ఓ నా జీవితమా!

ఓ నా అందమైన జీవితమా!
నాకు చేయూతనీయుమా!
నీతోటిదే నా లోకమా!
ఇరువురమూ కలసి పయనించెదమా!

ఓ నా అదృష్ట జాతకమా!
హృదయానికి నీవు చేరువ సుమా!
ప్రేమను నా నుండి వేరుచేయకుమా!
ద్వేషం నా మదిలో చేరనీయకుమా!

ఓ నా నమ్మకమా!
వెలుగు నీడల సౌధమా!
కష్టాలలో కృంగనీకుమా!
ధైర్యంతో ఎదురు నిలవనీయుమా!

ఓ నా ఆశల నిలయమా!
నీవే నా ప్రాణమా!
నా ఆశయాల సోపానమా!
నా గమ్యానికి నన్ను చేర్చుమా!!!

17 comments:

  1. ముందు వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువనే చెప్పాలి....
    ఎమో లే.....నాకు సరిగా అర్థం కాలేదు అనుకుంటా.... :(

    ReplyDelete
  2. హ్మ్! బానే ఉందండీ. ఈమధ్య నేనిటువైపెక్కువ రాలేదు.

    ReplyDelete
  3. ఎంత నిష్కల్మషమైన కోరికలో ఇవి. తప్పకుండా తీరుతాయి. ఎంతో నిర్మల మైన మనసుతో రాసిన ఈ కవిత నాకు చాల...చాలా...నచ్చింది. కోమల మైన పద్మానికి అర్పితమైన నీ జీవితం ఆశయాల గమ్యానికి చేరకుండా ఎలా ఉంటుంది!

    ReplyDelete
  4. జయగారు అన్నట్లు మీవి ఎంత అందమైన భావనలో....

    ReplyDelete
  5. @అపూర్వం గారు అన్నీ అందరినీ మెప్పించలేవు కదండి! అయినా అర్థం కాకపోవడం కాదులే, మీరు మెచ్చేలా రాయడానిక్ ప్రయత్నిస్తానుగా నవ్వండి:)
    @గీతాచార్యగారు బహుకాల దర్శనం, అలిగినారా! మెచ్చినందుకు ధన్యవాదాలు.
    @జయగారు మీలాంటి మిత్రుల ఆశ్శీసులతో తప్పక చెరుకుంటాను. మీ అభిమానాని కృతజ్ఞతలు.
    @సృజనగారు ధన్యవాదాలండి!

    ReplyDelete
  6. రె౦డవ ప౦క్తి చాలా బాగు౦ది..

    ReplyDelete
  7. పాజిటివ్ గా ఆలోచింపజేసే కవిత. మంచి అంశం. మాకిక్కడ ఒకసారి ప్రతి వ్యక్తిలోని సలక్షణాలని గుర్తించే వర్క్ షాప్ జరిగింది. ఆ ఫీడ్ బాక్ ద్వారా ప్రతివారూ ఉత్తేజితులయ్యారు. మీ కవిత కూడా అలా మనని మనం స్వయంగా ఎలా మలుచుకోవాలో అన్నట్లుగావుంది.

    ReplyDelete
  8. హ్మ్మ్.. బాగుంది బాగుంది.. 'అందమైన జీవితం', 'అదృష్టమైన జాతకం', 'నమ్మకం','ఆశ' జీవితాన్ని నడిపించే సూత్రాలన్నిటి గురించి బాగా రాసేరు, రెండవది తప్ప మిగతావి అన్ని మన చెతిలోనివే కదా.. పిక్చర్ బాగుంది కవిత కు బాగా సూట్ అయ్యింది.

    ReplyDelete
  9. సుభద్రగారికి, విజయమోహన్ గారికి, ఉషగారికి, భావనగారికి ధన్యవాదాలండి!

    ReplyDelete
  10. మీ కవితలానే మీ జీవితం కూడా అందమైనదేనండి పద్మార్పితగారు.

    ReplyDelete
  11. మీ ఆశల సౌధానికి,జీవిత గమ్యానికి, మీ ప్రేమ సోపానాలు గమ్యానికి చేరుస్తాయి లెండి. జీవితానికి పరిపూర్ణత ఇస్తాయిలెండి.

    ReplyDelete
  12. పద్మర్పిత గారు బావుందండి
    ఆశ ఆశయమైనప్పుడు ఎన్ని అడ్డంకులైనా అదిగమించి గమ్యం చేరవచ్చండి...

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  13. ఓ నా నమ్మకమా!
    వెలుగు నీడల సౌధమా!
    కష్టాలలో కృంగనీకుమా!
    ధైర్యంతో ఎదురు నిలవనీయుమా
    nice padma

    ReplyDelete
  14. బావుందెండి.
    నమ్మకమ్ముతో చెప్పిన మూడో పద్దు చాలా బావుంది.

    ReplyDelete
  15. nice,exressions bagunnayi

    ReplyDelete