ఎలాచెప్పను?

ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
వేటగాడివి నీవని నామనసుకి ఎలాతెలుపను?

నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?

దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?

నీ రూపమే కనపడుతుంది చందమామలోను చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?

కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?

నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
నిన్ను మరణించమని ఏలాచెప్పను?

25 comments:

  1. విరహ ప్రేమని తప్ప వేరేది రాయని పద్మను ,
    ఇంకేదైనా రాయమని ఎలా చెప్పను

    ReplyDelete
  2. రవిగారు....పద్మ అంటే ప్రేమని మీలో ముద్ర పడ్డాక నేను ఏది వ్రాసినా మీకు ప్రేమే కనిపిస్తుందని ఏలాచెప్పను?:)

    మధురవాణీగారు....ప్చ్ ప్చ్:(:( తిప్పి నవ్వేయండి! హ..హ:):)

    ReplyDelete
  3. పద్మార్పిత గారు మీ కవిత విన్నాక ఎందుకో నా మనసు బరువైంది ....

    ReplyDelete
  4. పద్మార్పిత గారు మీరేమన్నా పది రోజుల గ్యాప్ తో కవిత రాయాలని కంకణం కట్టుకున్నారా ??? పది రోజులయ్తే కాని కంటికి కనపడరు .......(సరదాగా ....)

    ReplyDelete
  5. ఫణిగారు......భాధపడకండి, లైట్ తీసుకోండి:)
    పదిరోజుల కంకణమేదో బాగుందే నేను గమనించలేదు:)

    ReplyDelete
  6. ఏమో అలా అన్నన్ని ప్రశ్నలు ఒకే సారి వేసేస్తే ఎలా?
    ఏదో పరీక్ష కొస్చిన్పేపరు చూస్తున్నట్టుంది.

    కాస్త ఇక్కడ పరిస్థితి తేల్లిక చేద్దమని అలా అన్నాను ఏమనుకోకండి.

    మీదైన రీతిలో బగా రాశారు.

    ReplyDelete
  7. నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
    నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?

    మిగిలిన పాదాలకు దీనికి కొంత వ్యత్యాసమనిపించింది. నిరీక్షణ ప్రేమను మరింత దృఢపరుస్తుంది కదా? మరి వేచి వుండరా?

    ReplyDelete
  8. అత్రేయ కొండూరుగారు మిమ్మల్నే కంప్యూజ్ చేసాయి అంటే అవి తప్పక సులువైన ప్రశ్నలే..థ్యాంక్సండి!

    కెక్యూబ్ గారు....తను వేచి ఉంటానంది కాని మనసు మాట వినన్నది... పాపం ఏంచేద్దాం:)

    ReplyDelete
  9. చాలా బాగుందండి...అన్నట్టు సైడ్ న పెట్టిన పెన్సిల్ స్కెచ్ ఫోటో చాలా చక్కగా ఉందండి.

    ReplyDelete
  10. హ్మ్మ్... బాగుంది.. ఇన్ని ఎలా లా పాపం పిచ్చి మనసు కు..

    ReplyDelete
  11. చెప్పడం ఎందుకు??అకల్మంద్ కో ఇషారా ఖాఫీ హై...సమజ్గయా:)

    ReplyDelete
  12. గాయం మానిందాండి ఇంతకు?:)

    ReplyDelete
  13. శేఖర్, భావన, సృజన, ప్రణీత స్వాతి, వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు.
    భాస్కర్ గారు బ్లాగ్ వైపు లుక్కినందుకు థ్యాంక్సండి! ఇంకా ఎన్నాళ్ళు ఈ అజ్ఞాతవాసం (కరెక్ట్ పదమో కాదో తెలియదు).
    లేపం రాయకుండా గాయం మానుతుందాండి:):)

    ReplyDelete
  14. chala bagundi padmarpita garu..

    ReplyDelete
  15. మనసుకే తెలుపలేనివి తనకెలా చేరతాయి?
    మాట వినని హృదయం మారాం మానుతుందా?
    దాగని వేదన, దరిచేరని కునుకు మాటవినేనా?
    మరణానా మాయమవని ప్రేమ అతనికి ఎర అవునా?
    నీలో కలిగిన ప్రశ్నకి మూలం నీవే కాదా?

    ReplyDelete
  16. nice one padmarpita garu

    ReplyDelete
  17. ఉషగారు, హనుగారు థ్యాంక్సండి!

    ReplyDelete
  18. మనసుతోటే కదా ఈ కష్టాలన్నీ. అసలు మనసే లేకపోతే! ఎలా ఉంటుందో...
    ఎప్పటిలాగే మీ కవిత చాలా బాగుందండి. బాధను బాగుంది అనటానికి మనసొప్పటంలేదు. ఎలా?

    ReplyDelete
  19. పెన్సిల్ స్కెచ్ చాలా బాగుందండి...మీ కవిత కూడా :)

    ReplyDelete
  20. This comment has been removed by the author.

    ReplyDelete
  21. Badhanu kuda anandamga cheppadam meeku baga thelusu... padamarpita garu.

    Badhal ni ela anandham ga sevkarinchadam.. oka kala.

    ReplyDelete
  22. मोहब्बत वो हसीन गुनाह है
    जिसे हर इन्सान खुशी खुशी करता है

    पर मोहब्बत में इंतज़ार वो सजा है
    जो सिर्फ-ओ-सिर्फ वोह ही करता है जो सच में मोहब्बत करता है...........

    ReplyDelete