ఎద అలజడి

ఎరుగని ఎదకు ఎదను తాకిస్తే తెలిసింది
మనసిచ్చి దోచుకోవడం నాకు రాలేదని!

దరిచేరిన హృదయం దూరమై తెలిపింది
తెలిసీ తెలియని చెలిమేదో బాగుండెనని!

ఎడబాటు ఎరుగని ఎద వెక్కెక్కి ఏడ్చింది
ఎదను ఇవ్వడం నేరమై మిగిలిపోయెనని!

శ్వాసాగితే చిన్నివిషయమని నవ్వేసింది
నీ తలపులో లేని తనువు జీవఛ్ఛవమని!

వేదనేమో నిన్ను నమ్మనంటూ నటిస్తుంది
నవ్వుతున్న కనులేల చెమ్మగిల్లినాయని!

చేసుకున్న బాసలని చివర్నో కోరిక కోరింది
ఊపిరి ఆగిపోతే నీ కౌగిలిలో కడతేర్చమని!

56 comments:

  1. ఎదను అలజడికి గురిచేసినా మీ కవితలోని పలుకులు పంచదార చిలుకలే. చిత్రం కవ్విస్తున్నా ముఖంలో అలజడి ప్రస్ఫుటమై కనబడుతుంది. అదేగా ఆ చిత్రంలో చూపాలనుకున్నది పద్మాజీ

    ReplyDelete
    Replies
    1. పంచదార పలుకుల తీపిదనాన్ని ఆస్వాధించిన మీకు నెనర్లండి.

      Delete
  2. అద్భుతంగా ఉంది చిత్రం కవిత్వం

    ReplyDelete
  3. హృదయాన్ని ద్రవింప చేసే కవితా మరో అద్భుత చిత్రం.. <3

    ReplyDelete
    Replies
    1. కవితని ఆస్వాధించిన హృదయానికి అభివందనం (చిత్రాన్ని చూస్తూ ఉండిపోతారు అనుకున్నానుగా )

      Delete
  4. ఏమైపోతివో అని నా ఎదలో అలజడకి కారణం అడిగేలోగా ఇలా నీ ఎద అలజడని తెలిపి ఎదను భారమెనరించ తగునా నీకు కలువబాలా:-) ఏమైనా చిత్రం కడు కనువిందుగా ఉన్నది.భళారే భళా :-)

    ReplyDelete
    Replies
    1. ఎక్కడికైనా ఎగిపోయేంత ధైర్యమా నాకు ఆకాంక్ష....నీ ఆ రెండు కళ్ళ వాడి చూపుల్లో బంధీని కదా! :-)

      Delete
  5. ప్యార్ మే టిక్కుం టిక్కుం... :-)

    ReplyDelete
    Replies
    1. ప్యార్ మే పూర్తిగా బుడుంగ్ బుడుంగ్ అని తేలక కొట్టుకుంటే పైకి తేకుండా టిక్కుం టిక్కుం అంటే ఎలా వినోద్:-)

      Delete
  6. పాత పద్మార్పితను మళ్ళీ మీ ఈ ఎద అలజడిలో చూపించారు

    ReplyDelete
    Replies
    1. ఎద అలజడికి పాత కొత్త ఏంటి యోహంత్. నేను ఎప్పటికీ ఒకేలా....

      Delete
  7. మనసు మాట వినదు . వేదనంటే మనసుకి నీకు కూడా మహా ఇష్టం కదూ :-)

    ReplyDelete
    Replies
    1. వినమన్నా వినని మనసుని వదిలి వేదనని వాటేసుకుంటే రంగిలింది ఈ వలపు చిచ్చు మహీ....:-)

      Delete

  8. చాతకాని తన్నాన్ని అంగీకరిస్తూనే ,
    చెలిమి ఎంత బాగుంటుందో అన్న విషయం దూరమైతే గాని తెలియదని ,
    ఎదకెడబాటు తప్పదని ,
    తనువుకి అనువుగ వుండేవి తలపులేనని ,
    వేదనతో కనులు చెమ్మగిల్లుతాయని ,
    బాసలు అభాసు పాలైనప్పుడు పర్యవసానం కడతేరటమేనని ,
    ఆ కడతేరటం కూడా కౌగిలోనే కడతేరాలని ,
    బహు చక్కగా చెప్పకనే చెప్పావు పద్మా !

    అందమైన భావనకు , అచ్చమైన అమ్మాయి ఆకృతి అమితంగా ఆకర్షిస్తోంది .

    ReplyDelete
    Replies
    1. మొత్తం కవితకి సరళమైన సారాంశం చెప్పారుగా శర్మగారు. ధన్యవాదాలండి.

      Delete
  9. ప్రేమకి వేదన తప్పదని సున్నితంగా చెప్పారు. చిత్రం చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. తప్పని వేదనని తలచుకుని ఏడవలేక నవ్వడమే అంటారా :-)

      Delete
  10. ప్రేమే పెద్ద రోగం ఇంక దానికి వేదన తోడు

    ReplyDelete
    Replies
    1. ఆ రోగానికి మందు వేదనేగా :-)

      Delete
  11. చింపేసారు చిత్రం అదిరింది. ఇలాంటి కవితలు రాయడంలో అందెవేసిన చేయి మీది.

    ReplyDelete
    Replies
    1. చిత్రం చింపాను అన్నారుగా మరి కవిత కత్తిరించాను అనొచ్చ్చుగా

      Delete
  12. చివరి లైనులు కనులను తడిచేస్తున్నాయి పద్దమ్మా..:-))

    ReplyDelete
    Replies
    1. అయ్యో......నీలా మీ కళ్ళు నీళ్ళు కారేలా చేసాను. ఈసారి నవ్విస్తానుగా:-)

      Delete
  13. ప్రేమించే వారిని ప్రేమించడంలో గొప్పతనం లేదు, ప్రేమించలేని వారిలో కూడా ప్రేమభావాన్ని కలిగించే ప్రజ్ఞ నీవు రాసే కవితల్లో కనీకనిపించడం ఆనందంగా చదివిస్తూ నూతనోత్సాన్ని ఇస్తుంది.

    ReplyDelete
    Replies
    1. నిజంగా అలాంటి ప్రభావం చూపిస్తున్నాయి నా రచనలు అంటే నాకు ఎంతో సంతోషంగా ఉందండి.

      Delete
  14. గుడ్డి ప్రేమకు పైత్యం తోడైనట్లుందంటే ఇదేనేమో! అన్నీ తెలిసీ ప్రేమించి మనసు మాట వినదంటూ చివరికి ప్రాణం కూడా అలాగే కడతేరాలి అనుకోవడం అంతా చిత్రం భళారే విచిత్రం.

    ReplyDelete
    Replies
    1. చిత్రాతిత్రమే ప్రేమచేష్టల విన్యాసం....వీక్షించక తప్పదుగా మీకు :-)

      Delete
  15. సుంధరమైన మైన ప్రేమ కావ్యం! అతి అధ్బుతమైన పదాలతో, అందమైన చిత్రంతో, కనువింపుగా వినసొంపుగా చుడముచ్చటగా ఉంది.. సూపర్:-)

    ReplyDelete
    Replies
    1. ప్రేమ మాధుర్యాన్ని(అలజడిని) ఇంతలా అభివర్ణించిన మీకు అభివందనం

      Delete
  16. .ఈ అలజడేదో గోల చేసి గగ్గోల పెట్టేలా ఉంది.:-)

    ReplyDelete
    Replies
    1. అలా అని అలజడులకి దూరంగా ఉంటే అసలు విషయం తెలీదుగా అనికేత్

      Delete
  17. Satish
    Sridhar
    Sripadagaru
    3 big S where are you?????????:-)
    here without you people blogging is bhoring

    ReplyDelete
    Replies
    1. నిజమే సుమా ఏ మాయాలోకంలో విహరిస్తున్నారో :-)

      Delete
    2. అవే కళ్ళు అందరిపై నిఘావేయడం అభినందనీయం ఆకాంక్ష. ముగ్గురిలో ఒకరు దొరికారు మరో ఇద్దరి మాటో !!!!?:-)

      Delete
    3. మాయావిశ్వం మరో జత కళ్ళతో మీరు కూడా వెతకండి :-)

      Delete
  18. సూపర్ మేడం... చాలా రోజులకి మీనుంచి ఇలాంటి కవిత. శ్వేతకలువ భావాల బంధిఖానా లో అభిమానులని కట్టిపడేశారు.
    కీప్ రాకింగ్ :-))

    ReplyDelete
    Replies
    1. శ్వేతకలువ భావాలా లేక....పసిమిఛాయ జవ్వని చూపులకి మనసున రేగే అలజడులా :-) నిజం చెప్పండి.

      Delete
  19. paintings select chesedi merena ekkada nundi collect chchestaru excellent madam

    ReplyDelete
    Replies
    1. Selection and choice is mine only. thank you

      Delete
  20. కలువల్లో రంగులు తెలుసు కానీ... మొట్టమొదటిసారి... పసుపుపచ్చ కలువను చూసినట్టుంది. ఆ చిన్నదాని
    వేదన అలజడిలో... ఎంత విరహమో... పైన కొమ్మ మీద కూర్చున్న ప్రేమవిహంగాలే చెప్తున్నాయి. అరవింద మోముకి అంత కష్టం తెచ్చిపెట్టినదెవరో... మనసు నొచ్చుకోనిదెవరికి. ప్రేమకే ప్రేమదేవతలా ఉన్న ఈ బంతిపూవు తాకిడి... నాలో ఎన్ని అలజడులు రేపిందో... చాలా బాగా రాశారు. పద్మగారు. ప్రేమ-విరహం... బాసలు ఊసులే అయితే కౌగిలిలో కడతేరాల్సిందేనా... మరో ప్రేమ కౌగిలికి అర్హత లేదంటారా... పద్మగారు... పచ్చని బందిఖానాలో కట్టిపడేశారు...

    ReplyDelete
    Replies
    1. సతీష్గారు......మీ కమెంట్ కోసం చూసి చూసి బదులే రాక వెళ్ళిపోయా. ఏమైపోయారు, ఎప్పుడొచ్చరు? ఈమెవరు అనుకున్నా ప్రశ్నించడానికి అనుకున్నా సరే జవాబు చెప్పాల్సిందే తప్పదు:-) మీ చిత్రవిశ్లేషణలకై వేచిచూసే విహంగిని....అమ్మో ఏంటో పద్మార్పిత బ్లాగ్ కి వస్తే కవిత్వం తన్నుకొస్తుంది. :-)
      ఇంక ఈ చిత్రం గురించి మీరు వివరించారు అనడంకన్నా వలపు కురిపించారు అంటే బాగుంటుందేమో కదా. అయినా దోషం మీదికాదు ఆ చిత్రంలోని చక్కనమ్మది:-) మాఫ్ కరో నా అగర్ గలత్ కహాతో .

      Delete
    2. ఆమెలో వేదన కన్నా ప్రేమమయమే కనిపించింది... పచ్చదనంలో ఆ ప్రేమనంతా దాచుకుని... వేదనలో నలిగిపోతున్నా... ఆ చిన్నదాని ఊసుల్లో, ఆమె ఎద అలజడిలో... మమేకమైతే.. ఆమె వేదన తాత్కాలికమే అనిపించింది ఆకాంక్ష గారు. మీరిలా నా కామెంట్‌ కోసం ఎదురుచూస్తే.. పద్మగారు కలువ పువ్విచ్చుకు కొడతారు... మనిద్దరినీ... థాంక్యూ ఫర్ వెయిటింంగ్‌... కొంచెం పని ఒత్తిడిలో కాస్త ఆలస్యం.

      Delete
    3. చంద్రుడులేని కలువపై సూర్యకిరణాలు పడితే పసిడికలువేగా (ఈసారి పసుపురంగు కలువని చూడండి చంద్రుడులేడన్న వేదనలో కొంచెం సన్నని రెక్కలతో పీలగా ఉంటుంది మామూలు వేరే రంగు కలువలతో పోల్చి చూస్తే) మొత్తానికి కవితకన్నా కాంతే మిమ్మల్ని కలవరపెట్టింది అనేది మాత్రం వాస్తవం.
      పసుపు బంతికి దాసోహమై కలువబాల కవిత్వంలో బంధీని అనడం సమంజసమా సతీష్ గారు :-)

      Delete
    4. ఆకాంక్ష నువ్వన్నది అక్షరాల నిజమే. ఎంతైనా తెలివైన దానివి సతీష్ గారి మనసుని ఇట్టే చదివేస్తావు.

      Delete
    5. సతీష్ గారు రెండుపిల్లులు కొట్టుకుంటే కోతి తగువు తీర్చినట్లుంటుందేమో!.....నేను కొడితే కలువతో కొట్టినా కొరడాతో కొట్టాను అంటారు. :-) ఎందుకొచ్చిన తగుగువుతీర్చడం చెప్పండి.(నన్ను ఇన్వాల్ చేయకండి)

      Delete
  21. విరహం వేదనాభరితమైనా తప్పదు ప్రేమ అంత మధురం. అయినా ఈ ముగ్థమనోహరిని ఎవరో ఇంత అలజడికి గురిచేసిన దురదృష్టవంతుడు:-) ;-)

    ReplyDelete
    Replies
    1. కలువ కష్టాలు కలువవి....చంద్రుడి కమిట్మెంట్స్ చంద్రునివి. దురదృష్టం అదృష్టందేముంది కదా :-)

      Delete
  22. ప్రేమ ఎంత మధురం
    ప్రియుడు అంత కఠినం
    అందుకే ఎద అలజడి మీ కవితా నాయకికి. మార్గమేం సెలవిస్తారు ప్రేమార్పితగారు. :-)

    ReplyDelete
    Replies
    1. మధురమైన అలజడికి ప్రేమించడేమే.....మరో మార్గమేం లేదుకదండి!

      Delete
  23. మీరెప్పుడూ ఒంటరి స్త్రీ చిత్రాలనే ఎక్కువగా ఎంపిక చేసుకోవడంలోని మర్మం ఏంటంటారు? కవితలో పదాలు చిత్రానికి అనుగుణంగా సున్నితంగా ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. చాలా సింపుల్....ఇందులో మాయా లేదు మర్మం లేదు. నేను వచ్చేటప్పుడు పోయేటప్పుడూ కూడా ఒంటరినే....ఇంక నా భావాలు కూడా ఎప్పటికీ ఒంటరివే. అయినా నేను రాసేవి సాధారణంగా "స్త్రీ" భావాలే అందుకే ఆమెనే చిత్రిస్తాను మీతో షేర్ చేసుకుంటాను.

      Delete
  24. Esa alajaDi anToo andari edalanu pinDestiri padmarpita gaaru:):)

    ReplyDelete
    Replies
    1. మీ అందరి స్పంధించే సున్నిత ఎదలని తాకిన నా భావలహరిది అదృష్టమే!

      Delete