గెలుపు నాదే!

జీవితంలో ముందుకి సాగాలన్న యత్నం
ప్రతిసారీ వెనుకబడిపోయె నా ప్రయత్నం
ఒక్క అడుగు వేయబోయింది నా పాదం
నాలుగడుగులు ముందుకి సాగె జీవనం!

జీవితందే ప్రతిసారీ అవుతుంది విజయం
నాకు దక్కింది ఎల్లప్పుడూ పరాజయం
ఓడిపోయిన నేను చేసాను దరహాసం
అదిచూసి జీవితానికి కలిగెను ఆశ్చర్యం!

జీవితంతో కొన్నేళ్ళిలా సాగింది నా పయనం
ఒకనాడు నన్ను ఇలా అడిగింది జీవితం
ఓటములను చూసిన నీకు రాదేల ధుఃఖం
మది నిట్టూర్పు విడిచింది ఆ క్షణం!

జీవితానికి ఇచ్చాను నేను సమాధానం
ఓరోజు తనకన్నా ముందన్నాను నా గమనం
మృత్యువు వెంట నేనెదిగిపోతాను ఆ దినం
నాకోసం జీవితమా....నీవు చేస్తావు నిరీక్షణం!

జీవితాన్ని చూసి నేను చేస్తాను విజయహాసం
గడచిన కాలాన్ని తలచి సాగిస్తాను ప్రయాణం
మరణించి సాధించాను జీవితంపై విజయం
గెలుపు ఓటముల్లో నవ్వలేకపోయింది జీవితం!

14 comments:

 1. జీవిమ్చడానికి కావలసిన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని అందరు కలిగి వుండాలని కోరుకుందాం...

  ReplyDelete
 2. >> మరణించి సాధించాను జీవితంపై విజయం
  ఎదగాలింకా.. :) ఏడ్చి/ముగిసిపోయి ఋజువు చేసేది ఏమిటి. "ఎదిరించిన సుడి గాలిని జయించి రావా మది కోరిన మధు సీమలు వరించి రావా...కెరటాలకు తల వంచితె తరగదు" వినలేదా..

  ReplyDelete
 3. కవిత చాలా బాగుందండి. కాని మరణిస్తే...జీవితంపై విజయం ఎలా అవుతుంది. నిర్వేదం నుంచి బయటకు ఒచ్చి విజయాన్ని సాధించటమే బాగుంటుంది కదూ...

  ReplyDelete
 4. జీవితం ఒక అద్భుతమైన అనుభవం. మనం ఎన్నో ఆలోచనలతో, ప్రణాలికలతో మనం అనుకున్నట్లు జీవితం సాగాలని అనునిత్యం ప్రయత్నిస్తూ వుంటాం. అంతా అనుకున్నట్లు జరగదు. అదే జీవితంలోని తమాషా. అయిన మన ప్రయత్నాలు మానేస్తున్నామా? తలచేది జరుగదు. జరిగేది తెలియదు అని బొమ్మను చేసి పాటకు ముందు వినిపిస్తుంది, గుర్తుకు తెచ్చుకోండి ఒక సారి.

  ReplyDelete
 5. నాకు కూడా చివరి పేరాలో లైన్లు మరోలా ఉంటే బాగుండేదేమో అనిపించిందండి.(గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించటం అంటే ఇదేనేమో కదండీ..:-)). మీరు పెట్టిన ఫోటో మరియు మిగిలిన లైన్లు మాత్రం చాలా బాగున్నాయి.

  ReplyDelete
 6. hi hi hi....
  meru rasina kavita add chesina oka stree silpam chala chala bagunndi

  oka stree avedhana
  evariki cheppukoleka entaga tanalo tane kumilipoi
  chivaraku marananni saitam tana vijayam anukune terunu varninchina me kala amogam suma...

  kani marnam anedhi mana chetilo ldhu kada
  idi manaku labhinchina pushpa vanam
  maname mana puvvulani tunchiveyalanukovatm avivekam kadha

  >> మరణించి సాధించాను జీవితంపై విజయం
  ఎదగాలింకా.. :)
  ane kante edirinvhi jevitamlo sadinchanu vijayam ani rasi vunte chala bagundedhi

  ReplyDelete
 7. ఏంటో కాస్త తికమకగా ఉంది...చావడం ఏమిటీ? గెలుపు ఏమిటీ!

  ReplyDelete
 8. హి హి ముందు బాగుందనిపించింది ..కామెంట్లు చూసాకా బోలెడు డవుట్లు వచ్చేసాయి.. తప్పునాది కాదు .. నీ కామెంట్స్ ది :)

  ReplyDelete
 9. కెక్యూబ్ గారు అలాగే.....మీతో పాటు నేను కూడా!
  శిశిరగారు నా కవిత మిమ్మల్ని టచ్ చేసినందుకు సంతోషం....తచ్ లో ఉంటానండి:)
  kvsv....thank Q!

  ReplyDelete
 10. ఉషగారు, జయగారు, షిరాకిపుత్రగారు......
  మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలండి!
  ఏదో మిడిమిడి జ్ఞానంతో చచ్చి గెలుపొందుదాం అనుకున్నా.....
  మీ అందరి అభిమానంతో బ్రతికి సాధించాలి అనుకుంటున్నా:):)

  ReplyDelete
 11. @ Honey....thanks a lot.
  ఇంక చచ్చినా చావనుగా....మీ లైన్స్ నే ఫాలో అవుతాను:)

  @ సృజనగారు.... అదేవిటో వ్యాఖ్యలు చదివాక మీలాగేనేను అనుకుంటున్నా:)

  @ నేస్తం...డౌట్లని తీర్చమని మాత్రం నన్నడకండి....నేరం కమెంట్స్ వి కాదేమో నా మిడిమిడి జ్ఞానానిదేమోనని డౌట్:)

  ReplyDelete
 12. బాగుంది.. నాది కూడా శేఖర్ గారి అభిప్రాయమే!

  ReplyDelete