నా ప్రశ్నలకు నేనే జవాబు!

ఇవి ప్రశ్నలు కావు నాలోని భావాలు...
ఎగసిపడుతున్న ఆలోచనా తరంగాలు...

పనికిరాని పండిన రావి ఆకై రాలనేల?
ఎండికూడా గోరింటాకై పండరాదటే బాల!
హస్తరేఖలు చూసి జీవితాన్ని వ్రాయనేల?
అవిటివారికి కూడా జీవితమున్నదే బాల!
పరుల సొమ్ములకై ప్రాకులాట మనకేల?
ప్రాప్తం ఉంటే పొమ్మన్నా పోదుకదే బాల!
ఎదుటివారిలోని తప్పులు మనమెంచనేల?
అద్దంకాదు మనమోము కడుక్కొనవలెనే బాల!
మెప్పుకై ప్రాకులాడి ముప్పులు తెచ్చుకోనేల?
మనస్సు లగ్నం చేస్తే మెప్పులు మనసొంతమే బాల!
పదాలను కూర్చి పేర్చి ఇలా వ్రాతలు రాయనేల?
కొందరైనా చదివి ఆచరిస్తేనే ఈ వ్రాతలకు సార్థకతే బాల!

9 comments:

  1. Chala bavundi Padmarpita :)

    ReplyDelete
  2. ఏంటి పద్మా అంత బిజీనా????

    ReplyDelete
  3. బాగుంది :)..అభినందనలు :)

    ReplyDelete
  4. జీవిత సారాన్ని చెప్పారుగా! ఎండికూడా గోరింటాకై పండరాదటే బాల! నాకు బాగా నచ్చిన వాక్యం
    మీ వ్రాతలకు సార్ధకత తప్పక దొరుకుతుంది పద్మార్పిత గారు!

    ReplyDelete
  5. హాయ్ అండి.. మీ కవితలకు తగ్గ చిత్రాలు. చాలా బాగున్నాయ్. ప్రతి ఒక కవిత ఒక చక్కని భావంతో పెనవేసుకుని ఉంది. చిత్రాలు మీరు వేసినవేనా?

    ReplyDelete
  6. పనికిరాని పండిన రావి ఆకై రాలనేల?
    ఎండికూడా గోరింటాకై పండరాదటే బాల!

    పరుల సొమ్ములకై ప్రాకులాట మనకేల?
    ప్రాప్తం ఉంటే పొమ్మన్నా పోదుకదే బాల!

    ee rendu maatalu chala bagundi andi....

    ReplyDelete