ఏదో చేయమాకు

నా మదిలోని భావాలను లూటీ చేసేసి
మౌనమనే లాటీతో కొట్టి లాలించమాకు
నాపై నీ భావాలని మనసులోనే దాచేసి
మాయమాటలతో మదిని మభ్యపెట్టకు!

నా గుండెసడికి నీ గుండెలయ శృతిచేసి
ఆశలే రేపి ప్రణయమని రాగాలు తీయకు
మనసిచ్చానన్న మిడిసిపాటుతో చిందేసి
తనువునే కోరి తైతక్కలాడి అలుసైపోకు!

నా మనసుని నీ అనురాగంతో పెనవేసి
ఒక పోగు నీవు మరొకటి నేనని వేరవకు
ప్రేమతో ఆడిన దాగుడుమూతల్లో అలసి
సొమ్మసిల్లినాక తనువులు వేరని అనకు!

నా చెలిమి నీ ఎదలోయలో ప్రవహింపజేసి
వలపునదై పొంగి పొర్లిపోతే ఘనీభవించకు
నా మనసు నిన్ను నమ్మినవేళ కాపుకాసి
ప్రేమపై నాకున్న ప్రేమను వమ్ముకానీయకు!

41 comments:

  1. అంతటి రసికతనెరిగిన వాడా ఆ ప్రియుడు :) లవ్లీ పిక్

    ReplyDelete
    Replies
    1. మీకు తెలియనివాడా. :-) థ్యాంక్యూ

      Delete
  2. డైరెక్ట్ నువ్వు కావాలి అని చెప్పేస్తే పోతుంది ఈ డొంకతిరుగుడు లేకుండా. ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. డైరెక్ట్ గా అడిగే ధైర్యం ఉండాలిగా :-)

      Delete
  3. ఒక్కొక్క స్టాంజా మీదైన మార్క్ తొ.. వలపు కుమ్మరిస్తోంది ...
    గోముగానో... ఘాటుగానో...గడుసుగానో ... మొత్తానికి సూపరండి మీ కవిత...

    ReplyDelete
    Replies
    1. గోమైనా... ఘాటైనా...గడుసుతనమైనా మీ ఆభిమానం ముందు దిగదుడుపే :-) థ్యాంక్యూ

      Delete
  4. మదిలోని భావాలనె లూటీ చసేవాడు మౌనంగా వుంటాడా?
    లాలించడానికి లాటీ వాడేవాడు సరసుడెట్లా అవుతాడు?
    భావాలని మనసులోనే దాచేస్తే అప్పుడిక
    మాయమాటలెట్లా వస్తాయి మభ్యపెట్టటానికి?!

    గుందెసడికి గుండెలయని చేర్చి శృతి చెయ్యవచ్చును గానీ
    అది ప్రణయమని రాగాలు తియ్యకూడదా యేమి చోద్యం?
    ఇంతటి గడుసరి మనసిస్తే మిడిసిపడని వాడుంటాదా?
    తనువును కోరని వుత్త ప్రణయం మరీ అలుసైపోదా?

    మనసునీ మనసునీ ముడిపెట్టి పెనవేశాక
    అసలు పోగులుగా విడిపోవటం సాధ్యమా?
    దాగుడుమూతలు పూర్తయి అలసి
    సొలసినాక కూడా వేరవకపోతే కష్టం కదా!

    ReplyDelete
    Replies
    1. నేను ప్రశ్నలు వేసి మీ బుర్రలు తింటున్నానని నున్ను ఇలా తిరిగి ప్రశ్నించడం న్యాయమా :-)

      Delete
  5. పద్మా ఈ సంవత్సరం అంతా ఏం, ఎందుకు, ఎలా అని ప్రశ్నలతో చంపేస్తావా ఏంటి. :) కవితాపరంగా భవ్యమైన పదశైలి నీది. ఆయుష్మాన్ భవ-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హన్నన్నా ఎంతమాట :-)

      Delete
  6. నా చెలిమి నీ ఎదలోయలో ప్రవహింపజేసి
    వలపునదై పొంగి పొర్లిపోతే ఘనీభవించకు
    ఇది పద్మార్పిత ప్రణయ ప్రావాహం ha ha

    ReplyDelete
    Replies
    1. కాదు కాదు...చిరుజల్లు మాత్రమేనండి :-)

      Delete
  7. నా మదిలోని భావాలను లూటీ చేసేసి
    మౌనమనే లాటీతో కొట్టి లాలించమాకు bagundi bhavam

    ReplyDelete
  8. mee priyudu police? lootee chesi latito lalinchadaniki.:-)

    ReplyDelete
    Replies
    1. Police aithe maagoppa chikku kadaa :-)

      Delete
  9. మాటల గారడితో మభ్యపెట్టేది మీ కవితలే ఆ అదృష్టం అందరికీ ఎక్కడిది చెప్పండి :-)

    ReplyDelete
    Replies
    1. నిష్టూరాలు వేస్తే ఎలా చెప్పండి.

      Delete
  10. good poetic lines. i luv it.

    ReplyDelete
  11. Impressive Profile & Blog

    ReplyDelete
  12. చురుకైన ప్రేమ పదాలు చాకులా మీ ప్రియుడి గుండెల్లో దించినట్లు... మరీ ఇంత ఆక్రమణా??? :-) :-)

    ReplyDelete
    Replies
    1. ఇదో నేరమా నాపై :-)

      Delete
  13. పద్మా ,

    భావానికి తగ్గ చిత్రం ఈ సారి రాలేదనిపిస్తుంది .

    ఏదో చేయమాకు అంటూ ఏదోలా గీశావేమో అన్నట్లుగా వున్నది .

    ఆ టైటిల్ నిన్ను ప్రభావితం చేసిందేమో అనిపించింది .

    ReplyDelete
    Replies
    1. అవునా భావానికి తగ్గ చిత్రం కాదా శర్మగారు. అయ్యుండవచ్చును.
      కానీ నేను గీయలేదుగా.
      మీ స్పందనకు నేనర్లు.

      Delete
  14. భావాత్మకంగా వ్రాసారు అర్పితగారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి ప్రేరణగారు.

      Delete
  15. మాడం మీరు అదనీ ఇదనీ కంప్యూజ్ చేయకండి. అసలే టెన్షన్లో ఉన్నాను.

    ReplyDelete
    Replies
    1. కంప్యూజ్ అయ్యి టెన్షన్ మరిచిపోతారనే ఇలా :-)

      Delete
  16. భావాలను లూటీ చేసేసి
    మౌనమనే లాటీతో కొట్టి లాలించకు
    మీరు లూటీ చేసి ఎదుటివారిపై నిందా :-)

    ReplyDelete
    Replies
    1. మీది మరో అభియోగం...తప్పదు భరించాలి :-)

      Delete
  17. విరహ గీతా విలాసం...మధుర భావాల సమ్మేళనం..ప్రణయ రాగాల సుధామయం...పద్మర్పిత కవిత్వం

    ReplyDelete
    Replies
    1. మీ కవితాభిమానం
      నాకు ఉల్లాసం ఉత్తేజభరితం.
      మీకు నా హృదయపూర్వక వందనం

      Delete
  18. No comments, bcoz no words :) ha hah

    ReplyDelete