దీన్నేమంటారో!

ఎవరో ఎందుకిలా నా కవితాస్పూర్తికి రంగులద్దుతున్నారు

ప్రేమ అనే రెండక్షరాలని చెవిలో ఊది ఉసిగొల్పుతున్నారు

కవయిత్రినని పొగుడుతూ రమ్యంగా రాయమంటున్నారు

దాగుడుమూతలాడుతూ విరహమేంటో తెలియజేస్తున్నారు

ప్రతిపదంలోని అనుభూతి తానై రాతలకి జీవంపోస్తున్నారు

భావాలకి ప్రేరణై  నేను ఏం వ్రాసినా నా ముందుంటున్నారు

ఇలా నాతోనే నాలోనే ఉన్నది ఎవరనడిగితే నవ్వేస్తున్నారు

ప్రేమేమో అని అడిగితే నా మనసుని ప్రశ్నించుకోమంటారు

కాదని మదినిమభ్యపెట్టి కనులుమూస్తే కలలోకొస్తున్నారు

ఈ అలౌకికానందానికి పేరెందుకే పద్మా! పిచ్చిదానివంటారు

28 comments:

  1. పద్మార్పిత మీరు నా ఆలొచనల్ని మార్చేశారు. కవితల కొసం తెలుగు కోసం ఫేసుబుక్ ట్విట్టర్లొ వెతికాను చివరిగా కూడలి చేరాను మీలాంటి రచయిత్రిని కనిపెట్టాను చాలా సంతొషంగా ఉంది

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి విచ్చేసి అభిమానాన్ని అందించిన మీకు అభివందనాలండి.

      Delete
  2. పేరుతో పనేముందండి.....మీ భావాలకే ఫ్లాట్ అయిపోయి మీ వెంట ఉంటేను :-)

    ReplyDelete
    Replies
    1. అలా వెంట ఉండబట్టే ఇలా :-)

      Delete

  3. " ఈ అలౌకికానందానికి పేరెందుకే పద్మా! పిచ్చిదానివంటారు "


    ఇలా అంటున్నారంటే అవధుల్లేని ఆనంద సాగరంలో ఓలలాడవలసి తీరాల్సిందే , అలౌకికానందాన్ని అలా అలా , ఇంకా ఇంకా అమితంగా నువ్వనుభవించాలని ఆశిస్తున్నా , ఇవే నా ఆశిర్వచనములు . అలాగని గర్వం అనే నరానికి మాత్రం చోటివ్వకు ఏ వేళ నీ అంతరాతరాల్లో పద్మా . అప్పుడు ఆ అలౌకికానందం ఆసాంతం ని సొంతం .

    ReplyDelete
    Replies
    1. శర్మగారు....సదా ఆచరిస్తాను. ధన్యవాదాలండి.

      Delete
  4. ఇంతలా అలజడినిరేపిన ఆ అదృష్టవంతుడెవరో?????

    ReplyDelete
    Replies
    1. చెప్తే సస్పెన్స్ ఏముంది:-)

      Delete
  5. corrtect Yohnath annattu ala alajadi repina lucky fellow evaro?? super padma... chala qte ga undi image.. alwayz i feel special to read your poetry..

    ReplyDelete
    Replies
    1. konchem curiosity ga untundi kada cheppakapothe evaru evaru ani :-)....let it be continue. thank q!

      Delete
  6. ఎవరో వారు? ఇలా ఎంతకాలం అని మీదైన రీతిలో అడిగేసి ఈ సస్పెన్స్ ని పోగొట్టేయ్ పద్మా:-)

    ReplyDelete
    Replies
    1. అడగడంలేదని అనుకుంటే ఎలాగండి.....అడుగుతూనే ఉన్నా :-)

      Delete
  7. దీన్ని ఏమంటారో మాకు అర్ధమయ్యింది..ఇది అదే అని తనకి అర్ధమయ్యేలా చెప్పారో లేదో మాత్రం అర్ధం కాలేదు

    ReplyDelete
    Replies
    1. ఇది అదే అని అంటే, అది ఇదికాదంటే ఏం చెప్పను ఎలాగ చెప్పను :-)

      Delete
  8. ప్రేమ అనే రెండక్షరాలని చెవిలో ఊది ఉసిగొల్పుతున్నారు....పాపం వాళ్ళకు తెలియదు మీరు రెండో చెవి నుండి వదిలేస్తారని ..
    any how .beautiful ..

    ReplyDelete
    Replies
    1. అలా విని వదిలేస్తే.....ఇలా వ్రాయలేనేమో కదండి:-) Thank Q!

      Delete
    2. సారి మర్చిపోయాను .. ఆ రెండిటి మధ్య మీ అందమైన మనసోకటి ఉందని ..అది దేన్నైనా కవితగా మార్చుకుంటుందని

      Delete
    3. మనసు మాట వినదండి ఒకోసారి...మారిపోతుంటుంది :-)

      Delete
  9. అందమైన ఊహలకి అక్షరమాలలు మీ కవిలలు...అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాధాలండి.

      Delete
  10. ప్రేమకు పర్యాయం పిచ్చా, పిచ్చికి పర్యాయం ప్రేమో తెలియలేదనుకుంటా పద్మార్పిత గారూ..:-)

    ఏమైనా ఇలా మీ కవితా చిత్రాలకు రంగులద్దే ఆ రహస్య కుంచె ఎవరో?? అదృష్టవంతుడే.

    ReplyDelete
    Replies
    1. వర్మగారు మొత్తానికి మీరుకూడా ఇది పిచ్చికి పర్యాయం అని తేల్చేసారుగా....:-)
      కుంచె రహస్యం తెలిపి ఇలా రంగులద్దడం కష్టమేమోనండి. Thank you.

      Delete
  11. Konni feelings nu vyakta parachalante padalu dorakavau....
    kevalam feel avvalante...maro saari hrudyaniki hattukonela rasina Padma gaariki dhanyavaadalu :-)

    ReplyDelete
    Replies
    1. nijame.....konni anubhutulea anandannistaayi. Thank you Srinivas garu.

      Delete
  12. padmagaru mee kavithaku praanam mee madiloni roopam mee oohalloni chitram. padmagaru jaagratha mari kalallo mabhya pedithe parledu.........

    ReplyDelete
  13. dhanyavaadaalandi.....

    ReplyDelete