ఏం కోరను


జ్ఞానదీపమే వెలగలేక ఆరిపోతుంటే
మనసులో జ్యోతిని ఏం వెలిగించను
మనిషి మార్కెట్లో అమ్ముడైపోతుంటే
ముఖం రంగులతో ఏం సింగారించను

భవిత కాసులకై కాలిబూడిదైపోతుంటే
యువత అందాలు ఎక్కడని వెతకను
ప్రలోభాల మెరుపులనే కనకం అనంటే
భవిష్యత్తులో పసిడిలోకం ఏం చూడను

తెలీదన్న ప్రతీసారీ అక్షరాభ్యాసమంటే
పాతపలకపై పలుమార్లు ఏం దిద్దించను
అవినీతినే గోరుముద్దలుచేసి పెట్టమంటే
తెలిసికూడా తెలియనట్లు ఏం నటించను

జగతి ఆకలితీర్చే రైతే శవమై అంకురిస్తే
జనం ఎరువుగా మారితే ఎక్కడ పాతను
ఆలోచనలే అరికాళ్ళ పగుళ్ళుగా స్రవిస్తే
అడుగులో అడుగేసి దేశోన్నతి ఏం కోరను

65 comments:

  1. చిత్రంలో ముచ్చటైన మోము అందులో విచారవదనం చూసి ఎందుకో అనుకున్నాను. మీరు చెప్పిన విషయాలన్నీ నేటివిటీకి దగ్గరగా ఉన్నాయి. ఆలోచించవలసిన విషయాన్ని మీ అందమైన పదాల్లో చెప్పారు. బాగున్నది.

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడూ ప్రేమ గురించేనా, కాస్త సంఘ సంస్కరణల గురించి రాయమనంటే ఆలోచిస్తె వచ్చిన భావాలండి ఇవి.

      Delete
    2. చాలా బాగుంది మీ కవిత. అభినందనలు

      Delete
    3. చాలా బాగుంది మీ కవిత. అభినందనలు

      Delete
  2. పెద్ద సెల్యూట్ మీకు మీ ఆలోచనలకు. పెయింటింగ్ అదిరిపోయింది మాడం.

    ReplyDelete
    Replies
    1. నాకు కూడా చాలా నచ్చిందండి ఈ పెయింటింగ్

      Delete
  3. తెలీదన్న ప్రతీసారీ అక్షరాభ్యాసమంటే
    పాతపలకపై పలుమార్లు ఏం దిద్దించను
    జగతి ఆకలితీర్చే రైతే శవమై అంకురిస్తే
    జనం ఎరువుగా మారితే ఎక్కడ పాతను
    మీ ఆలోచనా పదును సూటిగా మదినితాకి ఎదుటి వారిని ఆలోచింపజేసే ఆటంబాంబులు. చిత్రం అద్భుతంగా అమరింది మీ కవితకు.

    ReplyDelete
    Replies
    1. ఏదైనా అడిగితే తెలీదని సునాయసంగా అనేస్తారు చాలామంది. అలాంటివారికి ఎన్నిసార్లు మనం చెప్పి మాత్రం ఏం లాభం చెప్పండి. అదే ఈ వాక్యాలకి కారణం.
      ఆలోచనల వరకు ఓకే...మరీ ఆటంబాంబులు అంటే జనాలు భయపడతారేమో.

      Delete
  4. పద్మా ఏంకోరను అని అంటూనే అక్షరాలతో ఆడుకున్నావు. నీ భావసంఘర్షణ నన్ను ఎప్పుడూ ముగ్దురాలిని చేస్తుంది. ఈసారి చిత్రంలో సునాయసంగా నీ ఆవేదన్ని పసిగట్టేయగలిగాను. ఇక పై మరిన్ని మహత్తర రచలు నీ నుండి రావాలని కోరుతూ, అభినందనలతో.

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య ఆలోచిస్తుంటే ఆవేశం కాస్త ఎక్కువ అవుతున్నట్లుంది. తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే కష్టం కదా...తగ్గించుకుంటానండి.

      Delete
  5. భవిత కాసులకై కాలిబూడిదైపోతుంటే
    యువత అందాలు ఎక్కడని వెతకను
    ప్రలోభాల మెరుపులనే కనకం అనంటే
    భవిష్యత్తులో పసిడిలోకం ఏం చూడను..ప్రతి పంక్తిలోనో ఆవేశం ఆవేదనా మిళితమై కవితను అందంగా ప్రెజెంట్ చేశారు పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. నిజమేనేమో...బహుశా నిజాలు జీర్ణించుకో లేక ఈ ఆవేశం అనుకుంటానండి.

      Delete
  6. లోకజ్ఞానమే ఎరిగిన మనిషి తనకు తానుగా తెలుసుకునే రీతే తెలిసుంటే
    తన తప్పిదాలనే కప్పి అసత్యాలకే వత్తాసు పలికితే గుండె ఘోష ఇదే ఔనెమొ
    అంతర్జాల పుణ్యమా అని పాత కొత్త వస్తువులే అమ్ముడుపోతుంటే నమ్మికైన
    నిఖార్సైన నిజాయతి కి వెల కట్టగాలడా మనిషి తనకు తానుగా ఓడెను కదా అలా జరిగితే
    కాసుల మోతకే భవిత బావురు మంటుంటే ఏటేట గుండెలు పిండి వసులు చేసేనా
    విద్య నేర్చుకునే రోజులు మారి నేర్చు'కొనే' రోజులైనాయి అతిశయోక్తి కాదిది
    పలకపై రాతలు అక్షరాభ్యాసం ఐతే సభ్యత కూడా నేర్చుకోవాలి నేటి యువత
    అప్పుడే జీవితమ్ లో మంచి చెడు తెలిస్తే భావి పౌరులకు ఓతమై నిలిచెను కదా
    అవినీతి నేర్చుకున్న తీరునా నీటిని నేర్చుకుంటే అసత్యాలకు బదులుగా సత్యాలే పలికితే
    ఆడంబరాలకు పోయే బదులు నిరాడంబరతకు దాసొహమైతె ఆ జీవితానికే సార్థకత
    క్షుద్బాధ ఎరిగిన మనిషి ఆకలి దప్పుల విలువను తుంగలో తొక్కితే
    మాగాణియే బంజరు భూమిని తలపించెను కదా ముద్దా దిగాకుంటే మోక్షమే లేదాయే
    భగద్భక్తి మరిచిన మనిషి తనను తానూ శిలనుండి బండగా మార్చుకుంటున్నాడో
    లేకా మానవ సేవే మాధవ సేవ అంటూ సాటి మనిషికి మానవత్వం నేర్పించి మహనీయుడు ఔతున్నాడో


    విషాదాలను సైతం అలవోకగా విశదీకరించారు ఆ చిత్రం లో; చూసిన మరుక్షణమే భావాలన్నీ తెలియవచ్చేలా చిత్రం కవిత రెండు పోటి పడ్డాయి. నిజమే ఇప్పటి కాలం ఎలా వుందో ఎలా ఉండకూడదో ఎలా వుంటే బాగుంటుందో నేటి సమాజపు విలువలు మానవ సంబంధాలు వీటన్నిటిపై మీ కవితాస్త్రం భేష్ . నా రీతిలో మీ కవితను పోలిన చిన్ని ప్రయత్నం పద్మగారు.

    (నోట్: నేను రాసిన కవితను వ్యాఖ్య గా మాత్రమె పరిగణించండి. ఉద్దేశపూర్వకముగా ఎవరిని ఎక్కువ/తక్కువ చేసి మాట్లాడ లేదు. ఈ పంక్తులకి నిజ జీవితంలో ఎవ్వరిని పోలి ఉన్నా అది యాదృచికమే అని గమనించగలరు. ఎవరి మనసు బాధ కలిగిన మన్నించండి )

    ReplyDelete
    Replies
    1. ప్రతి మనిషి జివ్వితంలో జరుగుతున్నవే ఇవన్నీ అయినప్పుడు ఒక్కరినే ఉధ్ధేశించి వ్రాసారని ఎవరూ అనుకోరు శ్రీధర్ గారు. బాగుంది మీరు చెప్పిన విషయాలు.

      Delete
    2. మీ సుధీర్ఘ విశ్లేషణకి నేను ఏం జవాబు ఇవ్వలేక నమస్కరిస్తున్నాను నేస్తం _/\_

      Delete
  7. మీ కవితలో సమాజం పట్ల పరిణితి చెందినా ఆలోచనలు గోచరిస్తున్నాయి మేడం... సరళ పదాలతో లోతైన భావనల మేలవింపులు మధురం... కొత్తగా ఉన్నాయి ఈ కవితలో మీ భావాలు.. సలాం పద్మార్పిత గారు...

    ReplyDelete
    Replies
    1. సమాజంపట్ల పరిణితి ఏమో కానీ పచ్చి నిజాలు మాత్రం నా మనసు జీర్ణించుకోలేక పోతుందండి.

      Delete
  8. అయినా పిచ్చిగానీ .. మీరు ఉద్దరించాలి అనుకుంటే మాత్రం అది సాధ్యమా... ఎవరిపని వారు సక్రమంగా చేస్తే అదే దేశోన్నతికి దారి తీస్తుంది... మంచిగా రాసారు... అది చేస్తా ఇది చేస్తా అని అందర్లా సోది కొట్టకుండా... ఈసారికి అయినా రిప్లయ్ ఇవ్వండి... పప్పులో కాలేసి పొగిడేస్తూ అసలే పెద్ద కామెంట్ పెట్టేసా... :-(

    ReplyDelete
    Replies
    1. అలా అనుకునే ఊరుకుని నా భావాలేవో రాసుకుంటే. సంఘంలో నివసిస్తున్నప్పుడు సంస్కరణలు తప్పవు ఈ సంఘర్షణలు తప్పవు అని పెద్దలంటే ఈ చిన్ని ప్రయత్నమేదో చేసాను వినోద్.
      ఈసారి నేతిలో ముంచండి మీ కాలుని.

      Delete
  9. అందమైన అభ్యుదయం

    ReplyDelete
    Replies
    1. నిజంగా అభ్యుదయ భావాలు ఉంటే చాలంటారా ఉధ్ధరించడానికి :-)

      Delete
  10. నీ ముందు కవితలకి ఇది కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ, చాలా ఉన్నతమైన ఆలోచనలతో నీ కవితా హృదయాన్ని ఆవిష్కరించావు,. చిత్రం కవితా రెండూ సూపర్బ్.

    ReplyDelete
    Replies
    1. ఏదో కాస్త వేరుగా రాద్దామని ప్రయత్నించానండి.

      Delete
  11. జనం ఎరువుగా మారితే ఎక్కడ పాతను...

    నిజమే ముందు ముందు జనమే ఎరువుగా మారే రోజులొచ్చేలా ఉన్నాయి. అద్భుతః

    ReplyDelete
    Replies
    1. ఇలా ఆలోచిస్తేనే భయంగా ఉందండి మున్ముందు ఎలా జీవిస్తామోనని. థ్యాంక్యూ.

      Delete
  12. Padmaji Bigggggggggg Salute.

    ReplyDelete
  13. ఏ ఒక్క పంక్తి బాగుంది అని చెప్పలేను దేనికి అదే సాటి. నేటి జీవశైలి గురించి చక్కగా చెప్పారు. ఒక్క చిన్నమాట. మీ పెయింటింగ్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి ఈ చిత్రం కూడా చాలా బాగుంది. మీ ప్రతి బొమ్మలోను మిమ్మల్ని ఊహించుకున్నట్లే ఈ విచారవదనంలో మిమ్మల్ని ఊహించుకోలేము.

    ReplyDelete
    Replies
    1. రేయి పగలు ఎలాగో ఆనందం విచారం కూడా అక్కాచెల్లెళ్ళు. నవ్వు వచ్చిందంటే కిల కిలా ఏడుపొచ్చిందంటే విలవిలా...తప్పదు కదండీ :-) ;-(

      Delete
  14. నిజాలన్నీ కుండబద్దలు కొట్టి చెప్పారు. నిజం నెమ్మదిగా అయినా తెలుస్తుంది

    ReplyDelete
    Replies
    1. అవును నెమ్మదిగా తెలుస్తుంది, నిజం ఎప్పుడూ నిష్టూరంగానూ ఉంటుందండి.

      Delete

  15. తెలీదన్న ప్రతీసారీ అక్షరాభ్యాసమంటే
    పాతపలకపై పలుమార్లు ఏం దిద్దించను
    అవినీతినే గోరుముద్దలుచేసి పెట్టమంటే
    తెలిసికూడా తెలియనట్లు ఏం నటించను
    నాకూ ఈ నాలుగు లైన్స్ పిచ్చపిచ్చగా నచ్చేసాయి. అయితే మిగతావీ బాలేదా అని ప్రశ్నించకండి. ఏంటో మీకు కమెంట్ వ్రాయడానికే వణుకుతున్నాయి చేతులు :-) వన్ ఆఫ్ ది బెస్ట్.

    ReplyDelete
    Replies
    1. నయనిగారు...ఏదో సామెతలు మానేసారు అడ్జస్ట్ అవుతున్నాము. ఇప్పుడు కమెంట్ పెట్టడానికి భయం అని అంటే ఎలా చెప్పండి.

      Delete
  16. మీ ఆలోచనకి కవితలకి భిన్నంగా ఉందండి.

    ReplyDelete
    Replies
    1. ఏదో చిరుప్రయత్నం చేసాను.

      Delete
  17. చాలా చాలా బాగారాశావు

    ReplyDelete
    Replies
    1. :-) మీ మెప్పు పొందాను. థ్యాంక్యూ.

      Delete
  18. విచారకతమైన విషయాన్ని చాలచక్కగా వివరించారు. చిత్రం సూపర్

    ReplyDelete
    Replies
    1. ఆలోచిస్తేనే విచారంగా ఉన్నాయి..థ్యాంక్యూ.

      Delete
  19. ఏం కోరను కాదు ఏమడగము ఇంకేమడుగుతాము అని మేము అనవలసిందే ఈ కవిత చదివి. :-)

    ReplyDelete
    Replies
    1. ఏదో మీరు అడగాలని నేను కోరాలని కాదనుకుంటాను నేను రాసింది. ఏమి రాయడానికీ రాక వచ్చిన భావాలు ఇవి :-)

      Delete
  20. touching to the heart and brain.photo dhenamga unna sundaramga undi.

    ReplyDelete
  21. ఆఫీసు పని ఒత్తిడివలన ఆలస్యంగా చూసాను. చాలా మంచి ఆలోచనాత్మక పోస్ట్. చిత్రంలో మనోవేదన స్పష్టంగా కనబడుతుంది, అభినందనలతో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీరు క్రమం తప్పక చూసి స్పంధిస్తున్నందుకు నేనర్లండి.

      Delete
  22. జగతి ఆకలితీర్చే రైతే శవమై అంకురిస్తే
    జనం ఎరువుగా మారితే ఎక్కడ పాతను
    ఆలోచనలే అరికాళ్ళ పగుళ్ళుగా స్రవిస్తే
    అడుగులో అడుగేసి దేశోన్నతి ఏం కోరను...

    మీనుండి ఇలా బాణంలాంటి కవిత ఊహించలేదు పద్మాజీ.. సమయోచితమైన కవిత.. దేశమంతా చర్చనీయాంశంగా వున్న అంశంపై నిశిత పరిశీలనతో రాసారు. చిత్రం కూడా మదిలో దాగిన వేదనను ప్రస్ఫుటంగా తెలియచేస్తూంది. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీలా సునిశిత పరిశీలనా శక్తి లేని నేను, సాధారణ తవికలేవో రాసుకుని ఆనందించే నాకు మీ ప్రశంసా వ్యాఖ్యలు ఎంతో స్పూర్తినిచ్చాయి. అభివందనాలు మీకు.

      Delete
  23. మీ మరో ఆణిముత్యమంటి కవిత. చిత్రం చాలా నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ మహీ.

      Delete
  24. భవిత కాసులకై కాలిబూడిదైపోతుంటే
    యువత అందాలు ఎక్కడని వెతకను
    వెతికితే దొరుతాయా పద్మార్పితగారు

    ReplyDelete
    Replies
    1. దొరకవు అని ప్రయత్నం చేయడం మానలేం కదా.

      Delete
  25. మీరు పెట్టే చిత్రాలను చూసి ముగ్ధురాలి అయిపోతుంటే
    అక్షరాలతో అసాంతం ఆకట్టుకుని భావాల్లో బంధించడం మీ సొంతం పద్మగారు. కుడోస్

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానం ఆస్వాధించే గుణాలే నాకు స్పూర్తి.

      Delete
  26. పద్మగారు అమోఘమైన పదసంపద మీ సొంతం. అసలు మీకు ఇలాంటివి రాయాలని ఎలా తడుతుందో అంతుచిక్కని ప్రశ్న. చాలా చాలా బాగుందండోయ్ 10/10 మార్కులు ఈ కవితకు బొమ్మకు.

    ReplyDelete
    Replies
    1. ఇకపై ప్రతి పోస్ట్ కీ మార్కులుంటాయి ఏమో :-) థ్యాంక్యూ.

      Delete
  27. శ్రీధర్ గారూ...పద్మగారు కవితలో చెప్పిన విషయాలకంటే మీరు ఎక్కువ వివరించినట్లు అనిపిస్తుంది. మీ ఓపికకు జోహార్లు.

    ReplyDelete
  28. "తెలీదన్న ప్రతీసారీ అక్షరాభ్యాసమంటే
    పాతపలకపై పలుమార్లు ఏం దిద్దించను"
    నాకు చాలా నచ్చిన విన్నూతన పదప్రయోగం. మీ మిగతా కవితలకు భిన్నంగా బాగుంది. బహుశా పాఠకులు మీ నుండి ఇలాంటి కవితలు ఎక్కువగా ఆశిస్తారేమో కానీ నాకు మాత్రం మీరు ప్రేమని చలోక్తులతో చెబితేనే ఎంతో నచ్చుతుంది.

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడూ ప్రేమ పాఠాలే చెబితే బోర్ కదా ఆకాంక్షా :-) నేతిగారెలు ఎంత బాగున్నా ఎక్కువ తింటే ముఖం మొత్తేస్తుందేమో :-)

      Delete
  29. ఇక్కడ నువ్వు ఇచ్చిన జవాబులన్నింటిలో ఏదో నిగూఢత దాగుంది. అంతా క్షేమమే అని తలుస్తాను-హరినాధ్

    ReplyDelete
  30. క్షమించాలండి ఆలస్యంగా చూసాను. అద్భుతంగా వ్రాసినారు.

    ReplyDelete
    Replies
    1. అర్థమైందిలే యోహంత్...క్షమార్పణలు ఎందుకు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్

      Delete
  31. మీ అమ్ములపోదిలోనీ అక్షరాస్త్రాలనీ సమయానుకూలంగా వదీలారు. బావుంది పద్మార్పిత గారు.,,,,.

    ReplyDelete