సరికాని సబ్జెక్ట్

కంపాటిబిలిటీ కుదరలేదు కలిసి ఉండడానికని
కల్లబొల్లి కబుర్లతో కస్సుబుస్సుల్ని కవర్ చేసి
ఫిజిక్స్ పరికరాలతో ఫిగర్ చూసి పడిపోబోయి
మన కెమిస్ట్రీ కలవలేదని కాదుపొమ్మంటావు..

డిసెక్షనేదో చేసి నీకై కొట్టుకునే గుండెనే చూసి
వశమౌతావన్న వర్రీతో జువాలజీ జోలికెళ్ళకనే
సోషల్ నెస్ అని సొసైటీలో స్మైల్ ఫోజులిచ్చేసి
నిన్ను కోరిన నన్ను కాలమానంతో కొలుస్తావు..

జతకాలేని ఇరు జీవితాలని జాగ్రఫీతో జతచేసి
లెక్కలేయబోతే అన్నీ ఆంక్షలల్లిన ఆల్జీబ్రాలాయె
హైరానాపడి హిస్టరీ చూస్తే తెలీని మిస్టరీలున్నా
రాలిన ప్రేమకు రాజకీయ రంగులద్దుతానంటావు..

ఆఖరి ప్రయత్నంగా అనాటమీనే నమ్ముకుని
రియాక్ట్ కాలేనన్న భావాలని రియల్ గ్రాఫ్ గీసి
జెనిటిక్స్ చెప్పలేనన్న జ్యోతిష్యమేదో చెప్పబోతే
మొదటికొచ్చి మరల ఓనమాలు దిద్దుతుంటావు..

50 comments:

  1. అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ లిఖించిన కవిత భేషుగ్గా మీ పరిమళోభరితమై అలరించింది. పెయింటింగ్ కనులకువిందుగా చూడముచ్చటగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. కనులారా వీక్షించి తనివితీరా ఆస్వాధించేయండి.

      Delete
  2. అంత ముగ్ధ మనోహర రూపాన్ని నేనైతే సైన్స్ తో ముడిపెట్టలేను :-) again u done a awesome work with a new subject... Congrats Padma Arpita garu..

    ReplyDelete
    Replies
    1. సైన్స్ తో ముడిపెట్టలేను అని మెడలో ముడులేస్తే.....ఉరితాడై ఉచ్చులు బిగుసుకుంటాయి :-) జాగ్రత్తండి కవివర్మగారు.

      Delete
  3. అన్ని సబ్జెక్టుల్లో మీకు వందకు వంద.
    శాస్త్రాలని సంధర్భోచితంగా ముడిపెట్టి, సులువైన పదాలతో సాంతం సంభ్రమాశ్చర్యానికి గురిచేశారు.
    దటీజ్ ది పవర్ ఆఫ్ పద్మార్పిత.
    ఇలానే మమ్ములనూ అలరిస్తూ ముందుకు సాగాలని కాంక్షిస్తున్నాము మేడం. థ్యాంక్యు .

    ReplyDelete
    Replies
    1. వందకు వంద మార్కులు వచ్చిన వాళ్ళు న్యాయంగా నాలుగు నాళ్ళు సంపాధిస్తే....అన్ని సబ్జెక్ట్స్ లో సున్నా చుట్టిన వాళ్ళు రాజ్యాలేలుతున్నారు కదండి. :-)

      Delete
  4. పద్మార్పితా !

    అన్ని సబ్జక్ట్స్ ని అవలీలగా భోదించే
    పరిజ్ఞానమున్న అధ్యాపకరాలివి అని
    'సరికాని సబ్జెక్ట్' తో చెప్పేశావ్.
    భగవద్గీత సారాంశంలా జీవిత పాఠంలో ...
    మిగుల్చు కోవలసిన దేమిటీ.....
    పోగొట్టుకున్న దేమిటీ ....
    అని క్షున్నంగా అర్ధమయేలా చెప్పావ్.
    you are always a special పద్మార్పితా .

    బావుంది అన్ని సబ్జక్ట్స్ ని మిళితం చేసిన నీ కవిత .
    అభినందనలతో,
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాదగారు.....మరీ గీతాసారంతో పోల్చేంత గొప్పది కాదండి....ఎదో సరదాగా అలా ప్రయత్నిస్తాను అంతే. మీ అభిమానాక్షరాలకు అభివందనాలు.

      Delete
  5. సబ్జెక్ట్స్ అన్నీ క్షుణ్ణంగా చదివేసి మీరు ఇలా అదరగొడుతుంటే
    సబ్జెక్ట్స్ ఎన్నో కూడా తెలియని మేము బెదిరిపోతున్నామండి!:-)
    హమ్మయ్య అనుకున్నది చెప్పేసాను....చిత్రం గురించి చెప్పాలంటే......సతీష్ గారు చూసుకుంటారు. నాకు ఆ చిత్రంలో చిన్నిది "ముగ్థమనోహరి" మీరు మీ కవిత కూడానండి......కంటిన్యూ ఇట్.

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్షా...అల్లరిలో పోటీకి వస్తే ఓకే చూసుకుందాం ఎవరి సత్తా ఎంతనో. అంతేకానీ ఆ వాలుచూపుతో నువ్వు నన్ను గాలానికి వేసుకుని పైగా నేను బెదరుగొట్టాను అంటే మాత్రం....సతీష్ గారే కాదు ఎవ్వరు చెప్పినా విననుగాక వినను....మౌనపోరాటంలో నాదే తుది విజయం :-)

      Delete
  6. Wonderful padma.....once again you proved that you are a rocking star in poetic world. Keep rocking my dear.

    ReplyDelete
  7. "చదువురానివాడు కాకరకాయంటే చదువుకున్నోడు గుణింతాలొచ్చని కీకరకాయన్నాడంట"
    సరళంగా చెప్తేనే అర్ధంకాని సబ్జెక్ట్ ప్రేమ, మీరు సబ్జెక్ట్స్ లో క్రోడీకరిస్తే మేమేమైపోవాలి మేడమ్:-)

    ReplyDelete
    Replies
    1. "చదువుకున్నోడికన్నా చాకలోడు మేలంట" సబ్జెక్ట్స్ దేముందండి నేర్చుకోవాలనుకునే వారికి జీవితం రోజుకో సబ్జెక్ట్ నేర్పుతుంది.

      Delete
    2. ఓహో ఆహా....మీరు నా పార్టీయేనా :-)

      Delete
  8. ఇప్పుడు సరిచేసుకుని మాత్రం ఏం లాభం సబ్జెక్ట్స్ ని......చిత్రం సూపర్. అక్షరాలు అందంగా అమర్చావు.

    ReplyDelete
    Replies
    1. సరిచేసుకున్ని సాధించేదేముంది కానీ.....సాగిపోతుంటే అదే సర్దుకుంటుంది కదా :-)

      Delete
  9. అన్ని సబ్జెక్ట్స ఎవరూ పర్ఫెక్ట్ కాలేరు. కొత్త తరహాలో కవిత బాగుంది పద్మా. కంగ్రాట్స్

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరు చెప్పింది....థ్యాంక్యూ

      Delete
  10. మీరు మీ ఆలోచనలు సూపర్

    ReplyDelete
  11. అన్ని సబ్జెక్త్స్ లోనూ...ప్రేమే కనిపిస్తుంది.
    ప్రకృతిని పట్టుకొని కలాన నింపి కవిత రాయటం మీతే తెలుసు.
    పద్మా...చాలా బాగుందమ్మా.

    ReplyDelete
    Replies
    1. అప్యాయంగా అభిమాన స్పూర్తిదాయక స్పందనలివ్వడం మీకు వెన్నతో పెట్టిన విద్య. ధన్యవాదాలండి ఫాతీమాగారు.

      Delete
  12. ఓహొ, సూపర్.. మీ రీమిక్స్ మీ ప్రీమిక్స్ పదాల అళ్లిక సబ్జెక్ట్లతో ముడిపెట్టడం బహుబాగు.. ఇంక పిక్ అదిరింది..:-)

    ReplyDelete
    Replies
    1. థ్యాంకులే థాంకులు శృతి....నీవు వస్తావని నా కవిత చదివి స్పంధిస్తావని చెలినైనా చెకోరినై ఎదురు చూస్తాను.

      Delete
  13. అర్ధం కాని మనసులను ఫిజిక్స్ తో ముడి పెట్టి
    చెలి ఉన్దేదేక్కడో తెలియడానికి జియోగ్రఫీ వెతికి
    తన పుట్టుపూర్వోత్తరాల కోసం హిస్టరీ అంత వెతికి వేసారి
    నా గుండె లయ లో దాగుందేమో నని బయాలజీ అంత అవలీలగా తడిమి
    నవ్వుల ముఖానికి హుమరలజి తిరిగేసా

    తీర తను ఎక్కడ కనపడకపోయే సరికి హైప్నోటిసం.. అయోమయం లో పడి గందరగోళం సృష్టించే "అలీ" గారి కాట్రాలజి కూడా హహహహ

    ఈ సారి కొంచం హాస్య రసం పులిమానండి పద్మ గారు

    అన్ని సబ్జక్ట్స్ బాగానే కవర్ చేసారు.. వాటిని చక్కని బొమ్మకు ఆపాదించారు.

    ReplyDelete
    Replies
    1. http://kaavyaanjali.blogspot.in/2007/11/manam.html

      Delete
    2. వాటే సప్రైస్....మిమ్మల్ని నవ్వించాను అంటే మహానంద సంబరం.
      మీతో అన్ని పుస్తకాలూ తిరగేయించానని మరో సంబరం కూడానండి.
      మిమ్మల్ని ఎప్పుడూ నవ్వించాలనే నా ప్రయత్నం....సదా నవ్వుతూ ఆనందంగా ఉండండి....థ్యాంక్యూ.

      Delete
    3. http://kaavyaanjali.blogspot.in/2007/11/manam.html....మీరు రాసింది చదువుకుని ఒక్కసారిగా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయండి. ధన్యవాదాలండి మధుర స్మృతుల్లోకి తీసుకువెళ్ళినందుకు.

      Delete
  14. మనసుపెట్టి చూస్తే సబ్జెక్ట్స్ అన్నీ మనలోనే దాగిఉన్నాయంటూ, ఒకవంక కాదంటూన్న చెలికాడిలో పరివర్తనం తెప్పించ తనచుట్టూ తిప్పుకునే నాయిక బహుగడుసరిదే:-)

    ReplyDelete
    Replies
    1. నా అక్షర నాయికలంతా చాలా అమాయకురాళ్ళండి హరినాధ్ గారు. వాళ్ళ అందమైన మోము చిత్రాల్లో పరికించి చూస్తే మీకే తెలుస్తుందది. :-) అయినా అలా అభాండం వేయడం అన్యాయం.

      Delete
  15. హ హ హ ....స్కూల్లో చెప్పే సబ్జెక్ట్లతో కవిత్వమా... పదాల అల్లికతో చేసిన మీ ప్రయోగం బాగా కుదిరింది.. ఇన్ని సబ్జెక్ట్లూ తెలిసిన ఆ చెలికాడికి ప్రేమ తత్వం తెలియకపోవడం ఏమిటి??

    ReplyDelete
    Replies
    1. నవజీవన్ గారు....సబ్జెక్ట్స్ అంటే చదివేయగలరు కానీ "స్త్రీ" ని చదవడం అంత సులభమా చెప్పండి. మీకు తెలిసిన విషయమే కదా :-)

      Delete
  16. మీరు చెప్పిన సబ్జెక్ట్స్ ఒక్కటి కూడా పాస్ అయితే ఒట్టు. అప్పట్లో మాకు మీరు చెప్పినంతగా హత్తుకునేలా చెప్పి ఉంటే నేను అన్నిట్లో ఫస్టే ఫస్ట్ :-)

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు మాత్రం ఏం తక్కువని అన్నింటిలో ఫస్టేగా మీరు

      Delete
  17. అందుకే అన్నారు పెద్దలు... ప్రేమోనమాలు దిద్దించి కుమ్మేయమని... :-) Why dont you try for Hindi. fidaa hotaa hai kyaa ?!!... :-)

    ReplyDelete
    Replies
    1. కుమ్మడానికి ఓనమాలతో పనేంటి వినోద్. ప్రేమతో కుమ్మితే మనసుకి గాయమౌతుంది. మెదడుతో కుమ్మితే ఎదుటివారిని చిత్తుచేయడం సులభం కదా. ట్రై చెయ్య్ :-) I don't even know telugu properly. Mai hindi mein kyaa likhoon kaise likhoo?!! Likhne ki bhi quaabhil nahee hoon :-)

      Delete
  18. మరో మంచి కవితని ఆలస్యంగా చూసాను. చిత్రం అత్యద్భుతం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.. అందరూ కుశలమేకదా.

      Delete
  19. కెమిస్ట్రీ బాగా కుదిరింది... మీ కవిత నాయిక కళ్లతో, కంపాటిబిలిటీ కుదరని ఆ ఔట్‌డేటెడ్‌ మనసులో పనేముంది చెప్పండి. ఫిజిక్స్‌ పరికరాల్లో వెర్నియర్‌ కాలిపర్స్‌ కొలతల్లో సరిగ్గా ఇమిడిపోయే నడుము చూసి కూడా వంకలు పెడితే.. ఛఛ.. అదేం పద్ధతండి. ఇష్టసఖుడి కోసం గుండె అంతలా కొట్టుకుని, జువాలజీ పాఠాలు నేర్చుకుంటానంటే... ఆ అవకాశం నాకొస్తే.. ఛ.. బ్యాడ్‌ లక్‌. ఎప్పుడూ సోషనల్‌నెస్‌ అంటే.. మనిషికి.. గొడ్డుకి తేడా ఏముంటది... కుసింత కలాపోసన కూుడా ఉండాల. ఇంత జరిగినా ఇదంతా హిస్టరీ అని తెలిసినా.. గిలిగింతలు పెట్టే కెమిస్ట్రీ ప్రెజెంటెన్స్‌ అంటోందండి. రాలిన ప్రేమను రాలనివ్వండి... నాకు మాత్రం మీ రియల్‌ గ్రాఫ్‌లో అనాటమీ చూశాక..
    నా మనసు.. ఆమె మనసులో జాగ్రఫీ కోసం వెతుకుతోంది. ఆ లేతమనసులో అంతా ఆల్‌జీబ్రా చిక్కులే అనుకోండి..
    అయినా... జనెటిక్స్‌ కూడా అందని అందాన్ని చూసి తరించడమే తప్ప... ఏమీ రాయలేని, ఆమె హిస్టరీ మిస్టరీని ఏమాత్రం ఛేదించలేని అభాగ్యుడిని.. వండర్‌ ఫుల్‌ గా రాశారండి.

    ReplyDelete
    Replies
    1. సూపర్ గా చెప్పారు మీరు కూడా పద్మార్పితకి పోటీగా, అంతలోనే చివరిలో నిరాశావాదమెందుకు సతీష్ కొత్తూరిగారు.

      Delete
    2. సతీష్ గారు ఆలస్యంగా వచ్చారు కదా ఏవో నాలుగక్షరాలు రాసి వెళ్ళిపోతారనుకుంటే....అన్ని అంశాలని కవర్ చేసి ఒక పాఠ్యపుస్తకాన్నే అచ్చువేసి ఆశ్చర్యపరిచారు. అందుకే మీ కమెంట్స్ కి అంత క్రేజీ. చిక్కులేవైనా సునాయశంగా విప్పే ధిట్ట మీరు, మీరే అభాగ్యుడ్ని అంటే ఎలా? chase chase...until you succeed :-)

      Delete
  20. ఆకాంక్ష...అలా రెచ్చగొట్టడమెందుకు ....నాకు సపోర్ట్ చెయొచ్చుగా :-)

    ReplyDelete
  21. samajganiki kashtam

    ReplyDelete
  22. సబ్జెక్ట్టులు ఎన్ని అయినా .... అరమరికలు లేని లక్షణాల తాలింపేదో అవసరం లా
    భావ వ్యక్తీకరణకు ఏ సబ్జెక్టు నూ వదలని నేర్పరితనాన్ని స్వాగతిస్తూ
    అభినందనలు పద్మార్పిత గారు

    ReplyDelete
    Replies
    1. మిమ్మల్ని మెప్పించిన నా మది ఆనంద భరితం

      Delete
  23. మీది ఎలిమెంట్రీ స్కూల్ చదువే అనుకున్నా....మాస్టర్ మైండ్ :-)

    ReplyDelete