ప్రేమపరవశం

ప్రణయకాంత పరవశాన్న ప్రియుడ్నిచేర..
సడిచేయకే సెలయేరా సిగ్గు మొగ్గౌతుంది
ఊగిసలాడకే మనసా మాటమూగబోతుంది
గూటికి చేరవే గువ్వా గుండెల్లో గుబులుగుంది!

ప్రియుడు ముంగురులు సవరిస్తూ ముద్దాడగ..
గుబురుల్లో గుట్టుని రట్టు చేయకే వాడినకొమ్మా
చల్లగాలివై గిలిగింతలిడవే వర్షించని ఓ మేఘమా
వెన్నెలని తోడిచ్చి సాయపడవే సంధ్యాకిరణమా!

ఇరువురు ఏకమై పరిసరాలని మరచి పులకించ..
పరిహసించకే ప్రకృతిమాతా నిన్ను ప్రేమించలేదని
చిలకా పలుకులింకాపి పవళించనీయవే నీ తోడుని
పర్వతాలని మించి గగనాన్ని తాకనీ లోతైన ప్రేమని!


19 comments:

 1. ఎంత ప్రేమో. చాలా బాగుంది.

  ReplyDelete
 2. ప్రేమకి ప్రకృతి వర్ణనలో.. ఇంకా అందం తెచ్చారు... nice:-)

  ReplyDelete
 3. మండు వేసవి లో పండు వెన్నెల వంటి
  భావ సమీరం తో ఆహ్లాదపరచినందుక
  ు అభినందనలు పద్మార్పిత గారు ..:-)

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. ప్రకృతినంతా ఇన్వాల్వ్ చేసారన్నమాట ప్రేమలో...బాగుందండి.

  ReplyDelete
 6. నమసేత .మీపేరు బాగుంది.కవిత ఇంకా బాగుంది. చితరం కూడా బాగుంది. నేను కూడలికి కొతత.

  ReplyDelete
 7. అంతా అనురాగమయం
  మీ బ్లాగ్ ఆనందనిలయం

  ReplyDelete
 8. ఆశలు ఆవేశం వశమైనటువంటి ఆ సన్నివేశం,
  అర్ధం నర్మగర్భమునుగ నుండే ఓ సందర్భం,
  గోప్యం గుంచక జాప్యం చేయక లిఖించే శ్రావ్యమైన కావ్యం,
  కల్పిత భావార్పిత పద్మార్పిత మది సమర్పిత కవిత...

  మీరు ఎవరి చేతయినా రాయించగలరు.....
  బాగుంది అని ఒక చిన్న మాటతో సరిపెట్టలేక ఇలా .....

  ReplyDelete
 9. ముగింపు లైన్-
  "పర్వతాలని మించి గగనాన్ని తాకనీ లోతైన ప్రేమని!"
  చాలా నచ్చింది. ప్రేమ లోతు గగనం ఎత్తులనౌనా దాటగలదు.
  కవితా బొమ్మా రెండూ బాగున్నాయి.

  ReplyDelete

 10. ప్రేమికులు హాయిని అనుభవించాలంటె ప్రకృతి ,
  పరిసరాలు తోడై అండగా నిలిచి తీరాలి అని
  చక్కగా తెలియచెప్పటం చాలా బాగుంది.

  ReplyDelete
 11. wow..కవితలో ప్రేమ పరవశం బాగుంది అండి

  ReplyDelete
 12. బహుశా ఇది మీరు చిత్రం చూసి వ్రాసిన కవితనుకుంటా, చల్లని పవనం మీ "ప్రేమపరవశం"

  ReplyDelete
 13. ప్రణయ కావ్యాలు మీకు కొట్టినపిండి పద్మార్పితగారు :)

  ReplyDelete
 14. చాలా చాలా బాగుంది.

  ReplyDelete
 15. ప్రేమ పరవశం చాలా చాలా బాగుంది.

  ReplyDelete
 16. ప్రకృతే పరవశించి ప్రేమ పరవళ్ళుతొక్కినట్లుందండి....అహ్లాదకరంగా

  ReplyDelete
 17. వాగు వంకలో నడుమొంపుల సోయగాన్ని చూపించారు... భళా. ప్రణయ భావన ప్రకటన చేసేందుకు అందరీ ధైర్యం ఉండదు.
  అప్పుడెప్పుడో తిలక్ అమృతం కురిసిన రాత్రిలో రాసిన సొగసైన నిత్య వసంత వచనాలు గుర్తొస్తున్నాయి...
  మీ అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు...

  ReplyDelete
 18. ప్రకృతిని ప్రేమిస్తూ నా కవితల్ని అభినందిస్తున్న మిత్రులందరికీ....అభివందనములు.


  ReplyDelete