తుంటరి తలపు....

నీ తలపే భలే తుంటరి
నన్ను చేస్తుందది ఒంటరి
గిలిగింతలతో అదిచేసే అల్లరి
చలికాలం వద్దన్నా వినని పోకిరి

వేసవిలో వసంత సమీరాల ఝరి
వానాకాలం తడిపేసి చేస్తావు కిరికిరి
కాలమేదైనా నన్ను వీడవెందుకో మరి!!

ఎందుకిలాగని అడిగితే....మురిపంగా కసిరి

మరింతగా చేరువైపోతావు వద్దంటున్నా కొసరి
తలపులతో తనివితీరదుగా అంటాను విసిగివేసారి
నీ మత్తుమాటల్లో అన్నీ మరిచేను ఇదేం వింతవైఖరి
అందుకేనా తరచి తర్కించి తలుస్తాను నిన్ను మరీమరి
ఏదేమైనా బాగుంటుంది ఇరుమనసులు ఒకటై నడిచేదారి!

54 comments:

  1. తలపు తుంటరిది
    అల్లరి మాత్రం అర్పితగారిది

    ReplyDelete
    Replies
    1. అమాయకురాలిని చేసి అల్లరిదంటే ఎలా:-)

      Delete
  2. నేను.. మీ అల్లరి చూసే ముందు... అంతకుమునుపు మీరు రాసినవి మరోసారి చూశాను. ఒకటేమో... ఎందుకు, మరొకటి కాలం కరిగి. నిజమైన ఆనందం, ప్రేమ పొందలేనపుడు.. అవి పొందినట్టు నటించడం ఎందుకూ.. అంటు ప్రశ్నించారు. ఇది పూర్తిగా సగటు అమ్మాయి అంతరంగం. కాలం కరిగిపోయింది... గాయం మాత్రం మానలేదు.. అని కాాలం తీర్చలేని సమస్యతో పలకరించారు. అది... బాధాతప్త హృదయ విలాపం. ఇక ఇది... తుంటరి తలపు.
    మావిచిగురు లాంటి తొలకరి ప్రేమ జల్లుకి పులకరించిన మనసు లోతుల్లోంచి నులి వెచ్చని ఆలోచనలు. మొత్తంగా ఈ సుత్తి అంతా ఎందుకంటే... చాలా మంది రాస్తుంటారు. కానీ.. ఒకే లైన్ కి, థ్రెడ్ కి అంకితమవుతుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ థ్రెడ్ దాటి రాలేరు. అలా వచ్చి అన్ని భావాలను కూర్చగలిగేవారు సమర్ధులు. గిలిగింతలు పెట్టించే తుంటరి అల్లరిపిల్లే మీరు... ఒప్పుకోక తప్పడం లేదు.

    ReplyDelete
    Replies
    1. sateesh garu correct ga chepparandi:-)

      Delete
    2. ధన్యవాదాలు శృతి

      Delete
    3. సతీష్ గారు ఇలా పొగిడేస్తె అల్లరిమానేస్తానన్న భ్రంలోకి వెళ్ళకండి :-)

      Delete
    4. శృతి పార్టీ మారిపోతే ఎలా ;-)

      Delete
    5. మీ అల్లరి ఎప్పటికీ కొనసాగాలి. మీ కవితలు, ద్విపదతలతో మా మనసుతో అల్లరి చేయించాలి.
      కీప్ ఇట్ దిస్ నాటీ... ఫర్ ఎవర్.

      Delete
  3. పద్మ గారు పిక్ ఎంత బాగుందో అందంగా చిలిపిగా, మీ కవిత అంతకంటే చిలిపిగా అద్బుతంగా ఉంది:-)

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య....నాతోపాటే నువ్వు అల్లరి చేసెయ్....ఇద్దరం ఒక్టేకదా :-)

      Delete
  4. khoob likh rahee hoe......rukh na math*Nalottam*

    ReplyDelete
    Replies
    1. Nalottamji aap telugu mei అ ఆ ఆహా....likhthe jaayiye :-)

      Delete
  5. క్రౌంచ ద్వందమా.. :-)

    ReplyDelete
    Replies
    1. అర్థం ఏమి ఆచార్యా :-)

      Delete
  6. ఒంటరిగా ఉంటే తుంటరి తలపులే , చిత్రం నిలువునా మీ కవిత అలవోకగా జాలువారుతోంది పద్మగారు .

    ReplyDelete
    Replies
    1. ఏదో అప్పుడప్పుడు అల్లరిచేస్తే కసురుకోకండి ;-)

      Delete
  7. మరీ తుంటరి మనసు అల్లరి యిలా చెప్పేస్తే ఎలా. మీ కలం కుంచె అద్భుతం పద్మార్పిత గారు .

    ReplyDelete
    Replies
    1. మనసులోనే దాచుకుంటే బరువైపోతుందని :-)

      Delete
  8. పద్మ కలానికి పదునెక్కువని తెలుసుకానీ మరీ ఇంత అల్లరిది అనిమాత్రం ఈ కవిత చదువుతుంటే నిర్ధారణ అయ్యింది :-) చిత్రంలో కవితలోని భావాలన్నీ కనిపిస్తున్నాయి

    ReplyDelete
    Replies
    1. మహీ....పదును అని పొగిడావా లేక అల్లరిదని కోప్పడ్డావా :-)

      Delete
  9. నీలో దాగుంది అక్షరాల సిరి
    నీకు అదే అదృష్ట అనంతగిరి

    ReplyDelete
    Replies
    1. చెప్పేయకండి అందరికీ ఈ రహస్యభేరి

      Delete
  10. పద్మా ఇలా తుంటరి అని అతడి తలపులనే అన్నావా లేక నిన్ను నీవు అనుకున్నావా?

    ReplyDelete
    Replies
    1. నన్ను నేననుకున్నా.....తననన్నా ఒకటేకదండి :-)

      Delete
  11. ఏ కాలమైనా వదలని ఆ తుంటరే ఈ అందమైన భావవల్లరికి సరి.
    మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది మీ కవితా ఝురి,
    మరి మా కవితలెందుకో .. మాలో రేపుతాయి అలజడి.
    పద్మా... చక్కని కవిత.

    ReplyDelete
    Replies
    1. నాదేముంది అంతా నాభావాలఝరి...మీవేమో నలుగురికి మంచిని చూపే దారి

      Delete
  12. ఏదేమైనా బాగుంటుంది ఇరుమనసులు ఒకటై నడిచేదారి!
    ఇదే నిజం మిగిలినదంతా ఊహ. :)

    ReplyDelete
    Replies
    1. ఊహలో మిమ్మల్ని నవ్వించానుగా....:-)

      Delete
  13. బాగుంది పద్మా గారు.. మీ ఆరోహణాక్రమకవిత

    ReplyDelete
    Replies
    1. నెక్ట్స్ అవరోహణే :-)

      Delete
  14. మంచి రిథమ్ మంచి భావం అంతకు మించి చిలిపి అల్లరి కలబోసి కావ్యం చక్కగా అలరారుతుంది చక్కిలిగింతలు పెడుతూ, తుంటరి భావాల నడుమ కలిగే మనసులో కదలికలకు అక్షరరూపం... ఇది నిజంగా అపురూపమైన కళాఖండం.

    కైత మాలచ్మి పాదాన కావ్య పద్మమిదే
    స్యాన బాగున్నాది ఒయమ్మి ఈ కైత

    ReplyDelete
    Replies
    1. :-) నవ్వి తప్పించుకుంటే మంచిదేమో :-)

      Delete
  15. చలికాలం గిలిగింతల కవితా? బాగుంది

    ReplyDelete
    Replies
    1. అన్ని కాలాల్లోను గిలిగింతలు పెట్టలని :-)

      Delete
  16. chadivi anandinchadame tappa yem chestam :)

    ReplyDelete
    Replies
    1. నవ్వేయండి అదే పదివేలు ;-)

      Delete
  17. చిలిపి కవిత చిన్నిపదాలతో అలరిస్తే చిత్రం కొంటేగా రమ్మని సైగచేస్తుంది :-)

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు.....రమ్మని సైగచేసి నవ్వితే చలించిపోతారా ఏంటీ :-)

      Delete
  18. అల్లరి అర్పిత...తుంటరి తలపు బాగు బాగు :)

    ReplyDelete
    Replies
    1. అనికేత్ అందరూ అల్లరిదాన్ని అంటున్నారు....నువ్వు కూడా :-)

      Delete
  19. చాలాబాగుంది

    ReplyDelete
  20. కవితల్లొ ఈ రకంగా అంత్యప్రాస కోసంపాకులాటడం దేనికి? ఎంచక్కా సినిమా పాటలే రాసుకోవచ్చుగా? ;)

    ReplyDelete
    Replies
    1. బోలెడంతమంది ఎంచ్క్కగా రాసేస్తున్నారు నేను రాసేవెంత.....ఈ ప్రాకులాటైనా ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా ఇలా రాసేసుకోనిద్దురూ :-)

      Delete

  21. మీ ' తుంటరి తలపు'... ఓ వినూతన రీతిలో ఉంది, ప్రాసతో ప్రాణం పోసుకున్న మీ ఈ కవిత బావుంది. అందరిని ఆకట్టుకుంటుంది కూడాను . ముఖ్యంగా
    "వేసవిలో వసంత సమీరాల ఝరి" .
    ఓ మాంచి ఝలక్ ని ఇచ్చింది -
    ....... శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాదగారికి.....నా బ్లాగ్ ముఖాభివందనం _/\_ వింటర్ లో చలిమంట ఆవిరి కవితలు అందించే ప్రయత్నం చేస్తాను :-)

      Delete
  22. అరవిరిసిన అందమైన అల్లరి

    ReplyDelete
    Replies
    1. అనుమానంగా అన్నట్లున్నారు :-)

      Delete
  23. నీ తలపే భలే తుంటరి
    వలపు తలపులంటేమరి
    నన్ను చేస్తుందది ఒంటరి
    నేనుండాగా నేనొంటరె అంతె ఎలగు
    గిలిగింతలతో అదిచేసే అల్లరి
    అల్ల్రి అహ్లాదంగా ఉణ్ది మనసు కవిత కదాఇది
    చలికాలం వద్దన్నా వినని పోకిరి
    కవ్వించే మనసుండగా కాలందెముందండి
    వేసవిలో వసంత సమీరాల ఝరి
    వెసవి లో కూడా చలి పుట్టించగలవు
    వానాకాలం తడిపేసి చేస్తావు కిరికిరి
    కర కరమంటున్న కదల్లేకున్నా
    కాలమేదైనా నన్ను వీడవెందుకో మరి!!
    ఎలా వీడను కాదనలేని నిజం కదా మరి ( Emanukokandi Padma garu ...meee padalaku edo rayalani oo Chinnna Prayatnam tappite kashminchagalaru )

    ReplyDelete
    Replies
    1. బాగుందిగా మీ ప్రయత్నం....నాకు నచ్చేసింది :-)

      Delete
    2. నా ప్రయత్నంచూసి నొచ్చుకుంటారేమో అని భయపడ్డాను మెచ్చుకున్నందుకు చాలా సంతోసం పద్మాగారు

      Delete
  24. ఈ కవితల విందును ఆరగించాను మరి. !

    ReplyDelete
    Replies
    1. సదా కవితావిందులు పసందుగా అందించే ప్రయత్నం చేస్తానండి :-)

      Delete