ఈ దినాలు అవసరమా?

నిజం నిష్టూరమని అసత్యమాడాలంటే
అబద్ధాన్ని నిజమని నమ్మేలా ఏమార్చి
నిజమేదో నిరూపించబడనంతగా నమ్మించి
నిజంచెప్పినా అసత్యమనుకునేలా చెప్పాలి.

న్యాయంగా పయనం సాగించలేమనుకుంటే
అన్యాయాన్ని ఆశ్రయించి దాని పంచన చేరి
న్యాయాన్ని నడిబజారులో నగ్నంగా నిలబెట్టి
అన్యాయానికైనా న్యాయం చేసామనుకోవాలి.

నిజాయితీగా కాక అవినీతితో బ్రతకాలంటే
ఇతరులని దగా చేసి మన మనసుని చంపి
వారి అవసరాలని అవకాశంగా మలచుకుని
స్వార్థానికి నిజాయితీగా తలొగ్గి సాగిపోవాలి.

నాకై నేననుకుని బ్రతకడమే జీవితమనుకుంటే
ప్రతిక్షణమలా చస్తూ బ్రతకడమే ఆనందమనుకుని
బ్రతికే ఈ బ్రతుకులకి పనికిరాని సంబరాలు చేస్తూ
12.12.12 లాంటి ప్రత్యేకమైన దినాలు అవసరమా?

62 comments:

  1. అక్షరాలతో.. చెడుగుడు ఆడేసారు ..గా..

    నాకు నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా..:-)

      Delete
  2. Very nice పద్మర్పిత గారు....చాలా బాగుంది...

    ReplyDelete
  3. ఉదయమ్నించి అందరూ ప్రత్యేకంగా ఈ రోజు గురించి చెప్తుంటే నాలో మాత్రం నాకే తెలియని ఏదో నిర్లిప్తత..
    ఇప్పుడర్ధమయ్యింది దానికి కారణం..
    మీ కవిత చదివిన ప్రతిసారి స్పందించలేక మౌనన్ని ఆశ్రయిస్తాను..
    ఇప్పుడు మాత్రం 'ఈ దినం' విషయంలో నా మౌనానికి భాష్యం మీ కవనంలో చుశాను.
    ఆలోచనాత్మకంగా ఉంది ఈ కవిత..

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య....మీ నిర్లిప్తతకి తోడుగా నా భావాలు...
      నా కవితకి మీ వ్యాఖ్యలు....భలే హ్యాపీగా ఉందండోయ్:-)

      Delete
  4. ఏ రోజూ తిరిగి రాదు,ప్రతీ రోజు ,ప్రతీ క్షణం ప్రత్యేకమైనదే....అయినా ఈ పిచ్చి జనాలు...తింగరి సంబరాలు చేసుకుంటున్నారు,అదే అర్థం కాక ,పై మాటంటే పిచ్చోన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు...కాని అంతా బాగున్నోడికి ప్రతీ రోజూ పండగే ,ఎదురీదుతున్నోడికి ప్రతీ క్షణం ప్రత్యేకమే ...కష్టాల్లో ఉన్నొడికి రోజూ పోరాటమే అయినా డేట్ల ని చూసి మురిసి పోయి లేని ఆనందాలు నటిస్తారు... నటన ...

    ReplyDelete
    Replies
    1. స్వాగతం నా బ్లాగ్ కి, నిజమే...మీరు వివరించిన విధానం బాగుందండి. ధన్యవాదాలు.

      Delete
  5. చాలా బాగా చెప్పారండి ! దినాల పేరుతొ జరుగుతున్నా ఈ సర్కస్ అంతా కేవలం పశ్చిమ దేశాలా వ్యాపారాన్ని వృద్ది చేసుకోవడానికి మాత్రమె
    జీవితం లో ప్రతిక్షణం అపురుపమైనదే - తిరిగి రానిదే కాబట్టి

    దినాల పేరుతొ - కేవలం దగ మోసాలు మాత్రమె జరుగుతున్నాయి

    ReplyDelete
    Replies
    1. నా భావాలతో ఏకీభవిస్తూ.....నా బ్లాగ్ కి విచ్చేసి మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలండి.

      Delete
  6. చీల్చి చెండాడారు. అవసరం లేదండీ.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయిగారు....చాన్నాళ్ళకి మీ కమెంట్ నాకు ఆనందాన్నిచ్చిందండి. థ్యాంక్యూ.

      Delete
  7. నిజం నిష్టూరమని అసత్యమాడాలంటే
    అబద్ధాన్ని నిజమని నమ్మేలా ఏమార్చి
    నిజమేదో నిరూపించబడనంతగా నమ్మించి
    నిజంచెప్పినా అసత్యమనుకునేలా చెప్పాలి.
    ............ఇంత గొప్పగా రాయాలంటే పద్మార్పితానే రాయాలి,..అంతేకదండి,...

    ReplyDelete
    Replies
    1. అమ్మో...ఇలా మీతో మెప్పు పొందడం కష్టమే:-)

      Delete
  8. I guess you don't like rajanikanth. ;)

    ReplyDelete
    Replies
    1. No my friend....Sri.Rajanikanth is celebrating his birthday every year, not only 12.12.12:-) what you say?

      Delete
  9. కా. పద్మార్పిత గారు!
    మీ కలానికి చాలా పదును కుడా ఉందండోయ్ :))
    చాలా బాగుంది ఈ పోస్ట్.,
    ఇలాంటి చెత్త డేలకు సెలబ్రేషన్ అస్సలు అవసరం లేదు..

    ReplyDelete
    Replies
    1. ఆ పదునైన కలం మీలాంటివారి స్పందనలతో కలుపు మొక్కల్లాంటి విషయాలని కొన్నింటినైనా కత్తిరించి, స్ఫూర్తిదాయకమైన పోస్ట్ లు రాయాలన్న ఆశ....Thank you.

      Delete
  10. 12.12.12 ఒక మాములు రోజు ఏముంది దీని ప్రత్యేకత రోజులు వస్తున్నాయి పోతున్నాయి కాని మనం అలానే వున్నాము ప్రతి మనిషి సంతోషంగా వున్న రోజే నిజమైన ప్రత్యేకమైన రోజు

    ReplyDelete
    Replies
    1. నిజంగా అలా అందరూ సంతోషంగా ఉండే రోజు వస్తే ఆ కేరింతలలో ఈ దినాలు ఎవరికి కావాలి చెప్పండి.:-)

      Delete
  11. ఇరగదీసారు...
    ఈ రోజు మీ నుంచి ఇలాంటి కవితను నేను ఆశించాను ...
    నా ఊహ నిజమైందండి...

    ReplyDelete
    Replies
    1. నా నుండి ఇలాంటి పోస్ట్ ను ఈరోజు ఆశించడం అంతా మీ అభిమానం:-)

      Delete
  12. This is an extraordinary one by you madam....claps

    ReplyDelete
  13. తర్కానికి తావియ్యకుండా రాసి మెప్పించారు...అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. అలా అని ఇప్పుడు తప్పించుకున్నా......వచ్చే పోస్ట్ లో ఏం తర్కిస్తారో అని టెన్షన్:-)

      Delete
  14. eni questions meku yella vastayi andi ??

    ReplyDelete
  15. Replies
    1. when we ask questions then only we get answers which increases our knowledge my dear Ramya:-)

      Delete
  16. ఒక పదినిముషాల ముందుగా వచ్చి అవసరంలేదని వాదించేద్దాం అనుకున్నా ప్చ్:-( కానీ కుదరలేదు పద్మార్పితా.....కెవ్వు మనిపించావు:-)

    ReplyDelete
    Replies
    1. 365 డేస్ గ్రేస్ టైం ఉంది కదండి....వాధించండి:-)

      Delete
  17. :) Need to make some moments in life special. So people find ways. Why not? 12 12 12 is special in it's own way. Let us be happy and celebrate every day with happiness and a smile on our faces.

    ReplyDelete
    Replies
    1. Yes, I too agree with you madam, but why only on special dates?
      Someones bad date may be good for others. Anyway thanks for sharing your views.

      Delete
  18. ఎన్నెన్నో వర్ణాలు అంటూనే.........దహా.

    ReplyDelete
    Replies
    1. దహా....? అర్థంకాలేదండి.
      ఏమో గుర్రమెగరావచ్చు అన్నారుకదా మీ బ్లాగ్ లో...:-)
      ఎదురుచూస్తాను ఎక్కడైనా ఎప్పుడైనా వివరించకపోతారా!

      Delete
    2. దీని కోసం మళ్ళి గుర్రాన్ని ఎగరవేయడం ఎందుకండీ. ఇప్పుడే చెప్పేస్తాను.
      దహా అనగా దరహాసం.
      బ్రాకెట్లలో నవ్వను. తెలుగులోనే నవ్వుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నాను అప్పుడెప్పుడో.
      (అవునూ మీరు దహా గురించే అడిగారా? లేక కామెంటు గురించా?.......మహా, మందహాసం)

      Delete
    3. హా...హా...మీ దహా మహా ఆనందదాయకం:-)నేను ఇలా నవ్వితే అభ్యంతరంలేదుకదా!

      Delete
  19. Hmmm....First three stanzas chala baga nachayandi :) vaatiki akhari stanza ki sambandhamu emito ardam kaledu...

    Akhari stanza ki na opinion, 12.12.12 ki pratyekata undi anukunna vallaki undi...ledu anukunna vallaki ledu...adi valla personal opinions ni batti untundi....manaku mana 100th post, or 100th follower or mana blog birthday special ani ela anipistundo, vallaki 12.12.12 tedi, nela, samvatsaram okate '12' kavadam pratyekamga anipistundi :)

    12.12.12 naadu nenu pratyekamga emi celebrate cheskoledu, kani ah date concept ni baga enjoy chesanu. 12.12.12 moodu pannedu kavadam bhale ga anipinchindi :)

    ReplyDelete
    Replies
    1. mundugaa meeku naa 3 stanzas nachchinanduku thanks.

      నేను ఇక్కడ చెప్పాలనుకున్నది కేవలం 12.12.12 గురించి మాత్రమే కాదండి. ఈ పోస్ట్ రాసే రోజు ఈ తేదీ కావడం వలన ఇలాంటి దినాలు అని అడగవలసివచ్చింది. ఎవరి ప్రత్యేకమైన రోజులు, సంబరాలు వారికి ఉండగా మళ్ళీ "ఫ్రెండ్ షిప్ డే", మదర్స్ డే, ఫాదర్స్ డే అని ప్రత్యేకంగా ఆరోజున సంబరాలు అవసరమా? మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పర్వాలేదా? అన్యాయాన్ని,అసత్యాలని, అవినీతిని ఆసరాగా చేసుకుని ఆనందంగా బ్రతికేస్తున్నామనుకునే జీవులకి ఇలాంటి దినాల ముసుగొగటి అవసరమా?

      Delete
    2. Hmmm....meeru cheppadalchukunna inko konam naku ippudu ardham aiyyindi :) Sambaralu jarupukovadam tappu kadu, kani adi anyayanni, asatyanni avineethini prerepinchela undakudadu. Mee bhavam naku ardham aiyyindi. vivaramga explain chesinanduku Thank you :)

      Delete
  20. ఎవరి పిచ్చి వారికి ఆనందము... ఎవరిని ఏమి అనలేము...

    ReplyDelete
    Replies
    1. నిజమే నాలాంటి పిచ్చి వాళ్ళు ఉన్నారన్నమాట:-)

      Delete
  21. meeru em cheppalanukuntunnaru? 12.12.12 lanti dinalu vaddana lekhapotha andaru nijalu cheppalana? enduku ee renditini mix chesaaru?

    ReplyDelete
    Replies
    1. శ్రీవల్లిగారికి ఇచ్చిన రిప్లైలో నాభావం అర్థమై ఉంటుందని ఆశిస్తున్నా..Thank you
      బహుశా నా భావ ప్రకటనలో లోపమేమో, అయినా చెప్పాలనుకున్నది చెవిన వేసాననే భావిస్తున్నా!

      Delete
  22. ఈ పోస్ట్ ద్వారా మంచి సందేశాన్నందించారు పద్మార్పిత గారు. రోజు రోజుకి పెరిగిపోతున్న వైయక్తిక ఆశక్తులు అనురక్తుల మధ్య ఎవరికి వారే ఒక కొకూన్ లో బతికేసే తీరుని ఎండగడుతూ లేని రాని ఆనందాన్ని ఇలా ఈ దినాల పేరుతో అతికించుకొని సంబరాపడుతున్న కృత్రిమత్వాన్ని ఎండగట్టడం నచ్చింది. అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. వర్మగారు....నేను చెప్పాలనుకున్న భావం మీ కమెంట్ రూపంలో రావడం ఆనందదాయకం. అభివందనాలండి.

      Delete
  23. మీతో నేను ఏకీభవిస్తున్నానండి.ప్రత్యేకమైన తేదీలలో సంబరాలు జరుపుకుని సంతోషిస్తే పర్వాలేదు 12.12.12 మంచిరోజు కాదని వంద మందికి పైగా ఆ రోజు జన్మ నివ్వడం మానేసేలా నమ్మేంత మూర్ఖత్వంలో బ్రతకడం విచారకరం, అదికాక ఈ తేదీలపై చర్చాగోష్టిలు కూడా...ఏంటో ఎటువైపు వెళుతున్నామో??

    ReplyDelete
    Replies
    1. మీరు ఆలోచించిన కోణంలో ఇంకా విచిత్రాలు దాగున్నాయండి. మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  24. 12.12.12 మళ్ళీ వందేళ్ళకి కానీ రాదన్నారు కదా...అంతా మంచి జరుగుతుందేమో అనుకున్నా ఆఫీస్ లో అన్నీ అలజడులే ఇంకేం సంబరాలు:-( అందుకే ఇలాంటివి నమ్మను. (అందని పళ్ళు పుల్లన అన్నమాట)

    ReplyDelete
    Replies
    1. అందని పళ్ళు పుల్లగా ఉంటే పర్వాలేదు అదో టేస్ట్....చేదైతేనే కష్టం:-)

      Delete
  25. అంతేనమ్మా పద్దూ...
    ఏమిటీ లోకం.. పలు కాకుల లోకం.. ఫటా ఫట్..

    అంత మరీ ఇదిగా ఆలోసించకు తల్లీ.. గుండె బరువై మనసు భారమై పోద్ది..
    మాంచి సరదా పోస్ట్ రాసేయ్..:-)

    ReplyDelete
  26. :) Need to make some moments in life special. So people find ways. Why not? 12 12 12 is special in it's own way. Let us be happy and celebrate every day with happiness and a smile on our faces....
    వెన్నెల గారి భావాలటో ఏకీభవిస్తున్నాను...
    మీరు వ్రాసిన విధానం బాగుంది...but 12 12 12 ...is some thing special...
    పద్మ గారూ! అభినందనలు మీకు...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. Thanks for your comments & sharing Srigaru....

      Delete
  27. చాలా చాలా బాగుందండి. ఏ రోజూ తిరిగి రాదు,ప్రతీ రోజు ,ప్రతీ క్షణం ప్రత్యేకమైనదే... నిజం...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శృతిగారు.

      Delete
  28. నాకై నేననుకుని బ్రతకడమే జీవితమనుకుంటే
    ప్రతిక్షణమలా చస్తూ బ్రతకడమే ఆనందమనుకుని
    బ్రతికే ఈ బ్రతుకులకి పనికిరాని సంబరాలు చేస్తూ
    12.12.12 లాంటి ప్రత్యేకమైన దినాలు అవసరమా?..........పద్మ గారు చాలమంది మీరు రాసిన అక్షరాలను గమనించకుండా, అంకెలను పట్టుకొని కామెంట్ చేస్తున్నారు.....చర్నాకోలతో కొట్టి ప్రశ్నించిన మీ కవిత్వంలోని భావం అర్థం ఐతే ఈ అంకెలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదేమో...anyway .రోజు రోజుకు మీ కవిత్వం పదునెక్కుతుంది. గమనించారా?

    ReplyDelete
    Replies
    1. నేను చెప్పాలనుకున్న భావాన్ని అర్థం చేసుకుని పదాల్లో పదునుందని నా రాతలకు స్ఫూర్తిని కలిగిస్తున్న మీ అభిమానానికి కృతజ్ఞతలండి.

      Delete
  29. మాటల్లేవు...బదులీయడం అంత సులభం కాదు. ఒకో కవితలోని అంతర్మధనం నాకు అర్థమవ్వాలంటే సంవత్సరాలు పట్టేను. మీరు బహుముఖ ప్రగ్నులు.

    ReplyDelete