అతివ అతిచిన్ని ఆశ!!

కనీసం ఇవ్వుంటే చాలు.....
ఇంకేం నాకు అక్కర్లేదు.....
అందరిలాగ అడిగేదాన్నికాను!
కొందరిలాగ కొసిరేదాన్నికాను!

అందమైన ముఖవర్చసు...
దానికి తగిన సున్నిత మనసు...
ఆజానుబాహుడు, ఎత్తు మాత్రం ఆరడుగులు!
ప్రేమించడంలో నాకన్న ముందు రెండడుగులు

ఏదో మెడలోకి ఒక మోస్తారు వజ్రాల హారం.
పెళ్ళికి విచ్చేసిన వారికి చిన్ని విందుఫలాహారం...
వెన్నెలరేయికై ఏలాగో తప్పదు చంద్రమండల విహారం!
తిరుగు ప్రయాణంలో తప్పవు బహుమానాల పరిహారం!




మాకంటూ ఉండాలి కదా ఒక గృహం...
ఇరువురికీ కావాలి చెరొక వాహనం...
ఇంటిలో పనికై తప్పరు నౌకిరీజనం!
ఇంటి ముంగిట అందమైన నందనవనం!

సంధ్యవేళ సమయానికి రోజూ శ్రీవారు...
క్రమం తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు...
చిలిపి తగాదాలు తప్పవు ఎప్పుడో ఒకమారు!
సాగిపోవాలి సరదాగా సంసారపు జోరు!



చిరునవ్వుతో శ్రమించడం శ్రీవారి వంతు...
శ్రీమతికి తప్పదు చిన్ని ఖర్చుల తంతు...
నెలకి ఒకసారి స్వదేశంలోనే చిరు వినోదం!
ఏడాదికోమారు విదేశీయానంతో కనులకానందం!


అడగకపోయినా అబ్బురపరిచే బహుమానాలతో...
వారాంతంలో ఖరీదైన హోటల్లో విందువినోదాలతో...
పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడని ప్రేమానురాగాలతో!
అప్పుడప్పుడూ కాస్తో కూస్తో సెక్యూరిటీ డిపాజిట్లతో!


కనీస అవసరాలివి అనుకున్న కాంత..
చివరికి ఒక మార్గమున్నది మగవాని చెంత...
సన్యాసిగా మారడమే అతని మార్గమంట!
అతివా అతిగా ఆశపడడం ఎందుకంట???

(మనవి:- ఇంగ్లీష్ మెయిల్ ని నాదైన రీతిలో మీతో పంచుకోవాలన్న తాపత్రయమే ఈ ప్రయత్నం అంతే కానీ ఎవరి మనసునీ నొప్పించాలని కాదు!
)

9 comments:

  1. చార్టెడ్ ఫ్లైట్ మరచిపొయినట్టున్నారు..
    చిన్న ఆశే ఇలా ఉంటే ఇంక యావరేజ్ ఆశ, పెద్ద ఆశ ఎలా ఉంటాయో :)

    ReplyDelete
  2. plz read for information on following blogs
    gsystime.blogspot.com - telugu
    galaxystime.blogspot.com - english
    galaxystartime.blogspot.com - animation engines

    Thanks

    ReplyDelete
  3. మరీ అంత చిన్ని చిన్ని ఆశలైతే ఎలా చెప్పు పద్మ?:)

    ReplyDelete
  4. చాలా బాగుందండి , పిక్చర్స్ చాలా apt గా ఉన్నాయి .

    ReplyDelete
  5. చాల బాగుంది, అసలు ఇలా ఎలా ఆలోచించగలరు మీరు???

    ReplyDelete
  6. padmarpita garu chalaa baagundi mee comment

    ReplyDelete