ప్రేరణ!!

కనురెప్పలు విశ్రాంతికోసం ఆవలిస్తున్నవేళ
ఒంటరిగా ఉండమని జ్ఞాపకాలు శాసిస్తున్నవేళ!

నీ పలకరింపు నా హృదయవీణను మీటింది
మూగపోయిన నా మనసును తట్టిలేపింది!!

నీ స్పర్శ అంతరించిన ఆత్మీయతను వెలికితీసింది
తెలియని అనుభూతి నన్ను అలలా తాకింది!!

నీ చేయూత నాలో ఆశలను రేపింది
కలలాంటి జీవితాన్ని వాస్తవానికి దరిచేసింది!!

నీ తోడు నాకున్నది అన్న భావనే ఎంతోబాగుంది
నా కవితలకి అదే ప్రేరణగా నిలచింది!!

అలా మొదలైంది నా కవితాఝరి ఆవేళ
ఇలా సాగిపోతుంటే నా చెంతనలేవు నీవు ఈవేళ!

22 comments:

  1. Nice pic and very good lines :)

    ReplyDelete
  2. మేము చదువుతూనే ఉన్నాము మీ కవిత ప్రతీవేళ.
    బాగుంది.

    శ్రీవాసుకి

    ReplyDelete
  3. భలే రాశారు. కవితకి అతికినట్టుంది ఫోటో.

    ReplyDelete
  4. మీ కవితలు సరళం గా సూటి గా సుత్తి లేకుండా ఉన్నాయ్. ఈ బొమ్మలు మీరు వేసినవేనా లేక వాటిని చూసి మీరు స్ఫూర్తి పొంది రాస్తున్నారా! ఏమైనా చాలా కళాత్మకం గా ఉన్నది మీ పుట. అభినందనలు.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. ఏ కళకైనా ప్రేరణ, స్ఫూర్తీవసరమేగాండి. ఒక్కోసారి తమ అనుభవం లోంచి, ఒక్కోసారి తమని తాకిన అనుభూతి నుంచీ కళాకారులు తీసుకోవటం సహజం. మీరు వ్యక్తం చేసిన ప్రేరణ మీకు దూరమైంది భౌతికంగానైతే మానసికంగా ఎపుడూ మీకు చేరువలోనే ఉంది - అదే మీచేత ఈ రచన చేయించినదీను. ఇది నా అభిప్రాయం.

    ReplyDelete
  7. ప్రేరణ దరిలేదనే చింతతో రాయడం మానేయకండేం:)

    ReplyDelete
  8. చాలా బాగుంది.

    ReplyDelete
  9. Anonymous17 May, 2010

    so cute :-)

    ReplyDelete
  10. tram chutramgaa undi......chitram kavithanu kappelaa kaakunda choosukondi..... mee kavitha eppudu baagundaalii....

    ReplyDelete
  11. ప్రేమలో రకరకాల కోణాల్ని తీసుకొని అవలీలగా కవితలల్లటం మీకే సొంతం సుమా!!

    ReplyDelete
  12. ప్రేరణ కవితను ప్రేమతో ప్రేరేపించినందుకు (వ్యాఖ్యలిడినందుకు) ప్రతిఒక్కరికీ పద్మార్పిత ప్రణామాలు!!!!

    ReplyDelete
  13. ప్రేరణ దరిలేదని చింతిచకండి....
    మాకై మీరు లిఖించండి....

    ReplyDelete
  14. మీ కవితల్లో మంచి భావుకత వుంటుంది..
    మమ్మల్ని నిత్యం మురిపిస్తూ.

    ReplyDelete
  15. ఎద ని’వేదన’
    గుండెపిండి చూడు కారుతుంది కన్నీరు
    మనసుతట్టి చూడు మ్రోగుతుంది నీ పేరు
    నరనరాలలో పారేది నెత్తురు కాదు నీఊసే
    రేయీ పగలూ దినమంతా ఎప్పుడు చూడు నీ ధ్యాసే
    కాదులే చెలీ(నా) “ప్రేమ” నాటకం
    ప్రేమ అంటెనే ఒక నమ్మకం
    1. ఏ సాక్ష్యం చూపింది చిలకకు గోరింక
    ఏ ఋజువులు తెచ్చింది కలువకు నెలవంక
    ఏ మంత్రం వేసిందీ మేఘానికి చిరుగాలి
    ఏ హామీ ఇచ్చిందీ భ్రమరానికి సిరిమల్లి
    కాదులే చెలీ(నా) “ప్రేమ” నాటకం
    ప్రేమ అంటెనే ఒక నమ్మకం
    2. కన్నెవాగు ఏ కానుక తో కదలి ఒడిని చేరుతుంది
    గున్నమావి ఏ బహుమతి తో కోయిల జత కడుతుంది
    ఏ మత్తు జల్లి హరివిల్లు నింగి కొల్లగొడుతుంది
    ఏ లంచమిచ్చి జడివానా నేలను ముద్దెడుతుంది
    కాదులే చెలీ(నా) “ప్రేమ” నాటకం
    ప్రేమ అంటెనే ఒక నమ్మకం

    ReplyDelete
  16. 'Padmarpita' గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete
  17. హారం ప్రచారకులకు....హారంలో నేను ఒక పుష్పాన్నండి!

    ReplyDelete
  18. nuvvu manchi kala kaligina daanivi talli

    ReplyDelete