నేడు/రేపు

దినచర్య నుండి నిన్నటిని తొలగించాను
నిన్న నేర్చుకున్న ఙ్జానంతో నేటిని ఆహ్వానించాను
నేడు రేపు రాదని, ఈనాడే నాదని నాకు తెలుసును!

దినచర్యను నేను చిరునవ్వుతో ప్రారంభిస్తాను
నిన్న లభించని అవకాశాన్ని నేడు నేను వదులుకోను
నేడు దక్కిన సమయాన్ని మైలురాయిగా మలచుకుంటాను!

దినమంతా ఆశావాదిగానే పని కొనసాగిస్తాను
నిన్నలా కాకుండా నేడు విజయానికై ప్రయత్నిస్తాను
నేడు చేజారిన కార్యాన్ని రేపు ఎలాగైనా సాధిస్తాను!!!

14 comments:

  1. మీ positive attitude నచ్చింది.keep it up.

    ReplyDelete
  2. పద్మర్పిత గారు...నెడే రా మీరు నేస్తము రేపే లేదు.నిన్నంటే నిండు సున్నరా రానే రాదు అంతారు..మీ ధృక్పదం నచ్చింది...చెప్పవే ప్రేమకు రావదం మానేసారు ఏంటండి

    ReplyDelete
  3. గడచిన నాటికై వగచకు
    గడుస్తున్న నేటిని నిండుగా సద్వినియోగం చేసుకో
    రాబోయే రేపటిని తలుచుకుంటూ కలలు కంటూ నిదురపో
    కాలగమనంలో సాగిపోతున్న పాన్థులమయ్యా మనమందరం!

    ReplyDelete
  4. నిన్న లభించని అవకాశాన్ని నేడు నేను వదులుకోను

    బాచెప్పారండీ!!

    ReplyDelete
  5. Good positive thoughts Padmarpita.

    ReplyDelete
  6. ఆశావాదం ఆందరి జీవన గమనానికి అవసరం..అని గుర్తు చేసారు..కవిత బాగుంది..ఇంకా మీ బ్లాగులో ఫొటోలు అన్నీ చాలా బాగున్నాయి..

    ReplyDelete
  7. మీ అశావహ ధృక్పదం కావాలెందరికొ ఆదర్శం. ప్రతి కవితలొనూ (కవిత్వం లొనూ)ఉప్పొంగాలి నూతనత్వం. నేర్చుకున్న జ్ఞనం కాబొదు యెన్నటికీ వ్యర్ధం. అదే కదా అందరికి అస్వాదం, మనసుకు ప్రశాంతం, నూతన విజయానికి సొపానం.

    ReplyDelete
  8. మరింకెందుకు ఆలస్యం...సాగనీ విజయంవైపు పయనం:)

    ReplyDelete
  9. నిన్నటి జ్ఞాపకాల దొంతరలో నేటి కళల మేఘాలను రేపు ఆవిశ్కరి౦పచేసుకోవడమే జేవిత౦. మీ కవితలతో ఎప్పుడు ఆశావహ దృక్పధాన్ని కలిగిస్తారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  10. Hai Padama garu me kavithalu chala chala chala bagunayandi naku chala nachaye

    ReplyDelete
  11. స్పందించిన ప్రతి మనసుకి ధన్యవాదాలు....

    ReplyDelete