మారిపో.....

పోరా పో!.....పోయి నాకు గుర్తుకు రాకుపో
పొమ్మంటే రమ్మని వ్యతిరేక అర్థమే వెతుక్కో
నే వద్దన్నా విసిగిపొమ్మన్నా నా చెంగట్టుకో
కసిరితిట్టినా నీపై నాకున్న అధికారమనుకో!

రా రమ్మని!.....మనసు కలవరించె వచ్చిపో
నీ తలపు జ్వరంలో ఒళ్ళు ఒణికె వాటేసుకో
వలపు మందేసి నా మదిలో మంచమేసుకో
బిడియమేది కాదన్నా బింకమొదిలి పట్టుకో!

లేపుకు పో!.....గారం చేస్తే నీవెంట లేపుకుపో
అలిగితే అలుసనుకోక అపూర్వంగా చూసుకో
మారాంచేస్తే మర్మమెరుగని మహారాణిననుకో
పరువమున్న పసిపిల్లతత్వమని సరిపుచ్చుకో!

పోరా పో......నా ఊపిరాగితే ఉండలేవు వెళ్ళిపో
తనువు వీడి తలపుల్లో ఉన్నాను తడిమేసుకో
ఊపిరున్నప్పుడు చెప్పిన ఊసులు నెమరేసుకో
జ్ఞాపకాల బూజులనే దులిపేసి కొత్తరంగులద్దుకో!

56 comments:

  1. పద్మార్పితగారు అద్భుతమైన ప్రణయకావ్యం మీ కలం నుండి.

    ReplyDelete
    Replies
    1. ప్రణయమే కనిపించిందా యోహంత్ :-)

      Delete
  2. ఓ పదేళ్ల క్రితం చదివిన ఎంకి పాటలు గుర్తొచ్చాయి పద్మగారు. ప్రేమ ఊపిరి ఎప్పటికీ ఆగిపోదుగా. చాలా హృద్యమైన కవిత రాశారు. ఇది రాయడానికి మీరు పడిన కష్టం తెలుస్తోంది. మొదటి ప్రేజెస్‌ చదువుతుంటే... వారిద్దరి మధ్య ఉన్న ప్రయణ సుగంధాలు, సరస గమకాలు, అనురాగాల పొదరిల్లు, ఆప్యాయతల మధురిమలు.. అన్నిటి కలబోతగా కనిపించింది. మూడో ప్రేజ్‌లో అతనితో ఆమె జీవితాంతం ఉండాలన్న తపన... మనసుని బరువెక్కించింది. కానీ.. చివరిలో అలా చేశారేంటి పద్మగారు. అంత ప్రేమ పంచి.. ఊపిరాగిపోతుంది అంటారు.
    నిజంగా అక్కడ ఆగిపోతే.. ఒక్క ఊపిరికాదు... రెండు ఊపిరిలు ఆగిపోతాయి. స్వచ్ఛమైన ప్రేమ అవిభక్త కవలల లాంటి మనసుల మధ్యే పుడుతుంది. వాటికి హృదయం ఒకటే ఉంటుంది. మీ చిత్రంలో కూడా అంతే ఉంది చూడండి. తనువులు రెండు.. తపనలు ఒకటి. హృదయమూ ఒకటే. ఎంకి ఊపిరాగిపోతే... గుండె గొంతుకలో... కొట్టుకుంటాది... ఊసుల బాసల్లో... కన్నీటి ఊటలు, జ్ఞాపకల ఊడల్లో చిక్కుకున్నాక కొత్త రంగులద్దుకోడం..
    అంత సులువనుకోను. మంచి కవితకు.. అంతకన్న బాగా స్పందించాలన్న స్వార్ధంతో.. కాస్త ఇన్నర్‌గా వెళ్లాను. మీ కవితకు నేను రాసింది... సరిగ్గా ఆప్ట్‌ కాకపోతే.. ఏమనుకోకండి.

    ReplyDelete
    Replies
    1. ఏం చెప్పారు సతీష్గారు. మీ విశ్లేషణకు గులామునౌతున్నా....

      Delete
    2. మొదటి పేరాలో కవిత గురించి బ్రహ్మాండంగా వర్ణించి, రెండవ పేరాలో పద్మార్పితగారి ప్రలోభ ప్రభావానికి లోనైనట్లుగా తోస్తుంది. అమ్మో మీ సావాస దోషం మీపైనే ఆకాంక్ష అన్వేషణ....మొత్తానికి మీరు గ్రేట్ సారూ :-)

      Delete
    3. అయ్యబాబోయ్....మీరు ఇలా విజృంభించి విశ్లేషిస్తే, అది కూడా ఇన్నర్ గా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఇంటర్నల్ ఫీలింగ్స్ ఇవ్వని కరెక్ట్ గా చెప్పేస్తే.....కొంప కొల్లేరై పోతుందండోయ్ :-)

      Delete
    4. నయని & ఆకాంక్ష...అటొకరు ఇటొకరూ సపోర్టింగ్ అన్నమాట. :-)

      Delete
    5. ఇంత పెద్ద విశ్లేషణలు రాసి చిరాకు పెడుతున్నాడని అనుకోకుండా... వాటిని అభిమానిస్తున్నందుకు.. ధన్యవాదాలు

      Delete
  3. అలాగే మీ ముందరి అల్లరి... సరికాని సబ్జెక్ట్‌ కి కాస్త ఆలస్యంగా స్పందించాను... సరిపోయిందో లేదో చూడండి.

    ReplyDelete
    Replies
    1. చదివానండి......అదరహో అదరహ :-)

      Delete
  4. పద్మా నీలో ఉన్న గొప్ప ఎసెట్.....ప్రేమపై నీకున్న నిర్ధిష్టమైన అభిప్రాయం, పరిపక్వత చెందిన నీ మనసు. అలుపెరుగని నీ ఆలోచనా స్రవంతిని సాగిపోనీ ఇలా....

    ReplyDelete
    Replies
    1. వాటికి తోడు మీ అందరి ప్రోత్సాహం & అభిమానం సంగతి మరిచారు

      Delete
  5. "శుభం పలుకరా పెళ్ళికొడుకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడంట" అలా ఉంది మీరు వ్రాసింది. అహా ఓహో అందంగా ప్రేమని ఒలకబోసారు అనుకుని చదివేస్తుంటే చివర్లో అలా చంపేయడం ఏంటండి. మొదటిసారి చదివినప్పుడు కోపం వచ్చింది ఆ తరువాత నాలుగో సారి చదివి అప్పుడు అనుకున్నా....ఎంతైనా యండమూరిగారి అభిమానురాలు కదా ఈ "అర్పిత" (వెన్నెల్లో ఆడపిల్ల) ఇలాగే బాగుంది అని.

    ReplyDelete
    Replies
    1. "వెన్నెల్లో ఆడపిల్ల" అన్నారుగా గాల్లో తేలిపోతున్నా.....ఇంకేం అనను. 101 సార్లు తిట్టేసుకోండి.

      Delete
  6. రా రమ్మనడం
    పో పొమ్మనడం
    అంతా మీ ఇష్టమేనా
    పైగా అర్థాలు వేరనడం

    ReplyDelete
    Replies
    1. hmmmmmmm..... తిట్టారా....భలే భలే :-)

      Delete
  7. ఎదలోతుల్లోకి జొరబడిపోయి, నేను పోతాను నువ్వు మారిపో అంటే మేము ఒప్పుకోము. అభిమాన ఆనకట్ట కట్టి ఆపేస్తాం :)

    ReplyDelete
    Replies
    1. తాడుతో కట్టి కొట్టకండేం :-)
      పంజరంలో పెట్టి బంధించకండి
      మనసులో దాచేసుకోండి

      Delete
  8. వర్షాలు ఎలాగో కురవడంలేదు అర్పిత అనురాగ అక్షరమాల అల్లితే సేద తీరుదాం అనుకుని చదివేసా మూడు పేరాలు ముచ్చటగా....చదివి ప్రేమించేసా పిచ్చగా, అంతలో నాలుగో పేరాలో పెళ్ళున చెపపై కొట్టి పో పో అంటే ఎక్కడికి పోయేది ఎవరికి చెప్పుకునేది :-) అయినా మీ కవితలకి బానిసగా మారాక తప్పదుగా మారిపో అన్నా రా రమ్మన్నా పో పొమ్మన్నా.

    ReplyDelete
    Replies
    1. అమ్మో వర్షాలు పడలేదన్న వేడిలో వాడిగా ఇలా అన్నారనే నగరంలో వర్షం పడేవరకు రిప్లైయ్ ఇవ్వకూడదనుకున్నా :-) అయినా నిందలు బాగున్నాయి :-)

      Delete
  9. నాకేం తెలియటంలా నా మనసదేం టైపో
    నీ చెంగట్టుకు తిరుగుతోంది నువ్వన్నా పోరా పో
    పొమ్మంటూనే అన్నాక ఇలా వచ్చి పో
    రా రమ్మని అన్నట్లేగా మరి రెచ్చిపో ...

    చివరికి ఎవరిని ఎవరన్నారో మర్చిపో
    కరిగిన మనసున మనసై కలిసి పో
    కలవరింతల కమ్మని వలపు కలలే తీర్చిపో
    మహరాణిలా అపురూపమై ఒడి చేరి ఓదార్చి పో ...

    జ్ఞాపకాల దొంతరులు విడదీసి పో
    ఊహల ఊసులే ఎత్తుకు ఎగరేసి పో
    ఊపిరి విడుతూనే వెంట లేపుకు పో
    ఆత్మలు రెండూ ఉఫ్ న ఊదేసి పో ...

    ReplyDelete
    Replies
    1. పో పో పో పో
      పో పో పో పో
      పో పో పో పో
      పో పో పో పో
      ఎంత కోపమున్నా ఇన్నిసార్లు పొమ్మనాలా :-)

      Delete
    2. పొమ్మంటే రమ్మని వ్యతిరేక అర్థమే వెతుక్కో ...
      ..........వేసిన ప్రశ్నకు జవాబు కూడా మీరే ఇచ్చారుగా ... :-)

      Delete
    3. అమ్మో ఎంత కరెక్ట్ గా ఫాలో అయ్యిపోతున్నారో :-)

      Delete
  10. ప్రేమించిన వాడితో ప్రేమకలాపాలే కాదు....తను లేనప్పుడు మారిపోమంటూ అతడి యోగ క్షేమాలు చూసుకోమని అప్పగింతలు చేసిన మీ కవితానాయకి మాగొప్ప దొడ్డమనసున్న మనిషి. మంచి కవితను అందించారు.

    ReplyDelete
    Replies
    1. మీకే తెలుసునండి మా నాయకి దొడ్డమనసు.

      Delete
  11. ఎన్నోన్నో వర్ణాలు, అన్నిట్లో అందాలు!
    అన్నట్టుగానే మీ ప్రతీ కవితలో అందం, సుకుమారం, కోమలత్వంతో పాటు కోపం కుడా ఉన్నాయండోయ్.. పోరా పో... అన్నప్పుడు నకైతే భలే అనిపించింది.. సూపర్... ఇక పిక్ చాలా బాగుంది:-))

    ReplyDelete
    Replies
    1. సుకుమారం, కోమలత్వంతోపాటు...కూసింత కోపం అలుకా చూపకపోతే అలుసైపోతాము కదా శృతి....అందుకే :-)

      Delete
  12. I Here Your Voice when you will give comments... I have that kind of attachment with U & Ur Blog Madame.. I am Very Lucky for Being a Part in the Blog Member... Than Q...

    ReplyDelete
    Replies
    1. Oh...so nice of you Sruti, me too love you.

      Delete
  13. ఆడవారి మాటలకు అర్థాలే వేరని తప్పించుకోవడం తెలివైన పని

    ReplyDelete
    Replies
    1. అంత తెలివుంటే మీతో తర్కించేదాన్ని కదండి :-)

      Delete
  14. మారిపో అంటే మారిపోవడానికి మనమేమన్నా మరబొమ్మలమా, మనసున్న మనుషులం కదూ పద్మ.

    ReplyDelete
    Replies
    1. మనసుంది కదా అని పారేసుకుంటే మనకి ఇచ్చేవారుండరుకదా మహీ

      Delete
  15. Replies
    1. Welcome to my blog. inkaa manchigaa raasi meppinchaniki try chestaa

      Delete
  16. నా ఊపిరాగితే ఉండలేవు వెళ్ళిపో
    తనువు వీడి తలపుల్లో ఉన్నాను తడిమేసుకో
    ఊపిరున్నప్పుడు చెప్పిన ఊసులు నెమరేసుకో
    మనసుని హత్తుకునే మాటలివి-Harinath

    ReplyDelete
    Replies
    1. మీ మనసుని తాకిన మాటలు రాసినందుకు ఆనందంగా ఉందండి.

      Delete
  17. బాగుంది పద్మగారు

    ReplyDelete
    Replies
    1. మెచ్చేసారుగా thank you

      Delete
  18. Replies
    1. పొగ పెట్టక ముందే :-(( ఇలా ఏడుపు మొహం పెడితే ఎలా

      Delete
  19. ఫన్నీగా రాసినా పరమార్థాన్ని జొప్పించి కవితకే వన్నె తెచ్చారు. చాలా బాగుంది మేడం. కీప్ రైటింగ్ !!

    ReplyDelete
    Replies
    1. అలాగే అలరించే ప్రయత్నం చేస్తుంటాను,

      Delete
  20. ​​పైపైనే తిడుతున్నట్టు కనిపిస్తు ఉన్నా.. తన కోసం తన ప్రియుడు పడే పాట్లను చక్కని రీతిలొ ఇక్కడ పొందుపరిచారు.
    అలకలు అసలు సిసలు ప్రేమను ఋజువు చేస్తాయి
    నేనేమయిన పరవాలేదు నన్ను నా వాళ్ళు అనుకున్నవారిని కష్టపెట్టటం భావ్యం కాదని ఆ ప్రేయసి కసిరింతలో అవగతమౌతుంది.

    బంధాలనేవి తెంపితే తెగి పోయేంత సున్నితం కావని. అవి మల్లె పందిరి తీగలని. వికసించి పరిమళాలు వెదజల్లే అనుహ్య బంధం అనేది ప్రస్ఫూటం ఔతుంది.

    చలువ చంద్రునికి భువికి ఏమిటి సంబంధం
    రేయి వాలగానే మిరుమిట్లు గొలిపే వెలుగులతో ముంచే తీరుతుంది.

    Bonds are all preset and they unfold themselves as the time passes by. The Poem Illustrates this nature and is yet another marvel of your thought Dear Padmarpita.

    ReplyDelete
    Replies
    1. ప్రేమించే వారికే కదా తిట్టే అధికారం ఉంటుంది. అందుకే ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకునే తాపత్రయం. అయినా మీకు నేను చెప్పాలా చెప్పండి.Thanks a lots for inspiring words my dear friend.

      Delete
  21. .మనసు కలవరించె వచ్చిపో
    నీ తలపు జ్వరంలో ఒళ్ళు ఒణికె వాటేసుకో

    అలిగితే అలుసనుకోక అపూర్వంగా చూసుకో
    మారాంచేస్తే మర్మమెరుగని మహారాణిననుకో

    నా ఊపిరాగితే ఉండలేవు వెళ్ళిపో
    ఊపిరున్నప్పుడు చెప్పిన ఊసులు నెమరేసుకో
    జ్ఞాపకాల బూజులనే దులిపేసి కొత్తరంగులద్దుకో!

    ఇలా ఇంత డేర్ గా ప్రేమగా వేరెవరూ రాయలేరు కదా.. మీకే సాధ్యం

    ReplyDelete
    Replies
    1. తిట్టానని కసిరి కొడతానని...ఇలా డేర్ అండ్ దాషింగ్ అంటున్నారు కానీ నిజంకాదన్న విషయం మీకు తెలుసని నాకు తెలుసులెండి :-)

      Delete
    2. నిజాల్నిలా చెప్పేస్తే ఎలా..:-)

      Delete
  22. మొత్తానికి మీ పొమ్మనడంలోనే రమ్మనే ప్రేమ కనిపిస్తుందండి. మా విశ్వాన్ని పో పొమ్మంటే అటే పోతాడో లేక వస్తాడో చెప్పి చూడాలి. :-)

    ReplyDelete
    Replies
    1. మాయ చెప్తే విశ్వం కాదనడుగా .....చెప్పండి చెప్పండి :-)

      Delete
  23. మీరు ఇలా రాసిన ప్రతిసారి మాలో ఎన్నెన్నో ఊహలు.

    ReplyDelete
    Replies
    1. ఊహల నుండి కాస్త వాస్తవంలోకి రండి నందుగారు :-)

      Delete
  24. రమ్మన్నా పొమ్మన్నా మీకే చెల్లు.

    ReplyDelete