విత్ లవ్ ఫ్రం.......నరకం!

నావెంటపడి వస్తాను అనకు అల్లంత దూరం
అక్కడ నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువట
నీదేమో అది చూసి తట్టుకోలేని ప్రేమస్వార్థం
పాపులు పాతచుట్టాలుగా చుట్టూ చేరతారంట
నీకేమో నేనంటే అసలే వల్లమాలిన అభిమానం
వారు పలకరిస్తుంటే నీకు ఒళ్ళంతా పిచ్చమంట
యముడికి కూడా నేనంటే అమితమైన ప్రియం
చిత్రగుప్తునికి చెప్పి నన్ను త్వరగా రప్పించాడట
నాపై ప్రేమతోపాటు తెలివైన నీకు తగనంత ఆవేశం
అందుకే నిన్ను నావెంట ఒద్దని బ్రతిమిలాడుతుంట
నీ శక్తి సామర్ధ్యాలతో ఇక్కడ ఎందుకులే గందరగోళం
భువిలోనే మంచిమనిషిగా పేరు తెచ్చుకోమని అంట
నీ వెంట ఆయువు తీరిన నేను ఉండలేను కలకాలం
చేసిన క్రియానుగుణంగా వేయిస్తాను నీకు స్వర్గబాట!!

40 comments:

 1. ఎందుకండీ బ్రతిమిలాడడం....మీకన్నా ముందే యముడి వద్దకు చేరి.....మిమ్మల్ని రానీయకుండా చేస్తాగా....మీరు తన మంటనూ....ఆవేశాన్నీ.... తగ్గించి సరదాగా పది కాలాలు గడిపేయండి. ok.Have fun.
  Funny poem....with funny thoughts....thanks for making me laugh:)

  ReplyDelete
  Replies
  1. అనూగారు....ఇక్కడ నిజానికి నేను చెప్పాలనుకున్నది వేరు, నీవు లేక నేను లేను అని ప్రేమలో చెప్పేవారందరూ నిజంగా ఒకరితోపాటు ఇంకొకరు వెళ్ళిపోతున్నారా అనే సందేశాన్ని చమత్కారంగా చెప్పబోయి మీ చేతికిలా చిక్కాను ;-)

   Delete
 2. nuvu leni swargam kuda narakame kada anduke ikade kavitalu raasukuntu happyga batikedam

  ReplyDelete
  Replies
  1. kavitalu raasukuntuu kurchunte kadupu nindadu...kadupu ninditeanea kavitalu & swargasm kanipinchedi kuda :-)

   Delete
 3. టపాలు టపటప మని ఒకటి వెంట ఒకటిగా కదులుతున్నాయి
  భావాలు ఒకటి వెనక ఒకటి పరిగెడుతున్నాయి
  ఇంతలో ఏదో తెలియని ఆవేశం ముంచుకొచ్చినదా
  స్వర్గ నరకాలను విస్లేసిస్తున్నట్టు ఉంది మీ కావ్యం

  ప్రేమ పొందితే రెప్పపాటులో స్వర్గం నిరాకరిస్తే క్షణికం లో నరకం అన్నట్టు
  ఒద్దికగా మెత్తగా ఊసులేవో చెప్పి సన్నగా తీగ లాగితే డొంకేదో కదిలినట్టు
  ప్రేమను చూపి ద్వేషాన్ని రగిలించి మరల ఆప్యాయతను కుమ్మరించి
  ప్రేమలో ఇలా ఉంటుంది అని బహుచక్కని వివరణ ఏదో ఇచ్చి మది పులకింప జేశారు

  ReplyDelete
  Replies
  1. నా ఈ రచన మీకు ఇంకో అందమైన కవిత రాసేలా ప్రేరణ ఇచ్చినందుకు సంతోషం. థ్యాంక్యూ.

   Delete
 4. రావద్దు పోవద్దని కేవలం చెప్పగలరే కాని ఎదుటి వారి ప్రేమించే మనసు నిర్దేశించలేరు పద్మ. ఏమైనా నరకంలో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మెయింటైన్ చేసారంటే అబ్బో మీరు ఎక్కడుంటే అదే స్వర్గమన్నమాట....కాదు కాదు ఉన్నమాటే :-)

  ReplyDelete
  Replies
  1. మహీ.....ప్రేమించే మనసుని నిర్దేశించలేకపోవడం ఏమిటి? కనులు వెళ్ళిన దగ్గరకంతా మనసు వెళ్ళిందికదా అని కాళ్ళని కూడా పరుతీయిస్తే బొక్కబోర్లా పడతాం :-) అందుకే కొన్నింటికి కళ్ళెం వేయక తప్పదు.

   Delete
  2. మాటల మూటలతో పుట్టి...మనసులో కోటవేస్తావు. :-) I like your way of answering Padma, its amazing.

   Delete
 5. సుతిమెత్తగా కొరడాతో చరిచినట్లుంది

  ReplyDelete
  Replies
  1. దెబ్బ తగల్లేదు కదా :-)

   Delete
 6. సూపర్ గా చెప్పారు, పిక్ అదిరిందండి. దసరా శుభాకాంక్షలు

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ యోహంత్....మీకు కూడా

   Delete
 7. మీరెక్కడుంటే అదే స్వర్గం...
  రావద్దంటే ఎలా??
  చిత్రం అదిరిందండీ...

  ReplyDelete
  Replies
  1. అంతా స్వర్గం అయిపోతే యమలోకంలో కార్మికులకి పని ఉండక పస్తులపాలౌతారు కదండీ కుమారవర్మగారు :-) ధన్యవాదాలండి!

   Delete
  2. ఇదే మాట నేనంటే దానికి జవాబువేరుగా ఇచ్చారు. అందరికీ నచ్చే విధంగా సమాధానపరచడం ఎవరు నేర్పారు మీకు? ఆ గురువుగారి అడ్రస్ ఇస్తారా :-)

   Delete
 8. Replies
  1. Thank you Ahmed Chowdary garu.

   Delete
 9. సరిలేరు మీకెవ్వరు.....సాగిపొండలా సక్సెస్ తో.

  ReplyDelete
  Replies
  1. సరదాగా సాగిపోతా మీ అందరి సహకారంతో. ;-)

   Delete
 10. ఎక్కడైనా కలిసుంటేనే కదా అది స్వర్గం. బాట స్వర్గానికేసినా ఒంటరిగా వెళితే అదీ నరకమేగా?
  బొమ్మ గొప్పగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశగారు.....ఇది మరీ పెద్ద ఆశండి......కలిసున్నామని కాలంతీరక ముందే కలిసి కాటికి సాగాలి అంటే ఎలా :-) ఎవరి టైం వారిది కదా :-)

   Delete
 11. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనకు తెలియకుండానే వాళ్ళంటే ఇష్టంతోపాటు స్వార్దం పెరుగుతుంది కొందర్ని ఆస్వార్దమే దూరం చేస్తుంది..అదంతా ప్రేమ అని అర్దం చేసుకోవాల్సిన మనస్సు అపార్ద చేసుకొని అనరాని మాటలు అంటే చావు దగ్గర పడితే ఎంత బాగుంటు అని చిత్రగుప్తుని బుక్ లో తన పేరు లేకున్నా ఎదోలా తన పేరు చేర్చుకొని నరకానికి పయనం అవ్వాలని పిస్తుంది

  ReplyDelete
  Replies
  1. అనుకున్నామని పయనమవ్వలేం కదండి....అందుకే నేనక్కడుండి, నువ్విక్కడుండి అనే అనుభూతితో గడిపేయడమే :-)

   Delete
 12. నరకం నుండి కూడా ప్రియునికి స్వర్గానికి దారి చూపుతున్నారన్నమాట....బాగుందండి :-)

  ReplyDelete
  Replies
  1. ఎక్కడున్నా మంచి చేయాలన్న ఫాలసీతో బ్రతికేస్తున్నా :-)

   Delete
 13. Pic chala chala bagundi:-)) mee kavitha inka chala bagundi:-)) Super Padma:-)) Spl ga idi చేసిన క్రియానుగుణంగా వేయిస్తాను నీకు స్వర్గబాట chala nachindi:-))

  ReplyDelete
  Replies
  1. Thank you...ఏదో కర్మ ఫలం చూపే ప్రయత్నం శృతి :-)

   Delete
 14. నరకంలో కూడా ఫ్యాన్స్ అంటే....ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మాల్సిందే -)

  ReplyDelete
  Replies
  1. అనికేత్....నేను కచ్చితంగా నరకానికే వెళతానని డిసైడ్ అయిపోయావన్నమాట :-)

   Delete
 15. Hmmm....mi kavithala sumagandhalu narakanni kuda thaaki miku fans ni penchayaaa...gud gud

  ---Roopa

  ReplyDelete
  Replies
  1. అభిమానానికి హద్దులు ఎల్లలు ఏంటి చెప్పండి. :-)

   Delete
 16. గడుసరివి అని మరోసారి నిరూపించుకున్నవ్ పద్మ.:-)

  ReplyDelete
  Replies
  1. మీ అందరి ప్రోధ్బలమేనేమో :-)

   Delete
 17. పద్మా, సర్దాగా అనిపించినా... కవితలో చాలా గాడత ఉంది.
  హ్రుదయ మ్రుదుత్వం ఉంది.

  ReplyDelete
  Replies
  1. మీ సున్నిత హృదయం పసిగట్టగలిగింది మీరాజ్ గారు. థ్యాంక్యూ

   Delete
 18. పద్మార్పితా నీవు ఎక్కడుంటే అక్కడే స్వర్గం, నో డౌట్. నీ మాటలు అందులోని లాలిత్యం నెమలిపించంతో తాకుతున్నట్లుగా సుతారంగా చేసే హెచ్చరికలు సూపర్బ్- హరినాధ్

  ReplyDelete
  Replies
  1. హరినాధ్ గారు....ఇలా డౌట్ లేని స్టేట్ మెంట్స్ తో తబ్బిబైపోతూ తెలియకుండానే నరకాని లిఫ్ట్ లో వెళ్ళిపోతానేమో! ;-)

   Delete