హారర్ అంటూ హడలెందుకు?

దెయ్యాలకి దండుకోవడం
పిశాచాలై పీక్కు తినడం
భూతాలను బురిడీకొట్టించడం
నేర్పింది మానవజాతైన మనం!
ఇంకెందుకవ్వంటే మనకి భయం?

శాఖినీ...ఢాఖినీ అంటూ
హాం ఫట్! ఛలో ఛట్ అంటూ
ఆత్మ...ప్రేతాత్మలున్నాయంటూ
మనచెడుని మనమే తలచుకుంటూ!
లేనివి ఉన్నాయంటూ వాదనలెందుకు?

విభూధి పూనకాలతో
మాయమంత్ర తంత్రాలతో
మసిపూసుకున్న ముసుగుతో
పరులను భయపెట్టాలన్న నెపముతో!
మంచిని మరచి ఎందుకిలా దోచుకోవడం?

మానవత్వంతో మనం మసలుకుంటే
దెయ్యం దరిచేరను పొమ్మంటుంది
పిశాచి పూలతో గులామునంటుంది
భూతం భువి నీదేనంటూ ఏలమంటుంది!
ఇక పదండి…హారర్ అంటూ హడలెందుకు?

19 comments:

  1. భూమ్మీద అతి ప్రమాదకరమయిన జంతువు మనిషేనండీ........ తన స్వార్థం కోసం ఎంతకయినా దిగాజారగలడు, ఏమయినా చేయగలడు

    మానవత్వంతో మనం మసలుకుంటే
    దెయ్యం దరిచేరను పొమ్మంటుంది
    పిశాచి పూలతో గులామునంటుంది
    భూతం భువి నీదేనంటూ ఏలమంటుండి! - Well said.
    ____________________________________________
    Visit http://bookforyou1nly.blogspot.in/
    for books.

    ReplyDelete
  2. నైస్ పద్మగారు. నిజం అండి ముందు మనం కరెక్ట్ గా ఉండాలి. పిశాచి, భూతం అలంటివి ఏవి ఉండవు.......

    ReplyDelete
  3. సడెన్ గా ఈ గీతోపదేశాలేంటి పద్మ గారూ..
    అయినా మీ స్టైల్ లో ఏదైనా ఓకే...కంగ్రాట్స్..:-)

    ReplyDelete
  4. పద్మా....
    హడలెందుకు నాకు?
    నీవు చెప్పిన సూక్తులతో అడుగేస్తా ముందుకు
    దెయ్యమైనా, భూతమైనా తలవంచును నీ కవితకు:)

    ReplyDelete
  5. No doubt your poetry rocks Madam.
    Horror too gives a Message :)

    ReplyDelete
  6. Haha...chala bavundi me poem...Nice message :)
    Daivam...Dayyam...mana manushullone untayi...:D

    ReplyDelete
  7. మీకు సరిరారండి ఎవరూ
    మీకవితలతో దెయ్యాలని కూడా పారద్రోలగలరు
    అందుకేనేమో మీకింతమంది బ్లాగ్ అభిమానులు.

    ReplyDelete
  8. మీరు ఇలాంటి భావాలను కూడా కవితలుగా వ్రాసినందుకు మీకు ధన్యవాదాలు.మనిషి మనసే ఒక దేవుడు,ఒక దెయ్యం.ఇక వాటికి వేరే రూపాలెందుకు.ఇలాంటి వాటికి వివరణ కోసం నా సైన్సు బ్లాగులో 18 ప్రక్రుతి సూత్రాలు చదవండి. గమనించండి.http://cvramanscience.blogspot.in చూడండి.

    ReplyDelete
  9. :-)...
    మనలోని
    మంచి.. దేవుడైతే...
    చెడు...భూతం...
    భూతాలకే భూతమైన మనిషంటే ...
    భూతాలు భయపడాలిగానీ...
    భూతమంటే మనిషికి భయమెందుకు???:-))
    బాగుంది పద్మార్పిత గారూ!
    @శ్రీ

    ReplyDelete
  10. Anonymous13 July, 2012

    Nice Padma garu!

    --
    Photon

    ReplyDelete
  11. హా హా హా ....మోడల్లింగ్ చేస్తున్న దెయ్యం...
    ఎంత అందమైన చిత్రాలు పెట్టగలరో మీరు,
    అంతే భయంకరమైన చిత్రాలు కూడా పెట్టగలరు అని అనేస్తున్నాను ,ఈ రోజు ఈ కవితకు మీరు పెట్టిన చిత్రం చూసి... :))
    నాకు సిరివెన్నెల గారి పాట గుర్తుకు వచ్చింది మీ కవిత చదవగానే!

    మనసులో నీపైన భావాలే..
    బయట కనిపిస్తాయి ద్రుశ్యాలై..
    నీడలు నిజాల సాక్ష్యాలే

    శత్రువులు నీలోని లొపాలే..
    స్నేహితులు నీకున్న ఇష్టాలే..
    ఋతువులు నీ భావ చిత్రాలే

    మన మనసులో భయ్యము, పాపచింతే దెయ్యమై, భయ్యమై, డాకినీ పిశాచమై,భూతమై
    మనల్ని భయపెడుతుంది...చెడ్డ మనిషి కన్నా ప్రమాదమైన దెయ్యలు లేవు, భూతాలు లేవు...
    nice one పద్మ గారు, (చిత్రం nice one కాదు..:((
    భయపెట్టింది సుమా!! మరి భయపెట్టాలి కదా అంటారా? ఏమో బాబు, నేను దడుచుకున్నాను )

    ReplyDelete
    Replies
    1. Nenu kuda Meelage dhaduchukunnanandi:(

      Delete
  12. దైవం వుందంటే దెయ్యమూ వుందనుకోవాలె.. హీరో వుంటే విలనున్నట్టు..కానీ రెండూ మనుషులను భయపెట్టేవే..ఒకడు పాపం చేయకూడదంటూనే చేసే వార్ని క్షమించే మూర్ఖుడు.. మరొకడు చేసే వాడిని వెన్నంటి చంపే భయంకరుడు.. కానీ ఏమీ చేయకుండా వుండలేని మనిషి ఈ భూమ్మీద వుండగలడా? అందుకే ఈ రెండింటినీ పక్కకు పెట్టి నిర్భయంగా బతికే మనిషి కావాలి..ఏమంటారు పద్మార్పితగారూ?? మీ కవితలన్నీ హత్తుకుంటాయండీ..నేను మీ ఫాన్ ని..

    ReplyDelete
  13. Adenti padma vunnatundi ala bayapettinchavu..;(

    Ithe iyindi gani baga cheppavu Deyyala kosam:D

    ReplyDelete
  14. నాజూకు అమ్మాయి బొమ్మలతో అహ్లాదపరచగలవు
    అదే అమ్మాయి బొమ్మలతో భయపెట్టనూ గలవు
    అయిన నీ స్టైలే సెపరేటు అన్నట్లుంది ఇది :)

    ReplyDelete
  15. Pic lo chala information undi Padma garu..
    btw most sexy pic.. ;) hehehheee..

    ReplyDelete
  16. భూతాలు దెయ్యాలంటూ మిమ్మల్ని భయపెట్టాలని కాదండి!
    ఒక్కసారి ఆ చిత్రాన్ని చూడండి ఎంతందంగా ఉందో:-)
    చూసారా? అలా చూస్తూనే ఉండిపోయేరు సుమా!!!
    రండి ఇలా నాతో కలసి చూడండి.....
    అంతా ఆర్ట్ మయం అనిపిస్తుంది:-)
    "బక్కచిక్కిన వయ్యారి నడుము
    ధీటైన పగిలిన పెదవితో నవ్వు
    ఓ కంటితో కవ్వించే ఆ చూపు
    '0'పాక్ అందాలలో ఆమె వంపు
    కాకి కూడా పీకలేని కండలు
    ఏమని వర్ణించను ఆ అందాలు
    ఇంకా పొగిడితే రక్కును ఆమె గోళ్ళు"
    :-):-):-):-):-):-)
    హమ్మయ్యా నవ్వేసారు కదా
    అయితే మరి ఇంకేం...
    "భయపడనివారు
    భలేగుందన్నవారు
    బాలేదుగా అన్నవారు
    భావముందన్నవారు
    భీతిచెందినవారు"
    ఏమైనా అంతా నావారు
    అందుకోండి..నా నమ:సుమాంజలులు!

    ReplyDelete