నా కవితవై....

పంజరాన్న బంధించిన భావాలనేమి వ్రాయను
మూగనోము పట్టిన ఊసులను ఎలా తెలుపను
వెన్నెలే దాగుడుమూతలాడితే పదం పలుకలేను
కలబోసిన రంగులు విడదీసి ఏబొమ్మ నే గీయను
కవితా నేడు ఏమని అడగను? దేనిపై చర్చించను?


వర్ణాలే తెలియని నేను వర్ణించేదా ప్రకృతి అందాలని
ప్రేమే ఎరుగని నేనేమి వివరించేది ప్రేమరాహిత్యాన్ని
ఆకలన్నదేలేని నే తెలపనా పేదవాని ఆకలిఘోషని
నీతిలేని రాజకీయాలపై రాయ నేను ఎంతటి దానని
కవితా నేడు ఏమని అడగను? దేనిపై చర్చించను?

నా కనులు తెరిచి చుట్టూ చీకటినే చూస్తున్నాయి

నగ్నసత్యాలు సంకెళ్ళను తెంచుకు రాలేనన్నాయి
చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి
కలమా.......నేడు నీవే కదిలే కాలంగా మారిపోయి
నీ స్థాయి కవితేదో లిఖించి పద్మార్పితవై విరబూయి!

57 comments:

  1. చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి
    కలమా.......నేడు నీవే కదిలే కాలంగా మారిపోయి
    నీ స్థాయి కవితేదో లిఖించి పద్మార్పితవై విరబూయి!....

    కవిలోని అంతఃసంఘర్షణను వెలికి తీస్తూ ఆత్మ స్థైర్యాన్ని చివరిగా చూపుతూ ముగించడం మీ శైలిలో ఇదో ఆణిముత్యం పద్మార్పిత గారు...హార్థిక అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. నా మది భావఘర్షణనెరిగి,
      నా శైలిని మెచ్చిన మీకు అభివందనములు...

      Delete
  2. chaala chaala bagundi andi.. u r someting special padmarpita garu...

    ReplyDelete
    Replies
    1. Oh! thanks for your special comment:-)

      Delete
  3. madam beautiful.

    ReplyDelete
  4. Very thought provoking. Thanks for sharing.

    ReplyDelete
  5. చివరి నాలుగులైన్లు చాలా చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. నచ్చినందుకు ఫీలింగ్ హ్యాపీ:-)

      Delete
  6. చాలా మంచి కవితండి.
    నాకోసం ఒక సరదా కవిత చెప్పరూ..ప్లీజ్

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా....అయినా నేను రాసేవాటికి మీరు నవ్వుకోవాలనే నా ఆశ.
      చాన్నాళ్ళకి ఇలా విచ్చేసారు జయగారు thank you!

      Delete
  7. "నా కనులు తెరిచి చుట్టూ చీకటినే చూస్తున్నాయి
    నగ్నసత్యాలు సంకెళ్ళను తెంచుకు రాలేనన్నాయి
    చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి"
    ఈ ఆశాభావమే ప్రేమను బ్రతికిస్తుంది..బాగా రాసారు పద్మ గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతీమాగారూ....ఆశావాద దృక్పధంతో ముందుకుసాగడమే కదాండి అందరూ చేసేది!

      Delete
  8. పద్మార్పిత.....నీలోని ఏయే భావాలకి అభిమానిననను:-) అభిమానంతో హత్తుకోవాలనుంది:)

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి సదా విధేయురాలను....థ్యాంక్యూ!

      Delete
  9. naaku parichyam ayinaa appati padmaarpita gaaru ippudu padmaarpitagaaru... okkarenaa... modata meeru kavitalu vrastaraa annnaanu.... hmm.. ivi meere vrayagalaru anipistundi... andi.. reply iste debbalu padutaai andi...

    ReplyDelete
    Replies
    1. thanks for your compliments.....maarpu evarikaina sahajam kadandi:-)

      Delete
  10. కవితకు భావం పదిలమైన మనసున ప్రశ్నావళే కవితాకేళిగ మారి కవితార్పితమైనావు పద్మార్పితా!

    ReplyDelete
    Replies
    1. ఉమాదేవిగారు.... నా బ్లాగ్ కి విచ్చేసి వ్యాఖ్యతో ఆనందింపజేసిన మీకు నెనర్లండి.

      Delete
  11. బొమ్మలు కూడా మీరే వేస్తారా అండీ చాలా చాలా బాగున్నాయి మీ కవితల్లాగే
    --
    Rama

    ReplyDelete
    Replies
    1. నేను కూడా మిమ్మల్ని ఇదే అడుగుదాం అనుకున్నాను పద్మ గారు..

      Delete
    2. ramaగారు వెల్ కం టు మై బ్లాగ్....ధన్యవాదాలండి!
      అన్నీ కాదండి కొన్ని మాత్రమే నేను చూసివేసినవి...

      Delete
    3. Priyagaru అభిమానిగా అనుకోవడమెందుకు.....అడిగేయండి!:-)
      నన్ను మానసికోల్లాసపరిచేవే పెయింటింగ్స్ అండి...
      మీ అభిమానానికి కృతజ్ఞతలు!

      Delete
  12. చాలా ..చాలా బాగుందండి

    ReplyDelete
    Replies
    1. మెచ్చిన మీకు ధన్యవాదాలండి!

      Delete
  13. అద్భుతమైన భావకవిత. చాలా చాలా బాగా వ్రాశారండి.

    ReplyDelete
    Replies
    1. భారతిగారు నా భావకవితను మెచ్చిన మీకు ధన్యవాదాలండి!

      Delete
  14. భావాలు బంధితాలైనవేళ ప్రపంచాన్నే నీ పంజరం చేసి రాయి
    ఊసులు మూగబోయిన వేళ నీ విరిమోము తెలిపేనులే నీ తలంపులు

    కరిమబ్బు కరిగించలేవా నీ కరుణతో నీ వన్నె వెన్నెలై దివిచేర
    వడబోతకై వగపేల బాలా!! అన్నిరంగుల కలబోత నీ మనసు తెలుపు

    మంచు బిందువులకు రుచిపంచిన నీ కరుణని ఏమి కోరేది!
    తన చూపులతో బంధించిన లోకపంజరాన్ని ఎలా వేడేది!!

    నీకు తెలియని వర్ణం వివర్ణం
    నీవు ఎరుగని ప్రేమ లౌకికం

    కలలవనరాణి దయ కానని పేద ఎక్కడ! లేదే నాకు ఆకలి జాడ
    నీ నిర్మలవిజయాలపై రాయి రాజనీతి దిద్దుబాట పడుతుంది
    కవితను నువ్వమను ..నీ నవ్వులను లోకం పైకి రువ్వమను.

    ఇక ఎవ్వరి కనులైనా చూసేది వెలుగు చినుకులనే
    సంకెలలెలేవన్న సత్యం పరివ్యాప్త మై నిలుస్తుంది

    అనాడు నిజంగా
    చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి
    కలమా.......నేడు నీవే కదిలే కాలంగా మారిపోయి
    పద్మార్పితవై విరబూయి! రస సింధువు పొంగుతుంది

    ReplyDelete
    Replies
    1. కవితను నువ్వవ్వమను..

      నవ్వెక్కువొచ్చేసి..వ్వ లేకపొయా..
      రా య లేక పోయా..పైనా సవరించి.. ఇది తొలగించ ....

      Delete
    2. మీరు వ్రాసిన వ్యాక్యకవితా కుసుమావళికి జవాబు ఏమీయగలవు పద్మార్పితా....నీవు ఎన్నిపదాలు కూర్చి జవాబిడినా పరిపక్వతలేని పువ్వై విరబూస్తుందంటూ నా కవిత మీ కవితకు సలామంటుంది:-)

      Delete
    3. SKY garu....thank you very much for your wonderful reply.

      Delete
  15. Replies
    1. Yes...Its true!
      Iam glad to have that:-)

      Delete
    2. just a value addition to honour innocent feelings chatakaM garu!!

      Delete
  16. కలబోసిన రంగులు విడదీసి ఏబొమ్మ నే గీయను....ఇలాంటి మంచి భావాలతో, ఏం రాయను అంటూనే మంచి కవిత రాసేశారు.
    బొమ్మ చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన ఆత్మీయమైన స్పందనకు నెనర్లండి!

      Delete
  17. ఏ భావం పలికినా..పద్మార్పితవై పలకాలి...
    ఏ పదం వ్రాసినా...పద్మార్పితవై వ్రాయాలి...
    ఏ చిత్రం గీసినా...పద్మార్పితవై చిత్రించాలి...
    అవే అందరికీ పంచాలి...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ.....మరీ ఇంత స్వార్థమా :-):-)
      నా రాతల్ని అభిమానంతో అమోదిస్తున్న మీ అందరి ప్రేరణే ఇలా రాయిస్తుందండి!
      మీ అభిమానానికి కృతజ్ఞతలండి.

      Delete
  18. ఏం రాయను? ఏమడగను అంటూనే కమ్మని కవితని విరబూయించారుగా:)

    ReplyDelete
  19. విరబూసింది నచ్చినందుకు థ్యాంక్యూ.

    ReplyDelete
  20. మీరు మీలానే రాయండి పద్మార్పిత గారు...
    మీ అంతరాత్మ ఈ కవితలో ప్రస్ఫుటమయింది...

    Go a head..break the silence and get the depth of the Silence...:-)

    ReplyDelete
    Replies
    1. ఓహో......నన్ను నాలాగే రాయమన్నారు కదా, రిలాక్స్ గా ఉందండి. ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  21. bomma kante kavitha baagunda? kavitha kante bomma baagunda? thelchukoleka pothunnanu.Adi bomma leka viraboosina padmaarpithaa?

    ReplyDelete
    Replies
    1. మీకు బొమ్మ మరియు కవిత రెండు నచ్చినందుకు మహదానందంగా ఉందండి.
      మీ ప్రశంసకు ప్రణామాలు:-)

      Delete
  22. very very nice padmarpitha garu

    ReplyDelete
  23. ఇన్ని కవితలు ఇంత అద్భుతంగా వ్రాసి ఏమి వ్రాయను అంటూనే ఇంత మంచి కవిత వ్రాసినందుకు ఇందరి ప్రశంసలు పొందినందుకు మీకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ఇదంతా మీ అందరి అభిమానమండి. మీ స్పందనాస్ఫూర్తిదాయక వ్యాఖ్యకు అభివందనాలు.

      Delete
  24. Replies
    1. తెలివైన వ్యాఖ్య:-)

      Delete
  25. పదాలతోనే కాదు ప్రశ్నలతో కూడా కవిత్వీకరించగలరు మాట...
    బావుందండి....

    ReplyDelete
  26. Welcome to my blog....ఏదో ఇలా ప్రశ్నలడిగి కూసింత జ్ఞానాన్ని ఆర్జించాలన్న ఆశండి:-)Thank Q!

    ReplyDelete
  27. Replies
    1. చాన్నాళ్ళకి విచ్చేసి కమెంటిన మీకు నెనర్లండి!

      Delete