత బాగుంటుంది!"
    నేనూ చాలాసార్లు ఇలా అనుకుంటాను . పొరపాట్లు , తప్పులు దిద్దుకుంటూ తిరిగి జీవితాన్ని జీవించొచ్చు అనుకుంటూ ఉంటాను.మీ కవితలోనివి ఊహలు కాకపొతే ఎంత బాగుంటుంది !

    ReplyDelete
  6. ఎప్పటికైనా నిజ జీవితం కంటే ఊహాజీవితమే చాలా అద్భుతంగా ఉంటుంది కదూ!
    అందుకేగా ఎప్పుడూ కలల్లోనే బతికేస్తూ ఉంటాం. మీ లాగా భావాలని వ్యక్తీకరించ గలిగే భావుకత కూడా ఉండాలి. కలలని నిజం చేసుకుంటూ బ్రతికే పరిపూర్ణులు కూడా లేకపోరు. ఇవి చాలా అద్భుత భావాలు. ఎంతో బాగుంది.

    ReplyDelete
  7. పద్మార్పిత గారు, ఏ వాక్యానికావాక్యమే సాటి.
    జీవించినప్పుడే కాదు నిర్జీవివై నలుగురి మనసులో జీవిస్తే మరింత బాగుంటుంది....

    ReplyDelete
  8. పుస్తకంలోని పుటలన్నీ వెనక్కి తిప్పినట్లు జీవితాన్ని తిప్పితే ఎంత బాగుంటుందో
    కూడలిలో మాత్రం వెనక్కితిప్పకుండానే మీ "బ్లా"గుంటుంది....
    అది ఇంకా బాగుంటుంది...

    ReplyDelete
  9. బాగుంది పద్మార్పితా, ప్రతి పంక్తి భా.రా.రె అన్నట్లుగా దేనికవేసాటి.

    ReplyDelete
  10. meeru baaga wraastaaru...

    ReplyDelete
  11. "హృదయాలు రెండుండీ, ఒకటి విరిగినా మరొకటి మనదైతే మరింత బాగుంటుంది!"
    ఇలా ఉంటే చాలా బాగుంటుంది..
    వాక్యాలు గుర్తురావట్లేదు కాని ఇలాంటి అర్ధమొచ్చే ఒక హిందీ పాట ఉందండి..

    ReplyDelete
  12. ఇందాకా గుర్తు రాలేదు..ఇప్పుడే గుర్తు వచ్చిందండి.."మొహ్రా" సినిమాలో కుమర్ సాను పాడిన పాట..
    "ये काश कही ऐसा होता के दो दिल होते सीने में
    एक टूट भी जाता इश्क में तो तकलीफ न होती सीने में...तकलीफ न होती सीने में..."

    బావుంటుందీ పాట!!

    ReplyDelete
  13. నరసింహగారికి, సుభద్రగారికి, శ్రీధర్ గారికి, శేఖర్ గారికి, సత్యగారికి......ధన్యవాదాలు!
    పరిమళగారు....ధన్యవాదాలండి! ఊహలు నిజాలైతే ఇంకెంత బాగుంటుందో కదా?
    జయగారికి, భాస్కర్ గారికి, సంతోష్ గారికి, అన్వేషిగారికి, బొనగిరిగారికి, ఉషగారికి ధన్యవాదలండి!

    ReplyDelete
  14. తృష్ణగారు పాటను విని మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను....బాగుందండి!

    ReplyDelete
  15. "జీవించినప్పుడే కాదు నిర్జీవివై నలుగురి మనసులో జీవిస్తే మరింత బాగుంటుంది!" ...great..

    ReplyDelete