జీవించనీయకు!

పలకరింపుల పరిమళాలు...
నీ తలపులలో తడిసిన పరువాలు...
మనం తడిసి ముద్దైపోయే తరుణంలో,

ఎందుకో ఈ పెనుతుఫానుల గాలులు!!!


నిన్ను తలుస్తాను ప్రతిరోజూ పలుమారులు...
నీకు వచ్చే వెక్కిళ్ళే అందుకు నిదర్శనాలు...
నిన్ను చేరాలని చేసే శతవిధ ప్రయత్నాల్లో,

తీరం చేరని కెరటాల్లాంటి ఎన్నో అడ్డంకులు!!


కడదేరిన నన్ను చూసి కంటనీరిడకు...

చితిని చేర్చువేళ చింతిస్తూ చెంతచేరకు...

చింతతో కంటనీరిడిన నిన్ను చూసి నాలో,

జీవించాలన్న ఆశను మరల చిగురించనీయకు!

10 comments:

  1. "నిన్ను చేరాలని చేసే శతవిధ ప్రయత్నాల్లో,
    తీరం చేరని కెరటాల్లాంటి ఎన్నో అడ్డంకులు!!"
    బావుంది. బొమ్మ చాలా చాలా అందంగా ఉ౦ది పద్మార్పిత గారూ..

    ReplyDelete
  2. మనం తడిసి ముద్దైపోయే తరుణంలో,
    ఎందుకో ఈ పెనుతుఫానుల గాలులు
    బాగుందండీ! చిత్రం, వర్ణన రెండూ చక్కగా ఉన్నాయి!

    ReplyDelete
  3. "పలకరింపుల పరిమళాలు ---
    నీతలపులలో తడిసిన పరువాలు ---"
    పద్మార్పిత గారు! మీ కవిత బాగుందండీ!
    కవిత కోసం వేసిన బొమ్మ ఇంకా బాగుంది.

    ReplyDelete
  4. కవితా బొమ్మా రెండూ చాలా చక్కగా ఉన్నాయి, ఎవరేసిందీ బొమ్మ?

    ReplyDelete
  5. పద్మా బాగుంది కవిత, బొమ్మ రెండూ..

    ReplyDelete
  6. కడదేరిన నన్ను చూసి కంటనీరిడకు...
    చితిని చేర్చువేళ చింతిస్తూ చెంతచేరకు...
    చింతతో కంటనీరిడిన నిన్ను చూసి నాలో,
    జీవించాలన్న ఆశను మరల చిగురించనీయకు!


    baagundi...

    ReplyDelete
  7. చింతతో కంటనీరిడిన నిన్ను చూసి నాలో,
    జీవించాలన్న ఆశను మరల చిగురించనీయకు!
    అఆహా..కేక :)

    ReplyDelete
  8. అద్భుతమైన భావన..భావ చిత్రం...చాలా నచ్చాయి పద్మార్పిత గారూ...కంగ్రాట్స్..

    ReplyDelete