నీవు నావాడివి....

ఎదలోయలో దాగిన
మధుర ఊహల పరిచయానివి....

పెదవులపై విరిసిన
చిరునవ్వుల దొంతరవి....

విరబూసిన వెన్నెలలో
తెరతీసిన చల్లదనానివి....

అణువణువున దాగిన
అంతులేని అనురాగానివి....

ఆలోచనల్లో దొరలిన
ఆనందకేళీ విలాసానివి....

నిదురరాని కనులలో
పవళించిన స్వప్నానివి....

ఎందెందు దాగిన
ప్రియతమా! నీవు నావాడివి....

8 comments:

  1. Bhaavukata poortigaa nindina kavita..chaalaa baagundandee.

    ReplyDelete
  2. simply superb andi.. very very nice...

    ReplyDelete
  3. Yes....I can see Premarpita in this kavita:)good!

    ReplyDelete
  4. ఆలోచనల్లో దొరలిన
    ఆనందకేళీ విలాసానివి
    ఇది బాగుంది ఆలోచనల్లో ఉన్నపుడు తెలియకుండానే నవ్వు వస్తుంది కదూ

    ReplyDelete
  5. నిదురరాని కనులలో
    పవళించిన స్వప్నానివి.... ???

    ReplyDelete
  6. బాగుంది పద్మార్పిత గారు.. ఈ రెండు లైన్స్ నాకు బాగా నచ్చాయి.. నేను అర్ధం చేసుకున్నది కరెక్టో కాదో మీ భావమిదేనో కాదో తెలీదుకానీ నాకు అనిపించినది చెప్తున్నాను..
    నిదురరాని కనులలో
    పవళించిన స్వప్నానివి
    కనులు నిద్రిస్తేనే కదా స్వప్నం జాగృతమై మనకి కనిపించేది.. మరి ఆ కనులకి నిద్రరానప్పుడు ఆ స్వప్నం ఏం చేస్తుంది మనతోనే ఉండి తాను పడుకుని నిద్రిస్తూ ఉందన్న ఊహ.. నాకు బాగా నచ్చింది..

    ReplyDelete
  7. Yes....I can see Premarpita in this kavita:)good!

    ReplyDelete