అక్షర చుంబనం

ఉత్తమోత్తమ అక్షరాలతో లోకాన్ని ఉద్దరిద్దామంటే
నాలోని భావాలు పక్కున నవ్వి పరిహసించాయి...
పదిమందికి చెప్పే పాండిత్యం నీదా అని ప్రశ్నించె!?

సంఘాన్ని సంస్కరించే సరళపదాలు రాద్దామంటే
నా భావసంఘర్షణలు అక్షరరూపం దాల్చమన్నాయి
నిన్నునీవు సాంత్వనపడి సంఘాన్ని శాసించమనె!?

స్ఫూర్తితో రాయాలని ధీమాగా దూసుకెళదామంటే
నాలోని పిరికితనం పనికిరాని బ్రహ్మాస్త్రాలేలన్నాయి
చేతకానితనం ఎవరిదంటూ పదాలు పంజా చూపించె!

దిగులుతో డీలాపడిన మనసు దిక్కులు చూస్తుంటే
నా కోపాహంకారాలు  ఉండనంటూ ఎగిరిపోయాయి
విజ్ఞత మాత్రం వివేకంతో అడుగేయమని సూచించె!

విధేయతతో తెలిసింది వివరణగా విన్నవిద్దామంటే
నాలోని ప్రేమగుణాలు నను వీడనని మారాంచేసాయి
ప్రేమపంచమని ముస్తాబైనక్షరాలు నాచేయి చుంబించె!
  

51 comments:

 1. కవిత్వానికి ఉండేటటువంటి విలువల గురించి రాసిన మీ కవిత అత్యద్భుతం పద్మ గారు
  మదిలో రేగే భావాలాను సైతం అక్షరరూపం దాల్చడం అంటే చాలా ఓపిక ఉండాలి

  లోకాన్ని సంస్కరించే భావన అక్షరూపం దాల్చిన కవితకే ఉందన్న మీ కవితకు ఆ అక్షరమాలకు వేనవేల జోహార్లు

  ReplyDelete
  Replies
  1. నిజానికి సంస్కరించే భావాలు చెప్పడం అందరికీ రావని నా ఉద్ధేశమండి. నాకు తోచిన భావాలనే రాయగలును. ఆదరించే మీ అందరికీ వందనం._/\_

   Delete
 2. అద్భుతః పద్మార్పిత గారు.

  ReplyDelete
  Replies
  1. ధన్యోస్మి...

   Delete
 3. అక్షరాలకు మీకు అవినాభావ సంబంధం. చుంబనం ఏంటి అవి మీ కవితల్లో కాపురం ఉంటాయి పద్మగారు

  ReplyDelete
  Replies
  1. ఇంకా నయం పిల్లన్ని కంటాయి అనలేదు :-)

   Delete
 4. extraordinary words madam. you are rocking star of poetic worldly

  ReplyDelete
 5. ఎందుకో ఈ కవిత కొత్తగా అనిపిస్తోంది మేడం. భావాలను ఒక సిద్ధాంతానికో ఒక ఆశయానికో ఒక ఉద్ధరణకో ఒక ఇజానికో కట్టుబడి అణుచుకొని రాసుకోవడం ముర్ఖత్వమే ఔతుంది. ఇప్పటిదాకా మీరు మీ మసుకు నచ్చినట్లుగా ఆత్మతృప్తికోసం రచనలు చేస్తూ వస్తున్నారనే నేను విశ్వసిస్తున్నాను.
  చలా మంచి కవిత. హ్యాట్సాఫ్..

  ReplyDelete
  Replies
  1. నేను మీతో ఏకీభవిస్తున్నాను. ధన్యవాదాలండి.

   Delete
 6. అర్పితగారు అక్షరాలతో ఆడుకునేది మీరు. మీ ఇద్దరికీ ఉన్న లావాదేవీల మధ్య లాభం మాదేనండోయ్:-) చుంబనమో ఆలింగనమో మొత్తానికి ప్రేమని పంచుతానని మాటిచ్చారు పంచేయండి. సంఘాన్ని ఉద్ధరించాలంటే మనల్ని మనం సంస్కరించుకోవాలని మీరు చెప్పిన మాటలు ముత్యాలమూట. ఇంత అందమైన అక్షరమాలని అందించిన మీ చేతికి నేను కూడా చుంబిస్తున్నాను.(with your permission madam )

  ReplyDelete
  Replies
  1. ఆకాంక్ష ఆర్డర్ వేసారంటే అవలంభించాల్సిందే :-)
   thank you my dear.

   Delete
 7. లోకానికి కేవలం ఉద్ధరించే మాటలు చెప్పడం వలన ప్రయోజనం లేదని ఆచరించి చూపాలని మీరు గగతంలో చెప్పిన మాటలు ఙ్ఞాపకం వచ్చాయి ఈ కవిత చదువుతూ ఉంటే. మీ రచనల్లో నిగూఢంగా దాగిన సందేశాలు అర్ధంచేసుకుంటే చాలు. మరో మంచి కవిత మీ కలం నుండి .

  ReplyDelete
  Replies
  1. అలా అర్థం చేసుకుంటారన్న ఆశతోనే మీతో నా భావాలని పంచుకుంటున్నాను. థ్యాంక్యూ.

   Delete
 8. పదాలు ప్రేమిస్తాయి
  అక్షరాలు చుంబనం ఇస్తాయి
  మీ కవితలు కవ్విస్తాయి
  అభిమానులు ఆనందిస్తాము:-)

  ReplyDelete
  Replies
  1. మీఅంతా అనందించడంకన్నా నాకేం కావాలి చెప్పండి.

   Delete
 9. మంచి కవితతో మరోసారి అలరించావు పద్మా. అభినందనలు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సృజనగారు.

   Delete
 10. అందరికీ శుభాభినందనలు. పద్మగారి బ్లాగుని కాస్త ఉపయోగించుకుంటాను. హుధూద్‌ విలయం ధాటికి
  మా ఊరు అల్లకల్లోలం అయిపోయింది. విశాఖపట్నంలో బీచ్‌ ఒడ్డున ఉన్న అపార్టుమెంట్లు ఊగుతుంటే... భయపడిపోయామని నా మిత్రుడొకరు చెప్తుంటే అసలెలా ధైర్యం చెప్పాలో ఆర్థం కాలేదు. తుపాను తీరం దాటిన రోజు హైదరాబాద్‌లోనే ఉన్నాను. మర్నాడే చాలా రిస్క్‌ మీద మా ఊరు వెళ్లకుండా ఉండలేకపోయాను. దారిలో ఒక్క చెట్టూ లేదు.. ఒక్క కరెంటు పోలూ లేదు. పది రోజుల పాటు చిమ్మచీకటిలో మా ఊరు మగ్గింది. అక్కడ చాలా మంది నానా అవస్థలు పడుతుంటే... మా కళాశాల రోజుల్లో మిత్రులం అత్యవసరంగా సమావేశమై... కొంత సర్వీస్‌ చేశాం. వైజాగ్‌లో మా ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులను కలుస్తున్నాం. కనీసం 10 వేల మొక్కలు నాటాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. కొత్త సంవత్సరం కన్నతల్లి లాంటి మా విజయనగరం, పెంపుడు తల్లి లాంటి విశాఖపట్నం నగరాలకు మళ్లీ ఆ అందం తీసుకొచ్చే ప్రయత్నంలో సహకరించాలని మా మిత్రులంతా అనుకున్నాం. ఇదంతా ఎందుకంటే. ఇన్నాళ్లూ మీకు కనిపించకపోడానికి కారణాలివే. అక్కడ రోజుకో పరిస్థితిని వినాల్సి వచ్చింది. అందుకే ఇంటర్‌నెట్‌ని కొన్నాళ్లు పక్కన పెట్టి.. ప్రజలతో ఇంటరాక్ట్‌ అయ్యే పనులు పెట్టుకున్నాం. అత్యవసర సమాచారాలు మినహాయించి.. కొన్నాళ్లు కావాలనే ఫేస్‌బుక్‌, వాట్స్‌ఆప్‌లను మాకుమేమే నిషేధించుకున్నాం. విజయనగరంలో ఉన్నన్ని రోజులూ సెల్‌ ఫోన్‌కి చార్జింగ్‌ పెట్టుకునే దిక్కు కూడా లేకుండా పోయింది. అందువల్లే ఆప్తులకు నా నుంచి సందేశాలు లేవు. అందుకు క్షంతవ్యుడను. మొన్నటితో మళ్లీ ఇంటర్నెట్‌ జనజీవన స్రవంతిలో మళ్లీ కలిశాను. మొట్టమొదట పద్మగారి బ్లాగే చూశాను. చాలా మిస్సయ్యాను. మిత్రులు నా కామెంట్ల కోసం ఎదురుచూశారు. చాలా సంతోషం. ఆకాంక్ష గారు... మళ్లీ అల్లరి మొదలెడదాం. ఒక తుఫాను... నాలో ఏ మూలో నాకు తెలియకుండా ఉన్న కాస్త పిరికితనాన్ని తరిమేసి... ఏ సమస్యనైనా ఎదుర్కోగల ధైర్యాన్నిచ్చింది. నేనే కాదు... మా ఊర్లో ఏ ఒక్కరూ హుధూద్‌కి భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. పెనుగాలుల బీభత్సాన్ని... ధైర్యంగా తిప్పికొట్టాం. ఈ బ్లాగులో అయితే చాలా మందికి విషయం చేరుతుందని... పద్మగారి పర్మిషన్‌ లేకుండానే ఇదంతా రాసేస్తున్నా... ఏమనుకోకండి.

  ReplyDelete
  Replies
  1. నేను కూడా ఆ గాలిప్రకోపాన్ని కనులార చూసాను సతీష్ గారు ఎప్పుడు లేనిది 10 రోజులు చీకట్లోనే ఉన్నాం. ఇక్కడ చూడండి నేను రాసిన ఆ పోయెమ్ ని
   http://kaavyaanjali.blogspot.in/2014/10/the-natures-fury.html

   Delete

  2. :(జరగవసిన భీభత్సం ఎలాగో జరిగిపోయింది...ఇప్పుడు అందరూ కుశలమేకదా. షాక్ నుండి తేరుకుని బయటపడండి సతీష్ గారు. చిత్రలకి వర్ణనలేక వెలసిపోయినట్లున్నాయి (క్షమించాలి పద్మార్పితగారు, నాకు అర్థంకాక అసలు విషయం రాబట్టాలని)

   Delete
  3. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నానండి సతీష్ గారు.

   Delete
  4. జరిగిన ప్రకృతి ప్రళయానికి తలవంచడం తప్ప ఏం వ్రాయను చెప్పండి.

   Delete
 11. రాయడం రాదని ఒప్పేసుకున్నట్టేనా :-)

  ReplyDelete
  Replies
  1. ఒప్పుకుంటే మీరు ఒగ్గేస్తారా :-)

   Delete
 12. పద్మా...అక్షరం మీకు ముద్దు ఇవ్వడం ఏంటా అనుకున్నా, కవిత చదివితే అర్థం అయ్యింది. అక్షరాలని రఫ్ ఆడిస్తారని అందుకే మెమ్మల్ని బుట్టలోవేసుకోడానికి అక్షరాలు వేసిన వల :-) వేరీ నైస్.

  ReplyDelete
  Replies
  1. ఓహో....అదన్నమాట అసలు విషయం. ఈ చుంబనం వెనుక ఇంత మర్మముందా :-)

   Delete
 13. డిషుం డిషుం డిషుం...తుపాకీ తూట్లు మీ అక్షరాలు, గుండెల్లో దూసుకు వెళుతున్నాయి

  ReplyDelete
  Replies
  1. ఈ తూటాలకి బలి కావలసిందేనా ;-)

   Delete
 14. అంత మంచిగా రాసితే చుంబన్ ఒకటి కాదు చాల ఇస్తాది. I think what i wrote its correct Padma.

  ReplyDelete
  Replies
  1. పాయల్ అంతకన్నానా..:-) good improvement. keep writing.

   Delete
 15. ప్రతి కవితకీ అక్షరాలు చుంబనం ఇస్తూనే ఉన్నాయి పద్మార్పితా ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కాదంటావా చెప్పు-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. అందులో మీ అందరి అభిమానం ఆప్యాయతలు కూడా కలిసి ఉన్నాయి కదండి.

   Delete
 16. ఉత్తమోత్తమ అక్షరాలతో లోకాన్ని ఉద్దరిద్దామంటే
  నాలోని భావాలు పక్కున నవ్వి పరిహసించాయి..
  స్ఫూర్తితో రాయాలని ధీమాగా దూసుకెళదామంటే
  నాలోని పిరికితనం పనికిరాని బ్రహ్మాస్త్రాలేలన్నాయి
  మీరు ఇంతందంగా ఎలారాస్తారో కాని నాకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తారు.

  ReplyDelete
  Replies
  1. నచ్చాలనే నా ప్రయత్నాన్ని మీరు నిజం చేసారు. థ్యాంక్యూ.

   Delete
 17. yah kavita hai badi mast mast :)

  ReplyDelete
  Replies
  1. agle bar jabardast likhne ki koshish karoongi :-)

   Delete
 18. ముద్దాడి అక్షరాలకి మీరు మరో కవితలో జవాబు ఇస్తారని వెయిటింగ్ :-)

  ReplyDelete
  Replies
  1. సీరియల్ కవితలు రాయమంటారా :-)

   Delete
 19. అక్షర చుంబనం.....సెన్సార్ కట్ కట్ కట్ :-) ఇదంతా మీ పై ఈర్ష్యా, ప్రేమ, అభిమానం, ఇంకా ఏదేదోలెండి. మీరు అక్షరాలని కూడా మీవైపు తిప్పేసుకుని ప్రేమించేలా చేసుకుంటే పర్యవసానం ఇలాగే ఉంటుందేమో మరి :-) కవిత ఎప్పటిలాగే సూపర్.

  ReplyDelete
  Replies
  1. మీకు సామెతలు చిక్కడం లేదని నాపై ఇలా కక్ష కట్టారా...పర్యవసానం ఏమైనా సదా బద్దురాలినే :-)

   Delete
 20. పద్మగారు మీ కవితా పరంగా ఇవ్వన్నీ సరే వ్యక్తిగతంగా మీ మానసచోరుడు లబోదిబో అంటారేమో మరి :-)

  ReplyDelete
  Replies
  1. మహీగారు లేనిపోని లిటిగేషన్స్ పెడితే ఎలా :-)

   Delete
 21. మీరు ఉధ్ధరిస్తూనే ఉన్నారు ఎప్పటినుంచో. కవిత చాలానచ్చిందండి.

  ReplyDelete
  Replies
  1. ఎంతమంది ఉద్దరించానంటారు :-)

   Delete
 22. మీ కవితలకి సరైన బహుమానమే ఈ అక్షర చుంబనం.

  ReplyDelete
  Replies
  1. నిజమేనంటారా..!?

   Delete