మీ అందరిలో....

అరిగిన కుంచెతో అందాలు అద్దనా
పూరించని చిత్రానికి నా పేరుపెట్టనా
మెప్పించలేని మాటలు పలుకగలనా
జగమెరిగినవాడి జాతకం నే చదవనా!

బ్రతకలేని భావాలు ఎన్నని వ్రాయగలను
మదిమెచ్చకుంటే మెదడుకు అందించను
మరపన్నదేలేని నన్నునేనేం తలుచుకోను
మనసులోనే పదిలమంటే మెప్పులేం కోరను!

మీరే నిండిన మోముకి అలంకారాలెందుకు
పూలై విరిసివాడే పేరుప్రఖ్యాతులు ఎందుకు
మంచి చెబితే ముళ్ళైనా మణిహారమే నాకు
గుచ్చుకుని భాధలో గుర్తొస్తుంది తడవతడవకు!

15 comments:

  1. Anonymous01 July, 2012

    మంచి చెబితే ముళ్ళైనా మణిహారమే నాకు
    గుచ్చుకుని భాధలో గుర్తొస్తుంది తడవతడవకు!

    well said

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. పూలై విరిసి, వాడే పేరుప్రఖ్యాతులు ఎందుకు
      sorry andi,manchi line idi, aa cama leekapoye sariki nene koncham confuse aiyanandi, emanukokandi,

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. BTB, ఎప్పుడూ మీ కవిత బొమ్మ పై కామెంట్ ని నివారిస్తుంది మనసు తిప్పనీకుండా ;)
    బొమ్మ చాలా బాగుంది, రంగుల ఫ్లో లో ఉన్న ఈజ్...వాటర్ కలరా?

    ReplyDelete
  5. చక్కటి భావాలని రంగరించి
    చిత్రించిన తీరు చాలా బాగుంది...
    మీరే నిండిన మోముకి అలంకారాలెందుకు ?
    పూలై విరిసివాడే పేరుప్రఖ్యాతులు ఎందుకు?
    మంచి చెబితే ముళ్ళైనా మణిహారమే నాకు
    గుచ్చుకుని భాధలో గుర్తొస్తుంది తడవతడవకు!
    ఆఖరి నాలుగు వాక్యాలు మనసుని కదిలించాయి..
    superb...
    @శ్రీ

    ReplyDelete
  6. ఎవరన్నారు బ్రతకలేని భావాలని , ఊపిరి ఊదేస్తుంటేనూ , " మీరే నిండిన మోముకు అలంకారాలేందుకు" వహ .. ఎంత కొత్త ప్రయోగాన్ని సందించారు. పద్మగారూ చాలా బాగా ఆవిష్కరించారు. ఇంకా పొగడాలని ఉంది కానీ గురువు ఎక్కువగా పొగడకూడదు.

    ReplyDelete
  7. మీ కవిత అద్భుతం మీ painting చూడగానే నాకు కలిగిన భావన

    ఆమెవన్నీ రంగుల స్వప్నాలే అని

    పాపమా కన్నీళ్ళకేం తెలుసు

    తెలుసుంటే అవికూడా రంగులద్దుకునే జారేవేమో.

    ReplyDelete
  8. Anonymous01 July, 2012

    writing n painting, both are competing with each other.

    ReplyDelete
  9. బ్రతకలేని భావాలు ఎన్నని వ్రాయగలను?


    మీరే నిండిన మోముకి అలంకారాలెందుకు?

    nice padmarpita gaaru.....:)

    ReplyDelete
  10. చాలా తాత్వికంగా ఆర్థ్రంగా గుండె తడిని కుంచెకద్ది భావాన్ని అక్షరీకరించారు...అభినందనలు మేడం..

    ReplyDelete
  11. విభిన్నమైన కవిత." మీరే నిండిన మోముకి అలంకారాలెందుకు".ఆ మోము లోని వెలుగుకు వేరే అలంకారాలెందుకు.మంచి ప్రయోగం.

    ReplyDelete
  12. ఎంత సున్నితంగా చెప్పారండి.
    చాలా బాగుంది మీ భావవ్యక్తీకరణ.

    ReplyDelete
  13. భావాలన్ని అక్షరాలుగా పేర్చి, వాటికి రంగులు అద్ది, మనసులో అందరికి ఒక పెద్ద పీట వేసి,
    సమర్పించుకున్న కవితా సుమం ఇది!!
    చక్కగా ఉంది!

    ReplyDelete
  14. painting chaalaa nachindandi padmarpitaji.

    ReplyDelete