మార్పు

జీవితం దిశమార్చిందే కాని నేను కాదు మారింది
నిన్నలా నేడు అస్తమిస్తున్నా సంధ్యవేళతోపాటుగా
కాలం మారిందన్న ఆత్మవంచన చీకట్లో రంగుమార్చి
చంద్రుడిలోని బూటకపు నల్లని మచ్చ పెరుగుతుంది!

హింసలో మరిగెడి వెన్నెల వేడిరక్తపు స్నానమంటూ
పనికిరాని ఆవేశపు మాటలు వల్లెవేస్తూ నిద్రపోయింది
ఆశా ఉషోదయ కిరణాలు నిగ్రహమనే గోడపై నిటారుగా
దురాశచేసే అనాలోచిత కుయెత్తులనో చూపుచూస్తుంది!

నేను మాత్రం దశతిరిగిందని ఆనందానుభూతిని పొంది
మానవభూతమే మహనీయుడిగా మారెనని ఈలవేసేసి
సగం మారినా సరే మనిషి స్వఛ్ఛదవళమని నమ్మబోతే
నపుంసకతనరం వలలో చిక్కినా నరుమారడని నవ్వింది!

రాయి కరిగి శిల్పమైతే పాషాణమే తరిగి నెచ్చెలౌతుంది
మారాలన్న సంకల్పం ముందు నవ్విన నాపచేనే పండి
వంగి మానవత్వానికి సలాములే చేసి గులాము అంటే
మనుగడే ప్రకాశవంతమై జీవితం స్పటికమై మెరుస్తుంది!

80 comments:

  1. each and every line is awesome.most wonderful post with meaningful painting.

    ReplyDelete
  2. ఇలాంటి అద్భుతమైన భావావేశం ఉప్పొంగాలనే ఇన్నిరోజుల తరువాత వ్రాసారా పద్మగారు. చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అభినందనలు

    ReplyDelete
    Replies
    1. కల్కిగారూ...భావావేశం అంటే కోపంగా తిట్టినట్లుందండి. Just kidding. thank you.

      Delete
  3. ముగింపు ఇంపుగా కూర్చి సందేశాన్ని అందించి మెప్పించారు.

    ReplyDelete
    Replies
    1. మహీ...మెచ్చినట్లే కదా :-)

      Delete
  4. పద్మా...ఏమైపోయావో అని కంగారు పడ్డాను. ఇలా అవతరించావా, బ్రహ్మాండంగా వ్రాసావు. చిత్రం నప్పినట్లు లేదు.

    ReplyDelete
    Replies
    1. నేను ఇక్కడే ఉన్నాను మీరే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. మిస్ యూ. చిత్రం గురించి వివరించిన తరువాత మీ అభిప్రాయం మార్చుకుంటారు.

      Delete
  5. కవితకి తిరుగులేదండి. చిత్రం సంగతి చెప్పడానికి సతీష్ కొత్తూరిగారు మీ బ్లాగ్ కి రాకపోయె. మీరైనా వివరిస్తారా పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. "ముఖపుస్తకమ్" ఆకాంక్ష గారు బహుశా ముఖానే మార్చెశారను కుంటున్నాను. మీరు మీరే ఐతే ఇడుగొంది ఇది నా మార్క్ పిక్చర్ డిస్క్రిప్షన్.


      మనసు అనేది ఎప్పుడు నిర్మాలత్వానికి ప్రతీక దానిని కుయుక్తులతొ కపట మోసాల ముసుగు ధరించి యాంత్రికము కావద్దు అని చెప్పే ఆ మాస్క్ అండ్ ఆ ఫేస్ చెప్పకనే చెబుతుంది కదా పద్మ గారు.

      ఎప్పుడు కూడా మనసుకు మనిషికి దగ్గరగా కదలాడె అంశాలు ఎన్నుకోవడం లో పద్మ గారి కవితలు ఓ స్పెసిమన్.

      Delete
    2. శ్రీధర్ గారూ, నేనూ విండోస్ 8.1 వాడుతూనే ఇది తైప్ చేస్తున్నాను తెలుగులో.
      మీరు హాయిగా ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకొని తెలుగులో తేలికగా వ్రాయండి. ప్రముఖ్ IME డౌన్ లోడ్ లింకః http://vishalon.net/PramukhIME/Windows.aspx
      గుడ్ లక్

      Delete
    3. శ్రీధర్ గారూ, ప్రముఖ్ బాగుంది. చాలా చాలా సులువు. ఫోనోటిక్ టైపింగ్. అంతే. హెల్ప్ కూడా ఉంది - అదీ సులువే.

      Delete
    4. శ్రీధర్ గారు చిత్రం గురించు మీరు ఇచ్చిన వివరణ బాగుంది. మరి పద్మార్పితగారు ఏవంటారో చూడాలి.

      Delete
    5. నయని గారు ధన్యవాదాలు, పిక్చర్ ఇమేజ్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కో భావం మెదల వచ్చు. పద్మ గారి కవిత ను పరికించాక నాకు తట్టిన పిక్చర్ డిస్క్రిప్షన్ అది.

      Delete
    6. శ్రీధర్ గారూ...భలే చెప్పారే. నా రెండుకల్లు ముఖపుస్తకం దొంగిలించేసింది. అందుకే నీలిరంగులద్దుకుని మరో ముసుగువేసుకుని మీముందుకి వచ్చాను (పద్మార్పితగారి పాత కవితలోని లైన్స్ నేను దొంగిలించాను) థాంక్స్ మీరు జవబు ఇచ్చినందుకు. పద్మార్పితమ్మా ఇకనైనా వచ్చి రిప్లైస్ ఇవ్వండి.

      Delete
    7. ఓ మొత్తానికి మా ఇష్టదైవం శ్రీ కృష్ణుడి నీలవర్ణమ్ అన్నమాట. హరి గోపాల బాల ముకుందా మాధవా.. ఆకాంక్ష గారు. వెన్న దొంగ అంటారు మరి తమరు అక్షరాన్ని దొంగలించారా.. జ్ఞానానికి పెరుగుదలె ఉంటుంది లెండి.. తరగుదల ఉండదు

      Delete
    8. ఆకాంక్షగారు. సతీష్ గారు విడమరిచి చెప్పేలోపే శ్రీధర్ గారు చక్కగా వివరించారు. ఇంక నేనేం చెప్పను.:-) అయినా నేను సతీష్ గారంత అందంగా వివరించలేను. ఒకవేళ ప్రయత్నించినా అబాసుపాలేనేమో :-) కాదంటారా! :-)

      Delete
    9. నయనిగారు...శ్రీధర్ గారు చెబితే కాదనే ఆస్కారం ఉందంటారా :-)
      Thanks a lot to Sridhar Bukyaji.

      Delete
  6. దశలు దిశలు మార్చికొడితే గురితప్పుతుంది జీవితం. మీకు చెప్పేంత వాడినా నేను. నిజానికి నాకు సరిగ్గా అర్థం కాలేదు .

    ReplyDelete
    Replies
    1. గురి చూసి ఎప్పుడూ కొట్టాలి అనుకోవడమేనా...అప్పుడప్పుడూ గొరి తప్పి తల ఒగ్గితేనే జీవితపు విలువలు తెలిసేది.

      Delete
  7. మార్పుని కోరే మంచికవితను అందించారు

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు వందనాలు.

      Delete
  8. మార్పు ఎలా ఉన్నా మీరు రాసిన కూర్పుని అర్థం చేసుకోవడమే కష్టంగా ఉందనుకుంటే చిత్రం కూడా కడు విచిత్రంగా ఉందండి.

    ReplyDelete
    Replies
    1. నిజంగానే అర్థం కాలేదా లేక నిందవేయాలని వేస్తున్నారా. చెప్పాలంటే జీవితం గురించి మహా మహులకే అర్థం కాలేదు నేనేం చెప్తాను చెప్పండి రాధగారు.:-)

      Delete
  9. మంచి కవిత ... .

    ReplyDelete
    Replies
    1. మీ మెప్పు నాకు స్పూర్తి. థ్యాంక్యూ

      Delete
  10. పద్మగారు మీ ప్రతీకవితా ఒక్కసారి చదివితే అర్థకాదండి.
    పెయింటింగ్స్ చూసే కొద్ది కొత్త ఆలోచల్ని రేకెత్తిస్తాయి. మొత్తాని మీరు నాకొక పజిల్.
    మీ అక్షర జ్ఞానాన్ని పొగిడే అర్హత నాకు లేదు. చదివి అర్థం చేసుకోవడమే.

    ReplyDelete
    Replies
    1. అమ్మో ఇన్నేసి మాటలా. అదీ అర్హతలేదు అంటూ అంతలేసి మాటలు ఎందుకండి...రాసినవేవైనా చదివి ఆనందించి అభిమానించండి :-)

      Delete
  11. పద్మార్పితగారు ఒక మంచి హాస్యకవిత రాయండి. ఎప్పుడూ విషాధభరితమేనా

    ReplyDelete
    Replies
    1. జీవితం అన్నాక నవరసాలు పండిచాలి కదా అంటే ఆ రసాలు ఏంటని అడక్కండి. :-)

      Delete
  12. జీవితం లో ఒడిదుడుకులు సహజమని అవి ఉంటేనే అసలు సీసలు జీవితానికి అర్ధమని ఐతే మంచిని పంచె మనషులను మారవకూడదు అని చెప్పిన కవిత లో భావం ఏమిటంటే మారుతున్న కాలానుగుణముగా మార్పనేది సహజమని ఐతే ఆ మార్పువలన చెడు అనేది జరిగితే ఆది మొదటికే మోసమని తస్మాత్ బహుపరాక్ అని చెప్పకనే చెప్పారు పద్మ గారు.

    ReplyDelete
    Replies
    1. సర్ మీ రచనలు ఆధ్యాత్మికంగా బాగున్నాయండి. మీరు పద్మార్మితగారి బంధువులా లేక బ్లాగు పరిచయమేనా?

      Delete
    2. రాగిణి గారు నమస్తే .. నా "కావ్యాంజలి"బ్లాగ్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు, పద్మ గారు నాకు జూన్ 2013 goo.gl/ms8juS నుండి బ్లాగ్ ద్వారా పరిచయమయ్యారు.. మ్యాడమ్ నాకు లక్ష్మి నరసింహ స్వామి (ఆది విష్ణువంటే అతని అన్ని అవతారా)లం'టే భక్తి ఎక్కువ, అందుకే కొన్ని కొన్ని కవితలు వారికి సమర్పిస్తూ ఉంటా.

      Delete
    3. మీరు అందిస్తున్న స్పూర్తిదాయక ఆత్మీయ స్పందనలకు కేవలం ధన్యవాదాలు అని చెప్పలేను అలా అని ఇంకెలా వైవిధ్యంగా చెప్పాలో తెలియని వెర్రిదానను_/\_
      మీ సమయాన్ని వెచ్చించి అందరికీ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి.

      Delete
    4. రాగిణిగారు....ఏ బంధమూ కాని e-బంధం బ్లాగ్ బంధమండి. Once again thanks to Sridhar.

      Delete
  13. ఎవరు ఎంత మారాలో వివరించి రాస్తే నాలాంటి వారికి లాభం పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. యోహంత్ వివాహ బంధంలో అడుగిడిన నీకు అన్నీ కంప్యూజ్ లో ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదులే. :-)
      Wish you happy married life.

      Delete
  14. మీ వాడి మాటల వేడిబాణాలు వేసారు. బాగుంది మీ మార్పు

    ReplyDelete
    Replies
    1. వేడి బాణాలు అనకండి అసలే వేసవికాలం. :-) థ్యాంక్యూ.

      Delete
  15. నాకిది సమజ్ అయ్యి కానట్లుంది. జరంత ఈజీగా రాయండి మాడంజీ. బొమ్మ సార్ చెప్పినాక సమజ్ అయ్యింది మంచిగా

    ReplyDelete
    Replies
    1. సమజ్ కాక పొనికి ఏమున్నది జనని గారో . మనషుల గిట్ల ఆలోచన తీరిది అని సేప్తున్నారు గీ లా. గంతే మల్ల. గా మనషుల మనసులు ఎరికైయే టానికి మస్తు సమయం పడతది జరా సోచాయించండి అని చెప్తున్నారు. కవితలా భావం ఒక్కోపాలి అర్ధం కానట్టు వుంటాది. చిత్రం గురించి నేను చెప్పింది మీకు అర్ధంయ్యిందని తెలిసి చాల సంతోషమండి. తప్పులేమైన ఉంటె మన్నించండి.

      Delete
    2. నన్ను సమజ్ కాలేదని పరేషాన్ చేయకే :-)

      Delete
  16. చక్కని భావావేశం, దానికి తగ్గ పదాల పొందిక మీ సొత్తు. మార్పు వచ్చినా రాకపోయినా మీ చురక తకిలే వారికి తగిలుతూనే ఉంటాయి ఏదో విధంగా.

    ReplyDelete
    Replies
    1. నేను చురకలు వేయించుకుంటున్నాని తెలిసి కూడా నేను వేస్తున్నాను అనడం భావ్యం కాదేమో నయనిగారు :-)

      Delete
  17. మారిపొమ్మంటే మారిపోడానికి మనిషి కాదు మనసండి...కష్టమే మార్పురావడం :-)

    ReplyDelete
    Replies
    1. మార్కండేయ గారు..
      మనసుకి మనిషికి పొంతన లేదంటారా..?
      మనసు మారితే మనిషి మారినాట్టెగా
      మనిషిలో మార్పు వచ్చిందంటే మనసు కూడా మార్పు చెందినట్టే కదా
      మనసు మనిషిని మార్చిన లేదా మనిషే మనసుని మార్చిన మార్పనేది కాలానుగుణముగా మారుతూనే ఉంటుంది.. కాదంటారా..?
      కడలి కెరటానికి చంద్రవంకకు కాలమానానికి మార్పులు ఉన్నట్టే మనిషికి మనిషిలోని మనసుకు మార్పు కూడా సహజమే కాకపోతే ఆది సహేతుక మార్పు కావాలి అప్పుడే బంధాలు అనుబంధాలు మెరుగుపడి మనిషి మనసుకు ప్రశాంతత లేకుంటే మనిషి మనసు వికలం.. మనసు వికలమైతే మనిషి కకావికలం.

      Delete
    2. మార్పు అనివార్యం అని తెలిసినప్పుడు మారమన్నా వద్దన్నా మారవలసిందే మార్కండేయగారు.

      Delete
  18. ఈ బ్లాగ్ లో కవితలే కాదు బొమ్మలు, బ్లాగ్ మిత్రులు అభిమానులు అందరూ హాయిగా నవ్వేసుకుంటు మాట్లాడేస్తారు. మంచి వాతావరణంలో హాయినిచే కవితలు మళ్ళీ మళ్ళీ చదవాలి అనిస్తుంటాయి.

    ReplyDelete
    Replies
    1. హాయిగా అనిపిస్తే చదివి ఎంజాయ్ చేసి మీరూ మాలో ఒకరైపొండి అంతే కాని ఏ బంధం ఈ బంధం అని అడక్కండి. జనాలు అపార్థం చేసుకుంటారు. :-) thanks for nice compliments

      Delete
  19. మీ స్థాయికి తగ్గని మార్వలెస్ కవిత.

    ReplyDelete
    Replies
    1. సృజనగారు మీదైన స్టైల్లో స్పూర్తినిచ్చారు. కొత్తగా మీ స్మృతుల సవ్వడిని వినిపించండి :-)

      Delete
  20. మీ సాహిత్యం పవర్ ముందు అభిమానులు గులాం అవ్వవలసిందే. అధ్భుతమైన కవితను అందించారు

    ReplyDelete
    Replies
    1. గులాము అవ్వడం ఎందుకండీ గుర్తుంచుకుంటే చాలు :-) థ్యాంక్యూ.

      Delete
  21. కవితలో మీరు స్పృశించిన అంశం... కవితకు పెట్టిన చిత్రం చాలా బావున్నాయి మేడం. మనిషిని స్పటికమై మెరిపించే మానవత్వమే కదండీ వెలుగునిచ్చే కాంతి పుంజ్యం. చాలా బావుంది మీ కవిత కొంచెం డిఫరెంట్ టచ్ ఇచ్చారు.... _/\_

    ReplyDelete
    Replies
    1. నా ప్రయత్నాన్ని మెచ్చినా మీ అభిమానానికి వందనాలు.

      Delete
  22. మిమ్మల్నే కాదు మీ భావాలనీ అర్థం చేసుకోవడం కష్టమే.

    ReplyDelete
    Replies
    1. నన్ను అర్థం చేసుకోక పోయినా పర్వాలేద్ కానీ భావాలు అర్థం కాలేదు అంటే అందులో బావలని వెతికే వ్యక్తులున్నారు..జాగ్రత్తండి :-)

      Delete
  23. మాడం మీరు తెలుగు టీచర్ అనుకుంటాను. సున్నితంగా తీయని తెలుగుపదాలతో జోలపాడుతున్నట్లే ఉంటూ నీతిని భోధిస్తారు ఏదో విధంగా.

    ReplyDelete
    Replies

    1. 'బావ' ని అర్థం జేసుకుంటే గాని పద్మార్పిత 'భావాలు' అర్థం కావండీ !!

      జిలేబి

      Delete
    2. రాగిణి గారు: భావాన్ని కవితలా కూర్చటానికి తెలుగు టీచర్ లు, తెలుగు మాతృభాషిలు పూర్వకాలం లో ఉండేవారు మ్యాడమ్. భాషాభిమానం వాక్చాతుర్యమ్ ఇప్పటి కాలం లో "భావా"లు. చమత్కారం ఏమంటే ఇక్కడ ఉన్నవారిలో దాదాపు 40% వారు తెలుగు మాతృభాషి కాదు.

      Delete
    3. రాగిణిగారు తెలుగు అక్షరాలు సరిగ్గా రాయడంలేదని స్కూల్లో తెలుగు మాస్టారుతో మాటలు అనిపించుకున్నాను. ఇంక నీతులేం భోధిస్తాను చెప్పండి. నేను పాటించాలి అని మాత్రం అనుకుంటాను ఇలా రాసినప్పుడంతా. ఎంతవర్కూ అవలంభిస్తాను అనేది వేరే విషయం. :-)

      Delete
    4. Zilebiji.... అందరికీ బావలు ఉండాలిగా భావాలు అర్థం చేసుకోవడానికి:-)

      Delete
  24. రాయి శిల్పం కావాలంటే... ఉలి దెబ్బలు తినక తప్పదు. ఆ రాయిలో భగవంతుడూ ఉంటాడు, మనిషీ ఉంటాడు. ఉలే... కాలఘంటం. జీవితం ఆ రాయి లాంటిదే... ఉలి దెబ్బల కోసం ఎదురు చూస్తేనే.. జీవితశిల్పం ఆవిష్కృతం.
    అవే కష్టాలు, కన్నీళ్లు... శిల్పం నగిషీల దశకు వచ్చేసరికి ఆ కష్టాలే...ఆశలు, ఆశయాలై... చివరికి... సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఇవన్నీ జరిగినా... శిల్పంలో ఉన్నది రాయే. నిజమే... పద్మగారు... జీవితం దిశ మారుస్తుంది... మనిషి మనసుని మాత్రం మార్చలేదు. మీ కవితా నాయిక రాతి ముసుగు తీసి చూస్తే... ఈ కథంతా మనసులో జొరబడింది. కాలమే పెద్ద ఆత్మవంచన... ఒక నిమిషం దుఃఖం, మరునిమిషం సంతోషం-సుఖం.
    ఎంత పెద్ద కుట్ర ఇది. అందుకే కాలాతీతమై సాగాలన్న మీ కవితా సందేశం.. అద్భుతం. నిజం. ప్రతీ అమావాస్య... ఒక పున్నమిని, ప్రతి రాత్రి ఒక వెలుగుని తీసుకొస్తూనే ఉంటాయి. మనిషిలోనూ అమావాస్య-పున్నమి, వెలుగు చీకటి రెండూ ఉంటాయి. వెలుగు జాడల్లో చీకటిని చూసి.. అప్రమత్తమవుతూ సాగడమే జీవితం. ఇంత మంచి పరమార్ధాన్ని... ఒక చిన్న కవితలో ఇమిడ్చి... ఆలోచనల్లో మీ మెచ్యూరిటీని మరోసారి గుర్తుచేశారు. ఇన్నాళ్లూ కొన్ని కారణాల వల్ల బదుళ్లు ఇవ్వడం కుదర లేదు.

    ReplyDelete
    Replies
    1. సతీష్గారు మీరు నాకన్నా చిన్నవారే కనుక నువ్వు అంటున్నాను. అద్భుతంగా ఆవిస్కరించారు పద్మార్పిత అక్షరాలకి మీ అనంతపటిమను జతచేసి జీవితాన్ని నిజకోణంలో చూపించిన తీరు ప్రశంసనీయం....ఆశీర్వదిస్తూ-హరినాధ్

      Delete
    2. హాయ్ కొత్తూరిగారు వెల్కం వెల్కం మై ఓల్డ్ ఫ్రెండ్ అని నా బ్లాగ్ లో చెప్పినా మీరు చూడరు. ఫేస్ బుక్ వాళ్ళు తరిమేసారు. అందుకే ఇక్కడే ఇదే మన మీటింగ్ ఆండ్ చాటింగ్ పాయింట్. ఫేస్ బుక్ వాళ్ళకి నా ఆధార్ కార్డ్ పంపాను. నా ముఖం అందులో అందంగా లేదని బ్యాంక్ అకౌంట్ పంపమన్నారు. బహుశా ఉన్న బాలెన్స్ బట్టి విలువ కడతారేమో!.

      ఇక కవిత విషయానికి వస్తే...మీ విశ్లేషణతో కవితకి పరిపూర్ణత్వం వచ్చింది అంటే పద్మార్పితగారు నాపై శివతాండవమే చేసునో ఏమో. అయినా తప్పదు.

      Delete
    3. ఆధార్ కార్డ్, ర్యాషన్ కార్డ్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్, అకౌంట్ నంబర్ డీటైల్స్ ,పాన్ కార్డ్, ఇవ్వన్నీ ఫేస్‌బుక్ కు ఎందుకండీ ఆకాంక్ష గారు. మీరు దిగిన మాంచీ పిక్ అప్‌లోడ్ చేసుంటే సరిపాయే.. !!

      Delete
    4. మనసు ముసుగులో మెదిలే భావాలు మనిషిని మనిషిని మనసుని మనసుని మాటల్లోని అల్లికను అల్లికాలోని పదబంధాలను బంధాలనే బంధమై అల్లుకునే బాంధవ్యాలను ఆ బాంధవ్యాలలో మిళితమైన అనురాగపు మాధుర్యాలను దుఖమనే ముసుగు ఏమీ చెయ్యలేదని నా వాదన ఎందుకంటే నిర్మలమైన ముఖానికి ఆ ముసుగు ఉండేది క్షణికమే .. అలాగే జీవితానా కష్టాలు కాలానుగుణంగా కరిగిపోతాయి.. సతీష్ కొత్తూరి గారు, పద్మ గారు, ఆకాంక్ష గారు, హరినాథ్ గారు, నయని గారు నిజమే కదా నేను చెప్పిన వాస్తవం.

      Delete
    5. Satish Kotturi...First of all i am so happy to see you here after a long gap. Thanks a lot for spending your valuable time to give such a amazing description regarding Life.

      Delete
    6. అందరికీ రిప్లైస్ ఇవ్వడం ఒకెత్తు మీకు ఇవ్వడం మరో ఎత్తు. ఎప్పుడూ మీ వ్యాఖ్యా విశ్లేషణల ముందు నేను ఓడిపోతూనే ఉంటాను. ఇప్పుడు కూడా ఓడిపోయాను అని చెప్పడం తప్ప ఇంకో దారిలేనంత అత్యద్భుతంగా రాసారు. చాలాసార్లు మీరు వివరించాకే నేను రాసిన దాంట్లో మరో అందమైన కొత్తకోణం కనిపిస్తుంది. నా మెచ్యూరిటీ లెవెల్ ఏ స్థాయో తెలీదు కానీ మీ విశ్లేషణల ముందు మోకరిల్లుతుంది. నా కవితకి నిజమైన నిండు అర్థాన్ని ఇచ్చిన మీ వ్యాఖ్యలకు వందనం అభివందనం.

      Delete
    7. ఆకాంక్షగారు.... నిజాలు ఒప్పుకోడాని శివతాండవం ఆడ్డానికి లింక్ పెట్టకడి...అప్పుడు నిజంగానే శివతాండవం అంత కాకపోయినా చిందులు వేస్తాను:-) మీ ప్రొఫిల్ పిక్ బాగుందండి. గుడ్ ఆర్ట్ పిక్.

      Delete
    8. Sridhar Bukhyagaru...గారు...సంభంధ బాంధ్యవ్యాల గురించి మీ భావాలని అందంగా చెప్పారు. మీరు చెప్పాక కాదనడానికి నో చాన్స్...బట్ ఎవరి అనుభవం వారికో వింత పాఠం నేర్పుతుంది అని నేనంటాను. :-)

      Delete
  25. పద్మా ఈ కవితకి కమెంట్ వ్రాయడానికి ఏం తోచక ఇన్నాళ్ళు రోజుకొకసారి చదువుతున్నాను. పైన సతీష్ వివరణలోనే నా వ్యాఖ్యలూ పొందుపరచబడినాయని గ్రయించు-ధీర్ఘాయుష్మాంభవః-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ ఆశ్శీస్సులే చాలు. మీ అభిమాన వాక్యాలే పదివేలు. ధన్యోస్మి

      Delete
  26. This is out of my range to understand. :((((

    ReplyDelete
    Replies
    1. Payal... now it may be tough to you to understand this, but one day definitely you will get the essence. thanks for following my blog.

      Delete
  27. Thank you Padma gaaru, for your valuable comments. I feel really obliged. I do reply back or comment to your posts only during my leisure time.
    Life is just a mix of all emotions taken together, one at a time, but just never forget to add smile in every situation, even if it is in pain or in gloom.
    Happy Evening Madam Padmaji.
    Thank you Once Again.
    Happy *World Health Day* to you Madam.
    Being a Pharmacy Person, you might well know about the importance of life and its essence.
    This year, it is on *Food Safety*.
    Thank you Padma Ji

    ReplyDelete
    Replies
    1. World Health Day Coincides My Birthday.. 07th April.

      Delete
    2. Thank you and advance birthday wishes to you.

      Delete
  28. నిష్కపటత్వమే స్పటికత్వమా?!?

    ReplyDelete
    Replies
    1. కపటం లేకపోవడం అనే గుణం ఉన్నవారు స్పటికమేంటి వినోద్... కోహినూర్ వజ్రం.

      Delete