తెలుపలేకున్నా!

నన్ను చూస్తూనే నానుండి దూరమై
గమ్యాన్ని వెతుకుతూ నీవెళ్ళిపోతే...
ఏమైందో చెప్పమంటే ఏం చెప్పను?
నీవు వెళ్ళినప్పటినుండి నవ్వలేదని
ఒక్క క్షణమైనా కంటికి కునుకులేదని
నిశిరేయిలో నా నీడను నేనే వెతికానని
ఇవేవీ నిన్ను నాకు దూరం చేయలేదని
నన్ను బంధించి భాధిస్తున్న తలపులన్నీ
మదిగోడల్లోనే సజీవ సమాధి అయిపోతే...
ఎందుకీ వేదన అనడిగితే ఏమని చెప్పను?
నీవు లేకపోతే పర్వదినపు సంబరమేలేదని
ఇది తెలిస్తే నీ మనసు కలవర పడుతుందని
అందుకే నీవు వెళుతుంటే కంట నీరిడలేదని 
చెప్పాలనుకున్నవేవీ నీకు నేను చెప్పలేనని
తెలిసి తెల్లకాగితంపై నీ పేరునే మునివేళ్ళతో
రాస్తున్నా రాస్తున్నా.......రాస్తూనే ఉన్నా!!!

46 comments:

 1. ఇంతలా తల్లడిల్లే హృదయం నిజంగా ఉంటుందంటారా?
  Pic is too good.

  ReplyDelete
  Replies
  1. ఉండబట్టే ఇలా రాయగలుగుతున్నాం అనికేత్.....

   Delete
 2. 100% ఉంటారు అనికేత్. అలంటి స్వచ్చమైన మనసు, ఆరాదించే హృదయం, మన కోసం ఆరాటపడే మనిషి జీవిత భాగస్వామిగా వస్తే జీవితం సార్ధకం అవుతుంది. పద్మ గారు చాల బాగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి...

   Delete

 3. పద్మార్పిత గారు,

  ఏమిటో నండీ తెల్ల కాగితం మీద రాస్తున్నా నంటున్నారు !

  క్రింద కార్బన్ ముక్క ఉందా? కాపీ చేసుకుని పేరు ఏమిటో తెలుసు కుందామని!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
  Replies
  1. కాపీ చూసెందుకు....ఒరిజినల్ కాపీనే ఇస్తానుగా కొన్నాళ్ళూరించి:-)

   Delete
 4. హృదయాన్ని ఆవిష్కరించి ద్రవింప చేసారు.. మాటలు రావడం లేదు...ఆ చివరి వాక్యాలు పదే పదే వెంటాడుతున్నాయి పద్మార్పిత గారు...

  ReplyDelete
  Replies
  1. మీరు మరీ ఇంత సున్నిత మనస్కులైతే ఎలాగండి వర్మగారు:-)

   Delete
 5. ఈ రేంజ్ లో ప్రేమింపబడే జీవి జన్మ ధన్యం అండీ!నా జీవితం లో అలాంటి ప్రేమని కనీసం చూడాలనుకోవడం............ అదొక మాంచి కల......

  ReplyDelete
  Replies
  1. కొన్ని కలలుగా ఉంటేనే బాగుంటాయేమోనండి:-)

   Delete
 6. Replies
  1. ధన్యవాదాలండి!

   Delete
 7. ప్రేమతో కూడిన వేదనంతా మీదైన్ స్టైల్లో చెప్పారు. బాగుందండి, బొమ్మ సూపర్

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ యోహంత్ నచ్చిమెచ్చినందుకు:-)

   Delete
 8. Wow Padmarpita garu simply Super.. Image is nice..

  ReplyDelete
 9. meeru bhale easyga edipinchestarandi.....bomma suparandi....bhavukata suparandi.....hrudayanni chinni chinni padaltone kariginchastaru chudandi..... Hats off...

  ReplyDelete
  Replies
  1. nenu yedipinchinaa meeru navveyandi plz....thanks for compliments:-)

   Delete
 10. బాగుందండి (మీ) విరహవేదన... పర్వదినం తర్వాత కలిసేవుంటారు?
  Good one

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి....లేదండి! పండగముందే ప్రయాణమై వెళ్ళారుగా:-)

   Delete
 11. పద్మార్పిత గారు
  రాతలకన్న బొమ్మలు బాగున్నాయి
  బొమ్మలకన్నా రాతలు ఇంకా బాగున్నాయండి

  ReplyDelete
  Replies
  1. రాతలైనా, బొమ్మలైనా......జీవితపు గీతలేకదండి (ఈ వేదాంతపు ధోరణి నాకు నప్పదంటారా:-) అయితే ఓ కే....థ్యాంకులు మీకు ఇలా విచ్చేసి వ్యాఖ్యానించినందుకు!

   Delete
 12. ఎంతందంగా కట్టిపడేసారో కవిత్వంతో
  ఆ కొంటెకోణంగి వాలుచూపు చిత్రంతో

  ReplyDelete
  Replies
  1. నిజమేనా....?:-)thank Q

   Delete
 13. ఆత్మాశ్రయ విప్రలంబ కవిత్వం

  ReplyDelete
  Replies
  1. ఇందులో అంత పస ఉందంటారా మాష్టారు:-)Thank you sir

   Delete
 14. ప్రోషిత పతిక

  ReplyDelete
  Replies
  1. మరీ ఇలాంటి పదాలతో ఇబ్బంది పెడితే ఎలాగండి:-)

   Delete
  2. మీకు తెలియని పదాలా అండి...

   Delete
 15. కవిత చాలా బాగుంది. బొమ్మ అంతకన్నా. చాలా చక్కగా వేశారు. కవితలోని భావానికి తగ్గట్టుగా...

  ReplyDelete
  Replies
  1. మీరు నచ్చింది అని మెచ్చితే బహు ఆనందం.....
   అది Mohanగారి కుంచె నుండి జాలువారిన సజీవశిల్పం!

   Delete
 16. అన్ని చెప్పి ఎం తెలుపలేక పోతున్న అని అంటున్నారు.:) బాగుంది అండి మీ భావాలు మరియు గీసిన బాపు బొమ్మ .....

  ReplyDelete
  Replies
  1. ఏం చెప్పలేదు కదండి, తెల్లకాగితంపై రాయడం తప్ప:-) అది మోహన్ గారి పెయింటింగ్ అండి.

   Delete
 17. కవిత మీలా బొమ్మ మీ మనసులా భలే అందంగా ఉన్నాయి పద్మార్పితా...

  ReplyDelete
  Replies
  1. అలా పొగడ్డమంతా మీ అభిమానమండి. ధన్యవాదాలు!

   Delete
 18. పద్మర్పిత గారు ..మీ బ్లాగు చాలా బాగుంది .అలాగే మీ కవిత కూడా చాల బాగుంది

  ReplyDelete
  Replies
  1. Welcome to my blog.ఇలా విచ్చేసి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు!

   Delete
 19. Beautiful painting and kavitha kuda chala bavundi :)

  ReplyDelete
  Replies
  1. thanks for your compliments Sri Valli:-)

   Delete
 20. చెప్పాలనుకున్నవేవీ నీకు నేను చెప్పలేనని
  తెలిసి తెల్లకాగితంపై నీ పేరునే మునివేళ్ళతో
  రాస్తున్నా రాస్తున్నా.......రాస్తూనే ఉన్నా!!!...
  మనసు కాగితంపై....వలపు సిరాతో వ్రాసేవి అందరికీ కనబడవు...
  చాలా బాగుంది పద్మ గారూ!@శ్రీ...

  ReplyDelete
  Replies
  1. అందరికీ అర్థమైతే అది వలపుకాదేమోనండి:-)
   మీ స్పందనకు ధన్యవాదాలండి!

   Delete