మదిగాయంతో ముందుకు సాగిపో
ప్రతిగాయాన్ని మెట్టుగా మలచుకో
ఊహల రెక్కలతో దివిన విహరించు
నేలపై నిలబడి నిజాన్ని గ్రహించు...
ఎవరో వచ్చి ఏదో చేస్తారని మరచిపో
నిన్ను ప్రభావితం చేసినవారిని గుర్తుంచుకో
కాలమై సాగుతూ నిన్ను నీవు మరువకు
ప్రలోభాలకు ఎన్నడూ భానిసవుకాకు...
ఎదభారమైన వేళ ఒంటరిగా ఉండిపో
నలుగురిలో నవ్వుతూ దాన్ని మరచిపో
మందిరంలోని భగవంతుడ్ని పూజించు
మనిషిలోని మంచిని మందిరంగానెంచు...
చీకటి బాటలో వెలుగుగా నీవు మారిపో
నీ హృదయాన్ని ఆ వెలుగుతో నింపుకో
గడచినది ఏదైనా తలచి విలపించకు
జరగబోవుదాన్ని గూర్చి యోచించకు...
:)) Nice!
ReplyDelete:)) thank Q!
Deletegood
ReplyDeleteOh! so nice of you:-)
Deleteగొప్పగా ఉంది.
ReplyDelete"నిన్ను ప్రభావితం చేసినవారిని గుర్తుంచుకో...." ఈ వాక్యం అద్భుతం.
నా రాతల్లోని వాక్యానికి ప్రభావితమై వ్యాఖ్యిడిన మీకు ధన్యవాదాలు!
Deleteమీరు ఎంచుకునే పెయింటింగ్స్ చాలా అందంగా డిఫరెంట్ గానూ ఉంటాయి, వేసిన ఆర్టిస్ట్ పేరు తెలుసుకుని బొమ్మ కింద పేరు రాస్తే ఇంకా బాగుంటుందేమో, చిన్న సలహా మాత్రమే.
ReplyDeleteమీ సలహా నాకెంతో సంతోషదాయకమండి....కానీ నేను మీలా క్రియేటివ్ ఆర్టిస్ట్ ని కానండి...సాధారణంగా నా కళ్ళకి ఇంపుగా కనబడి నేను వేయగలను అనుకున్న చిత్రాలని సేకరించి చూసి కాపీ కొట్టేస్తాను(అప్పుడప్పుడు రంగులు షేపులు కూడా మారిపోతుంటాయి, అవి మీరు గమనించే ఉంటారనుకోండి) అందుకే కాపీ కొట్టినవాటికి వారి పేరు పెట్టి ఆ గొప్పకళాకారుల్ని తక్కువ చేస్తున్నానేమోనన్న భావం, అలాగని కాపీకొట్టడమే నేరమైతే దానికి మరల నా పేరు పెట్టుకోవడం ఏంటని ఇలా!
Deleteనా ఈ చిత్రలేఖనం గురువులేని విద్య...
అయినా మీరంతా అభిమానిస్తున్నందుకు ధన్యవాధములు, తప్పైతే మన్నిస్తారన్న ఆశ కూడ.
గమనిక :-ఈ చిత్రం మాత్రం ఒరిజినల్ దే ఆర్టిస్ట్:Biswajit.
మీ కళా తృష్ణకు జోహార్లండీ..అలాగే మీ సహృదయతకు కూడా.
Deleteఓ...మీరే బొమ్మలు వేస్తారా అయితే, తెలీదండీ, కాపీ అయితే మాత్రం ఆర్ట్ కాదా? గొప్ప ఆర్టిస్ట్ ఏ అయితే...
Deleteపికాసో కొటేషన్ తెలుసు కదండీ...Good Artists Copy, Great Artists Steal"
Congratulations! for Painting and also writing.
@వర్మగారు మీ అభిమానపు ప్రోత్సాహానికి ధన్యవాధాలండి.
Delete@చిన్నిఆశ: అమ్మయ్య....ఇప్పుడు ధైర్యం వచ్చేసిందిగా:-) మీవికూడా ఓ రెండు బొమ్మలు కాఫీ కొట్టేసానులెండి...నా చెలి "అపు"రూపం కలువలోని పద్మానికి చీరను మార్చి, పరుగున రావా నేస్తమా...మూసిన కళ్ళని తెరచి కాన్వస్ పై కాఫీ చేసాను ఏమనుకోకండేం! మీరువేసే అమ్మాయి వేళ్ళు నాకు చాలా నచ్చుతాయండి.Thanks for giving me inspiration.
ధైర్యం తెప్పించేశామా? ఇంకేం మీరేసిన ఆ రెండు బొమ్మలూ చూపించేసెయ్యండి మరి. చాలా కుతూహలంగా ఉంది. మా బొమ్మల్లోని లోపాలని సరిదిద్ది ఇంకా బాగా వేసి ఉంటారని మా expectations.
Deleteఅమ్మాయి చేతివేళ్ళు నచ్చుతాయా? అన్నిటికన్నా చేతివేళ్ళు వెయ్యటం చాలా కష్టం అని మా అభిప్రాయం, చేయ్యి పలికినన్ని భావాలు ముఖం కూడా పలుకలేదు...కదూ! Norman Rockwell అని గొప్ప American Illustrator, వినే ఉంటారు, ఈయన బొమ్మల్లో చేతివేళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
Once again Congratulations!
ఆశా భావం తో.. ముందుకు సాగమని
ReplyDeleteబావుంది..
నచ్చినందుకు నెనర్లండి...
Deleteenni quotes raasarandi, okkao sookthi ki oka kavitha raayochemo,
ReplyDeletenice bhagundandi, oka class la.
keep writing. mee pencil sketches, paintings chakkaga untayandi.
inni sookthulu cheppi bhor kottinchanu kada, ala ani class bunk kaakundaa unnanduku, mechchina meeku thank you very much.
Delete"చీకటి బాటలో వెలుగుగా నీవు మారిపో
ReplyDeleteనీ హృదయాన్ని ఆ వెలుగుతో నింపుకో"
బాగుందండీ కవిత.
ధన్యవాధాలండి...
Delete"చీకటి బాటలో వెలుగుగా నీవు మారిపో
ReplyDeleteనీ హృదయాన్ని ఆ వెలుగుతో నింపుకో"
చాలా బాగుంది పద్మ గారూ!
చిత్రం కూడా బాగుంది.
మదిగాయానికి కాలమనే లేపనం పూసుకుంటూ...
ముందుకు సాగిపో.....
@శ్రీ
ధన్యవాధాలండి...సాగిపోవలసిందేకదండి!:-)
Deleteచాలా చాలా బాగుంది అండీ.. సూపర్..
ReplyDeleteచాలా చాల సంతోషదాయకమండి...
Deleteఎవరో వచ్చి ఏదో చేస్తారని మరచిపో
ReplyDeleteనిన్ను ప్రభావితం చేసినవారిని గుర్తుంచుకో
కాలమై సాగుతూ నిన్ను నీవు మరువకు
ప్రలోభాలకు ఎన్నడూ భానిసవుకాకు...
మంచి స్ఫూర్తినిచ్చిన వాక్యాలతో ఆశావహ దృక్పథాన్ని నింపుతూ వెన్నుతట్టేలా పొందికగా చెప్పిన తీరు నచ్చిందండీ..అభినందనలు పద్మార్పితగారూ...
స్ఫూర్తిదాయకమని మెచ్చి వ్యాఖ్యిడిన మీకు అభివాధములండి వర్మగారు!
Deletenice padmarpita garu......
ReplyDeleteచాలా బాగుందండి మీ స్ఫూర్తినిచ్చే కవిత!
ReplyDeleteధన్యవాధాలండి!
DeleteInspiring quotes.
ReplyDeleteOh! Is it.....thank Q :-)
Deleteచాలా బాగుంది కవిత దానికి తగిన చిత్రం ఎప్పటిలాగానే
ReplyDeleteనెనర్లండి...
DeleteNice painting mam.
ReplyDeletethank Q...
DeletePadmarpitha garu....chala bavundandi me poem...chala motivating ga....Header lo unna picture meedena?....Chala andamga unnaru meru :)
ReplyDeleteThanks for your comment & compliment:-)
ReplyDeleteయెంత చక్కగా స్పోర్టి దాయకంగా వ్రాసారు
ReplyDeleteథ్యాంక్సండి!
Delete